పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/01/2015 8:27 am

    >> తెలుగేతరులు కూడ తెలుగు నేర్చుకోవాలని అనే గమ్యం కూడ ఉంటే తెలుగుని రెండవ భాషగా నేర్పడం ఎలా అన్న విషయం మీద పరిశోధన అవసరం. అటువంటి పనిని ఆదివారం పాఠశాలలు కంటె విశ్వవిద్యాలయాలు చేస్తేనే రాణిస్తుంది.

    అంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ లాంటివాటికంటే హిందీ పుస్తకాలు రాసి అచ్చేసే మన ఆంధ్రా యూనివర్సిటీ పుస్తకాలే మంచివంటారా? యూనివర్సిటీల్లో పనిచేసే మన అధ్యాపకులెంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళో, వాళ్ళనెలా ఉద్యోగాల్లోకి తీసుకుంటారో జగమెరిగిన సత్యం. నేను యూనివర్సిటీ అధ్యాపకులు రాసిన పుస్తకాలు చదువుకుంటూ ఇంటర్మీడియేట్ పూర్తిచేసేసరికి హిందీ ప్రచారసభ వారు అందించిన పుస్తకాలు చదువుకుంటూ, మధ్యమ, రాష్ట్ర లాంటి పరీక్షలు పాసై నా తోటి స్నేహితులు అద్భుతమైన హిందీ మాట్లాడేవారు. వాళ్లకి యూనివర్సిటీ పుస్తకాలు అవసరం లేకపోయాయి.

    మద్రాసులో చదివిన కొంతమంది స్నేహితులు సరిగ్గా ఆరునెలల్లో తమిళం మాట్లాడ్డం నేనెరుగుదును. మామూలు తమిళం, మద్రాస్ తమిళం, మదురై తమిళం ఎకా ఉంటాయో వాళ్ళు వివరించి చెప్పగలిగేవారు – సరిగ్గా ఆరునెలల్లో. నేర్చుకోవాలని తపన ఉన్నవాడికీ ఏ పుస్తకమూ అఖ్ఖర్లేదు. అది లేనివాడికి సాక్షాత్తూ సరస్వతీ దేవి నోట్లో బీజాక్షరాలు రాసినా ఏమీ రాదు. ఉత్తినే యూనివర్సిటీలని పట్టుకుని వేళ్ళాడ్డం అంత మంచిది కాదని నా బోడి అభిప్రాయం.

  2. సామాన్యుని స్వగతం: మంచి స్నేహితురాలు గురించి Dr.CBS Venkataramana అభిప్రాయం:

    06/01/2015 5:10 am

    ఇది కథా లేక వాస్తవంగా జరిగిన సంఘటనా? అర్ధం కావటం లేదు.

  3. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

    05/31/2015 11:15 pm

    తెలుగు గురించి ఇక్కడ ఒక అంశాన్ని పేర్కొనడం ముఖ్యమని భావించి ఇది రాస్తున్నాను:
    దాదాపు 15 సంవత్సరాలక్రితం ‘ద హిందు’ నెలలో ఒకఆదివారమనుకుంటాను. సంగీతానికీ నాట్యానికీ సంబంధించిన విషయాల మీద ఓక ప్ర త్యేక ఫోలియో వెలువరించేది . ఆఫోలియోల్లో వచ్చిన వ్యాసాల్లో ఒక దాంట్లో , సంగీతం -తమిళ దేశం లో- నేర్చుకోవాలనుకునే విద్యార్థులను తమ దగ్గర పాఠాలకై జేర్చుకునేముందు, పాత రొజుల్లో గురువులు ఆ విద్యార్థులకు తప్పనిసరిగా రావలిసినవి గా ఆశించే వాటిగురించి ఈమాటలు చదివాను. “….. తెలుగు ఇజ్ అ మస్ట్ , సంస్కృత్ ఇజ్ ఆప్షనల్ ” .
    తః తః

  4. ప్రతీక గురించి తః తః అభిప్రాయం:

    05/31/2015 10:02 pm

    తః తః అనే పేరుతో నేను రాసిన అభిప్రాయమొకదానికి స్పందిస్తూ ‘ గుప్త నామం తో రాసినవేవీ ఇక నుంచి చదవను ‘ అని లైలా యెర్నేని గారు ఒకసారి అన్నట్టు జ్ఞాపకం. కానీ వారు ఇతరులడైరీలను చదివి వాటిలోని విషయాలను మనకు కథలుగా చెపుతున్నారు. ఆహా!
    తః తః

  5. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/31/2015 3:18 pm

    బ్రిటిష్ వాళ్లు ఇండియా వచ్చి తిష్ట వేసిన కొత్త రోజులలో వారికి ఒక సమస్య ఎదురయింది. “ఇంగ్లీషేతరులకి” ఇంగ్లీషు ఎలా నేర్పించాలి అని. వారి మాతృభాష ఇంగ్లీషే కాబట్టి ఎవ్వరూ నేర్పకుండానే వారికి ఇంగ్లీషు వచ్చేసింది. పాఠశాలకి వెళ్లి నేర్చినది రాయడం, చదవడం. కాని భారతీయులకి ఇంగ్లీషు నేర్పబూనుకున్నప్పుడు ఆ పని ఒక క్రమ పద్ధతిలో ఎలా చెయ్యాలో కనిపెట్టడానికి అప్పటి యూనివర్శిటీలు కష్టపడే ఉంటాయి. ఇండియా అంత పెద్ద మార్కెట్ లేకపోతే “రెన్” గ్రామరు వంటి పుస్తకాలు బ్రిటన్లో ఎవరికి కావాలి?

