పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/08/2018 11:15 am

    మొదటి “మాధవ్” కామెంట్లో ఈమాట సంపాదకులని చెప్పే లింకు ఉంది. అందులో టోపీ తో ఇది. టోపీ లేకుండా ఇది అని రాసారు. రెండో “మాధవ్” కామెంట్లో సంపాదకుల టోపీని ఇక్కడ కోతులెత్తుకుపోయాయని ధ్వనించింది – అదే సంపాదకులు పాఠకులు రాసేది ఏమరుపాటుగా చూసీచూడనట్టుపోవడంవల్లా (దీన్నే కథలో టోపీ వ్యాపారస్తుడు పడుకున్నప్పుడు అని చదివినట్టు గుర్తు) టోపీ ఉంది లేదు అని పెట్టకపోవడం వల్లాను. వీరే వారా, వారే వీరా అనేది సందిగ్ధం. అసలు టోపీ ఉందా లేదా అని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఆ టోపీ కత్తెరకి గురైందా, అసలు టోపీ రహస్యం ఏమిటీ అనేవి పాఠక లోకానికి తెలియవల్సిన అవసరం లేదా? మీరు కనక టోపీ పారేసుకుంటే చెప్పండి. మా ఇంట్లో కొన్ని ఉన్నాయి. అందులో ఒకదానిమీద ఇప్పుడే పెయింటింగ్ నేర్చుకుంటూ ఇల్లంతా అలికే కుర్రాడి చేత ‘ఈమాట సం.” అని రాయించి పంపిస్తాను. పోస్టు ఖర్చులు కూడా నావే. ఇంక నోరు మూసుకో అంటున్నారా? చిత్తం.

    గౌరవనీయులైన మిగతా పాఠకులకి: ఈ వ్యాఖ్య ఈమాట ని జెనెరల్‌గా ఉద్దేశించి రాసినది. మిగతావాళ్ళు భుజాలు తడుముకోనవసరం లేదు.

  2. జూన్ 2018 గురించి Madhav అభిప్రాయం:

    06/08/2018 8:58 am

    అమరేంద్రగారూ,

    Before I disagree with you, I need to clarify what I meant.

    నేను తరగతులు, రకాలు, తరహాలు, వంటి పదాల బదులు కులాలు అన్నమాట ప్రత్యేకంగా వాడాను, ఎందుకూ అంటే వివక్షను సూచించడానికి. ఇది జాన్రాల మధ్య ఉండే తేడావంటిది కాదు. ఆంగ్ల సాహిత్యంలో ఎన్నో జాన్రాలున్నాయి. కానీ ఏ ఒక్క జాన్రాకూ వేరేవాటి పట్ల చిన్నచూపు లేదు. వివక్ష లేదు. అప్‌డైక్‌నూ, ఆట్‌వుడ్‌నూ, రాత్‌నూ సమీక్షించిన విమర్శకులే బ్రౌన్‌నూ, గ్రిషమ్‌నూ, క్లాన్సీనీ, కింగ్‌నూ కూడా సమీక్షించారు, అదే గౌరవంతో, అవే పత్రికల్లో, వాటి వాటి పరిథుల్లో. విమర్శకులు ఒక తరహా సాహిత్యం గొప్పదని, ఇంకొకటి తక్కువని సాహిత్యంలో నిమ్నౌన్నత్యవిభజన చేయలేదు. ఆరకమైన విభజన కనీసం ఆంగ్ల సాహిత్యంలో నాకు కనపడలేదు. ఇతర భారతీయ భాషల సాహిత్యం గురించి నాకు అంతగా పరిచయం లేదు కాని, తెలుగులో ఆ వివక్ష స్పష్టంగా కనిపిస్తుంది.

    Popular writing thrives on supporting and supplementing the existing system. Serious writing is a result of disagreement with the existing order.

    This is at best an idealistic notion, at worst a gross generalization. More over, this is a political distinction, not a literary characteristic. నేను అంటున్నది ఇదే. వ్యవస్థను ప్రశ్నించేదే సీరియస్ సాహిత్యం అని అనడంలోనే ఈ వివక్ష ధ్వనిస్తోంది కదా. So, what we have here is a political requirement masquerading as a literary definition. ఈ ధోరణి వల్లనే తెలుగు సాహిత్యంలో ఒకప్పుడు ఉన్న భిన్నత్వం పోయింది అని నేను అభిప్రాయపడింది.

    The problem is not with categorization, it is with value judgement and disregard.

  3. సెలవు మాస్టారూ! గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    06/08/2018 5:17 am

    చాలా బావుంది అండి.

