పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. ఒకనాటి యువ కథ: మా నాన్న నాకేమిచ్చారు? గురించి శ్రీనివాసుడు అభిప్రాయం:

    06/19/2017 11:09 pm

    @ anyagaami

    అచ్చంగా ఆ రామకృష్ణారావుగారే.

    మీకు ఇబ్బంది కలిగించినా ఒక విషయం చెప్పక తప్పదు. మీరు ఎంచుకున్న పేరుకు తెలుగులో చెడ్డ అర్థం వుంది. ఈ క్రింద నిఘంటు అర్థాలు యిస్తున్నాను. ఇక పైన ఆ పేరు మీరు ఉంచుకుంటారో, త్రుంచుటకుంటారో మీ ఇష్టం.

    అన్యగామి : ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
    సం.విణ.

    1. ఇతరుని కడకు పోవువాఁడు.
    2. జారుఁడు.

    అన్యగామి : వావిళ్ల నిఘంటువు 1949
    సం.విణ. (న్‌.ఈ-నీ.న్‌.)

    ఇతరులను పొందువాఁడు.

  2. ఒకనాటి యువ కథ: మా నాన్న నాకేమిచ్చారు? గురించి anyagaami అభిప్రాయం:

    06/19/2017 8:06 pm

    మీరు ఒకానొకప్పుడు బాలజ్యోతిలో మాథమెట్రిక్స్ కాలం నడిపినవారేనా? ఇది కథ కాదు జీవిత పరమార్థం. అద్భుతంగా వ్రాసారు.

  3. రంగులూ మాటాడతాయి! గురించి థింసా అభిప్రాయం:

    06/17/2017 5:18 am

    విజయ్ గారూ నమః.!

  4. రంగులూ మాటాడతాయి! గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    06/16/2017 9:50 pm

    థింసా గారూ

    ‘గుండె అంగీ’ అంటే గుండె కు వేసుకునే అంగీ అనే వుద్దేశ్యంలో ప్రయోగించానని మొదటే తెలియచేశాను. ప్రేమతో గీసుకుని రంగులు నింపుకున్న జీవితచిత్రాన్ని మరింత ప్రియంగా గుండెకు చుట్టుకొమ్మని నా భావన.

    అన్ని ప్రయోగాలూ అందరికీ నచ్చాలని లేదుగదా.

    మీ ఆసక్తికి ధన్యవాదాలు. నమస్తే.

  5. రంగులూ మాటాడతాయి! గురించి థింసా అభిప్రాయం:

    06/16/2017 8:07 am

    డా విజయ్ గార్కి,

    ధన్యవాదాలు.

    ఒక పదమో పదబంధమో ప్రయోగమో పంటి కింది (పలుగు) రాయిలా అనిపించడానికి .. దుష్ట సమాసం, దుష్ట సంధి, ముద్రారాక్షసాలే కావలెనా?

    శబ్ద సౌందర్యం, అర్థ శబలత, కంటికుండే ఇంపు గురించి మీకు తెలియనిది(వి) కాదు కదా!

    మీకు ఇష్టమైన, నాకు ఇంచుక వ్యత్యస్తంగా తోచిన “గుండె అంగీ” లో ఏ సమాసం, ఏ సంధి గలవో (ముద్రారాక్షసం లేదనుకున్నప్పటికీ) అదెంతటి సత్ప్రయోగమో దయచేసి వివరించ గలరని సవినయంగా విన్నవించుకుంటున్నాను.

    థింసా

  6. రాగలహరి: సింధుభైరవి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    06/16/2017 7:12 am

    జూలై 22న జరగబోయే సాహిత్య సదస్సులో “మన పాటల్లో సింధుభైరవి” అన్న అంశం మీద ప్రసంగానికి తయారు అవుతుండగా ఈ క్రింది పాటలు లభ్యమయ్యాయి. ఈ పాటలన్నీ సింధుభైరవి రాగంలో బాణీ కట్టబడ్డవే!

