Your command over language & observation of humans and nature are second to none to weave a story of supreme artistic heights. Super like for the story. It has got gripping claws of interestingness, which capture the reader to take him/her along until the end without any stop in the middle. (I can say so for I – one of the most impatient readers of all – could experience it means everyone does 😉 )
Each and every sentence sprouted either aesthetics or truth or both, and thus became a mirror for the majestic reflection of the essence of physical and metaphysical confluence.
As many have brought out, I liked the following sentences for their universal appeal and beautiful usage of metaphors and distilled wisdom from the vulnerable human life ridden with common failings and frailties:
“మాట ఎప్పుడూ ఉప్పు లాటిది. తగినంత వాడాలి. లేకపోతే పదార్ధం చెడిపోతుంది.” “నూనె లో తేలే మాగాయ ఇంగువ వాసన”, “ఈర్ష్యా అసూయలెక్కువైనప్పుడు, పట్టలేని ఉడుకుమోత్తనానికి కూడా ఏడుపొస్తుంది”
The interspersed flashbacks of grand-mother’s words bring in sublime economic subtlety to the narrative.
Overall: Superlike 🙂 Wish you all the best in all your endeavours. May GOD bless you so that we would be treated similarly for very long long time to come. 🙂 Thanks for such a wonderful treat. 🙂
పైన గన్నవరపు గారి అభిప్రాయ్ంతో నేనూ ఏకీభవిస్తాను. ప్రస్తుతం తెలుగు అంతర్జాతీయభాష కావలసిన ఆవశ్యకత ముందు మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. అసలే మన సాధారణ ప్రజానీకానికి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే భాషపట్ల మక్కువ, మమకారం కాస్త తక్కువే అని చాలాచోట్ల చర్చించుకోవటం పరిపాటి. చదువుకున్న వారూ మేధావులూ వ్రాసే భాషకూ దారినిపోయే వారు మాట్లాడే వాడుకభాషకూ కూడ వ్యత్యాసం ఎక్కువే! వ్రాయడానికి కూడ ఒక ప్రమాణికమైన తెలుగు భాష లేదని ఇతరభాషలతో తులన చేసిన మోహన గారి లాంటి పెద్దలు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఇవన్నీ ఒక యెత్తైతే, అచిరకాలం క్రితమే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలూ తమ ఉనికినీ భాషాసంస్థలనీ పునర్నిర్మించుకోవడమే ఒక కొలిక్కి రాలేదు.
ఈ పరిస్థితులలో తెలుగును అంతర్జాతీయ భాషగా ముందుకు త్రోయడం దేనికి? ఎవరి ప్రయోజనం కోసం? ప్రాచీన భాష హోదా వచ్చి తెలుగుకు ఒరిగిందేమిటో మామూలు ప్రజలలో తొంభైశాతం మందికి తెలియనే తెలియదు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఎవరిస్తారో, అటుపిమ్మట ఎవరు నిర్ధారిస్తారో ఒకసారి వస్తే చాలునో, నిలబెట్టుకుంటూ పోవాల్నో దేనికీ స్పష్టమైన సమాధానం దొరకదు..
అసలే మన భాషలో అల్పసంఖ్యాక మేధావివర్గానికీ – మిగతా సాధారణ ప్రజలకూ అంతరం చాల అధికం. వీలైతే ఈ అంతరాన్ని తగ్గించి, తెలుగును మరింత ప్రజలభాషగా చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఊహాత్మక తులనలపై భాషాశాస్త్ర వేదికలలో తెలుగు జండాని ఎగురవేయడం కన్నా ఇది తక్షణ అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే రచ్చకెళ్ళె ముందర ఇంట గెలవడం చాల అవసరం..
ఈ వ్యాసం మీద ప్రస్తుతం సూక్షంగా నా అభిప్రాయాలు ఇలా ఉన్నవి.
ఒక సంస్థని ఏర్పాటు చెయ్యాలి. వ్యాసకర్తలు అన్నట్టు “అంతర్జాతీయ భాషగా చేయాలన్న పట్టుదల వుంటే ఏదయినా సాధ్యమే.” రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రాజకీయ నాయకుల రాజకీయాలకు దూరంగా, కుల మత ప్రాంతీయ దురభిమానాలకు తావివ్వకూండా ఉండే ఒక సంస్థ ఏర్పడాలి. వంగూరి వారి మాటల్లో “అందులో మీరు (వ్యాసకర్తలు) సూచించిన ప్రమాణాలకీ, నిబధ్ధతకీ, దిశా నిర్దేశానికీ , ఆశయ సాధనకీ కట్టుబడి ఉండే “ప్రైవేటు” సంస్థ ఒక ప్రత్యామ్నాయ మార్గం అని నేను అనుకుంటాను.”
