కనక ప్రసాద్ కి కాదు వసంత లక్ష్మి కి ( గార్లెందుకని రాసి తీసేసాను) . బెజవాడనుంచి వచ్చి యూనివెర్సిటీ లో జేరి న 1968 రోజులు. యేం ఊర్రా యిది ! ఒక విశ్వనాథా! ఓక బాలమురళీ నా, ఒక రేడియో స్టేషనా ! ఒక రైల్వే స్టేషనా! ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వేళ లో యెల్లమ్మ తోట లో రోడ్డు మీద నుంచుంటే నేను తప్ప మరోమనిషి కనిపించేవాడు కాదు.
(నేను హాస్టల్లో ఉండే వాణ్ణి కాదు). క్లాస్ రూం నీ , యూనివెర్సిటీ లైబ్రరీ నీ వదిలితే బయట సముద్రమొకటే నన్ను కట్టేసింది. రాత్రి రెండు దాకా చాలా రాత్రులు సముద్రపొడ్డునే. మెల్ల మెల్లగా మా ఊరైన మీఊరు గురించి మీ రెల్లి మాటల్లొ వింటుంటే నేను విశాఖపట్టణాన్ని చూడవలసిన రోజుల్లో సరిగ్గా చూడలేక పోయానేమోనని పిస్తోంది . క్షమించండి.
నమస్కారాల తో
తః తః
మీరన్నది నిజమే! సంజ్ఞావాచకాలు, విరామ చిహ్నాల వాడనానికి కూడా ప్రమాణాలు ఉండాలి. అవి లేకుండా సాహిత్యం వెలువరిస్తే అవే ప్రమాణాలుగా చెలామణి అయిపోయ్యే ప్రమాదం కూడా ఉంది. మార్పు సహజమే. కాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న కథ పునరావృతం కాకుడదన్నదే ఇక్కడి ఆలోచన. ఇప్పటికే మీరన్నట్టు “ఆశ్చర్యార్థకాలు కూడా ఒకటీ రెండూ సరిపోతాయి, అవి ఎన్ని ఎక్కువ వాడితే అంత ఆశ్చర్యమని కాదు కదా. బహుశా కీబోర్డ్ మీద ఒకే మీట నొక్కిపట్టుకోటం తేలిక కావచ్చు. ఇన్‌ఫార్మల్గా ఈమెయిళ్ళూ చాట్ల వంటి వాటిలో వాడే భాష, ప్రచురణకు తగదని తెలియకపోవడమూ కావచ్చు.” తో సాహిత్యం వెలువడుతున్నది. మరీ ముఖ్యంగా వెబ్‌జైన్‌లలోను / ఆన్‌లైన్ టపాలలోను.
వ్యాసకర్తలు పేర్కొన్న పంక్తుల పోగు వచనం, పద్యమే కాక మిగతా అంశాలతో కూడ పరిచయం ఉంది. అంతే కాదు వారు ప్రస్తావించిన ప్రచురణకర్తలు / ముద్రాపకులందరితో కాకపోయిన చాలమందితో కనీసం ఏదో ఒక సందర్భంలో కలవడం, మాట్లాడడం జరిగిందే,గుజిలి పుస్తక ప్రచురణ కర్తలతో సహా.
మీరన్నట్టు ‘ఒయాసిస్సు’ లను ఏకరువు పెట్టడం ఈ వ్యాసం, వ్యాఖ్యల ముఖ్యోద్దేశం కాదు, కాకూడదు.
వేలూరి వారు కనీసం ఒక డిజిటల్ ఎడిషన్ ప్రచురించాలని కోరుకుంటూ, వేమూరి వారు కూడ అన్యధా భావించక తాము రాసుకున్న స్టయిల్ ‘పుస్తకాన్ని’ తెలుగువారికి అందించవలసిందిగా అభ్యర్ధిస్తూ, ఈమాట “స్టైల్ మాన్యూయల్” కోసం ఎదురుచూస్తూ,
మీరు వ్యాసంలో పేర్కొన్న సమీక్షకుల తర్వాతి తరంలో చెప్పుకోదగిన సమీక్షకులు/విమర్శకులు విద్వాన్ విశ్వం మరియు సర్దేశాయి తిరుమలరావు. తిరుమలరావు విమర్శలలో మచ్చుకు ఒకటి ఇక్కడ చదువుకోవచ్చు.
