పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16472

  1. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Madhav అభిప్రాయం:

    09/04/2015 7:23 am

    అనిల్ గారు,

    1. సంజ్ఞావాచకాల వాడకం గురించి ఏ అనుమానం ఉన్నా సునాయాసంగా గూగుల్లో వెతుక్కోవచ్చు. ఉదా quotes in quotes అని వెతికాను. చూడండి. పైగా ఆంగ్లంలో స్టయిల్ మాన్యువల్స్ ఉన్నాయి. సాధారణ వ్యాకరణానికే కాకుండా, పత్రికలు తమకోసం తాము రాసుకున్న గైడ్స్ తో సహా. అందువల్ల వాటి వాడకం గురించి తీర్చుకోలేని సందేహం అంటూ ఏమీ లేదు.

    తెలుగులో పూర్తిగా మానేయమనటం లేదు నేను. పొదుపుగా, పద్ధతిగా వాడమంటున్నాను చదివే సౌకర్యం కోసం. (అసలు వాడకపోయినా ఇబ్బంది లేదని అలనాటి తెలుసా చర్చల్లో పరుచూరి శ్రీనివాస్ నిరూపించినట్టు గుర్తు. ఈవ్యాసంలో రెండవ బొమ్మ – పంక్తులపోగు వచనం పెద్దది చేసి చదివిచూడండి.)

    2. లీలాజనార్దనం ఉంది. బైండింగ్ కొంత బలహీనం తప్ప పుస్తకం నాణ్యత బాగుంటుంది. అదే రకం పుస్తకమైన తిరుప్పావై బైండింగ్ మరీ బలహీనం. ఒక పదిసార్లు తెరచీ మూస్తే తట్టుకోగలదో లేదో. కాని ఇలా ఒక్కో పుస్తకాన్నీ ఉదా. ఇవ్వడం వల్ల ఏమిటి ప్రయోజనం? వ్యాస రచయితలే చెప్పినట్టు ఇలా ఎన్ని ఒంటరి ఒయాసిస్సులను చూపించుకుంటూ పోతాం?

    3. ఈమాటలో ఒక మాన్యువల్ చేసి పెట్టచ్చు కదా అంటే అవును అలానే పెట్టచ్చు. 🙂 ఆ దిశగా ఆలోచనలూ, చర్చలూ చేస్తూనే ఉన్నా ఇది ఇంకా పూర్తిగా రూపు దిద్దుకోలేదు. అది కొంత పకడ్బందీగా చేయవలసిన ప్రయత్నం. కానీ చేయాలన్న ఆశయం అయితే దృఢంగానే ఉంది.

  2. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Sivaraamaprasad Kappagntu అభిప్రాయం:

    09/04/2015 12:27 am

    చాలా చక్కటి వ్యాసం. చౌదరి గారు అన్నట్టుగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవాళ్ళందరికీ గమనించి, ఏమీ చెయ్యలేక నిశ్శబ్దంగా బాధపడుతున్న ఫిర్యాదులు అన్నీ కలగలిపి ఒక్కచోట వ్రాయటం ఎంతయినా బాగున్నది. మనకు పుస్తకాలు ముద్రించేవారే కాని ప్రచురించేవారు లేరు అన్నమాట అక్షర సత్యం.

    నేను చూసినంతవరకూ ముప్పాళ రంగనాయకమ్మ గారు తన పుస్తకాలను (ఇప్పుడు వస్తున్నవి, ఇంతకు ముందు తెలియదు) చాలా చక్కటి గట్టి అట్టతో, మంచి కాయితం మీద బుక్ మార్క్ కూడా ఉంచి, సరసమైన ధరతో, చదువుకోవటానికి వీలుగా ప్రచురిస్తున్నారు. ఆవిడ వ్రాసిన పుస్తకాల్లో ఉండే విషయం మీద నాకు ఆసక్తి లేకపోయినా ఆ పుస్తకాలు చూడ ముచ్చటగా, చక్కటి ఇండెక్స్, మంచి నాణ్యమైన ముధ్రణ ఉండి, అటువంటి ప్రచురణలను ప్రోత్సహిస్తే, మనకు ఇష్టమైన పుస్తకాలు కూడా ఆ విధంగా ప్రచురిస్తారన్న ఆశతో ఆవిడ పుస్తకాలు దాదాపుగా అన్నీ కొనుకున్నాను. హైదరాబాదులో టాప్ బైండర్ చేత ఆ పుస్తకాలు బైండ్ చేయిస్తారని వినికిడి.

