పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. చంపకోత్పలమాలల కథ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/14/2015 10:59 pm

    డా. యెర్నేని లైలా గారికి, పెద్దలందరికి
    నమస్కారములతో,

    ఈ పద్యపాఠం, ప్రతిపాదింపబడుతున్న తాత్పర్యం ఈ ప్రకారంగా ఉండాలని నాకు తోచింది:

    “అర్థమ శాశ్వతమ్ము; యొడ లన్నది తత్ క్షణభంగురమ్ము; త
    త్త్వార్థము గాదు జీవము, కృతాంతక మారక; మిట్టి దీనినిన్
    వ్యర్థ” మటంచు నమ్మక, పరార్థము నెన్నడుఁ జేటులేని ధ
    ర్మార్థము జేయుఁడీ మనుజు లమ్మన ప్రెగ్గడ యట్లు నెమ్మితోన్.

    “ఈ జీవితంలో డబ్బొక్కటే ఎల్లకాలం ఉండేది (మనకే గాక మన తర్వాత మన కుటుంబానికి కూడా సంక్రమిస్తూ తరతరాలు నిలిచి ఉంటుంది). శరీరం అన్నది క్షణంలో అవతరించి మరుక్షణంలో అంతరించే ఆ సబ్బు బుడగ వంటిది. ఈ జీవపరమార్థం తత్త్వార్థం కాదు (అంటే, జీవవిచారం చేసినవారు “సర్వస్మిన్ దృశ్యే వాచ్యమానేఽపి తద్బాధాధిష్ఠానత్వేన స్వయ మబాధ్యమానేఽపి అనారోపితే స్వరూపే” అని – కంటికి కనబడే సమస్తచరాచరమూ నశించినప్పటికీ, ఈ సమస్తానికీ అధిష్ఠానమై మిగిలి ఉండేదీ, స్వతస్సిద్ధమైనదీ అయిన స్వరూపమే (బ్రహ్మచైతన్యమే) తత్త్వము; అదే శాశ్వతము అని అంటుంటారు. ఆ తత్త్వార్థం ఎంతమాత్రమూ సరికాదు. శాశ్వతమైనది ఏదన్నా ఉంటుందంటే అది మనము సంపాదించి, తరతరాల వారికి వదిలివెళ్ళే డబ్బొక్కటే శాశ్వతం. తక్కినవేవీ శాశ్వతాలు కావు). ఈ శరీరం కృతాంతక మారకం. ప్రారబ్ధం నశింపగానే యమధర్మరాజు వచ్చి పడగొట్టి తీసికొనివెళ్ళిపోయేది. అందువల్ల ఇటువంటి శాశ్వతమైన ధనాన్ని కాపాడుకోవాలి గాని, పోయేటప్పుడు మన వెంటరాదు, వట్టి నిరర్థకం” – అని విశ్వసింపక,

    మనుజులు = మనుష్యులందరూ, ఎన్నడున్ చేటులేని = ఏనాటికీ చేడ్పాటు లేని, ధర్మార్థము = ధర్మంకోసం (అంటే, సంసారముయొక్క మేలుకోసం, వేదవిహితమైన మోక్షకారక కర్మమును పాటించడం కోసం), పరార్థమును = స్వార్థంకోసం గాక ఆర్తులకోసమై దానధర్మాలను, అమ్మన ప్రెగ్గడ యట్లు = అమ్మన ప్రెగ్గడ గారి లాగా, నెమ్మితోన్ = ప్రేమతో సంతోషంగా, చేయుఁడీ = చేయండి.

    అని.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  2. జాషువా – పిరదౌసి గురించి syam అభిప్రాయం:

    05/14/2015 7:56 am

    ఆధునిక కవులలొ సమాజ రుగ్మతలను వెలుగెత్తి చూపిన దీశాలి గుర్రం జాషువా.కరుడుగట్టిన సమాజంలో, సాంఘిక దురాచారాలపై తిరుగుబాటుచేసి, దారిద్య్రం, అస్పృశ్యతపై తన కలం ద్వారా పోరాటం సాగించిన మహాకవి శ్రీ గుర్రం జాషువా. కుల మతాల గీతలతో తలరాతలనే శాసించే కుళ్ళిన సమాజాన్ని దాటి విశాల కవితా సామాజిక జగత్తుకు ఎదిగిన మేటి కవితా ధీరుడు.అస్పృశ్యుడిగా అవమానాలకు గురైనా భూతకాలాన్ని జీర్ణించుకొని,వర్తమానం లోని సవాళ్లను పరిశీలించి, జీవించి, భవిష్యత్తును దర్శింప జెసిన విశ్వకవి.ఆటువంటి గొప్ప కవి రచించిన ‘పిరదౌసి గురించి మీరు రాసిన విశ్లేషణా వ్యాసానికి శిరస్సు వంచి పాదాభివందనం చెస్తున్నా.మీ రచనా శైలి అద్బుతం.

