పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. పూర్వీకం గురించి suresh అభిప్రాయం:

    03/06/2018 4:01 am

    బాగుంది కథ. కథలిలాక్కూడా రాయొచ్చు అని మనకు తెలియటం మరింత బాగుంది.

    భాస్కర్ గారి థాంక్ లెస్ కృషికి ధన్యవాదాలు.

    – సురేష్

  2. ఒక వోర! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    03/05/2018 12:55 pm

    చాలా ధన్యవాదాలు రహ్మాన్ గారు.
    శుభాకాంక్షలు.

  3. ఒక వోర! గురించి S A RAHMAN అభిప్రాయం:

    03/05/2018 8:02 am

    కథ చాలా చాలా బాగుంది.

  4. ఆకాశ దీపం గురించి S A RAHMAN అభిప్రాయం:

    03/05/2018 7:58 am

    సింప్లి సూపర్బ్.

  5. తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి Raghavendra అభిప్రాయం:

    03/04/2018 10:49 pm

    ఆచార్యులవారు ఈవ్యాసం రాసినప్పటికంటే అధ్వాన్న స్థితిలో ఉన్నాం నేడు బోధనలో భాష విషయంలో. కొత్తపాళీ గారు చెప్పిన విద్యావ్యాపారం ఇప్పుడు మరింత బలీయమైంది. సైన్సంతా తెలుగులోనే నేర్పమని కాదు భాషాశాస్త్రవేత్తల సలహా. ప్రాధమిక విద్య మాతృ భాషలో నేర్చినపుడు విషయగ్రహణశక్తి మరింతగా వికసిస్తుందని మాత్రమే. అలాచదివినవారు అమెరికా వచ్చి అందరినీ మెప్పించగలగడం విదితమే. ఎల్ కె జి నుంచీ ఆంగ్లమాధ్యమం లోనే చదువుకుని వచ్చి ఇక్కడ బహుధా రాణిస్తున్నవారనేకులు పదిపంక్తులు కూడా తప్పులు లేకుండా ఆంగ్లం లో రాయలేకపోవడం చూడవచ్చు. ఇట్టివారి విజయానికి కారణం వారి ఆంగ్లభాషా ప్రావీణ్యం కాదు. విద్యావిధానం నిర్ణయించే పాలకులు ఇది గమనించాలి.

  6. నాకు నచ్చిన పద్యం : మెయి బూదిపూత మాగాణి గురించి VSTSayee అభిప్రాయం:

    03/04/2018 8:39 am

    ఆ పద్యంలో ‘చిద్గగన ప్రాలేయాంశువు’ అనే పదముంది. ‘ప్రా’ అనే ద్విత్వాక్షరం ముందున్న ‘న’ అనే అక్షరం లఘువుగా వాడాడు. ఒకే సమాసం మధ్యలో వున్నప్పుడు ద్విత్వాక్షరం ముందున్న లఘువు గురువౌతుంది గదా, నీ కావ్యం తొలి పద్యంలోనే ఛందోదోషముంది అనీ, మరికొన్ని విషయాలనూ ఉటంకిస్తూ, కొత్త సత్యనారాయణ చౌదరి అనే పండితుడు తీవ్ర విమర్శ లేవనెత్తాడు.

    శ్రీ రావూరి దొరసామిశర్మగారి ”విశ్వనాథ-ప్రయోగ వైలక్షణ్య సమీక్ష” (భారతి, జనవరి 1962) నుండి..

    కల్పవృక్ష ప్రథమపద్యములో రెండవపాదములో ‘ప్రథమకబళేమక్షికాపాతః’ అన్నట్లు గణభంగ మెదురగునని క్రొత్తవారి యాక్షేపము. ఆ పద్యభాగము:
    ‘శ్రీమంజూషిక భక్తరక్షణకళాశ్రీచుంచు వానందవ
    ల్లీమంజుప్రసవంబుఁ జిద్గగనప్రాలేయాంశువున్‌ …’
    ‘గగనప్రాలేయాంశు’ వనుచోట సిద్ధసమాస మగుటచే సామాన్యలక్షణానుసారము ‘న’ గురువు కావలె, కాని యిందు లఘువుగాఁ బ్రయుక్తము. ఇట్లు ప్రయోగించుట దోషముగాదు. దీనికి శాస్త్రమును బ్రయోగములును గలవు; చూడుడు: …

    పూర్తి సమీక్ష ఇక్కడ పుట72 (PDF page 79) నుండి.

