పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:

    12/06/2015 11:28 am

    కొన్ని ఉదాహరణలు, నా ఆలోచనలు.
    జె. కె. మోహన రావు గారి ఈ పద్య పాదాలను పరిశీలించండి.

    1. కాదంబరిని త్రాగిన మదాలసవతిని
    2. ఎడమ కుచమును తాకు వీణియను మీటెడు
    3. శశికిని సుధకు నక్కా నీకు నా నమస్సులు

    మదాల సవతిని, సుధకు నక్కా -అని చదివి ఆనందించలేము కదా. అసలు అందులో పొయట్రీ నూ లేదు. వాటి ఒరిజినల్స్ కింద చూడండి. ఎంతో వినబుల్ గా పాడబుల్ గా ఉన్నాయి.

    1a. కాదంబరీపాన మదాలసాంగీం
    2b. వామస్తనాలింగిత రత్నవీణాం
    3b. నమోऽస్తు సోమామృతసోదరాయై

    ఈ కింది అనువాదపు మాటలలో మాత్రా ఛందస్సు ఉందేమో కాని, కవిత్వం లేదు. తెలుగు కూడ రమారమి లేదనే అనాలి.

    “తిండి విషము, సరము పాము,
    బట్ట తోలు, బండి ఎద్దు
    నాదు సేవ కొసగ దగిన
    దేమి లేదు నీదు చెంత
    నీదు పాద కమల భక్తి
    నీయు మయ్య శంభు యెపుడు”

    దానికి మూలం ఈ కింది సొగసు రచన అని ఎవరూహిస్తారు?

    అశనం గరలం ఫణీకలాపే
    వసనం చర్మ చ వాహనం మహోక్షః
    మమ దాస్యసి కిం కిమస్తి శంభో
    తవ పాదాంబుజ భక్తిమేవ దేహి

    ఐనా, ఆ తెలుగుసేతలు – ఆయన వ్యాసంలో రాసినపుడు, శంకరాచార్యుని అందమైన రచనలను, రకరకాల ఛందస్సులను పరిచయం చేస్తూ, ప్రతిదానికీ అర్ధం చెప్పక పోతే తెలియని నా లాటి మూఢమతులకోసం జె. కె. మోహన రావు గారు, పెద్ద మనసు చేసి, ఓపికతో, తేలిక భాషలో చెప్పినవి. వాటి ఉపయోగం అంతవరకే ఐనా, అది నా వంటి ఆరంభ దశలోని చదువరులకు చాలా మేలు.

    త్యాగరాజు, అన్నమయ్య, రామదాసులలో, నాకు, సంగీతానికి, సాహిత్యానికీ, త్యాగరాజే గొప్ప. సింపుల్ గా “సీతమ్మ మాయమ్మ, శ్రీ రాముడు మాకు తండ్రి” అన్న దగ్గరే అది డిసైడ్ ఐపోయింది.:-) క్లాసికల్ సంగీతంలో ఏ మాటల వల్ల, గాయకులకు పాడటానికి ఏం బాధ? పాడ చేత కావాలి. కర్ణాటక సంగీతము పాడే వాళ్లకు, సాహిత్యం అర్థం చెప్పి, సరైన ‘voice training’ ఇప్పిస్తే, ఎన్నో మనసు రంజింప చేసే రచనలు ఉన్నయ్యి. I don’t know the current music publishing software status for Karnataka music. I like to find out.

    Coming to Sri Sri’s poetry, అద్వైతం- The title and some stanzas reflect, he is taking some of the content and theme from Swinburne’s poem – ‘A match.’ For instance:

    “If you were queen of pleasure
    And I were king of pain”
    Becomes
    “హసనానికి రాణివి నీవై
    వ్యసనానికి బానిస నీవై,”

    “If you were April’s Lady
    And I were Lord in May”
    Perhaps becomes
    “వాసంత సమీరం నీవై
    హేమంత తుషారం నేనై”

