పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. పరిచయం: ఇంటివైపు – అఫ్సర్ కవితల సంపుటి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/01/2018 3:05 am

    ప్రియమైన శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు,

    ఒక ఆత్మగత ప్రపంచానికి ప్రతీకగా ఉన్న అఫ్సర్ గారి కవితల పుస్తకం “ఇంటివైపు”ను నవోదయ బుక్ హౌస్ కాచీగూడా వారు అందించారు కాని దాన్ని ఎలా ఆశ్వాదించాలో మీ యీ విశ్లేషణ వల్లే తెలుసుకున్నాను. (వాకిలి అంతర్జాల పత్రికలో స్వాతి కుమారి బండ్లమూడి గారు కూడా యీ పుస్తక పరిచయం చేసి సాయపడ్డారు). మీకు ధన్యవాదాలు.

    “కణకణ మండే ఉద్యమ రక్తకాసారాల్లోకి
    దేహాల్ని చితుకుల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు” అన్న అఫ్సర్ గారికి వొందనాలు.

  2. పలుకుబడి – కాలమానము II గురించి సంతోష్ కుమార్ అభిప్రాయం:

    01/01/2018 1:01 am

    మురళీధర్ రావు గారికి మీరు మే 14, 2013 లో ఇచ్చిన జవాబు అది. ధన్యవాదాలు.

  3. పలుకుబడి – కాలమానము II గురించి సంతోష్ కుమార్ అభిప్రాయం:

    01/01/2018 12:46 am

    సురేష్ గారికి, నమస్కారములు. మురళీధరరావు గారు: నాకు నిజంగా 1901 వివాదం గురించి తెలియదు. అయితే, నా ఊహ ప్రకారం అధికమాస నిర్ణయంలో సందిగ్ధతకు కారణాలు ఈ కింది వాటిలో ఏదైనా కావచ్చు.

    1. ఉత్తర భారతంలో పౌర్ణమి నుండి పౌర్ణమి ముందురోజు దాకా ఒక చాంద్రమాసంగా పరిగణిస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్రా, గుజరాతులలో అమావాస్య తరువాత రోజు నుండి అమావాస్య వరకూ ఒక మాసంగా లెక్కిస్తారు. దీని వల్ల అధిక మాసం వేర్వేరు మాసాల్లో వస్తాయి. (అయితే, 1901 వివాదానికి ఇది కారణం కాకపోవచ్చు).

    2. అధికమాస నిర్ణయానికి సూర్య సంక్రమణ కాలం, చాంద్రమాస కాలం కచ్చితంగా నిర్ణయించాలి. చాంద్రమానం అని విన్నాను. మరి ఈ చాంద్రమాసం గురించి వివరింప ప్రార్థన. ధన్యవాదాలు.

  4. మంచి కవి, మంచి స్నేహితుడు గురించి తః తః అభిప్రాయం:

    12/31/2017 1:40 pm

    “నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు” లో ‘అందమైన’ అని తిలక్ అనిఉండకూడదనీ, అలా అనటం నన్ను చాలా బాధ పెట్టిందనీ ‘ఈమాట’ అభిప్రాయాలలో (ఎప్పుడో, ఎక్కడో గుర్తు రావటం లేదు) ఒక సారి రాసాను. మొన్న డిసెంబర్ 18 వ తేదీ ‘ఈనాడు’ అనుబంధం II వ పుటలో – అప్పుడు హైదరాబాదు లో జరుగుతున్న ‘ప్రపంచ తెలుగు మహసభల’ ప్రేరణతో – ఒక ఆడ పిల్ల – వేమూరి సుధా మాధురి, భీమవరం- రాసిన ‘అమ్మ ఒడంత వెచ్చదనం నా తెలుగు’ అంటూ మొదలైన ‘అమ్మ ఒడి’ అన్న ఒక కవిత వచ్చింది. అందులో చివరి చరణం:

    “తిలక్ చెప్పినట్లు మన తెలుగు అక్షరాలు
    నిజంగానే వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు”

    1968 నుంచీ నేను పడిన బాధ సుధా మాధురి కి తెలిసిందని ఊరట కలిగింది.