అలాగే, “ఆ ప్రయత్నం అమెరికాలోనే జరగాలనీ, ఇక్కడి నిబధ్ధత , అక్కడ ఇంకా అంతరించి పోకుండా అందుబాటు లోనే భాషా శాస్త్ర వేత్తల , పండితుల, గ్రంధాలయాలతో ప్రభుత్వేతర అనుబంధం పెట్టుకుంటేనే తెలుగు అంతర్జాతీయ భాషగా (ఏ నిర్వచనం ప్రకారం అయినా సరే) ప్రయాణం మొదలు పెడుతుంది,” అనే వారి మాటలతో నేను ఏకీభవిస్తాను.
తెలుగు భాషాభిమాని కీ.శే. కొప్పాక విశ్వేశ్వర రావు గారు వారి కుటుంబ సభ్యుల వదాన్యతతో అట్లాంట, అమెరికాలో ఎమెరి విశ్వవిద్యాలంలో తెలుగు సాహిత్య పీఠం ఏర్పడిందన్నది గుర్తుచేస్తున్నాను. అలాగే కోట్లలో విరాళాలు (GMCANA కి) అందించిన పొదిల ప్రసాద్ గారి లాంటి దాతలు మనకి లేకుండా పోలేదు. అలాంటి వారిని గుర్తించి ఇది ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లవచ్చు.
మరో విషయం. ఒక పత్రిక కూడా కావాలి. వేమూరి గారన్నట్లు “ఈ పత్రికలో సగం తెలుగులో రాసినవి, సగం ఇంగ్లీషులో రాసినవి ఉంటే ఇంగ్లీషు ప్రపంచానికి తెలుగు గురించి కొంచెమైనా తెలుస్తుంది.”
“Nay Sayers” ఎప్పుడూ ఉంటారు! But let’s ignore them. సారధి మోటమర్రి గారు అన్నట్టు – “A long journey starts with a small step.”
తెలుగు బాషాభిమానులు, పెద్దలు అందరూ ఇక ఆ దిశగా ఒక కార్యక్రమం, ప్రణాళికని నిర్ణయించుకుని సాగడమే మనకి కావాల్సింది.
తా.క
ఒకటి గమనించాను. ఈ వ్యాసం మీద ఇప్పటిదాక తమ అభిప్రాయాలను వెలువరించిన వారందరూ…విదేశాలలోనున్న ప్రవాసాంధ్రులు (non-resident Telugu person)లాగే ఉన్నారుగా?
‘కనుల ముందు జరిగే విషయాల్లోనూ కనిపించని వాయులీనాలు ధ్వనిస్తుంటాయా…’
– ఎంత పొయిటిక్ గా చెప్పావు, జాయ్!
మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నాకు అచ్చు ఇలానే కనిపిచీ కనిపించని రూపాలు. వినిపించీ వినిపించని ధ్వనులు.
ఆ గలగలల గురించి ఎప్పటికైనా రాయగలనో లేదో!..
ఒక అల లా అలా అలా వచ్చి తాకి వెళ్తున్నట్టు..నీ హృదయ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు జయ్ !
శుభాకాంక్షలతో..
దమయంతి గారు, మానవ మనస్తత్వాల చుట్టూ చాలా అందమైన, ఆర్ద్రమైన కథని అల్లారు. వెంటాడే పాత్రలు! ఎత్తుగడలో తీరుబాటుగా సాగిన కథ, ముగింపులో కొంత త్వరగా ముగిసిపోయిన భావన నిచ్చింది. మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. జీవితంలో కొన్ని సంఘటనలు మనకి అర్ధం కాక పోవచ్చు గాని కథకి మీరే విధాత కదా. మరికొంచెం స్పష్టత చూపాల్సింది… ఏమైనా, గుర్తుండిపోయే వాక్యాలతో, దృశ్య మాలికలతో, ఆత్మీయతా సౌరభాలతో కథ రసాత్మకంగా సాగింది. అభినందనలు !