ఇదేటి కనక పెసాదు బాబూ !
అచ్చం మా బాసలో ఇటేపా ? అటేపా ? అని అడిగేసినావు . అల్ల కృష్ణ నగర్ లేడీస్ హాస్టల్ అప్పు మీన ఆజానుబాహువుల శాస్త్రి గారిని సూసి , అబ్బ రచైత లింత అందంగా కూడా ఉంటారా ? అని మురిసి ముక్కలైపోయే మా ఇస్టూడెంట్ రోజుల్లోకి చేయట్టుకుని లాక్కుపోనావు ,పెసాద్ బాబూ .. విరసమా ? అరసమా ? నీరసమా ? అని మాకు మూడు చాయిస్లు ఇచ్చిన జ్ఞాపకం మా ఎంసెట్ పేపరులో ..అదే మా జీవితం క్వ్సెస్చన్ పేపరులో , మధ్యే మార్గం , అయినా ఏ చాయిస్సూ ,బీ చాయిస్సూ కూడా నే వదలను అంటూ జంట పడవల లో చెరో కాలు వేసి ,లాహిరి లాహిరి అంటూ విశాపట్నం సముద్రమ్లో ఈదినట్టూ కాసిన్ని జ్ఞాపకాలు రేపావు కదయ్యా పెసాదు ..కనక పెసాదూ ..విశాపట్నం డాల్ఫింస్ నోస్ కొండ మీద లైట్ హౌసూ , కనక మహాలచ్చి తల్లీ , రావి శాస్త్రీ , విరసం చలసానీ అలా ఎప్పటికీ ఉంటారు బయ్యా ..అని మనకి తెలియదా ? త్రిపుర ఇల్లు రచైతల ,కవులకి కాశీ బెనారసూ , అక్కడే మోక్షమూ తీర్ధమూ అని మనకి చెప్పాలా ఓకరు ..ఎవరో ఒకరు ,మనకి తెలీదా ఏంటి బయ్యా .. బుక్ సెంటెర్ వరహాలు చెట్టి గారూ , అచ్యుత రామరాజు గారూ రాయలు దర్బారు , సాహిత్యంని పోసించిన రాజులు కాదా ఏటి? మా కంతా తెల్సు బయ్యా .. మేమూ విశాపట్నం ఓసులమే , అల్లా రెల్లి వీధి దిబ్బ మీదే కదా కతలేన్నో రాసారు ..రచైతలు ..స్మైలూ .. వాళ్ళూ ..
ఆదిభట్ల కైలాసం , సత్యం మాష్టార్లని సీ ఆర్ పి ఎఫ్ వోళ్ళూ సంపేసామని సెంకలు గుద్దుకోగానే రక్తపు బొట్లు కారినట్టు వేల మంది తుపాకీలు భుజాన వేసుకుని అడవుల్లోకి పారిపోయిన వైనాలు ,నక్సలబరీ కి శ్రీకాకుళంకి ఎక్కడబ్బా సుట్టరికం అని జుట్టు పీక్కున్న కథలు మనం వింటూ పె్రిగాం కదా ..