    In terms of metrics, I feel Sri Sri is thinking more along lines of stressed syllables and end rhymes, of English poetry. ఆనందం అర్ణవ మై తే has Four stresses. So does అనురాగం అంబర మై తే. ‘A match.’ Looks like an Iambic tetrameter to me. To sing somewhat upbeat like – ‘For he is a jolly good fellow, for he is a jolly good fellow.’ Sri Sri is not doing Traditional Telugu syllabic -One long, one short count. He is a beginner poet. All he is doing is trying out to write differently from before. His previously written classical Telugu poems are downright ghastly. He definitely needed something new, to stay in the game. He would not be chanting his poetry in -Venkateswara suprabhatam style, which every Telugu hears every Saturday morning. (A few lines partially randomly used. Don’t start counting syllables.)

    ఆనంద మర్ణవ మైతే,
    భుజాంతర దివ్య మూర్తే,
    హిమాదిక మర్ద యంతే
    జగదేక శరణ్య మూర్తే

    Sri Sri is not thinking of 6-4-4, or, ధృవ తాళము. (He might have favored Gurazäda’s fourteen syllabic count lines. It’s a nice comfortable length.)
    I really don’t like అద్వైతం. It’s poor poetry. Worse than ‘A match.’ The poet is just ‘working’ the words. (To take T.S. Elliot’s expression.) There is no cohesive meaning. Sometimes you get doubts whether there is a man and a woman – two lovers – in Sri Sri’s poem or whether he is addressing a group of people. వేస్తాం, తీస్తాం, పరిహాసిస్తాం, పరిపాలిస్తాం, ప్రపంచమును, భవిష్యమును, all so bombastic and pseudo grand. Well, as I grumbled a few times before, here and there, Sri Sri is not a favorite of mine. He will never be one.
    (But if I sing వాసంత సమీరం నీవై, హేమంత తుషారం నేనై -my way, it is getting a new life. I would not mind editing the poem, giving it a track in ‘my Album’)

    When it comes to Gurajada, in the context of this essay, yes, he really wrote a nice Telugu song. “దేశమును ప్రేమించు మన్నా, మంచి యన్నది పెంచు మన్నా.” చక్కని తెలుగు పదాలు, చక్కని భావం. గేయము పాడేవారు పాట సొగసును పెంచవచ్చు. చేతకాకపోతే దించవచ్చు.

    గురజాడ కవి తన ఛందస్సును గురించి చెప్పినాడు. (Thanks Sayee garu for providing an essay.) And I read some poetry of his. “మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కకు, మనుషులంటే రాయి రప్పల కన్న కనిష్ఠం గాను చూస్తావేల బాలా!” It’s nice work. Nice awakening thought. (Someone sang it on you tube. It is downright horrible.)

    Reading this essay, lead me to re-read many more of J.K. Mohana Rao’s essays on chandassu, (I have been reading him for ten years now.) I checked on a few others, namely A.J. Swinburne, (a remarkable rhyming capacity, ‘The Roundel’ is a joy) Tennyson, Shakespeare, some criticisms of Ezra Pound, (beautiful translation by K.V.S. Ramarao, in this magazine.) And excerpts from T.S. Eliot -Sacred Wood. I enjoyed the whole process. (And more so conversations of literary friends in the magazine.) Gained more insights into music and poetry – writing, and reading. Thanks.
    Lyla

  2. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి అశ్మాచం అభిప్రాయం:

    12/05/2015 2:01 pm

    ఎల్లప్పుడూ రామాయణమూ, భారతమూ, కన్యాశుల్కమూ, కాకితమూ గురించి మాట్లాడుకుంటే ఉపయోగం ఋజమన్నది నిజభావన. ఇవ్వానియందు రామము, భారతము నిత్యపఠనీయములే కానీ, అవ్వాటి కోటలు దాటి ఈవలి ప్రపంచమునకు వస్తే మన సాహిత్యమందున్న ఇతర కావ్య, ప్రబంధాల కూడిన రసతర్కము, వివేచనము గత శతాబ్దిలో జరిగిన మూలము దిగసనమే. అసలు లేదనే చెప్పవచ్చునేమో.