ప్రియమైన రచయిత్రికి.. కథ బాగుంది. ఏకబిగిన చదివించావు. కొన్ని వాక్యాలు కథకి ప్రాణ సమానాలు. అవి ఏమిటో పైన స్పందనల్లోనే చెప్పేశారు కాబట్టి రెపీట్ చేయనక్కర్లేదు. చెప్పీ చెప్పకనే చురుక్కుమనిపించిన మానవ మనస్తత్వం ఇంకా మనసు ఉలిక్కిపడేలా చేసిన ముగింపు… అంతేనేమో… కనుల ముందు జరిగే విషయాల్లోనూ కనిపించని వాయులీనాలు ధ్వనిస్తుంటాయా… సముద్రాన్ని కూడా కథలో ఒక పాత్రగా చెయ్యడం బాగుంది.
‘నూనె లో తేలే మాగాయ ఇంగువ వాసన’- మా పుట్టింటి వంటింటి ఘుమాయింపు..
‘మంగినపూడి సముద్రపు అందం’ -నా జన్మ భూమి సౌందర్యం
‘ఉసిరికాయలంత వాన చినుకులు ‘ – నా అనుభూతుల పరిమళం
🙂 ఎంత బావుంది మీ వ్యాఖ్యావళి కాదు మధుర జ్నాపకాకాల జావళి. మిధునం గుర్తొచ్చిందన్నారు! హబ్బ, మాటలు రావడం లేదు మైధిలి గారు.ధన్యవాదాలు తెలియచేసుకుంటూ..
శుభాకాంక్షలతో..
శేషు మావయ్య గురించి GVRamesh అభిప్రాయం:
05/05/2015 12:04 am
Damayanti gaaroo:

తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి పాలూరి వెంకట రామారావు అభిప్రాయం:
05/04/2015 11:44 pm
పెద్దలకు వందనాలు, రచయితలకు అభివాదాలు.
పైన గన్నవరపు గారి అభిప్రాయ్ంతో నేనూ ఏకీభవిస్తాను. ప్రస్తుతం తెలుగు అంతర్జాతీయభాష కావలసిన ఆవశ్యకత ముందు మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. అసలే మన సాధారణ ప్రజానీకానికి పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే భాషపట్ల మక్కువ, మమకారం కాస్త తక్కువే అని చాలాచోట్ల చర్చించుకోవటం పరిపాటి. చదువుకున్న వారూ మేధావులూ వ్రాసే భాషకూ దారినిపోయే వారు మాట్లాడే వాడుకభాషకూ కూడ వ్యత్యాసం ఎక్కువే! వ్రాయడానికి కూడ ఒక ప్రమాణికమైన తెలుగు భాష లేదని ఇతరభాషలతో తులన చేసిన మోహన గారి లాంటి పెద్దలు పలు సందర్భాలలో ప్రస్తావించారు. ఇవన్నీ ఒక యెత్తైతే, అచిరకాలం క్రితమే రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలూ తమ ఉనికినీ భాషాసంస్థలనీ పునర్నిర్మించుకోవడమే ఒక కొలిక్కి రాలేదు.
ఈ పరిస్థితులలో తెలుగును అంతర్జాతీయ భాషగా ముందుకు త్రోయడం దేనికి? ఎవరి ప్రయోజనం కోసం? ప్రాచీన భాష హోదా వచ్చి తెలుగుకు ఒరిగిందేమిటో మామూలు ప్రజలలో తొంభైశాతం మందికి తెలియనే తెలియదు. ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఎవరిస్తారో, అటుపిమ్మట ఎవరు నిర్ధారిస్తారో ఒకసారి వస్తే చాలునో, నిలబెట్టుకుంటూ పోవాల్నో దేనికీ స్పష్టమైన సమాధానం దొరకదు..
అసలే మన భాషలో అల్పసంఖ్యాక మేధావివర్గానికీ – మిగతా సాధారణ ప్రజలకూ అంతరం చాల అధికం. వీలైతే ఈ అంతరాన్ని తగ్గించి, తెలుగును మరింత ప్రజలభాషగా చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఊహాత్మక తులనలపై భాషాశాస్త్ర వేదికలలో తెలుగు జండాని ఎగురవేయడం కన్నా ఇది తక్షణ అవసరం. ఒక్కమాటలో చెప్పాలంటే రచ్చకెళ్ళె ముందర ఇంట గెలవడం చాల అవసరం..