ఆ రోజులు ,అదే ఏ రోజులు ..ఆ రోజులు ..వీధి వీధి కీ ఓ చైతన్యం , ఓ సూరీడు , ఓ వెచ్చదనం , ఓ రక్తపు బొట్టు దానికో సలమూ ,పతోడూ ఏదో ఓ జెండా మోయడం , రాజకీయ చైతన్యం క్లాసులు కి అటెండ్ అవడం ,నిజం సుమండీ ,అట్టాంటి క్లాసులు కూడా జరిగేవి , ఇలా బందల దొడ్డి కళాసు రూములు కాదు సుమండీ , పేజీలు పేజీలు కవిత్వాలు ఎక్కించడం , పుస్తకాలకీ ఓ గుడి ఉండేది అదే గ్రంధాలయం , అందులో కూకొని చేతిలో ఓ పుస్తకం పట్టుకుని పఠిమచడం అనే పూజ చేసేవాళ్ళం , ఆ పుస్తకం మీద చర్చించి ,వాదులాడీ స్నేహితులతో. మరో నాలుగు పేజీల వ్యాసాలు రాసుకునే వాళ్ళం భలే రోజులు బయ్యా , ఆ గ్రంధాలయం ని బుల్ డోజర్లు పెట్టి కొట్టించి అక్కడో నానా రకాల డబ్బాలు డోళ్ళూ అమ్మే కొట్లూ అవీ కట్టించి , మనకి మేలు సేస్తారుట ..బయ్యా ..అది మటుకు కళ్ళమ్మట నీళ్ళూ తెప్పించేస్తుంది ..వీధి వీధి కి ఆలయాలు కట్టించేస్తున్నారు ,మత్తు మందు బాగా దట్టించి వీభూతి పెడుతున్నారు , పుస్తకాలంటే ఎంసెట్ గైడ్లూ , ఎక్కాల పుస్తకాలే పెసాదు బాబూ ,మా రాజ్యెం లో .. అంతా షేమం అని తూలుతూ జనాలు ఓట్లు గుద్దుతున్నారు , అదీ బాబూ ఈ మాతృ భూమి దృశ్యం ..విరసం ఉండాది ,చలసాని ఉంటారు ..మనకేటీ ? అటో ఇటో , ఏటైనా దూకేయొచ్చు .గోడ కూడా ఉన్నాది …కనక పెసాదూ ..భలే బాగా రాసావయ్యా ..మా బాగా ..వసంత లక్ష్మి .
నమస్తే
అద్భుతమైన వివరణ ఇచ్చారు. చిన్న సందేహం. తితిదే వారు ప్రచురించిన పోతన భాగవతంలో గజేంద్రమోక్షం గురించి రాస్తూ పోతన శ్రీధర భాగవతాన్ని కూడా తెనిగించాడు అన్నారు కరుణశ్రీ గారు. దీనికేమైనా ఆధారం ఉందాండి? మీకు తెలిస్తే చెప్పగలరు.
శంకర భగవత్పాదుల శ్లోకాలు గుర్తు తెచ్చుకుంటే ఆయన ఒక్కోసారి పాదాలనుంచి మొదలుపెట్టి తలదాకా ఇంకోసారి తలనుంచి మొదలుపెట్టి పాదాలదాకా (సౌందర్య లహరి – నాకు గుర్తున్నంతలో) వర్ణించడం చూస్తాము. అలాగే పోతన కూడా కిందనుంచున్న బలి వామనుడు అలా ఎదుగుతూ పోతూంటే పై పైకి (ఇంతింతై వటుడింతయై…) చూడ్డం; అది అయిపోయాక పైకెత్తిన తల కిందకి దించేటప్పుడు రవిబింబం.. అనేది రాశాడని నాకు అనిపించింది.
ఇలాంటివాటికి “ఆనందఫలదాయకమైన కృషి” చేస్తే బాగుంటుందన్నారు. ఎలా, ఎక్కడ మొదలుపెడితే బాగుంటుందంటారు? ఇండియాలో లేని మాలాంటి వాళ్లకి ఎలాగ కుదురుతుందో చెప్పి పుణ్యం కట్టుకోండి. నేను సిద్ధంగా ఉన్నా!
ఈ వాదోపవాదన్లు పక్కదారి పట్టేలోగా ఒక్క చిన్న విషయం. శ్రీనివాస్ గారు “వెడలెను కోదండపాణి” అనేది “అడవులకి వెళ్ళడం” అనే అర్ధంలో వాడాను. అందుకే “ఉరమున హారములు మెరయ…సురుచిర వాద్యములు మ్రోయ.. అన్నది లేదు కధలో. వసుధ భారమెల్ల దీర్ప అనేది మాత్రం ఉంచాను. 🙂