    మీలాటి పండితులు, ఆ బాట పట్టిన విధము హర్షణీయము. ఆ బాటమార్గమందు మరికొందఱు ఇబ్బడి ముబ్బడిగా నడచిన, తరువాతి తరాలకు మన తరమందు వైశేషికభావన యున్నదని తెలియవచ్చును. లేనిచో దిక్కుమాలినతనముతో మన తరము తగులపడినదని, ఆ వల్మీకమూ, వాశిష్టమూ ఆవరించుకొనియున్న దొందములే మనవారి ప్రతాపమని ఎత్తిపొడుపులు వచ్చు అవకాశము మెండు.

    ఉదాహరణముగా బ్రహ్మానందముల వారి ఎంకమ్మ యందు తాతను తిట్టిన సంగతి ఙప్తికి తెచ్చుకొనుడు. తాతలను తిట్టుట మంచి పద్ధతి కాదు కనక, మనము ఆ తిట్లు పడరాదు కావున మీరు సూరనవారిని, శ్రీనాథులవారిని, సోమన వారిని, ఇతరులు అంటీముట్టని దిగ్గజముల వారిని, ఇతరేతర సాహితీ చక్రవర్తులను గట్టిగా పట్టుకొని వారి దృశ్యకావ్యముల మీమాంస మా శరీరమందున్న బుద్ధిమాంసమునకు ప్రీతిగా సువారము చేసి పెట్టిన సుఖీభవయని దీవించి మేము ధన్యులమగుదుము.

    స్వస్తిప్రేమంగా
    అశ్మాచం

  3. బాలానందం గురించి Veloori Krishna Moorthy అభిప్రాయం:

    12/05/2015 8:39 am

    Dear Srinivas Garu,

    We are so much indebted to you to recall our childhood days listening to the children songs of BALANANDAM fame.You are doing yeomen service to the old generation of people giving them an opportunity to listen to these songs who have listened and experienced those wonderful times!

    What a pity the present day kids are denied the beauty of our language in their childhood which could keep them hooked to their mother tongue in spite of the English language dominating the public school modern educational system in the Telugu States.

    V. Krishna Moorthy, Mysore

  4. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    12/05/2015 7:42 am

    మాన్యతములు శ్రీ అశ్మాచం గారికి
    నమస్కారములతో,

    వ్యాసాన్ని ఆసాంతం చదివి, ఔదార్యపూర్ణమైన మీ అనుమోదాన్ని తెలియజేసి ఎంతో దయతో ప్రోత్సహిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ చిత్తస్థితులై శుభవాక్ప్రతీతులైన శ్రీ బమ్మెర పోతనామాత్యుల వారికిదే ప్రణతిశతనివేదనం _/|\_ !

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    శ్రీమాన్ వెల్లంకి శేషగిరిరావు గారి, శ్రీ తః తః గారి అభిప్రాయోదితాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

  5. ఇస్మాయిల్ అవార్డు-2015 గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    12/05/2015 3:30 am

    నరసింహా రావు గారు

    -రెండూ ఒకటి కాదు.
    వాడ్రేవు వీరలక్ష్మి గారు ఇస్మాయిల్ పురస్కారాన్ని గత ఐదారేళ్లుగా పేరుపొందిన కవులకు ఇస్తున్నారు (నామాడి శ్రీధర్ ,వాడ్రేవు చినవీరభద్రుడు, విన్నకోట రవి శంకర్,బివివి  ప్రసాద్,రేణుక అయోల, యాకూబ్ ).

    మరిన్ని వివరాలకు:
    “http://www.andhrajyothy.com/Artical?SID=158444”

    ఒక దశాబ్ద కాలంగా తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డు లభించేది ప్రతిభా వంతులైన యువకవులకే (పూర్తి జాబితా పై ప్రకటనలో ఉంది).

    మరిన్ని వివరాలకు :
    “https://te.wikipedia.org/wiki/ఇస్మాయిల్_అవార్డు”

    తమ్మినేని యదుకుల భూషణ్

  6. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి అశ్మాచం అభిప్రాయం:

    12/04/2015 5:45 pm

    అరెరె! అరెరె! అరెరే!

    అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ
    కృన్నీలదీర్ఘ దోస్య మమరఁ
    బ్రజ్వలజ్జ్వలన దీప్తజ్వాలికా జాల
    జాజ్వల్యమాన అర్ణములు మెఱయఁ
    జండ దిగ్వేదండ శుండాభ దోర్దండ
    సాహస్ర ధృత పేనాసంఘ మొప్ప
    వీక్షణత్రయ లోకవీక్షణ ద్యుతి లోక
    పఠితతతి దుర్నిరీక్ష్యముగను…..

    వరుసలో ఇంత బాగుగా రాసినారేమండి?

    మీరు సాహితీ రుద్రులో లేక అపర ఇలక్కియమావాహిత వీరభద్రులో గానీ, మా ప్రణామములు సప్రమాణముగా స్వీకరించవలెనని కోర్కె.

    ఆ చివరన వాడిన దుర్నిరీక్ష్యము (Dazzling) అన్న అర్థములో వాడబడినదని రచయిత అర్థము చేసికొందురనుకొని

    అశ్మాచం

  7. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:

    12/03/2015 9:06 pm

    లైలా గారు,

    “ఈ పత్రికలో ‘ముత్యాల సరాలు’ అన్న మకుటంతో ఒక కవిత ఉంది. అది కవి ఏ ఛందస్సులో వ్రాసారు? దాని పేరేమిటి?”

    “ఈమాట” పత్రికలో క్రింది రెండు కవితలు ముత్యాలసరాలుగా వ్రాయబడినవి (ఇంకా ఉందేమో నాకు తెలియదు) –

    జనవరి 2009 – గడ్డిపూవు – హేమ వెంపటి
    జనవరి 2011 – మంచుమనిషి – నేను వ్రాసినది

    విధేయుడు – మోహన

  8. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి మోహన అభిప్రాయం:

    12/03/2015 6:36 pm

    తహతహ గారు,

    “1. మనసులోనిమ(మా)…..ర్మములు తెలుసుకో (త్యాగరాజు, పల్లవి)
    2. కాలా .. తీత విఖ్యాత (త్యాగరాజు, సామజవరగమన, పల్లవి)
    3. భవచంద్ర కళాధర (త్యాగరాజు, దేవాదిదేవ సదాశివ, చరణం)*”

    నేను మన కవులు పాటలను వాగ్గేయకారులకు వదిలారు, తాళ వృత్తములను అలా వ్రాయలేదని మాత్రమే. ఇకపోతే వాగ్గేయకారులు అలా పదములను విఱువకుండ పాడుటకు వ్రాసినారా అనే ప్రశ్నకు ఉత్తరము మీ వ్యాఖ్యలోనే ఉన్నది. కాని ప్రయత్నించారని చెప్పవచ్చును. నా ఉద్దేశములో అన్నమయ్య, రామదాసు ఈ విషయములో కృతకృత్యులయ్యారు.

    లైలా గారు,

    “కాని ఎవరో పెళ్లి శుభలేఖలో తెలుగులో పద్యం కావాలంటే, – మీ పెళ్లి గురించి ఈ శీర్షికలో ఇక్కడ ఈ డైగ్రెషన్ ఎందుకు? అని అనలేదేం?”

    కారణములు – (1) అలా అడగవలసిన బాధ్యత రచయితది లేక సంపాదకులది. (2) ఒక శుభకార్యమునకై ఒక వ్యక్తి అడిగినపుడు, మనకు తెలిస్తే మనము సహాయము చేయాలి. (3) ఆ వ్యక్తి చిరునామా నాకు తెలియదు కావున ఇక్కడే ఆ అభిప్రాయమును చెప్పవలసి వచ్చినది. (4) ఇటువంటి సంబంధము లేని ప్రశ్నలకు సంపాదకులు మఱొక చోటు ఉంచితే బాగుంటుందేమో?

    “తెలుగు పద్యం కావాలని ఆయనెవరో అడిగితే, ఇంగ్లీషులో అనువాదం కూడా ఎందుకు రాసినట్టు?”