    తెలుగు విషయం వచ్చేసరికి పరిస్థితి వేరుగా ఉంది. ఒకటి, ఇంగ్లీషుకి ప్రపంచం లోను, హిందీకి ఇండియాలోను ఉన్న “రాజకీయ బలం” తెలుగుకి లేదు. కనుక తెలుగు పరిస్థితిని లేవనెత్తడానికి చేసే ప్రయత్నాలన్నీ ఏటికి ఎదురీత లాంటివే. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఈ “ఈత”ని ఈదాలి. రెండు, మన పిల్లలకి, మనవలకి తెలుగు నేర్పి అదే మన గమ్యం అని ఊరుకోదలుచుకుంటే ఈ చర్చ అనవసరం. లేదు, కాదు, తెలుగేతరులు కూడ తెలుగు నేర్చుకోవాలని అనే గమ్యం కూడ ఉంటే తెలుగుని రెండవ భాషగా నేర్పడం ఎలా అన్న విషయం మీద పరిశోధన అవసరం. అటువంటి పనిని ఆదివారం పాఠశాలలు కంటె విశ్వవిద్యాలయాలు చేస్తేనే రాణిస్తుంది. – వేమూరి

  6. ప్రతీక గురించి Sivakumara Sarma అభిప్రాయం:

    05/31/2015 2:04 pm

    కథ దుర్గేష్ తో మొదలై, ఆమె ప్రస్తావనతోనే ముగిసింది. కథ శీర్షిక కూడా ఆమెకి సంబంధించినదే. దుర్గేష్ న్యూయార్క్ లో డాక్టర్ గా వున్నా గానీ ఎప్పటివో భారతీయ పధ్ధతులనే అనుకరిస్తూనే వచ్చింది. అయితే, కథ మధ్యలో ఆమె ప్రస్తావన చాలా పరిమిత మవడంవల్ల ఆమె ఈ కథకి ఎందుకు కేంద్ర మయింది అన్న విషయం కథలో వెలువడలేదు. కథంతా నిసి కోణం నించే వున్నాగానీ దుర్గేష్ గూర్చిన విషయాలు తక్కువ వుండడంతో దీన్నొక నవల లాగా మలచి వుండాల్సింది అని అనిపించింది. ఒక చోట మొదలై వేరెక్కడో అంతమవడం నవలలోనే చెల్లుతుంది. అంతే కాక, అక్కడే వాదనలకీ, ప్రకృతి వర్ణనలకీ, వేదాంతాలకీ చోటు దొరుకుతుంది.
    కథలో ఛార్లీ బెన్సన్ పాత్ర వచ్చిన దగ్గర్నుంచీ దుర్గేష్ ప్రసక్తి వెనకబడమే గాక నిసి తెర ముందంతా వ్యాపించి గడబిడ చేసింది. బట్టల ప్రసక్తి వచినప్పుడు మాత్రం నాలుగు పేరాల్లో దుర్గేష్ పాత్ర దర్శన మిచ్చింది. తరువాత దుగేష్ భర్త పోతాడు. నిసి వాళ్లు వెకేషన్ కి వెడతారు. మళ్లీ బెన్సన్ కీ హుస్సేన్ కీ మధ్య వున్న సంఘర్షణ ప్రసక్తి. చివర్లో ముండ మొయ్యడం గూర్చి. ఆ చివరి వాక్యంలో కర్త కర్మల సంయమనం కుదర్లేదు.
    “యూ నో శ్యామ్! ఎందుకు దుర్గేష్ చదువు! ఆ పోలిష్ మేరీ క్యూరీతో, ఆ జర్మన్ రోజలిన్ యాలోతో, సమంగా తనూ ఒక సైంటిస్ట్‌గా ఉండలేక, డాక్టర్‌గా ఉండలేక, దుర్గేష్ భారతీయ సంస్కృతి, పరిరక్షణ అంటూ వెనక్కి వెనక్కి పయనించి, గతం లోనే ఉండిపోయి, అక్కర్లేని ఒక దురాచారాన్ని స్వీకరించి, అమెరికాలో ఒక అంతర్జాతీయ వైద్యశాలలో ఒక భారతీయ వనితను ముండ మోయించింది.” అన్న పేరాలో, ఆ “మోయించింది” పదానికి సంబంధించిన కర్త ఎవరు? “దుర్గేష్ … పయనించి, … స్వీకరించి, …” అన్నదాని బట్టీ, దుర్గేష్ అవాలి. కానీ, ఆ కర్తకీ, “మోయించింది” అన్న కర్మకీ పొసగదు. పోనీ ఆ ఆశ్చర్యార్థకంతో ముగిసిన ముందరి వాక్యంతో అన్వయిద్దామా అంటే, “చదువు … ముండ మోయించింది” అన్న అర్థమొస్తుంది. కనుక అదీ సరికాదు. ” … ఇంత చదివినా గానీ తలకెత్తుకున్న దురాచారం అమెరికాలో ఒక అంతర్జాతీయ వైద్యశాలలో ఒక భారతీయ వనిత చేత ముండ మోయించింది.” అని చెప్పడం రచయిత్రి ఉద్దేశమనిపిస్తోంది. అయితే, ఈ దురాచారాన్ని ఈనాడు ఒకచోట ప్రతీకగా చూపించ వలసిన అవసరమేమిటన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు పాఠకులు దుర్గేష్ మీద జాలిపడాలా, లేక నిసితో బాటు ఆమెని నిరసింఛాలా?
    అక్కర్లేని చోట కామాలు విరివిగా దర్శనమిచ్చి చదవడానికి చాలా ఇబ్బందిని కలిగించాయి. ఉదాహరణలు: మొదటి వాక్యంలో కామా అవసరమే లేదు. అలాగే, “నిసి, రెసిడెన్సీ అప్పుడు ఛార్లీ బెన్సన్, బ్రాంక్స్ వెటరన్స్ హాస్పిటల్‌కు వారం వారం, విజిటింగ్ ప్రొఫెసర్‌గా వచ్చి వారి ప్రోబ్లమ్ కేస్ లకు సొల్యూషన్స్ చెప్పేవాడు.” అన్న వాక్యంలో మొదటి మూడు చోట్ల కామాలుండడంలో అర్థంలేదు. అది వుండాల్సిన ఒకేచోట – “వచ్చి” తరువాత కామానే లేదు.