రెండో విషయం “కోదండ పాణి అనేదానిమీద.” కోదండం అంటే రాముడు మా-త్ర-మే వాడే ధనస్సు అని నేను అనుకుంటున్నాను. కానీ తెలుగు పదకోశం చూస్తే వెదురు విల్లు, ధనస్సు అనే అర్ధాలొచ్చాయి. కానీ వెదురు విల్లుతో రాముడు రావణుణ్ణి చంపలేడు కదా? 🙂 అయితే ఈ ధనస్సు రాముడు అయోధ్యనుంచి పట్టుకెళ్ళినది కాదు. ఒక్కో మునిని దర్శించుకుంటూ పోతూంటే అరణ్యాలలో అగస్త్యాశ్రమం వచ్చేసరికి ఆ ముని “రామా ఈ ధనస్సు నీ దగ్గిర ఉంటేనే బావుంటుంది,” అని ఓ ధనస్సు ఇస్తాడు రాముడికి. అదే కోదండం అని నేను నమ్ముతున్నాను. అసలు ఈ అరణ్య వాసమే ఒక పెద్ద ప్రహేళిక. రాముడు అరణ్యానికి ఎందుకు పంపబడ్డాడో వీళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు రాముడితో చెప్పరు. “రామా నువ్వు ఇక్కడే ఉండొచ్చు కానీ ముందుకెళ్తే అక్కడ బాగుంటుంది మీకు,” అంటూ పంచవటికేసి తోస్తారు ముగ్గుర్నీ. ఇంతకీ పంచవటికి వచ్చేదాకా రాముడి దగ్గిర రావణుణ్ణి చంపేటందుకు సరైన విల్లే లేదు. అంటే మొదటిసారి విశ్వామితృడికూడా వెళ్ళేటప్పటికి రాముడు మామూలు రాముడే. ఆ తర్వాత పంచవటికి వెళ్ళేసరికి కోదండ రాముడు. అందువల్ల త్యాగరాజుకు రాముడి చేతిలోకి కోదండం ఎప్పుడు వచ్చిందో తెల్సు కనక – మీరిచ్చిన రెఫరెన్స్ చెప్పినట్టూ- ఈ పాట ఆయన రాయలేదేమో? సరదాగా అనాలసిస్సు చేసాను లెండి. ఇది నాకొచ్చిన పనికిరాని పరిజ్ఞానం. ఇది నేను [మా ఆఫీసులో అన్నట్టు] “నాట్ ఎగ్రీయింగ్ ఆర్ డినైయింగ్.” 🙂
మూడోది. మీరు ఉత్తి “నూకల” అనేసరికి నేను ఆయనెవరో సినిమా పండితుడనుకున్నాను. క్షంతవ్యుడను. స్వస్తి!
ఒక పద్ధతి ప్రకా…రం గురించి తః తః అభిప్రాయం:
09/05/2015 3:22 pm

చిత్రం – ‘బాపు’రే విచిత్రం! గురించి సూర్యుడు అభిప్రాయం:
09/05/2015 12:05 pm
Interesting. Please write one essay on Vaddadi Paapayya also.
తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి Anil అనిల్ అట్లూరి అభిప్రాయం:
09/05/2015 7:31 am
మాధవ్ గారు,
మీరన్నది నిజమే! సంజ్ఞావాచకాలు, విరామ చిహ్నాల వాడనానికి కూడా ప్రమాణాలు ఉండాలి. అవి లేకుండా సాహిత్యం వెలువరిస్తే అవే ప్రమాణాలుగా చెలామణి అయిపోయ్యే ప్రమాదం కూడా ఉంది. మార్పు సహజమే. కాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న కథ పునరావృతం కాకుడదన్నదే ఇక్కడి ఆలోచన. ఇప్పటికే మీరన్నట్టు “ఆశ్చర్యార్థకాలు కూడా ఒకటీ రెండూ సరిపోతాయి, అవి ఎన్ని ఎక్కువ వాడితే అంత ఆశ్చర్యమని కాదు కదా. బహుశా కీబోర్డ్ మీద ఒకే మీట నొక్కిపట్టుకోటం తేలిక కావచ్చు. ఇన్‌ఫార్మల్గా ఈమెయిళ్ళూ చాట్ల వంటి వాటిలో వాడే భాష, ప్రచురణకు తగదని తెలియకపోవడమూ కావచ్చు.” తో సాహిత్యం వెలువడుతున్నది. మరీ ముఖ్యంగా వెబ్‌జైన్‌లలోను / ఆన్‌లైన్ టపాలలోను.
వ్యాసకర్తలు పేర్కొన్న పంక్తుల పోగు వచనం, పద్యమే కాక మిగతా అంశాలతో కూడ పరిచయం ఉంది. అంతే కాదు వారు ప్రస్తావించిన ప్రచురణకర్తలు / ముద్రాపకులందరితో కాకపోయిన చాలమందితో కనీసం ఏదో ఒక సందర్భంలో కలవడం, మాట్లాడడం జరిగిందే,గుజిలి పుస్తక ప్రచురణ కర్తలతో సహా.