    ఎంతటి పల్ప్ ఫిక్షన్ ఐనా యండమూరి, మల్లాది వంటి రచయితలు తమ తమ పుస్తకాలు ఏ రూపంలో పాఠకులకు అందుతున్నాయో పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. చాలా చౌకబారుగా “గాడీగా” ఉండే ముఖ చిత్రాలతో, పరమ నాశిరపు పేపర్మీద ప్రింటవ్వటం వాళ్ళకే నామోషీ అన్న విషయం తెలిసినట్టు లేదు. దీనికి మరొక కోణం కూడా ఉన్నది. అవే పుస్తకాలు మంచి కాయితం మీద, చక్కటి బైండ్ చేసి,అర్ధవంతమైన చక్కటి ముఖచిత్రంతో ప్రచురిస్తే, ధర ఎంతవుతుంది, ఈ పల్ప్ పుస్తక పాఠకులు ఆ ధరతో ఆయా పుస్తకాలు కొంటారా అన్న ఒక భయం ప్రచురణ కరతల్లో ఉండటం సహజమే మరి. అన్నీ కలగలిపి ఒక బాలెన్స్ తీసుకు రాగలగటమే ఒక “పయనీర్” లక్షణం. అలాంటి “పయనీర్” పుస్తక ప్రచురణలో మనకు తెలుగులో ఒక్క రంగనాయకమ్మ గారే నాకు కనప్దుతున్నారు. కాని ఆవిడ పుస్తకాలన్నీ ఒకే “మార్క్స్” సారీ “మార్క్” పుస్తకాలు అవటం ఒకటి ఉన్నది.

    ఏమైనా కూడా మన తెలుగు ప్రచురణా కర్తలు ఒకసారి తిరిగి చూసుకుని, తాము చేస్తున్న పని ఎంతవరకూ బాగున్నది తరచి చూసుకోవాలి. ఎంతసేపూ పుస్తకాదరణ తగ్గిందని, పుస్తక ప్రదర్శనల్లో విలపించటం మాని,తమ “వస్తువు” ఐన పుస్తకం కొనటానికి, పుస్తకాభిరుచి ఉన్న పాఠకుడికి అనుగుణ్యంగా కనపడుతున్నదా లేదా అని చూడాలి.

    తరువాత రష్యన్ పుస్తకాలు చాలా అద్భుతమైన బైండింగ్ లో చక్కటి పేపరు మీద చూడ ముచ్చటి బొమ్మలతో 1970లలో ప్రచురణ జరిగింది. ఆ ప్రచురణా స్టాండర్డ్స్ కాపీ కొట్టినా చాలు, మన తెలుగు పుస్తక ప్రచురణ నాణ్యం పెరుగుతుందని నా అభిప్రాయం.

  3. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Anil అనిల్ అట్లూరి అభిప్రాయం:

    09/03/2015 10:47 pm

    మాధవ్,
    మీరన్నది పాక్షిక సత్యం.

    బూదరాజు గారు ఈనాడు కోసం వెలువరించినది “ఈనాడు భాషా స్వరూపుం – గుణదోషాలు” అది అమ్మకానికి లేదు. కనీసం నాకు తెలిసి. ఇక “స్టైల్ మాన్యువల్ అవసరం చాలా ఉందనేది నిర్వివాదాంశం.” అది పాత్రికేయానికి మాత్రమే కాదు. తెలుగులో ప్రతి రచనకి కూడా అవసరమే.

    ఇక సంజ్ఞావాచకాల గురించి.
    “ప్రత్యేకించి కొటేషన్ మార్కుల వంటివి. ఇలా కామాలూ కొటేషన్లూ మాటకొకటి లేకుండా కూడా తెలుగు వాక్యం చదివి చక్కగా అర్థం చేసుకోగలం.”

    మొన్నామధ్య ఖధీర్ కూడా టి వి ఇంటర్యూలో ఒక మాటన్నాడు, తెలుగులో విరామ చిహ్నాలు లేకపోయినా ఇబ్బంది లేదు. మన పాఠకులకి అర్ధం అవుతుంది అని. నాతో పాటు మరి కొందరి సాహితిమిత్రుల అభిప్రాయం ఇది: ఇబ్బందికరమే. మనకి కోట్‌లో కోట్ వంటివి వచ్చినప్పుడు ఎలా చెప్పాలి?