  4. జూన్ 2018 గురించి amarendra dasari అభిప్రాయం:

    06/07/2018 8:42 pm

    మాధవ్ గారు:

    చర్చ కేవలం తెలుగులోనే యెందుకు పాప్యులర్ రచయితలు, సీరియస్ రచయితలు అన్న రెండు కులాలు ఉన్నాయి అన్న విషయం మీద జరిగితే బాగుండేదని ఆశించాను

    Here is my two cents on this very important aspect of literature.

    1. This ‘rendu kulaalu’ is not a unique prerogative of Telugu Sahityam

    2. Popular writing thrives on supporting and supplementing the existing system. Serious writing is a result of disagreement with the existing order.

    3. Popular writing is not just confined to Fiction and so is serious writing. We have ‘You Can Win’ and its Telugu clones.

    4. A discerning reader can make out whether he is with a Dan Brown or Chelam or Khalid Hussaini.

    5. Btw, Somerset Maugham wrote a foreword for one of his works in which he deliberated as to how his pen worked when he wrote for the Gallery and Box-Office and when he wrote for his inner-self . That foreword , in my opinion , clears many basic issues related to Popular-Serious debate. (can somebody help me to locate that Foreword ? I have been trying, but no luck. I wish to translate that into Telugu)

    6. Repeating my own point, this categorization exists in every language, in some form or other.

  5. జూన్ 2018 గురించి Madhav అభిప్రాయం:

    06/07/2018 11:31 am

    (సందిగ్ధంలో ఉన్నాను, ఇలా చర్చ జరుగుతున్న సమయంలో నేను కామెంట్ పెట్టచ్చా? సాటి ఎడిటర్లేమనుకుంటారు? నేనుగా పెట్టాలా, ఎడిటర్‌గా పెట్టాలా? ఏ హ్యాట్ పెట్టుకోవాలి? అసలు పెట్టుకోవాలా? ఆ తేడా ఎవరైనా కనీసం గమనిస్తారా? అయినా సరే, ఒక రెండు ముక్కలు చెప్పకుండా ఉండలేక ఈ కామెంట్ రాస్తున్నాను. ఒకసారి పోస్ట్ చేసినాక దాన్ని ఏం చేస్తారో సంపాదకుల ఇష్టం. నేనైనా వారి నిర్ణయానికి కట్టుబడి ఉండవల్సిందే మరి.)

    1. రామారావు గారూ, మీ సూచనలు ఎప్పుడూ విలువైనవే. మీకు కృతజ్ఞతలు. రెండు విషయాలు.

    ఒకటి – I do not see any ‘escalation’ either from Lyla or from the editors. Initially the voices registered a slightly higher note, but then toned down. Looking at the published commentary, it appears to me that the problem here lies not with the decision but the execution of which, could have been a tad better. రచయితలకు, పాఠకులకు ఉన్నంత వాక్‌స్వేచ్ఛ సంపాదకులకు, నిర్వాహకులకు ఉండదు. వారికి నిగ్రహం మరింత అవసరం.

    రెండు – [Editor hat ON]ఈమాట రెగ్యులర్‌గా చదివే మీరు కూడానూ ఎవరి “మనోభావాలు దెబ్బతింటాయనో” సంపాదకులు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అనడం/అనుకోడం నిజంగా ఆశ్చర్యం. ఆమాట ఈమాట గురించి ఏనోటా వినలేదు ఇన్నేళ్ళలో నేను. పైపెచ్చు “మనోభావాలు” గాయపరుస్తున్నామని మమ్మల్ని తిట్టేవారే ఎక్కువ. That was, is and will be never our concern, but the standards and the etiquette of eemaata are. At times we err in our judgement. We learn from it and go on. కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం. Our only job is to do our job the best we can.