మీరన్నట్టు ‘ఒయాసిస్సు’ లను ఏకరువు పెట్టడం ఈ వ్యాసం, వ్యాఖ్యల ముఖ్యోద్దేశం కాదు, కాకూడదు.
వేలూరి వారు కనీసం ఒక డిజిటల్ ఎడిషన్ ప్రచురించాలని కోరుకుంటూ, వేమూరి వారు కూడ అన్యధా భావించక తాము రాసుకున్న స్టయిల్ ‘పుస్తకాన్ని’ తెలుగువారికి అందించవలసిందిగా అభ్యర్ధిస్తూ, ఈమాట “స్టైల్ మాన్యూయల్” కోసం ఎదురుచూస్తూ,
(అంతకంటే ఇంకేమి కావాలి?)
ఉంటాను.
అనిల్
ఒక పద్ధతి ప్రకా…రం గురించి Kandi Ravi అభిప్రాయం:
09/05/2015 1:31 am
అద్భుతంగా వ్రాశారు. మాటలు లేవు. మీకు శత కోటి వందనాలు.
పుస్తక సమీక్షల గురించి… గురించి కోడీహళ్లి మురళీమోహన్ అభిప్రాయం:
09/05/2015 12:25 am
మీరు వ్యాసంలో పేర్కొన్న సమీక్షకుల తర్వాతి తరంలో చెప్పుకోదగిన సమీక్షకులు/విమర్శకులు విద్వాన్ విశ్వం మరియు సర్దేశాయి తిరుమలరావు. తిరుమలరావు విమర్శలలో మచ్చుకు ఒకటి ఇక్కడ చదువుకోవచ్చు.
ఒక పద్ధతి ప్రకా…రం గురించి p. vasanta lakshmi అభిప్రాయం:
09/05/2015 12:13 am
ఇదేటి కనక పెసాదు బాబూ !
అచ్చం మా బాసలో ఇటేపా ? అటేపా ? అని అడిగేసినావు . అల్ల కృష్ణ నగర్ లేడీస్ హాస్టల్ అప్పు మీన ఆజానుబాహువుల శాస్త్రి గారిని సూసి , అబ్బ రచైత లింత అందంగా కూడా ఉంటారా ? అని మురిసి ముక్కలైపోయే మా ఇస్టూడెంట్ రోజుల్లోకి చేయట్టుకుని లాక్కుపోనావు ,పెసాద్ బాబూ .. విరసమా ? అరసమా ? నీరసమా ? అని మాకు మూడు చాయిస్లు ఇచ్చిన జ్ఞాపకం మా ఎంసెట్ పేపరులో ..అదే మా జీవితం క్వ్సెస్చన్ పేపరులో , మధ్యే మార్గం , అయినా ఏ చాయిస్సూ ,బీ చాయిస్సూ కూడా నే వదలను అంటూ జంట పడవల లో చెరో కాలు వేసి ,లాహిరి లాహిరి అంటూ విశాపట్నం సముద్రమ్లో ఈదినట్టూ కాసిన్ని జ్ఞాపకాలు రేపావు కదయ్యా పెసాదు ..కనక పెసాదూ ..విశాపట్నం డాల్ఫింస్ నోస్ కొండ మీద లైట్ హౌసూ , కనక మహాలచ్చి తల్లీ , రావి శాస్త్రీ , విరసం చలసానీ అలా ఎప్పటికీ ఉంటారు బయ్యా ..అని మనకి తెలియదా ? త్రిపుర ఇల్లు రచైతల ,కవులకి కాశీ బెనారసూ , అక్కడే మోక్షమూ తీర్ధమూ అని మనకి చెప్పాలా ఓకరు ..ఎవరో ఒకరు ,మనకి తెలీదా ఏంటి బయ్యా .. బుక్ సెంటెర్ వరహాలు చెట్టి గారూ , అచ్యుత రామరాజు గారూ రాయలు దర్బారు , సాహిత్యంని పోసించిన రాజులు కాదా ఏటి? మా కంతా తెల్సు బయ్యా .. మేమూ విశాపట్నం ఓసులమే , అల్లా రెల్లి వీధి దిబ్బ మీదే కదా కతలేన్నో రాసారు ..రచైతలు ..స్మైలూ .. వాళ్ళూ ..