    ధన్యవాదాలు.
    SYAM PRASAD
    ADMIN MANAGER
    SECUNDERABAD

  3. చంపకోత్పలమాలల కథ గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    05/13/2015 3:20 pm

    ఈ ఉత్పలమాల పద్యం శ్రీకృష్ణ దేవరాయ గ్రంథాలయ స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికలో చోటుచేసుకున్న “రాయలసీమ శాసనాలు -ధార్మిక జీవనము” (గడియారం రామకృష్ణశర్మ) అన్న వ్యాసంలో మరింత పరిష్కృత రూపంలో ( లఘు వివరణతో )కనిపించింది.

    అర్థ మశాశ్వతమ్ము యొడలన్నది తత్ క్షణ భంగురమ్ము త
    త్వార్థముగాదు జీవము కృతాంతక మారక మిట్టి దీనినిన్
    వ్యర్థమటంచు నమ్మక పరార్థము నెన్నడు చేటులేని ధ
    ర్మార్థము చేయుడీ మనుజులమ్మన ప్రెగ్గడయట్లు నెమ్మితోన్

    కమలాపురం తాలుకా చిదిపిరేల శాసనము కాలము 10వ శతాబ్ది
    చిదిపిరేలలో అగస్త్యేశ్వరాలయము కాలవశమున చెడిపోగా అమ్మన ప్రెగడ
    జీర్ణోద్ధారము చేసెను. బాసెభూపతి అనువాడు యేబది మర్తురులు నేల
    దానము చేసి పద్యమును చెక్కించెను.

    ఆదినారాయణ శాస్త్రి గారు ఉదహరించిన ఉత్పలమాల :

    అర్థ మశాశ్వతమ్ము, యొడలన్నది తక్షణభంగురమ్ము, త-
    త్వార్థము గాదు జీవనమ్ము, కృతాంతక మారక, మ్మిట్టి దీనినిన్
    రత్తి గుఱించి నమ్మక పరార్థము నెన్నడు జేటు లేని ధ-
    ర్మార్థమ చేయుడి మ్మనుజు లమ్మెన పెగ్గడ యట్లు వేర్మిలోన్

  4. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Pakkinti Bapuji అభిప్రాయం:

    05/13/2015 12:38 pm

    “తెలుగు భాషా పరిరక్షణ సమితి, శ్రీవెంకటేశ్వర ప్రాచ్య పరిశోధన సంస్థ, ఎస్‌.వి. విశ్వవిద్యాలయం, తిరుపతి, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా జాతీయ సదస్సును తిరుపతిలో నిర్వహించనున్నాయి’

    మూడు పేర్లు రాసి రెండు సంస్థలంటారేమిటండీ? ఇప్పటికే మనది జాతీయ స్థాయి దాటి పొయింది కదా? ఇప్పుడు మళ్ళీ పరిరక్షణ యేమిటి? జాతీయంగా అన్ని భాషల వాళ్ళనీ అత్యంత విజయవంతంగా అనుకరించి, మిగిలిన ఖండాతర భాషలని అనుకరించే ఏకైక ఉన్నత లక్స్యంతో పురోగమిస్తున్న ప్రగతిశీల భాషా సమాజం మనది.

    అనుకరణలో ఉన్నత ప్రమాణాలు ప్రోదిచేసే భాషాసూచనల కోసం యెదురుచుద్దాం. పత్రాలు సమర్పించాలనుకునే వారికి ఆమాత్రం జరిమానా ఉండాలిసిందే.

  5. ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద గురించి nvsubbarao అభిప్రాయం:

    05/13/2015 12:10 pm

    చాలా కాలానికి మనసారా చదువుకున్న. చక్కని శైలి… ఇంపైన మాటలు…

  6. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి మోహన అభిప్రాయం:

    05/12/2015 7:29 pm

    “జాతీయ భాషగా తెలుగు” – నాకు అర్థము కాలేదు, తెలుగు ఆంగ్లము, హిందీల వలె అధికార భాష (official language) కాదు, కాని మిగిలిన చాల భాషలతో తెలుగు జాతీయభాషయే (national language) కదా? మఱి ఈ పరిరక్షణ సమితి ఉద్దేశము ఏమిటో బోధపడడము లేదు. ఈ ప్రవేశ రుసుము (registration fees) అన్ని సమావేశములకు ఉన్నాయి, అందులో ఆశ్చర్యము ఏమియు లేదు. 400 రూపాయలు చాల తక్కువే. విధేయుడు – మోహన

  7. శార్దూలవిక్రీడిత వృత్తము గురించి మోహన అభిప్రాయం:

