పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. రంగులూ మాటాడతాయి! గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    06/15/2017 12:16 am

    ‘అపారా’నుభవంతో ‘సునిశిత’ విమర్శ చేసిన ధింసా గారికి నమస్సులు.

    చాలా సమయం వెచ్చించి వ్యాఖ్య(లు) చేసినందుకు ధన్యవాదాలు.

    అనేక భావావేశాలనే రంగులని గ్రహించి జీవితాన్ని అందమైన చిత్రాన్నెలా చేసుకోవాలో చెప్పడమే నా ఆలోచన.

    1. ‘తెల్ల నవ్వులు’ అనే ప్రయోగం సర్వ సాధారణమే. మీరు వినలేదంటే ఆశ్చర్యమే వేసింది. తెల్ల నవ్వు వెలిసిపోయిన తనాన్ని, జీవం లేని తనాన్ని సూచిస్తుందనేది అందరకు తెలిసిన విషయమే. అందుకే నవ్వుల్లో తెల్లదనం ఎక్కువ కాకూడదనేది కవి హృదయం.
    2. ఇక ఇంగిత జ్ఞానం గురించి మీరు చేసిన వ్యాఖ్య: కవితలోని చమత్కారాన్ని గ్రహిస్తే ఇంగిత జ్ఞానం త్వరగా బోధపడుతుంది.ఏ భావానికి ఆ రంగును అద్దమని కవి ఆకాశం , గడ్డి పరకల రంగుల గురించి ప్ర స్తావించాడు. లేకుంటే ఇదిగో ఇలాగే ఒక దానికి మరొకటి అర్ధమౌతాయి.
    3. ఏ ఒక్క రంగునీ కవి ద్వేషించ లేదు – లేడు. ఎందుకంటే ఒక మంచి చిత్రానికి అన్ని రంగులూ అవసరమే – అందులోనూ జీవిత చిత్రం కదా. చాలా తేలికైన పదాలతోనే జీవితాన్ని గూర్చి చెప్పాలని ప్రయత్నించిన కవిత ఇది – అంత దాగని సత్యాలేముంటాయి చెప్పండి ? 
    4. ఇక శీర్షిక విషయంలో మీరు చేసిన వ్యాఖ్య : మాటాడు – మాట్లాడు ; పోటాడు – పోట్లాడు – వాడుకలో ఉన్నవే . అంత ‘సర్డుకు’ పోవాల్సిన అగత్యం లేదేమో.
    5. ‘గుండె అంగీ’ లా చుట్టుకోడమంటే మనసుకు చాలా ఇష్టమైన దానిలా చుట్టేసుకొమ్మని. మీకు నచ్చకపోతే నేనేమీ చేయలేను. నాకు నచ్చి చేసిన ప్రయోగమది. అంతే కానీ ఫేసు బుక్ లో బోలెడన్ని లైకుల కోసమో చప్పట్ల కోసమో కాదు. అసలు నేను వ్రాసుకునేదే నాకోసం. నాకిష్టమై వ్రాసాను. సంపాదకులకి నచ్చి ప్రచురించారు. నచ్చిన వారు చదువుతారు. ఇష్టపడతారు. బలవంత మేమీ లేదు.
    6. రంగులు మానసిక భావావేశాలను వ్యక్తంచేసినపుడే మాటాడి నట్టు – అదే – మాట్లాడినట్లు. నేను చెప్పిందీ అదే.
    7. ఏదైనా చదివినపుడు ఏమైనా మాట్లాడే హక్కు అందరికీ వుంది. అవసరమైనపుడే మాట్లాడాలి – కానీ నా మటుకు నాకు అవసరాన్ని గుర్తించ గలిగినపుడే మాట్లాడాలన్నది నా ఉద్దేశ్యం.

    ఇలా మీ పరిచయం కలగడం మహద్భాగ్యం. నమస్తే.

  2. ఇంటికి మళ్ళు గురించి థింసా అభిప్రాయం:

    06/13/2017 5:36 am

    మీ వివరణ కు ధన్యవాదాలండీ ఇంద్రాణి గారు.

  3. వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 4. వైరుధ్యం వర్సెస్ వైవిధ్యం గురించి kalluri bhaskaram అభిప్రాయం:

    06/12/2017 9:23 pm

    సహానుభూతిపూర్వక స్పందనకు రవిగారికి ధన్యవాదాలు. వేయిపడగలపై ఆర్.ఎస్. సుదర్శనంగారి విమర్శ కాక, చెప్పుకోదగిన ఇతర అనుకూల/ప్రతికూల విమర్శలు ఏవైనా మీ దృష్టికి వచ్చి ఉంటే తెలపగలరు.

  4. పునరావృతమ్ గురించి kalluri bhaskaram అభిప్రాయం:

    06/12/2017 9:16 pm

    కథ, కథనం రెండూ బాగున్నాయి. కొన్ని తప్పనిసరి సాంకేతిక పదాలను మినహాయిస్తే మిగతా ఇంగ్లీష్ మాటల్ని, వాక్యాల్ని తెలుగు చేయడం ఏమంత కష్టం కాదు. అవసరమనిపిస్తే ఎవరి సాయమైనా తీసుకుని ఆ పని చేయండి.