    “`హరిఓమ్మ’ని కల్పవృక్షములోని అవతారిక తీయఁగా తొలిపద్యములోనే రెండవ పాదములో ‘ప్రథమకబళేమక్షికాపాతః’ అన్నట్లు గణభంగ మెదురగును. … సంయుక్తాక్షరమునకు పూర్వాక్షరము గురువన్నమాట ఇంగ్లీషుబడులలో కుఱ్ఱకాఱునకు సైతము తెలిసిన చదువు” అంటూ “విశ్వనాథ – ప్రయోగ వైలక్షణ్యము” వ్యాసంలో (భారతి, సెప్టెంబరు 1961) ఆక్షేపించిన కొత్తవారు, పైన ఇచ్చిన ఉదాహరణను ‘కల్పవృక్షఖండనము’ పుస్తకము తెచ్చినప్పుడు, “సకృత్తుగా ఏ కొందఱో .. లఘువుగాఁ జేసిన కవులు లేకపోలేదు. అట్లని అది రాచబాటకాదు; అదే ప్రధానముగాఁ జూచుకొనిసాగిన కవిత, ప్రథమశ్రేణికి రాదు. అందు కొంత ‘కక్కుర్తి’ ఉన్నదనక తప్పదు.” అంటూ, వదలిపెట్టారు.

    1960లలో, ఆంధ్రపత్రికలో. చాలా తుములంగా సాహిత్య సమరం జరిగి చాలా కాలం కొనసాగింది. … ఆ ఖండనమండనలన్నీ క్రోడీకరించి ఎవరైనా పుస్తకంగా వేశారో లేదో …

    వాటిని భారతి, జనవరి 1962 సంచికకు అనుబంధం (PDF page 104 నుండి)గా ఇచ్చారు.

    నమస్సులతో,
    వాడపల్లి శేషతల్పశాయి.

  7. పిల్లర్ నం. 13 గురించి Anwar అభిప్రాయం:

    03/03/2018 1:16 am

    ఒకసారి నా చిన్నతనంలో హైస్కూల్ రోజుల్లో చంద్రశేఖర్ టాకీస్‌కు సినిమాకు పొయినా మధ్యాహ్నం ఆటకు. ధియేటర్‌లో ఒక పర్స్ దొరికింది. పర్స్‌లో ఒక బీగం చెవి, సైకిల్ స్టాండ్ సైకిల్ రసీదు ఉండాయి. సినిమా అయిపొయినాకా జనం అంతా ఖాళీ చేసేశాక సైకిల్ స్టాండ్లో చివరి రెండో సైకిల్‌ని గూడ విడుదల చేసినాక మిగిలిన చివరి మనిషి చివరి సైకిల్, స్టాండ్ కీపర్ దగ్గరికి పొయ్యి “న్నా, టాకీస్‌లో ఈ పర్స్ దొరికింది. దీంట్లో ఈ చీటి గూడా ఉందన్నా. ఎవర్దో ఇద్దామని ఇంతసేపు ఆగినా” అన్నా. ఆయన్న పర్స్ చెక్ చేసుకొని చెంప పట్టి ఒక్కటి పీకి “లంజా కొడకా యాభై దెంగేసి నాటకాలు పడుకుంటా ఉత్త పర్స్ ఇస్తావురా నీయమ్మా” … తలుచుకుంటే ఇప్పటికీ చెంప చుర్రున కాలింది. అయినా దొరికిన పర్సులు ఇచ్చే అలవాటు పోలా 🙂

  8. ఒక వోర! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    03/02/2018 7:15 pm

    * సురేష్! మీ మాటలతో నవ్వించారు. కథ పై మీ ప్రశంసకివే నా ధన్యవాదాలు.

    * టెన్షన్ ఫీలయ్యారా వనజ గారూ? 🙂 చక్కని కామెంట్ ఇచ్చారు. థాంక్యూ, థాంక్యూ.

    * చాలా థాంక్స్ లక్ష్మి అక్కా, మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు! నమస్సులు.

  9. ఒక వోర! గురించి G.S.Lakshmi అభిప్రాయం:

    03/02/2018 11:16 am

    మనసుని బాగా విశ్లేషించావు దమయంతీ.. కథ చాలా బాగుంది..

  10. గడి నుడి – 17 గురించి Kartik Chandra Pvs అభిప్రాయం:

    03/02/2018 10:24 am

    Right or wrong, but filled in the puzzle 17 yesterday itself, but faced some technical problems in submitting it showing the message “డేటాబేస్ అనుసంధానంలో తప్పిదం”.
    Anyhow now I could submit the puzzle filled (right or wrong) now and transmitted for your kind consideration to see it for your judgement.
    Yours Sincerely,
    Kartik Chandra Pvs

    ,

    ,