    శుభలేఖలను తెలుగులో మాత్రమే కాకుండా ఆంగ్లములో కూడ ప్రచురిస్తారుగా, అందువలన దానిని కూడ జత చేసాను.

    “వీరి రచన గురించిన అభిప్రాయ వేదికలో మాత్రం, శ్రీ శ్రీ పద్యాలు, తన పద్యాలు గురించే మాట్లాడాలి, ఇంకెవరూ ఇప్పటి వాడుక ఇంగ్లిష్ భాషలో లిరిక్ రాయకూడదేం. రాస్తే అది digression.”

    నా రచనలలోని విషయాలను అనవసరముగా sidetrack చేసినప్పుడు నేను అలా చేయకండని అభ్యర్థించడము సబబే అనుకొంటాను.

    “ఈ వ్యాసం లో మాత్రం, — ‘అద్వైతం’ అన్న గేయంలో శ్రీశ్రీ 6,4,4 ఛందస్సు వాడినాడనినది -వ్యాసకర్త అభిప్రాయం. నిర్ణయం. శ్రీ శ్రీ చెప్పలేదు.”

    శ్రీశ్రీ చెప్పనంత మాత్రాన వ్యాసకర్త అభిప్రాయము తప్పు కాదు. Swinburne వ్రాసిన A match లో 7, 6 syllables ఉన్నాయి. అందులోని సారాంశమును శ్రీశ్రీ గ్రహించాడు, syllabic arrangement కాదు.

    “గురజాడ ‘ముత్యాల సరాలు’ అతని కవితా సంకలనము పేరా? లేక అతడు వాడిన మాత్రా ఛందస్సు పేరా?”

    అది ఛందస్సు పేరు. నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, సుభద్ర, పూర్నమ్మ అనుబంధము ఇవన్నీ ముత్యాలసరాలు అనే పేరితో ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ముత్యాలసరాలపైన అప్పారావు వ్యాసము ఒకటి ఉన్నది.

    “మహా ఐతే పట్టుమని పది సొంత కవితలు లేని ఈ శ్రీశ్రీ మహాకవి ఎట్లా ఐనాడా? అని ఆశ్చర్యపోయే నాకు, అతనిని మాత్రాఛందస్సు మధ్వాచార్యుడిగా, రూపొందిస్తున్న వ్యాసం మహామిరుమిట్లు కొలుపుచున్నది.”

    ఈమాట శ్రీ వేలూరిగారిని కూడ అడగండి, వారు ఒకప్పుడు 20వ శతాబ్దములోని మహాకవులు విశ్వనాథ, శ్రీశ్రీ అన్నట్లు గుర్తు. జగద్గురు మధ్వాచార్యులు మాత్రాఛందస్సును ద్వాదశస్తోత్రములో వాడినారు. కాని జగద్గురు శంకరాచార్యులు మాత్రాఛందస్సును ఎన్నో స్తోత్రములలో వాడినారు, శ్రీశ్రీకి స్ఫూర్తి ఇచ్చినది ఆ రచనలే.

    విధేయుడు – మోహన

  9. ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి అశ్మాచం అభిప్రాయం:

    12/03/2015 6:34 pm

    లైలా గారు

    మీ కామెంటును చూచి, ప్రథమారంభంగా నన్నాకర్షించిన మీ ప్రశ్నలు బట్టి, గట్టిగను పట్టుబట్టి వెతుకు బొత్తాము నొక్కి వెతికితిని. అప్పుడు పంచరత్న లంకెల దర్శనప్రాప్తి జరిగినది. అద్దానియందు ముత్యాల సరములు అని వున్నదాని మీద నొక్కి చదివినాను.

    అదియంతయు చదివిన తరువాత ముత్తెములు సరాలలో కాకుండగా నరాలలో బంధించిన యెడల యమధర్మరాజుకు కాసింత విశ్రాంతి కలిపించినవారమగుదుమని ఒకనాడు ఒకానొక మిత్రుడు నాతో మొఱపెట్టుకొన్న వైనము ఙప్తికి వచ్చినది.