    1. “మన ప్రేమ, మన ప్రేమ..” అన్న బాలాంత్రపు రజనీకాంతరావుగారి రచనని, బాలమురళీకృష్ణ – శ్రీరంగం గోపాలరత్నం అద్భుతంగా పాడగా చాలా కాలం క్రితం విన్నాను. ఇదిగో మళ్ళీ ఇక్కడ వినొచ్చు.

      https://www.youtube.com/watch?v=GEq9MlJERvU

    2. ఇంకో పాట:

      సంసారం (1950, ఘంటసాల – గానం,L. V. ప్రసాద్ – దర్శకత్వం, సుసర్ల – సంగీతం, వెంపటి సదాశివ బ్రహ్మం – రచన)
      సంసారం! సంసారం!
      ప్రేమ సుధాపూరం! నవజీవన సారం!

      https://www.youtube.com/watch?v=rmQBJuPVX4M

    3. మరొక అద్భుతమైన పాట:

      మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
      ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది

      https://www.youtube.com/watch?v=uVR75mT2Ibc

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  7. రంగులూ మాటాడతాయి! గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    06/16/2017 5:38 am

    ధింసా గారు, ప్రతిస్పందనకు ధన్యవాదాలు.

    ఏ కవీ తన చదువరులను ఇబ్బంది/తికమక పెట్టాలని అనుకోరని నా భావన. ఒక్కోసారి కవికి ఉన్న దృక్కోణం రీడర్ కి దొరక్కపోవచ్చు. అలాగని కవిత, దాని లోని భావన ఇలాగే ఉండాలని చెప్పలేము. వీలున్నంతవరకు కవితను తన చదువరీ ఆస్వాదించాలనే కవి భావన కదా.

    వైరి సమాసమో, దుష్ట సంధో, ముద్రా రాక్షసమో ఐతే మీరన్నట్లు పంటి కింద రాయే. కానీ ఈ నా భావన అంత సంక్లిష్టమో జుగుప్సాకరమో కాదు గదా.

    మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  8. తెరచాటు-వులు: 3. శ్రుతి చూసుకో, శ్రుతి చేసుకో! గురించి Guru kiran అభిప్రాయం:

    06/15/2017 10:23 pm

    Can the TONE and TREATMENT be considered as same?

  9. రంగులూ మాటాడతాయి! గురించి థింసా అభిప్రాయం:

    06/15/2017 4:26 pm

    ప్రియమైన డా. విజయ్ గారూ, మీ వివరణ అర్థమయింది. నా రాతతో మీ సున్నిత మనస్సుని మీ మృదు హృదయాన్ని గాయపరచడం నా ఉద్దేశ్యం కానేకాదని గమనించ మనవి. పరస్పర అభిప్రాయ కలబోత హలదాయకం కాగలదని నా నమ్మకం. అంతే.