    2018 శుభాకాంక్షలతో,
    తః తః

  5. వో షామ్ కుచ్ అజీబ్ థీ… గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/27/2017 12:15 pm

    <> ఇక్కడ శూన్య అంటే అర్ధం ఏమిటి?

  6. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Chandranaga Srinivasa Rao Desu అభిప్రాయం:

    12/26/2017 7:34 am

    శిలాశాసనాల్లోనూ, విదేశాల్లోనూ గణపతి ప్రస్తావన గురించి ఈ వ్యాసo ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు.

  7. గడి నుడి – 14 గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/25/2017 1:56 am

    25 రానే వచ్చింది.దయచేసి సరిచూపును అనుగ్రహించండి.

  8. కులవ్యవస్థ – భావవ్యక్తీకరణ హక్కు: పెరుమాళ్ మురుగన్ ప్రసంగం గురించి సురెందర్ అభిప్రాయం:

    12/20/2017 5:39 am

    పెరుమాళ్ మురుగన్ గారు చెప్పినవి కాదనలేని నిజాలు. మురుగన్ గారు చెప్పిన విషయాన్ని చదివి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారు కొన్ని విషయాల పట్ల విభేదించారు. వారు విభేదించడానికి కారణాలు ఉన్నాయి. అవేంటంటే వారు పెరిగిన పరిస్థితులు ఎప్పుడూ కూడా తీవ్రమైన కుల భావాలను ఎదుర్కొనకపోవచ్చు. వీరు ఎక్కువ అని పిలవబడుతున్న కులాల వారి అయి ఉండి తక్కువ అని పిలవబతున్న కులాల వారిని కుల ఆధిపత్యంతో సంబోధించకపోవడమూ, స్వీకరించకపోవడమూ ఒక కారణంగా చెప్పవచ్చు. అందుకే వీరు పెరుమాళ్ గారి మాటలను కొన్నింటిని అంగీకరించలేకపోతున్నారు. ఏది ఏమైనా, గతంలో కుల ఆధిపత్య ధోరణులు భారత సమాజంలో పెచ్చరిల్లాయన్నది నిజం. ఇప్పుడవి చాలా వరకు తగ్గాయి ఏవో అక్కడక్కడా జరుగుతున్నాయి. కానీ ఏ కులం వారు ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా మనసులో ఎక్కడో ఒకచోట కుల మత్తు ఉండనే ఉంటుంది. అది కూడా మాలో లేదనే వారు ఉంటే ఎక్కువ కులం అని పిలవబడుతున్న వారు తక్కువ కులం అని పిలవబడుతున్న వారితో బంధాలను ఏర్పరచుకుంటారా ? తక్కువ కులం అని పిలవబడుతున్న వారు ఎక్కువ కులం అని పిలవబడుతున్న వారితో సంబంధాలను ఏర్పరచుకోలరా ? ఇలా చేసిన వాళ్లు ఎక్కడో ఒకచోట ఉండవచ్చు. మరి మిగతా వాళ్ల సంగతేంటి ? భారతదేశం ఉన్నంత కాలం కులాలు అనేవి పోవు. ఎందుకంటే కుల పిచ్చి ఉన్న వారే పరిపాలన చేస్తున్నారు కాబట్టి. కుల గజ్జిలేని వారు రాజ్యమేలుతున్నప్పుడు కులాలు కనుమరుగవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

  9. ఏం జీవితం! గురించి Vijay అభిప్రాయం:

    12/20/2017 1:28 am

    In the end, you have only you. Excellent Write-up, Chandra Gaaru

  10. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి Avineni Bhaskar అభిప్రాయం:

    12/17/2017 5:38 am

    టి. చంద్రశేఖర రెడ్డి గారూ,
    తెలుయజేసినందుకు ధన్యవాదాలు.