    అయిననూ పొత్తము పూర్తిగా చదివితిని కావున ఆ సరములయందు నను పూర్తిగా కమ్మిన వాక్యములు ఇవియని చెప్పుటలో ఇసుమంత సందేహము లేదు.

    అంతు పట్టని ఊహలన్నీ,
    అంధకారం లాగ కమ్మీ….

    అనిన వాక్యములు కవితావిదారక స్థానములో జగణము భగణము మీద కాక మగణము మీద యమోపచారము పొందినట్లు అనిపించినది. ఇది కూడా ఒక భావనే కావున, కవులైన వారు అర్థము చేసుకొనెదరని భావించుచుంటిని.

    ఏతావాతా చెప్పునది ఏమనగా – ఆ సరములు చదివిన పిమ్మట అద్దానియందున్న మాత్రాఛందస్సు పరిస్థితి ఏమిటో తెలియనైతే లేదు కానీ, మాత్రా బిళ్ళగోలీలు వేసుకొనే పరిస్థితి దాపురించేట్లుగా కనపడటముతో

    అంతు పట్టని రాతలన్నీ
    అంధకారం లాగ కమ్మీ…

    అని ఒక రెండు వాక్యములు నాకు నేనుగా రాసుకొని సమాధానపఱచుకొంటిని.

    ఇక గురజాడ గుఱించి మీరు అంత ప్రియముగా గోముగా అడిగిననూ నేను మాటాడదలచుకోలేదు. ఆయన వలన కాదుకానీ, ఆయన రచనల వలన మన సాహిత్యము, వల్లకాడు దిశగా సాగిపోయినదని నా నిశ్చితాభిప్రాయము. దానికి కారణములు ఇక్కడ వివరించపూనుకునే ఓపిక లేదు. కాకున్న గురజాడ సంగీతమునకు, స్వరములకు సంబంధించిన మీ ప్రశ్నలు చాలా ఉత్సాహపూరితముగా వున్నవి. ఇతర చదువరులెవరన్నా విశదీకరించ పూనుకుంటే అవి చదవవలెనని పూనకముగా వున్నది.

    ఆ సమయము కొఱకు ఎదురు చూచుచు

    అశ్మాచం

    PS: – మీ పి.ఎస్ నందు శ్రీశ్రీ గుఱించిన మీ అభిప్రాయముతో నాకు భేదవిభేదమున్నది కానీ, మిఱుమిట్లు కొలిపినది మీకే కావున ఆయ్యదాంధకార పరిస్థితి మీ వరకే నిలిచి యుండును. అద్దానివలన ఇతరులకు ఇబ్బంది లేదు, వుండకూడదు అని ఆశ. అయిననూ పైన డైగ్రెషనుకు సంబంధించిన మీ ప్రశ్నావివరణకు, స్విన్బర్నుకు సంబంధించి ప్రశ్నకు రచయిత నుండి ఏమి సమాధానము వచ్చునోనని ఆసక్తోత్సాహముగానున్నది.

  10. స్వర్గంలో స్ట్రిప్‌ టీజ్‌ గురించి అశ్మాచం అభిప్రాయం:

    12/03/2015 12:53 pm

    కటిచేలంబు బిగించి కలకట్టియ జక్కం గయి బంధించి దో
    స్తట సంస్ఫాలన మాచరించి చరణద్వంద్వంబుఁ గీలించి త
    ద్దిసమొలాగ్రము మీఁదనుండి యుఱికెన్ ముసద్దిసింహంబు ది
    క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్

    ఆణిముత్యమనుకొన్న వీరి ప్రాత రచనా స్వరూపము, విశ్వరూపమూ నగ్నదిగంబరముగా నిలబడి కించిత్ ఆశ్చర్యము కలిగించినది.

    ఈ వ్యాసము గర్హించదగినదని చెప్పివేత వలన దీనికి మరింత ప్రచారపు తిలకము అద్దినట్లగును. రచయిత ఇట్లు రాయుట ఆనాటి వయ: ప్రభావము కాబోలును. రోతలందు పరమరోతలు వేరయానని ఉక్తితో ముగింపు పలుకుచున్నాడ.

    అశ్మాచం