ఆదిభట్ల కైలాసం , సత్యం మాష్టార్లని సీ ఆర్ పి ఎఫ్ వోళ్ళూ సంపేసామని సెంకలు గుద్దుకోగానే రక్తపు బొట్లు కారినట్టు వేల మంది తుపాకీలు భుజాన వేసుకుని అడవుల్లోకి పారిపోయిన వైనాలు ,నక్సలబరీ కి శ్రీకాకుళంకి ఎక్కడబ్బా సుట్టరికం అని జుట్టు పీక్కున్న కథలు మనం వింటూ పె్రిగాం కదా ..
ఆ రోజులు ,అదే ఏ రోజులు ..ఆ రోజులు ..వీధి వీధి కీ ఓ చైతన్యం , ఓ సూరీడు , ఓ వెచ్చదనం , ఓ రక్తపు బొట్టు దానికో సలమూ ,పతోడూ ఏదో ఓ జెండా మోయడం , రాజకీయ చైతన్యం క్లాసులు కి అటెండ్ అవడం ,నిజం సుమండీ ,అట్టాంటి క్లాసులు కూడా జరిగేవి , ఇలా బందల దొడ్డి కళాసు రూములు కాదు సుమండీ , పేజీలు పేజీలు కవిత్వాలు ఎక్కించడం , పుస్తకాలకీ ఓ గుడి ఉండేది అదే గ్రంధాలయం , అందులో కూకొని చేతిలో ఓ పుస్తకం పట్టుకుని పఠిమచడం అనే పూజ చేసేవాళ్ళం , ఆ పుస్తకం మీద చర్చించి ,వాదులాడీ స్నేహితులతో. మరో నాలుగు పేజీల వ్యాసాలు రాసుకునే వాళ్ళం భలే రోజులు బయ్యా , ఆ గ్రంధాలయం ని బుల్ డోజర్లు పెట్టి కొట్టించి అక్కడో నానా రకాల డబ్బాలు డోళ్ళూ అమ్మే కొట్లూ అవీ కట్టించి , మనకి మేలు సేస్తారుట ..బయ్యా ..అది మటుకు కళ్ళమ్మట నీళ్ళూ తెప్పించేస్తుంది ..వీధి వీధి కి ఆలయాలు కట్టించేస్తున్నారు ,మత్తు మందు బాగా దట్టించి వీభూతి పెడుతున్నారు , పుస్తకాలంటే ఎంసెట్ గైడ్లూ , ఎక్కాల పుస్తకాలే పెసాదు బాబూ ,మా రాజ్యెం లో .. అంతా షేమం అని తూలుతూ జనాలు ఓట్లు గుద్దుతున్నారు , అదీ బాబూ ఈ మాతృ భూమి దృశ్యం ..విరసం ఉండాది ,చలసాని ఉంటారు ..మనకేటీ ? అటో ఇటో , ఏటైనా దూకేయొచ్చు .గోడ కూడా ఉన్నాది …కనక పెసాదూ ..భలే బాగా రాసావయ్యా ..మా బాగా ..వసంత లక్ష్మి .
పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/04/2015 12:08 pm
నమస్తే
అద్భుతమైన వివరణ ఇచ్చారు. చిన్న సందేహం. తితిదే వారు ప్రచురించిన పోతన భాగవతంలో గజేంద్రమోక్షం గురించి రాస్తూ పోతన శ్రీధర భాగవతాన్ని కూడా తెనిగించాడు అన్నారు కరుణశ్రీ గారు. దీనికేమైనా ఆధారం ఉందాండి? మీకు తెలిస్తే చెప్పగలరు.
శంకర భగవత్పాదుల శ్లోకాలు గుర్తు తెచ్చుకుంటే ఆయన ఒక్కోసారి పాదాలనుంచి మొదలుపెట్టి తలదాకా ఇంకోసారి తలనుంచి మొదలుపెట్టి పాదాలదాకా (సౌందర్య లహరి – నాకు గుర్తున్నంతలో) వర్ణించడం చూస్తాము. అలాగే పోతన కూడా కిందనుంచున్న బలి వామనుడు అలా ఎదుగుతూ పోతూంటే పై పైకి (ఇంతింతై వటుడింతయై…) చూడ్డం; అది అయిపోయాక పైకెత్తిన తల కిందకి దించేటప్పుడు రవిబింబం.. అనేది రాశాడని నాకు అనిపించింది.