    1. మీరు ఆశ్చర్యాన్ని వెలిబుచ్చిన “తెల్ల నవ్వులు” నిజానికి నాకెక్కడా ఎదురు కాలేదు. ఇది నా పరిమిత జ్ణానమే కావచ్చును. “జీవం లేని (నిర్జీవపు) “, “పేలవపు”, “వెలతెల బోయిన” “నిర్వేదపు” “కిలకిల గలగల” “ముత్యాలు జాలువరే” ఎట్సెట్రా నవ్వుల వరకే నా తెలివిడి. నిజానికి సాదారణ వాడుకలో “తెలుపు” స్వచ్చతకి ప్రతిబింబం. కానీ అది సందర్భ ఔచితిని బట్టి ముఖ్యంగా సంఘర్షణలో “తెలుపు” ఓటమిని తెలిపే సంకేతం. “ప్రతి రంగుకూ ఒక భాష ఉంటుంది” అన్న మీకు రంగు ప్రాధమ్యత అబోధకమని నేను పొరబడను గాక పొరబడను.
    2. నిజమే.. ఏ వస్తువుకు ఆ రూపాన్నీ ఏ భావానికి ఆ రంగునూ అద్దడం వాస్తవిక కవి సమయం. మీరు కోపానికి ఎరుపు రంగును సరిగ్గా ప్రయోగించి, ఆకసం, గడ్డిపరకల్ని విరుద్ధ రంగుల బారిన పడెయోద్దనడం చమత్కారమనుకోమనడం భావ్యమేనంటారా?
    3. డా. విజయ్ గారూ నిజమే అన్ని రంగుల కలయికే జీవితం..కానీ జీవితమ్లో కొన్నింటికే ఎక్కువ ప్రాధాన్యమియ్యడం అందరి అనుభవంలో ఉన్నదే గదా! అందుకే రంగులకు భాష మాత్రమే కాదు భావజాలం కూడా ఉంటుందన్నాను. మీరు నొచ్చుకుంటే మన్నించండి. రంగు కున్న ప్రాధాన్యమది.
    4. మాటడుతాయి, మాట్లాడుతాయి మాండలిక భేదాలను, యాసల పార్శ్వాలని తెలిపేటివని మీకు తెలియనిది కాదనుకుంటాను. అందుకే సర్దుకుని అర్థం చేసుకోవచ్చులేనని భావించాను తప్ప అన్యం కాదు.
    5. “గుండె అంగీ” ప్రయోగం మీకు అత్యంత ఇష్టమైన మీ మమకారాన్ని దాయలేనంత ప్రీతిపాత్రమైన పద ప్రయోగమే కావచ్చును. కాదనడం లేదు. కానీ ఏ ప్రయొగమైనా పాఠకుడికి పంతికింది రాయిలా ఉండకూడదన్నదే నా భావన.
    6. రంగులు మానసిక భావవేశాలను వ్యక్తం చేయడమే కాదు కావలసింది ఆ వ్యక్తీకరణకి ఒక క్రమగతి, క్రమోన్మీలన కూడా ఆవశ్యకమని మీరూ గుర్తిస్తారు కాదా డా. విజయ్ గారూ.
    7. “ఏదైనా చదివినప్పుడు ఏమైనా మాట్లాడె హక్కు అందరికీ ఉంది” అని మీరంటారు గానీ అట్లా “ఏమైనా మాట్లాడడం” బాధ్యతా రాహిత్యమని నేను గాఢంగా భావిస్తాను. కవి మాత్రమే కాదు చదువరులు కూడా ఔచిత్యాన్ని పాఠించాలని నా ప్రగాఢ ఆకాంక్ష. అవసరమైనప్పుడు పెదవి విప్పకపోతే అనవసర అపార్థాలనధిగమించడం దుస్సాధ్యమౌతుంది కదా. అవసరాన్ని గుర్తించిన పరస్పరుల కవితాస్వాదనా సంలబ్ది కోసమే గదా మన భావాభిప్రాయాల కలబోత.
    8. మీకు తెలియని విషయమేమీ కాదు గానీ – కవి కవిత రాసి ప్రకటించాక ఇక ఆ కవిత కవిది కాదు పాఠకులదౌతుంది. అనుకుంటాం గానీ ఏ కవీ తన కోసం మాత్రమే కవిత్వం రాసుకోడన్నది జగమెరిగినదే. పాఠకులు లేదా చదువరుల ఆస్వాదనిరాస్వాదన వల్లనే ఆ కవితకొక ఉనికి ఏర్పడుతుందని చెప్పడం అవాస్తవమో అతిశయోక్తో కాబోదు.

    కొంచెం ఎక్కువగానే స్పందించాననుకుంటాను.
    నా అభిప్రాయ నివేదనని అన్యధా భావించరని కవికీ సంపాదకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ….
    –థింసా

  10. కోడ్ కూలీ గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    06/15/2017 3:34 am

    కథ బాగుంది. అంతకంటే దీన్ని అనవసమైన విస్తరణలు లేకుండా సూటిగా చెప్పి ముగించటం ఇంకా బాగుంది. కాని కథలో కొంత వైరుథ్యం కనిపిస్తోంది. నోటిదురుసువల్ల ఉద్యోగం ఊడగొట్టుకున్న మనిషి ఆతరువాత ఏమీ మారలేదని సుస్పష్టంగానే కథలో కనిపిస్తోంది. కాని అంత తలబిరుసూ నోటిదురదా ఉన్న మనిషి ఒక ఉద్యోగంలోనుండి గెంటించుకొన్నాక ఎలాగ అమెరికాలో కుదురుకొని పైకి వచ్చిందని చెప్పటం ఆ పాత్రస్వభావానికి అస్సలు నప్పటం లేదు. అదొక చెప్పుకోదగ్గ లోపమేను.