  7. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

    05/31/2015 1:45 pm

    నమస్కారాలు శ్రీ శాయి : మీరు మీకు అనుకూలమైన వాక్యాన్ని ‘ సందర్భం’నుంచి బలవంతంగా పెఱికి బయటికి లాగి మీ అభిప్రాయం చెప్పారు . నా అభిప్రాయం లోని సందర్భం లో మీరన్న ప్రణాళికలకు చోటులేదని సధైర్యంగా చెప్పగలను. సైన్స్ లో పని చేసేవాళ్ళు తమకు పరిచయం లేని భాష లో వచ్చిన వ్యాసాలను,మీరన్న పాఠ్యప్రణాళికల ద్వారా నేర్చుకోవటం ‘అరుదాతిఅరుదు’ .అంతదాకా ఎందుకు కన్నాంబ గారు తమిళ సినిమాల్లో చెప్పిన సంభాషణలకు ప్రేక్షకులు జేజేలు చెప్పేవారట. ఆమె మీరన్న పాఠ్యప్రణాళికల ద్వారా తమిళం నేర్చుకున్నారని నేననుకోను . అలాగే సోఫియా లారెన్ వంటి ఇటాలియన్ నటీమణుల ఇంగ్లిష్ మీరన్న పాఠ్యప్రణాళికల ద్వారా వచ్చిందనీ నేనకోలేకపోతున్నాను. క్షమించండి.
    తః తః

  8. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి VSTSayee అభిప్రాయం:

    05/31/2015 12:17 pm

    తః తః అభిప్రాయం: ‘తెలుగేతరులు’ చచ్చినట్టు తెలుగు నేర్చుకుంటారు. విశ్వ విద్యాలయ తెలుగు శాఖలేమిచేస్తాయి!

    తెలుగేతరులకు తెలుగు ఎట్టా నేర్పించాలో పాఠ్యప్రణాళికలను, పుస్తకాలను తయారుచేస్తాయి.

    నమః,
    శాయి.

  9. కవికులగురువు గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    05/30/2015 10:50 am

    శ్రీమద్రామాయణం – శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు. ఆర్షవిఙ్ఞాన ట్రస్టు – హైదరాబాద్ (పది సంపుటాలు)
    రఘువంశం – శ్రీ కేశవపంతుల నరసింహశాస్త్రీ. తెలుగు విశ్వవిద్యాలయం – హైదరాబాద్.

    (ఇప్పుడు అమ్మకానికి ప్రతులున్నాయో లేదో తెలియదు. కాని అన్ని కాలేజ్ లైబ్రరీల్లో దొరకవచ్చు)

    -భాస్కర్

  10. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

    05/29/2015 9:32 pm

    కొత్తగా చెప్పిన నా అభిప్రాయం లో 2. ను మరొక సారి చెక్ చేసుకుందామని గూగులు కు వెళ్తే కనపడినదిది -ఫేస్ బుక్ లో A film about a Japanese guy who wants to become the next big Tamil Film Superstar.
    గురించి చూడవచ్చని!
    తః తః