    “సొంతడబ్బా అనిపించినా సరే, ఈమాటలో చిన్న అచ్చుతప్పు కనిపిస్తే మాకు కనీసం పదిమంది పాఠకులనుంచి ఈమెయిళ్ళు వస్తాయి. పోనీలే అనుకోకుండా వారు ఆ ప్రయాస తీసుకుని మాకు తప్పు ఎత్తిచూపడం వల్ల, వారు అలా ఆశించే స్థాయి ఒకటి ఏర్పరిచామని మాకు గర్వంగా ఉంటుంది, మా పొగరు కాస్త తగ్గి పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది కూడా.”

    మరి ఈమాట వారు తమ స్టైల్‌గైడ్‌ని, లేదు వారు పాటిస్తున్నదానిని ఇక్కడే ప్రచురించవచ్చు కదా? ఆన్‌లైన్ ఎడిషనే. ఈమాట కి పంపే రచనలకి, రచయితలకి ఆ ప్రమాణాలు పాటించాలని చెప్పొచ్చు. అదొక పద్దతి. ఈమాట సంపాదక వర్గానికి కొంత శ్రమ తగ్గుతుంది కదా! ఏమంటారు? చి న

    ఇక కందుకూరి రుద్రకవి ‘జనార్ధనాష్టకం'(వి ఎ కె రంగారావు, బాపు బొమ్మలతో) లాంటి పుస్తకం ఈ వ్యాసకర్తల దృష్టికి రాలేదనుకోవడం, కొంచెం ధైర్యం చేసి, మరో ముందడుగు వేసి, వారి personal library లో లేవనుకోవడం కూడా పొరబాటే అవుతుందనుకుంటాను. అలాగే మొన్నిమధ్యే మిత్రులు కాండ్రగుల నాగేశ్వర రావు ప్రచురించిన ‘సప్తపర్ణి’ కూడా ఈ వ్యాసకర్తల దృష్టికి రాలేదనుకోలేము.

    రామారావు గారన్నట్టు ఫాంట్ (ఖతి)కూడా చాల పనిచేస్తుంది. He is right when he says, “Different fonts evoke different sensibilities.”

    ఇక గొర్తి గారి మాట: ‘ముందు మాట’ సరిపోదా, preface కి సారు? ద హ
    “నా పుస్తకం – నా మాట” అనుకునే వారితో ఇబ్బంది ఏముంటుంది? చి న.
    ఇక వేలూరి వంటి వారే మనకి కావల్సింది. ఆ పట్టుదల కూడ ఉండాలి మరి.

  4. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    09/03/2015 10:29 pm

    మాధవ్ గారూ:

    మీ ఈమాటలోనే స్టైల్ బుక్ అవసరం గురించి ఒక వ్యాసమూ, దానిపై చర్చా జరిగింది గతంలో! అందులోనూ అచ్చు పుస్తకాల గురించీ ఉంది.

    http://eemaata.com/em/issues/200905/1436.html

  5. ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం గురించి కటకటా అభిప్రాయం:

    09/03/2015 4:01 pm

    రవిగారూ!

    అంటే ఏమిటి? సంస్కృతం రాని మాబోటి వాళ్ళకి కాస్తంత తెలుగు లోనో అంగ్రేజీ లోనో అర్థంచెప్పి,ఇంద్రాణిగారి కవితకి ఎలామప్పుతుందో చెప్పండి స్వామీ,మీకు పుట్టెడు పుణ్యం వుంటుంది.

    విధేయుడు,

    కటకటా

  6. వెడలెను కోదండపాణి గురించి ayyavaru అభిప్రాయం:

    09/03/2015 1:38 pm

    అసలు వాల్మీకి శ్రీ రామయణం లో మంధర పాత్ర మరియు కైక పాత్ర మీద ఎన్ని రకాల వ్యాఖ్యానాలో!! ఈ రెండు పాత్రలు మళ్ళీ ఆ వరములు అడగడం తదుపరి ఎక్కడా మాట్లాడవ్ లేదా కనిపించవ్. కైక వరాలు అడిగినప్పుడు దేవతలని, అష్టదిక్పాలకులని అందరిని సాక్షిగా పెట్టి అడిగింది. ఇదే సందు ఇంక ఇప్పుడే రాముడిని “ధర్మ బద్ధంగా” అడవులకి పంపుదాం అని (మరి తాము బాధ పడుతోంది రానణుడి వలనే గా) దేవతలే పలికించారు అని వ్యాఖ్యానించారు పెద్దలు. అందుకే చతుర్దశ వర్షాణి అనకుండా నవ పంచచ వర్షాణి అనిపించారు అన్నారు. చతుర్దశ అని ఉంటే అప్పటి యుగధర్మం ప్రకారం రాముడూ మరెప్పుడు అయోధ్యలో అడుగుపెట్టే వీలు ఉండేది కాదు.