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Anil అనిల్ అట్లూరి అభిప్రాయం:
05/04/2015 10:37 pm
ఈ వ్యాసం మీద ప్రస్తుతం సూక్షంగా నా అభిప్రాయాలు ఇలా ఉన్నవి.
ఒక సంస్థని ఏర్పాటు చెయ్యాలి. వ్యాసకర్తలు అన్నట్టు “అంతర్జాతీయ భాషగా చేయాలన్న పట్టుదల వుంటే ఏదయినా సాధ్యమే.” రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ రాజకీయ నాయకుల రాజకీయాలకు దూరంగా, కుల మత ప్రాంతీయ దురభిమానాలకు తావివ్వకూండా ఉండే ఒక సంస్థ ఏర్పడాలి. వంగూరి వారి మాటల్లో “అందులో మీరు (వ్యాసకర్తలు) సూచించిన ప్రమాణాలకీ, నిబధ్ధతకీ, దిశా నిర్దేశానికీ , ఆశయ సాధనకీ కట్టుబడి ఉండే “ప్రైవేటు” సంస్థ ఒక ప్రత్యామ్నాయ మార్గం అని నేను అనుకుంటాను.”
అలాగే, “ఆ ప్రయత్నం అమెరికాలోనే జరగాలనీ, ఇక్కడి నిబధ్ధత , అక్కడ ఇంకా అంతరించి పోకుండా అందుబాటు లోనే భాషా శాస్త్ర వేత్తల , పండితుల, గ్రంధాలయాలతో ప్రభుత్వేతర అనుబంధం పెట్టుకుంటేనే తెలుగు అంతర్జాతీయ భాషగా (ఏ నిర్వచనం ప్రకారం అయినా సరే) ప్రయాణం మొదలు పెడుతుంది,” అనే వారి మాటలతో నేను ఏకీభవిస్తాను.
తెలుగు భాషాభిమాని కీ.శే. కొప్పాక విశ్వేశ్వర రావు గారు వారి కుటుంబ సభ్యుల వదాన్యతతో అట్లాంట, అమెరికాలో ఎమెరి విశ్వవిద్యాలంలో తెలుగు సాహిత్య పీఠం ఏర్పడిందన్నది గుర్తుచేస్తున్నాను. అలాగే కోట్లలో విరాళాలు (GMCANA కి) అందించిన పొదిల ప్రసాద్ గారి లాంటి దాతలు మనకి లేకుండా పోలేదు. అలాంటి వారిని గుర్తించి ఇది ఉద్యమంగా ముందుకు తీసుకువెళ్లవచ్చు.
మరో విషయం. ఒక పత్రిక కూడా కావాలి. వేమూరి గారన్నట్లు “ఈ పత్రికలో సగం తెలుగులో రాసినవి, సగం ఇంగ్లీషులో రాసినవి ఉంటే ఇంగ్లీషు ప్రపంచానికి తెలుగు గురించి కొంచెమైనా తెలుస్తుంది.”
“Nay Sayers” ఎప్పుడూ ఉంటారు! But let’s ignore them. సారధి మోటమర్రి గారు అన్నట్టు – “A long journey starts with a small step.”
తెలుగు బాషాభిమానులు, పెద్దలు అందరూ ఇక ఆ దిశగా ఒక కార్యక్రమం, ప్రణాళికని నిర్ణయించుకుని సాగడమే మనకి కావాల్సింది.
తా.క
ఒకటి గమనించాను. ఈ వ్యాసం మీద ఇప్పటిదాక తమ అభిప్రాయాలను వెలువరించిన వారందరూ…విదేశాలలోనున్న ప్రవాసాంధ్రులు (non-resident Telugu person)లాగే ఉన్నారుగా?
పాఠశాలకై పర్మిటు గురించి గన్నవరపు నరసింహ ముర్తి అభిప్రాయం:
05/04/2015 9:46 pm
శ్రీ దేశికాచారి గారూ ! సందేహ నివృత్తి చేసారు . ధన్యవాదములు .
శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
05/04/2015 2:19 pm
‘కనుల ముందు జరిగే విషయాల్లోనూ కనిపించని వాయులీనాలు ధ్వనిస్తుంటాయా…’
– ఎంత పొయిటిక్ గా చెప్పావు, జాయ్!