    2. ఈమధ్యనే ఒక స్నేహితునితో అన్నాను అతని రచన గురించిన ప్రస్తావనలో. “మాకు రచన ముఖ్యం, రచయిత ఎవరు అన్నది అనవసరం. మామెక్కడైనా మామే కాని మొక్కజొన్న చేనుకాడ కాదని తెలుగులో ఒక మొరటు సామెత ఉంది. మాకూ అలానే ఈమాట దగ్గర అందరూ పరాయివారే”, అని. ప్రత్యక్షానుభవంతో చెప్తున్నాను – సంపాదకులు కేవలం వారి రచనల నాణ్యత మాత్రమే పరిశీలిస్తూ (చాతయినంతగానే అనుకోండి), వారి మనోభావాలకు, అహంభావాలకు, స్థాయీపరపతులకు విలువనివ్వనందువల్లే ఈమాటకు తమ రచనలు పంపని రచయితలు ఉన్నారు. అదే సమయంలో, ఆ ప్రొఫెషనాలిటీ, సాహిత్యం పట్ల గౌరవం శ్రద్ధాసక్తులు ఆశించి, పొందినందువల్ల తమ రచనలు మొదటగా ఈమాటకే పంపే రచయితలూ ఉన్నారు. నాణేనికి ఒకేవైపు ఎలా ఉండదో అలానే విమర్శ లేకుండా సాహిత్యం ఉండదు. రచయిత నుంచి వచ్చినది వచ్చినట్టు ప్రచురించగల స్థాయి ఏ కొద్ది రచనలకో ఉంటుందేమో. మొదట్లో మా విమర్శ తీసుకోలేకపోయినా, మా పరిష్కరణలను సందేహించినా, ఒకసారి మాతో కలిసి పని చేసినాక, ఈమాటపై తమ అభిప్రాయాలను పూర్తిగా మార్చుకున్న రచయితలూ ఉన్నారు. ఇంకా మా పద్ధతుల పట్ల అపోహల్లోనే ఉన్న రచయితలూ ఉన్నారు. It is a diverse world out there. అందువల్ల, ఇక్కడ పారేది పన్నీరా మురికినీరా అనేది ఎవరి దృక్పథం బట్టి వారు నిర్ణయించుకునేది. [Editor hat OFF]

    3. ఇకపోతే, I have known Lyla well and her wickedly sharp wit very well. I am sure, if their tone offended Lyla, she would have openly said so and the editors too would have offered her an unconditional apology. More importantly, what struck me here is the maturity and decorum she has shown. “సాహిత్యం మీదే ఆసక్తి. ఈ లోపల ఈ పత్రికలో వేరే ఆర్టికల్స్ చదువుతూనే ఉంటాను. వాటి మీద అభిప్రాయాలు ఈ మేగజీన్ లో రాస్తూనే ఉంటాను. ఎప్పటి మాదిరే. కొన్నేళ్లుగా ఈ పత్రికలో నేను రచన చేస్తూనే ఉన్నాగా. ఈ ఒక్క కామెంట్ మీద ఎక్కువ తక్కువ ఇంట్రస్ట్ ఏమీలేదు.” She didn’t take this episode personally. తన “మనోభావాలు” గాయపరచుకోలేదు.

    తెలుగులో రచయితలు ఈ పరిణితిలో కనీసం సగమైనా కలిగివుంటే ఎంత బాగుండునోనని నేను కలగన్నదీ నిజం! అలాగే, ఇక్కడ కొన్ని వ్యాఖ్యలలో కనిపించిన సృజనాత్మకత చూసి కొంత ముచ్చట పడి, అది కథల్లోనూ కవితల్లోనూ కూడా కనిపిస్తే ఎంత బాగుండునోనని నేను అనుకున్నదీ నిజం!

    4. చర్చ ఆ ముందుమాట మీద – కేవలం తెలుగులోనే ఎందుకు పాప్యులర్ రచయితలు, సీరియస్ రచయితలు అని రెండు కులాలు ఉన్నాయి అన్న విషయం మీద – జరిగి ఉంటే బాగుండేదని ఆశించాను. కాని, పక్కదారి పట్టింది. నెట్ స్వభావమే అంత. Personally I think it’s time for us to move on. (నేను చెప్పదలచుకున్న రెండు ముక్కలూ చెప్పేశాను కాబట్టి!)

    I hope I did not disappoint any one with my uncharacteristic humility!

    Regards
    మాధవ్

  6. జూన్ 2018 గురించి రాధిక అభిప్రాయం:

    06/07/2018 11:30 am

    ఈమాట సంపాదకులకు:
    ఇంతకు మునుపు వ్రాసిన నా అభిప్రాయంలో నా భయానికి కారణాన్ని (వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనన్నది నన్ను భయపెట్టిన విషయమని) నేను స్పష్టంగా వ్రాశాను.

    అటువంటి భయం అర్థరహితం కాదనీ, అన్ని అభిప్రాయాల విషయంలో సంపాదకులు ఒకేరకంగా వ్యవహరించడం లేదనీ ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమయింది.

    “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచనని పాటించకుండా వ్రాసిన ఒక వ్యాఖ్యని – అది కూడా హుందాగా కాక అపహాస్యం చేస్తూ వ్రాసిన వ్యాఖ్యని – ప్రచురించడం ద్వారా మీరు ఆ విషయాన్ని స్పష్టం చేశారు.