    yathaa krameNa shapasi varaM mama dadaasi cha |
    tachchhR^iNvantu trayastriiMshaddevaaH saagnipurogamaaH || 2-11-13

    “Let thirty three celestials with the god of Fire in the forefront hear your words giving boons to me, preceded by series of your oaths”

    chandraadityau nabhashaiva grahaa raatryahanii dishaH |
    jagachcha pR^ithivii cheyaM sagandharvaa saraakshasaa || 2-11-14
    nishaacharaaNi bhuutaani gR^iheshhu gR^ihadevataaH |
    yaani chaanyaani bhuutaani jaaniiyurbhaashhitaM tava || 2-11-15

    “Let your words be heard by sun, moon, sky, planets, day, night, the directions, universe, earth, celestial musicians, demons, spirits wandering in nights , house-gods and other spirits.”

    satysandho mahaatejaadharmajJNH susamaahitaH |
    varaM mama dadaatyeshha tanme shR^iNvantu devataaaH || 2-11-16

    “King Dasaratha, who has true promise, who has great valour, who knows righteousness and who has good equanimity of mind, is giving boon to me. Let the celestials hear it for my సకె.”

    nava paJNcha cha varshhaaNi daNDakaaraNyamaashritaH || 2-11-26
    chiiraajinajaTaadhaarii raamo bhavatu taapasaH |

  7. టూఎయిటీన్ డీ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/03/2015 1:10 pm

    అంటే… మీరు ఇంకోలా కూడా చెయ్యొచ్చు. ఆబిడ్స్ దాకా వెళ్ళిపోయి, తిన్నగా ఎంటీవోడి ఇంటి పక్కనున్న విశాలాంధ్రా బుక్ హౌస్ కెళ్లి త్రిపుర కధలు బుక్కు కొనుక్కుని అందులో పేజీ నెంబర్ 31 నుండి 35 దాకా మరో సారి సదువుకుని ఇలాంటి దుస్సాహసాలకి వొడికట్టొచ్చు.

  8. వెడలెను కోదండపాణి గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    09/03/2015 12:51 pm

    “దాన్ని మన సినిమా వాళ్ళు ఎన్ని తికమకలు పెట్టి ఎలా సాగదీసినా సరే …త్యాగరాజు త్యాగరాజే. త్యాగరాజ కీర్తన బదులు మీకు సినిమా పాట నచ్చడం అనేది మీ ఇష్టమే.” – అన్న మీ మాట చదివి –

    “సందర్భం” గురించి నా వ్యాఖ్యను చూసి అది సినిమా పాట ప్రేరితమయ్యిందని మీరు అనుకున్నారేమో అని అనుకున్నాను. కానీ ఎప్పటిదో నూకలవారు చెన్నై ఆకాశవాణికి పాడిన పాట (మళ్ళీ) వినీ, సాహిత్యం చూసీ ఆ మాట అన్నాను (వెడలెను కోదండ పాణి / అనుజ సౌమిత్రిని కూడి / పుడమిలో జనులెల్ల పొగడ / పూజితుడౌ మౌని వెంట…). ఇక్కడ మౌని విశ్వామిత్రుడే కదా. వనవాస సందర్భంలో “ఉరమున హారములు మెరయ…సురుచిర వాద్యములు మ్రోయ…” వెడలలేదు కదా కోదండపాణి?

    అన్నట్లు – త్యాగరాజ వైభవం అనే వెబ్‌సైటులో “In the book ‘Compositions of Tyagaraja’ by Sri TK Govinda Rao, this kRti is listed in the category of ‘Doubtful kRtis’ which means that this kRti might not have been composed by SrI tyAgarAja” అని చెప్ఫారు.

    కాపీ-పేస్టని మీరన్నారు కానీ చాలా బావుంటుంది మీరు కథ చెప్పే తీరు. పోలికా కాదు, పేడ నీళ్ళ ప్రస్తావనా అక్కర్లేదు. 🙂

  9. ఒక పద్ధతి ప్రకా…రం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/03/2015 12:42 pm

    “పౌర గ్రంధాలయాల మేడలు (డాబాల) వంటి యప్పస్ జాగాల మీద చలసాని ప్రసాద్ లాంటి మనుషులు (విరసం) లాంటి సంస్థల్ని తమకి చాతనయినట్టు నిర్మించి, నిలబెట్టుతారు. ఒక పద్ధతి ప్రకా…రం.” ~ ఆ తరం త్యాగాల పునాదుల మీదే నేటి తరం వైభోగ హార్మ్యాలు వెలిసాయని పెద్దలు అంటున్నారు.

