చాలా బాగున్నదండీ! విశ్వనాథ వారి పద్యంలో వెలుగు అనేది కూడా శివుని సూచించే పదం కాదా? విశ్వేశ్వరా నిన్ను అర్చింతు. విశ్వేశ్వరా సంభోదనా, నిన్ను అనేది కర్మ అధ్యాహారం అవుతుంది ఇక్కడ. శివుని సూచించే పదాలన్నీ కూడా శివుని విశేషణాలు కదా? స్థూలంగా పరిశీలించలేదు, చూసిన వెంటనే అట్లా అనిపించింది. తప్పైతే క్షంతవ్యురాలిని.
// “ఇలాంటి మనస్తత్వం ఉన్న అద్దెకుండేవాళ్ళు మనం చుట్టుపక్కల ఉన్నా అదే చేస్తారేమో!” // నిజం చెప్పారు, కృష్ణవేణి గారూ. బుద్ధి అటువంటిదైనప్పుడు ఇంటి యజమాని దూరంగా ఉన్నా, ఎదురింట్లోనే / పక్కింట్లోనే ఉన్నా తేడా ఉండదు.
ఇటువంటి సమస్యే కథగా ఓ పాతికేళ్ళ క్రితం “బృందావనం” అని ఒక తెలుగు సినిమా వచ్చింది (గుమ్మడి, కైకాల సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ మొదలైన నటీనటులతో). గుమ్మడి కట్టుకున ఇంటిని కైకాల ఆక్రమించుకుంటాడు. ఆ దిగులుతోనే గుమ్మడి చనిపోయిన తరవాత మనవడు రాజేంద్ర ప్రసాద్ ఆ ఇంటిని కైకాల హస్తాల నుండి విడిపిస్తాడు – సినిమా ఫక్కీలో.
చాలా చక్కటి వ్యాసం. ద్వితీయ విభక్తికి సంబంధించిన కొన్ని అంశాలను కూలంకషంగా చర్చించినందుకూ, మంచి వివరణ ఇచ్చినందుకూ చాలా ధన్యవాదాలు. “రాయిని ఆడది చేసిన రాముడివా” అన్న వాక్యం విషయంలో మాత్రం “ఆడదిగా” లేక “ఆడదానిగా” అని లేకపోవడం అసలు (లేక ముఖ్యమైన) సమస్య అని నాకు అనిపిస్తోంది. “గా” అనే ప్రత్యయం కనక వుంటే “రాయి ఆడదిగా చేసిన రాముడివా” అన్న వాక్యం కూడా ఖచ్చితంగా కాకపోయినా, సుమారుగా సరైన అర్థాన్నే స్ఫురింపజేస్తుంది. [విద్య కీర్తి ఇస్తుంది/తెస్తుంది అన్నట్టు.]
ఇక్కడ మరొక విషయం గుర్తుకొస్తోంది: ఈమధ్య “సూపర్ ఉంది” (“సూపర్ గా ఉంది” కాదు), “లైట్ తీసుకో” (“లైట్ గా తీసుకో” కాదు) వంటి ప్రయోగాలు బాగా వాడుకలోకి వచ్చాయి. ఇటువంటి ఆధునిక భాషా పరిణామాల విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్నా!
అప్పాదురై ముత్తులింగం గారిని,
వారి వాణిని తెలుగులో వినిపించే అవినేని భాస్కర్ ని
వారిరువు అందిన్స్తున్న యీ మరో అద్భుతమైన కధను, ప్రిన్సెస్ సైరా ను
( Saira; as a version of Sarah; as girl’s name means “Princess” in Hebrew )
‘ నేను ఎప్పటికీ మరిచిపోను ’
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి sumalatha అభిప్రాయం:
04/01/2018 11:45 pm
చాలా బాగున్నదండీ! విశ్వనాథ వారి పద్యంలో వెలుగు అనేది కూడా శివుని సూచించే పదం కాదా? విశ్వేశ్వరా నిన్ను అర్చింతు. విశ్వేశ్వరా సంభోదనా, నిన్ను అనేది కర్మ అధ్యాహారం అవుతుంది ఇక్కడ. శివుని సూచించే పదాలన్నీ కూడా శివుని విశేషణాలు కదా? స్థూలంగా పరిశీలించలేదు, చూసిన వెంటనే అట్లా అనిపించింది. తప్పైతే క్షంతవ్యురాలిని.
అద్దెకిచ్చి చూడు గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
04/01/2018 10:22 pm
// “ఇలాంటి మనస్తత్వం ఉన్న అద్దెకుండేవాళ్ళు మనం చుట్టుపక్కల ఉన్నా అదే చేస్తారేమో!” // నిజం చెప్పారు, కృష్ణవేణి గారూ. బుద్ధి అటువంటిదైనప్పుడు ఇంటి యజమాని దూరంగా ఉన్నా, ఎదురింట్లోనే / పక్కింట్లోనే ఉన్నా తేడా ఉండదు.