  5. పునరావృతమ్ గురించి Sai kala.v అభిప్రాయం:

    06/12/2017 7:20 am

    కృతజ్ఞతలు మధు గారు . ఎవరికీ అర్థం కాలేదు అని బాధ వేసింది . ఇంగ్లీష్ విషయం ఈసారి గుర్తు ఉంచుకుంటాను

  6. మనోరమ గురించి శివరామప్రసాద్ కప్పగంతు అభిప్రాయం:

    06/11/2017 12:07 am

    అద్భుతమైన రేడియో నాటకాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

  7. ఇంటికి మళ్ళు గురించి indrani palaparthy అభిప్రాయం:

    06/10/2017 5:48 pm

    థింసా గారు,

    1. అత్తింటి పోరు, నస, చాకిరీ భరించలేక ఆత్మహత్య చేసుకుందామని వస్తుంది తల్లి.

    2. ఇంతలో పాప మరణించిన శీతాకోక చిలుక తెచ్చి అది ఎగరడం లేదని ఏడుస్తుంది.

    3. తల్లికి తాను చనిపోతే పాప పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకి వస్తుంది. పాపని తీసుకుని ఇంటి వైపుకు ఆడుగు వేస్తుంది.

    ఇదీ నేను చెప్పదల్చుకున్నది. బహుశా నేను అనుకున్న విధంగా చెప్పలేకపోయి ఉండవచ్చు.

    నా కవిత మాట ఎలా ఉన్నా మీ మారుపేరు భలే ఉన్నాదండీ. ధింసా అంటే- తుం సా నహి దేఖా! అన్న పాట గుర్తొస్తోంది. 🙂

    ధన్యవాదాలు.
    ఇంద్రాణి.

  8. రంగులూ మాటాడతాయి! గురించి థింసా అభిప్రాయం:

    06/10/2017 1:36 pm

    నాకు తెలిసినంతవరకు తెలుపు లొంగుబాటుకు ప్రతీక. తెలుగు కవిత్వంలో కూడా ఈ అర్థంలోనే ప్రయోగించారు. కానీ నవ్వులకు కాదు. నవ్వు తెల్లగా ఉండదు పచ్చగా ఉంటుందనుకుంటాను.

    ఆకాశానికి పచ్చదనాన్నీ గరికకు నీలిమనీ ఇంగిత జ్ఞానమున్న కవి ఎవరూ ప్రయోగించరు గాక ప్రయోగించరు. ఇక్కడ విజయ్ గారు ఎందుకు అట్లా వ్యక్తీకరించారో సులభంగానే గ్రహించవచ్చు. ఏమంటె ఎరుపుని కోపానికి ప్రతీకగా తీసుకున్న కవికి రంగు(ల) రుచి వాసన స్వరూప స్వభావాల గురించి తెలియక కాదని చెప్పకనే తెలుస్తోంది. ఎరుపు మీద వ్యతిరేకతతో ఈ పొయెం రాసారని దాచేస్తే దాగని సత్యం.

    వీరి పొయెం శీర్షిక “రంగులు మాటాడుతాయి” అన్నారు గానీ నిజానికి “రంగులు మాట్లాడుతాయి” అనాలె. వ్యావహారికమని ఏదో సర్దుకుపోవచ్చును లెండి.

    కానీ చివరి మూడు పాదాలు పొయెంకి అతికినట్లనిపించట్లేదు. “గుండె అంగీ” ఏమిటొ మరి. కొత్త ప్రయోగమని బోలెడన్ని లైకులు కొట్టి మరీ చప్పట్లు చరుద్దామా!? పేరుబడ్డ కవి తప్పు ఎన్నటికీ చేయడని, మనదే పొరపాటని ముడుచుకుందామా!?

    ఈ కవి చెప్పదలచుకున్న విషయం బోధపడక కాదు గానీ రంగులు మాట్లాడ్డమె కాదు మానసిక స్థాయినీ ప్రస్పుటిస్తాయనుకుంటాను. అట్లాగే భావజాల దిశ దశనీ చెప్పకుండానే చెబుతాయిగదా. ఈ పొయెం మీద కొంచెం ఎక్కువే మాట్లాడాననిపిస్తోంది. తప్పదుకదా అవసరమైనప్పుడు. తక్కువేననుకుంటే చర్చకు సిద్ధమవక తప్పుతుందా?!

    –థింసా

  9. తెలుగులో యాత్రాసాహిత్యం గురించి amarendra dasari అభిప్రాయం:

    06/09/2017 5:12 pm

    నిజమే… ఆయన కాశీయాత్ర 1830-31 లలో జరిగింది కానీ ఆ పుస్తకం మాత్రం 1838 లోనే వచ్చింది.

  10. ఇంటికి మళ్ళు గురించి థింసా అభిప్రాయం:

    06/09/2017 1:30 pm

    కొన్ని హైకూల్లాంటివి కలిపి కుట్టినట్లుందీ కవిత. వీటితో వచ్చిన సమస్యల్లా కవితని పూర్తిగా ఆస్వాదించనీవు ముక్కలు ముక్కలుగా తప్ప. పాలపర్తి ఇంద్రాణి మంచి poet అని విన్నాను. వారి కవిత్వ తాత్వికతని నేనే అందుకోలెకపోతున్నానేనేమో.
    మన్నించగలరు.