    05/12/2015 5:59 pm

    వ్యాసములో మ/స/జ/స గణములతో విరళోద్ధతా అను వృత్తమును పరిచయము చేసియున్నాను. విరళోద్ధతలో శార్దూలవిక్రీడితపు మొదటి నాలుగు గణములు గలవు. దానితో తఱువాతి గురువును కూడ చేర్చుకొన్న వృత్తము పంకజధారిణీ అను వృత్తము. క్రింద పంకజధారిణీ వృత్తమునకు నా ఉదాహరణములు –

    పంకజధారిణీ – మ/స/జ/స/గ, యతి (1, 8) UU UII UI – UIII UU
    13 అతిజగతి 1881

    నిన్నే బంకజధారి-ణీ గొలుతు భక్తిన్
    వన్నెల్ జిందుచు రమ్ము – వాక్కు లలరించన్
    దెన్నుల్ జూపుము నాకు – దీపములతోడన్
    విన్నాణమ్మగు రీతి – విజ్ఞునిగఁ జేయన్

    ఈ నా డెందము పువ్వు – యెల్లపుడు నీకే
    వీణానాదపు గీతి – ప్రేమమయి నీకే
    నానావర్ణ మహస్సు – నాళికలు నీకే
    ప్రాణోత్సాహపు శ్వాస – వాయువులు నీకే

    ఆ దివ్యాస్యము గాన – నందఱము నుండన్
    రాధారాధనలోన – రాజిలుచు నుండెన్
    రాధామాధవుఁ డిందు – రాసమున లేఁడే
    మోద మ్మీయఁగ రమ్ము – మోహన మురారీ

    విధేయుడు – జెజ్జాల కృష్ణ మోహన రావు

  8. గ్రంథ పరిచయం: శ్రీవిజయుని కవిరాజమార్గం గురించి VSTSayee అభిప్రాయం:

    05/12/2015 9:22 am

    ఎం.వి.సీతారామయ్యగారి “కవిరాజమార్గ వివక్షె.”

    దండి “కావ్యాదర్శ”కు పుల్లెలవారి వ్యాఖ్య.

    రేచన “కవిజనాశ్రయము.”

  9. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/12/2015 8:15 am

    హేవిటేవిటీ? భాష నాశనం చేసుకున్నది కాక ఆ భాష జాతీయంగా ఎలా కుదురుతుందో చెప్పాలా? పోనీ చెప్పాలనుకున్నా దానికి 400 రూపాయలు కట్టుకోవాలా? బానే ఉంది సంబడం. ఆయనే ఉంటే మంగలితో పనేముంది అనే సామెత గుర్తొస్తోంది.

    ఇదండి వరస. ఆ మధ్య ఏదో సినిమాలో అనుకుంటా ఎవరో పేపర్ చదువుతూ ఉంటారు, “బస్సులు జాతీయము చేయబడినవి” అని. పక్కనే ఉన్న పెద్దమనిషి (ఈయనకి చెవిలో ఓ పువ్వూ నుదుట విభూదీ అవీను) చేతులు కట్టుకుని “అయ్యా బస్సులు జాతీయం చేయబడినవి” అంటే ఏవిటండీ? అని అడుగుతాడు. చదివే వాడికి తెలియదు కదా? “బస్సు ఉందా? అలాగే జాతీయం ఉంది. ఈ రెండూ కలిపితే…” దీనితో చెవిలోపువ్వు పెద్దమనిషికి తెల్సిపోతుంది ఈ చదివేవాడి యోగ్యత. “సరే మీకూ తెలియదన్న మాట. ఈ పువ్వు తీసి చెవిలో పెట్టుకోండి.” అని చక్కాపోతాడు. నవ్వుకోవడానికి పెద్ద జోకే. (ఇందులో మరో మైక్రో జోకు.. ఈ కధ ఓ స్నేహితుడికి చెప్తే ఆయన అడిగిన ప్రశ్న.. మొదటి పెద్దమనిషికి చెవిలో పువ్వు ఎవరు పెట్టారో?)

    ఈ “తెలుగు బాషా పరిరక్షణ సమితి” వేసిన జోకు అచ్చు ఇలాగే ఉంది కానీ చెవిలో పువ్వు పెట్టించుకోవడానికెంతమంది ముందుకొస్తారో మరి? ఒక్క ధర్మ సందేహం. “రక్షణ” సమితి అనొచ్చు కదా “పరి రక్షణ” అని ఎందుకన్నారో ఎవరైనా చెప్పగలరా?

  10. యద్భావం తద్భవతి గురించి mahesh అభిప్రాయం:

    05/12/2015 7:00 am

    భక్తి భావం పొంగిపొరలె కథ.
    ఆర్ శర్మ దంతుర్తి గారికి దన్య వాదములు