ఇటువంటి సమస్యే కథగా ఓ పాతికేళ్ళ క్రితం “బృందావనం” అని ఒక తెలుగు సినిమా వచ్చింది (గుమ్మడి, కైకాల సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్, రమ్యకృష్ణ మొదలైన నటీనటులతో). గుమ్మడి కట్టుకున ఇంటిని కైకాల ఆక్రమించుకుంటాడు. ఆ దిగులుతోనే గుమ్మడి చనిపోయిన తరవాత మనవడు రాజేంద్ర ప్రసాద్ ఆ ఇంటిని కైకాల హస్తాల నుండి విడిపిస్తాడు – సినిమా ఫక్కీలో.
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి వేణు దశిగి అభిప్రాయం:
04/01/2018 2:52 pm
చాలా చక్కటి వ్యాసం. ద్వితీయ విభక్తికి సంబంధించిన కొన్ని అంశాలను కూలంకషంగా చర్చించినందుకూ, మంచి వివరణ ఇచ్చినందుకూ చాలా ధన్యవాదాలు. “రాయిని ఆడది చేసిన రాముడివా” అన్న వాక్యం విషయంలో మాత్రం “ఆడదిగా” లేక “ఆడదానిగా” అని లేకపోవడం అసలు (లేక ముఖ్యమైన) సమస్య అని నాకు అనిపిస్తోంది. “గా” అనే ప్రత్యయం కనక వుంటే “రాయి ఆడదిగా చేసిన రాముడివా” అన్న వాక్యం కూడా ఖచ్చితంగా కాకపోయినా, సుమారుగా సరైన అర్థాన్నే స్ఫురింపజేస్తుంది. [విద్య కీర్తి ఇస్తుంది/తెస్తుంది అన్నట్టు.]
ఇక్కడ మరొక విషయం గుర్తుకొస్తోంది: ఈమధ్య “సూపర్ ఉంది” (“సూపర్ గా ఉంది” కాదు), “లైట్ తీసుకో” (“లైట్ గా తీసుకో” కాదు) వంటి ప్రయోగాలు బాగా వాడుకలోకి వచ్చాయి. ఇటువంటి ఆధునిక భాషా పరిణామాల విశ్లేషణ కోసం ఎదురు చూస్తున్నా!
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి కట్టా శ్రీనివాస్ అభిప్రాయం:
04/01/2018 2:15 pm
వాడుకలో ఇంతే కదా అనిపించే భాషాపరమైన అంశాల వెనక ఇంతకథ ఉందా!!
శ్రద్ధగా ఇంత విలువైన సమాచారం అందించిన రచయితకు, ఈమాట పత్రికకు ధన్యవాదాలు
జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి indraprssad అభిప్రాయం:
04/01/2018 12:47 pm
బావుంది వ్యాసం. ఒక వ్యాకరణ సూత్రాన్ని తెలుసుకొన్నాను. దాంతోపాటు మంచి తెలుగు పద్యం కూడా.
అద్దెకిచ్చి చూడు గురించి Krishna Veni అభిప్రాయం:
04/01/2018 7:30 am
వెంకట అద్దంకిగారూ, ‘రచన అద్భుతం!’ మీరెప్పుడూ అందించే ప్రశంసకి ధన్యవాదాలు. 🙂
ఇలాంటి మనస్తత్వం ఉన్న అద్దెకుండేవాళ్ళు మనం చుట్టుపక్కల ఉన్నా అదే చేస్తారేమో!
స్మృతిలో… గురించి Anil అట్లూరి అభిప్రాయం:
04/01/2018 6:16 am
రంగారావు గారి “కధ” కోసం ఇచ్చిన, కథానిలయం లంకే, వాకాటి పాండురంగా రావు గారి కధలని చూపిస్తున్నది.
[పొరపాటు దిద్దాము. పట్టించినందుకు కృతజ్ఞతలు. సం.]
కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు గురించి అధ్యాత్మరామం బులుసు అభిప్రాయం:
04/01/2018 5:20 am
ధన్యవాదాలు. చరిత్ర, దానితో పాటుగా మంచి ఆడియో క్వాలిటీ ఉన్న పాటలు, పద్యాలు యిచ్చారు.
పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/01/2018 4:09 am
అప్పాదురై ముత్తులింగం గారిని,
వారి వాణిని తెలుగులో వినిపించే అవినేని భాస్కర్ ని
వారిరువు అందిన్స్తున్న యీ మరో అద్భుతమైన కధను, ప్రిన్సెస్ సైరా ను
( Saira; as a version of Sarah; as girl’s name means “Princess” in Hebrew )
‘ నేను ఎప్పటికీ మరిచిపోను ’
జ్వరగీతం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/01/2018 3:43 am
రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
వస్తే రానీ!
కానీ, కానీ!
గానం, ధ్యానం!
హాసం, లాసం!
కానీ, కానీ!
కళారవీ! పవీ! కవీ!
క్షమాకీజియే కవి స్వాతిజీ,
కళా రవి శ్రీశ్రీ ని ఆసరాగా చేసుకుని స్పందిస్తున్నందుకు.