ఇలాంటివాటికి “ఆనందఫలదాయకమైన కృషి” చేస్తే బాగుంటుందన్నారు. ఎలా, ఎక్కడ మొదలుపెడితే బాగుంటుందంటారు? ఇండియాలో లేని మాలాంటి వాళ్లకి ఎలాగ కుదురుతుందో చెప్పి పుణ్యం కట్టుకోండి. నేను సిద్ధంగా ఉన్నా!
వెడలెను కోదండపాణి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
09/04/2015 11:54 am
ఈ వాదోపవాదన్లు పక్కదారి పట్టేలోగా ఒక్క చిన్న విషయం. శ్రీనివాస్ గారు “వెడలెను కోదండపాణి” అనేది “అడవులకి వెళ్ళడం” అనే అర్ధంలో వాడాను. అందుకే “ఉరమున హారములు మెరయ…సురుచిర వాద్యములు మ్రోయ.. అన్నది లేదు కధలో. వసుధ భారమెల్ల దీర్ప అనేది మాత్రం ఉంచాను. 🙂
రెండో విషయం “కోదండ పాణి అనేదానిమీద.” కోదండం అంటే రాముడు మా-త్ర-మే వాడే ధనస్సు అని నేను అనుకుంటున్నాను. కానీ తెలుగు పదకోశం చూస్తే వెదురు విల్లు, ధనస్సు అనే అర్ధాలొచ్చాయి. కానీ వెదురు విల్లుతో రాముడు రావణుణ్ణి చంపలేడు కదా? 🙂 అయితే ఈ ధనస్సు రాముడు అయోధ్యనుంచి పట్టుకెళ్ళినది కాదు. ఒక్కో మునిని దర్శించుకుంటూ పోతూంటే అరణ్యాలలో అగస్త్యాశ్రమం వచ్చేసరికి ఆ ముని “రామా ఈ ధనస్సు నీ దగ్గిర ఉంటేనే బావుంటుంది,” అని ఓ ధనస్సు ఇస్తాడు రాముడికి. అదే కోదండం అని నేను నమ్ముతున్నాను. అసలు ఈ అరణ్య వాసమే ఒక పెద్ద ప్రహేళిక. రాముడు అరణ్యానికి ఎందుకు పంపబడ్డాడో వీళ్ళందరికీ తెలుసు. కానీ వాళ్ళు రాముడితో చెప్పరు. “రామా నువ్వు ఇక్కడే ఉండొచ్చు కానీ ముందుకెళ్తే అక్కడ బాగుంటుంది మీకు,” అంటూ పంచవటికేసి తోస్తారు ముగ్గుర్నీ. ఇంతకీ పంచవటికి వచ్చేదాకా రాముడి దగ్గిర రావణుణ్ణి చంపేటందుకు సరైన విల్లే లేదు. అంటే మొదటిసారి విశ్వామితృడికూడా వెళ్ళేటప్పటికి రాముడు మామూలు రాముడే. ఆ తర్వాత పంచవటికి వెళ్ళేసరికి కోదండ రాముడు. అందువల్ల త్యాగరాజుకు రాముడి చేతిలోకి కోదండం ఎప్పుడు వచ్చిందో తెల్సు కనక – మీరిచ్చిన రెఫరెన్స్ చెప్పినట్టూ- ఈ పాట ఆయన రాయలేదేమో? సరదాగా అనాలసిస్సు చేసాను లెండి. ఇది నాకొచ్చిన పనికిరాని పరిజ్ఞానం. ఇది నేను [మా ఆఫీసులో అన్నట్టు] “నాట్ ఎగ్రీయింగ్ ఆర్ డినైయింగ్.” 🙂
మూడోది. మీరు ఉత్తి “నూకల” అనేసరికి నేను ఆయనెవరో సినిమా పండితుడనుకున్నాను. క్షంతవ్యుడను. స్వస్తి!
దృశ్యం గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:
09/04/2015 9:52 am
అద్భుతంగా ఉంది కవిత.
ఒక తెలుగు పుస్తకం కావాలి గురించి Anil అనిల్ అట్లూరి అభిప్రాయం:
09/04/2015 8:08 am
అందరి అభిప్రాయమే నాది కూడా.
“Veluri garu should publish his style book.” 🙂
This is in continuation to the article here:
http://eemaata.com/em/issues/200905/1436.html