    “మా నాన్న, రావి శాస్త్రిగారూ, చలసాని ప్రసాదూ ఈ దారంటే నడిచెళ్ళేవారు.” ~ అయితే బాబో మరి మీరు అటు వైపా? ఇటు వైపా? ఈ తోవ కాకపోతే ఇంకేటున్నాది?

    త్రిపుర స్నేహం చలసాని ప్రసాద్‌గారికి ఊరడింపుగా ఉండేదనుకుంటాను. తరచు వచ్చి పోతుండేవారు. ~ “త్రిపుర గారూ? అయితే మన కాళిదాసు గొప్పవాడంటారా లేక షేక్స్ పియర్ గొప్పవాడంటారా? అని కూడా చలసాని ప్రసాద్‌ గారి సంభాషణలో దొర్లినట్లు వినికిడి.

    “మెడ్రాస్ నుండి రాంభట్ల కృష్ణమూర్తిగారూ వాళ్ళు నిర్వహించిన కన్యాశుల్కం నాటకం సీక్వెల్ రచన పోటీలో కనక ప్రసాద్ గారికి బహుమానం ఇచ్చేరు. అభ్యుదయ పత్రిక రెండు మూడు సంచికల్లోన ప్రచురించేరు” ~ అది దొరకబుచ్చుకోవటానికి మూలా సుబ్రతో మరి మాలాంటి ఔత్సాహికులకు ఇన్నాళ్లకు మంచి క్లూ దొరికింది.

    “తరానికో చలసాని ప్రసాద్‌ అలా ఉండాలమ్మా” అనేసి అనాలనీ ఉందమ్మా.

  10. వెడలెను కోదండపాణి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    09/03/2015 11:01 am

    నమస్తే శ్రీనివాస్ గారు:

    అసలు ఈ కధ రాయడానికి కారణం – కైకనీ మంధరనీ విలన్లు గా చూపించకూడదనే. ఏదైనా మనం అర్ధం చేసుకునేది మన మనః స్థితి మీదే కదా ఆధారపడేది? ఆదిన్ శ్రీపతి కొప్పుపై … అనే పద్యాన్ని బూతుగా చూడ్డం చాతనవ్వడం వేరూ, భైరవభట్ల గారో ఏల్చూరి గారో చెప్పినట్టు చూడ్డం వేరూను. ఎవరో గూని మనిషి రాముణ్ణి అంత పనిగట్టుకుని 14 సంవత్సరాలు అడవుల్లోకి ఎందుకు పంపిందో అర్ధం చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ రాముడంటే చూడగానే ఒళ్ళు మరిచిపోయేలా ఉండేవాడుట. అలాంటి వాడిమీద మంధరకి కోపం రావడం లేక పగ రావడం ఊహించడం కష్టం.

    అవన్నీ అలా ఉంచండి. వెడలెను కోదండపాణి అనేది (నాకు తెల్సినంతలో) త్యాగరాజ కీర్తన. దాన్ని మన సినిమా వాళ్ళు ఎన్ని తికమకలు పెట్టి ఎలా సాగదీసినా సరే త్యాగరాజు త్యాగరాజే. త్యాగరాజ కీర్తన బదులు మీకు సినిమా పాట నచ్చడం అనేది మీ ఇష్టమే. కొంతకాలం పోతే త్యాగరాజునీ, అన్నమయ్యనీ మర్చిపోయి ఫలానా పాట విన్నావా అంటే, అదేనా, నాగార్జున సినిమాలో అనే దశకి చేరుకుంటున్నాం కాబోలు. నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి.

    చంపేసారండి. నేను రాసేవి పోతననీ, వాల్మీకిని అనుసరిస్తాయా? మళ్ళీ ఎక్కడా అనకండి. మొహం మీద పేడ నీళ్ళు జల్లుతారు నాకు. ఎక్కడి పోతనా? ఎక్కడి వాల్మీకి? నక్కకీ నాకలోకానికి పెట్టారు పోలిక? నేను మహా అయితే గియితే ఓ కాపీ-పేస్ట్ ఆర్టిస్టుని. పైన అయ్యవారు గారికి ఇచ్చిన రెండో కామెంట్లో నా తెలుగు పాండిత్యం ఎంతో చెప్పాను. ఓ సారి చదవండి. అది చదివితే తెలియట్లేదా?ఈ కధలో మీరు చెప్పినట్టుగా మొదటి పదంలోనే అపశృతి దొర్లింది. హతోస్మి!