మనం మాట్లాడుకున్నప్పుడు కూడా నాకు అచ్చు ఇలానే కనిపిచీ కనిపించని రూపాలు. వినిపించీ వినిపించని ధ్వనులు.
ఆ గలగలల గురించి ఎప్పటికైనా రాయగలనో లేదో!..
ఒక అల లా అలా అలా వచ్చి తాకి వెళ్తున్నట్టు..నీ హృదయ స్పందన తెలియ చేసినందుకు ధన్యవాదాలు జయ్ !
శుభాకాంక్షలతో..
శేషు మావయ్య గురించి వారణాసి నాగలక్ష్మి అభిప్రాయం:
05/04/2015 2:12 pm
దమయంతి గారు, మానవ మనస్తత్వాల చుట్టూ చాలా అందమైన, ఆర్ద్రమైన కథని అల్లారు. వెంటాడే పాత్రలు! ఎత్తుగడలో తీరుబాటుగా సాగిన కథ, ముగింపులో కొంత త్వరగా ముగిసిపోయిన భావన నిచ్చింది. మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయింది. జీవితంలో కొన్ని సంఘటనలు మనకి అర్ధం కాక పోవచ్చు గాని కథకి మీరే విధాత కదా. మరికొంచెం స్పష్టత చూపాల్సింది… ఏమైనా, గుర్తుండిపోయే వాక్యాలతో, దృశ్య మాలికలతో, ఆత్మీయతా సౌరభాలతో కథ రసాత్మకంగా సాగింది. అభినందనలు !
సూరిగాడి కొలువు గురించి Jayashree Naidu అభిప్రాయం:
05/04/2015 1:42 pm
పిల్లల లోకం చూపించావు…
హ్మ్ కార్పొరేట్ చదువుల్లో పిల్లలు కోల్పోతున్నదేంటో కూడా స్పష్టం గా కనిపిస్తోందీ..
పాఠశాలకై పర్మిటు గురించి దేశికాచారి అభిప్రాయం:
05/04/2015 1:24 pm
శ్రీనరసింహమూర్తిగారికి,
మీ అభిప్రాయమునకు ధన్యవాదములు. ‘నాదు, ‘మాదు’, ‘నీదు’, ‘మనదు’ ఇత్యాది శబ్దముల స్వరూపములు ఆంధ్రవైయాకరణపతంజలులైన బ్రహ్మశ్రీ వజ్ఝల చినసీతారామస్వామిశాస్త్రిగారిచే వారి ‘బాలవ్యాకరణోద్ద్యోతము’ అను గ్రంథములో వివరముగా చర్చింపబడినవి. ఐనా, ‘మా’శబ్దము ‘నా’శబ్దముయొక్క బహువచనరూపమేకదా! అందుచేత, ‘నాదు’ వలెనే ‘మాదు’కూడ సాధురూపమే. బాలవ్యాకరణోద్ద్యోతములో చినసీతారామస్వామిశాస్త్రిగా రిచ్చిన పూర్వకవి ప్రయోగము లివి: నీదుకొడుకులు (భారతము:స్త్రీపర్వము); తమదు వీథులఁ దమదు లోఁగిళ్ళ (రంగనాథ రామాయణము); మద్భక్తదేహంబు మాదు దేహంబు (బసవపురాణము)
శేషు మావయ్య గురించి Jayashree Naidu అభిప్రాయం:
05/04/2015 1:10 pm
ప్రియమైన రచయిత్రికి.. కథ బాగుంది. ఏకబిగిన చదివించావు. కొన్ని వాక్యాలు కథకి ప్రాణ సమానాలు. అవి ఏమిటో పైన స్పందనల్లోనే చెప్పేశారు కాబట్టి రెపీట్ చేయనక్కర్లేదు. చెప్పీ చెప్పకనే చురుక్కుమనిపించిన మానవ మనస్తత్వం ఇంకా మనసు ఉలిక్కిపడేలా చేసిన ముగింపు… అంతేనేమో… కనుల ముందు జరిగే విషయాల్లోనూ కనిపించని వాయులీనాలు ధ్వనిస్తుంటాయా… సముద్రాన్ని కూడా కథలో ఒక పాత్రగా చెయ్యడం బాగుంది.
శేషు మావయ్య గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
05/04/2015 10:21 am