    అది అపహాస్యం కాదు కవిత్వం అనుకునేందుకు కూడా ఇపుడు అవకాశం లేదు. “మీ అభిప్రాయాలను కవితలుగా, ఆలాపనలుగా, కథానికలుగా రాయకండి. మీ సృజనకు అభిప్రాయాల పెట్టె వేదిక కాదు.” అన్న మీ కొత్త నిబంధనను అంగీకరిస్తూ వ్రాసినందువలన ఆ అభిప్రాయాన్ని సూటిగా చేసిన అవమానంగానే తీసుకుంటున్నాను.

    ఇలా అవమానింపబడినందుకు బాధపడుతూ ఇకపై ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నాను.
    అభినందనలు!

    [క్షమించాలి. అది కేవలం సరదాగా అన్న మాట అని, “సాటి పాఠకులను నేరుగా సంబోధిస్తూ రాయకండి.” అన్న సూచన ఉన్నప్పటికీ, కొన్నిసార్లు పాఠకుల మధ్య చర్చలో లైట్ బ్యాంటర్ వల్ల లాభమే కాని నష్టం లేదని అనుకోవడం చేత, ఆ వ్యాఖ్యలో మాకేమీ మీ పట్ల అవమానం కనిపించకపోవడం వల్లనే, ఆ వ్యాఖ్య ప్రచురించాం. -సం.]

  7. జూన్ 2018 గురించి రాధిక అభిప్రాయం:

    06/07/2018 10:25 am

    “పాఠకులకు సూచనలు” లో రెండో అంశాన్ని కొందరు పాఠకులు పాటిస్తున్నట్లు లేదు! ఆ విషయాన్ని సంపాదకులు పట్టించుకుంటున్నట్లూ లేదు!!

  8. జూన్ 2018 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    06/07/2018 9:58 am

    >> ‘అదిలింపు స్వరం’, ‘నాకయితే నిజంగానే భయం వేసింది’

    ఆంజనేయ దండకం రాదాండి మీకు? గూగిల్లో ఉచితంగానే దొరుకుతుంది 🙂

  9. జూన్ 2018 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    06/07/2018 3:16 am

    ‘అదిలింపు స్వరం’, ‘నాకయితే నిజంగానే భయం వేసింది’ said Radhika garu. A very very valuable feedback !!

  10. జూన్ 2018 గురించి రాధిక అభిప్రాయం:

    06/06/2018 9:02 pm

    కేవీయస్ రామారావుగారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
    వ్యాఖ్యని మార్చడం వలన అర్థం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది.
    “కొందరు సప్లైదారు రచయితలు- వారి అభిమాన సాహితీవేత్తల చావుకు ముందే” – ఈ పేరాకి ముందు లైలా గారు బహుశా ఈ సంచికలోని రచనల నుండి కొంత పక్కకి వెళ్ళి ఇటువంటి వాటిపై సాధారణంగా తనకి ఉన్న అభిప్రాయాన్ని కవితారూపంలో వెల్లడించి ఉంటారనుకుంటున్నాను.
    ( పాఠకుల అభిప్రాయాలు రచనకు ప్రత్యక్షంగా సంబంధించి ఉండాలన్న నిబంధన ఉన్నది నిజమే కానీ ఇక్కడ ఈ అభిప్రాయం ఒక రచన గురించి కాదు కనుక, సంపాదకీయం గురించీ పత్రిక గురించీ కనుక ఇక్కడ అది పొసగుతుందని నా ఉద్దేశ్యం)
    సంపాదకులు ఆ భాగాన్ని తీసివేసి ప్రచురించడం వలన పైన పేర్కొన్న పేరాలోని మాటలు నేరుగా ఈ సంచికలోని రచయితలను ఉద్దేశించి అన్నట్లుగా తోచే అవకాశం వుంది. అలా ఉండకూడదనే బహుశా ఆవిడ ఆ విషయాన్ని కవితలా వ్రాసి ఉంటారు (ఒక మర్యాదని పాటించదలచి).
    దానిని తీసివేయడం ద్వారా, ఆవిడ ఆ విషయాన్ని పదే పదే చెప్తున్నా అదలింపు స్వరంతో జవాబివ్వడం ద్వారా – సంపాదకులు పాఠకులను భయపెడుతున్నారనిపించింది. నాకయితే నిజంగానే భయం వేసింది, వ్రాసినదానిని “మార్చి” ప్రచురించే అవకాశాన్ని సంపాదకులు ఎలా ఉపయోగించుకుంటారో తెలియనపుడు ఏమి వ్రాస్తే ఏమవుతుందోనని. అందుకే ఇప్పటివరకూ వ్యాఖ్య వ్రాసేందుకు సందేహించాను కానీ చూస్తూ ఊరుకోలేక ఇప్పుడు సాహసించాను. 🙂