చెట్టు అందాన్ని అక్షరం లో పట్టుకోగలగటం అంత తేలిక కాదు. అలాంటిది ఆ అందాన్ని సునాయాసంగా అంతే అందంగా కవిత్వం చేసేరు. చదువుతూంటే మనసుకి కూడా ఆ రంగు అంటింది సుమా. హాయిగా అనిపించింది. బాగా రాస్తున్నారు. కంగ్రాట్స్. మరిన్ని రంగుల్ని మీ ఊహ ప్రతిఫలించాలని …
జయప్రభ
note for babjeelu; బాబ్జీలుగారు రామలింగని అవతరమా మీది?? మీ ధోరణి నాకు బాగా నచ్చింది, అభిప్రాయాలు చెప్పటంలో. ఎన్‌జాయ్ చేస్తున్నాను వాటిని చదువుతూ. — జయప్రభ.
వేలూరి గారికి,
నమస్కారం. మీ వ్యాసం శీర్షిక కూ మీరు రాసినదానికీ పొంతన లేదు.
మీరు మీ తాతగారి తెలుగే మాటాడేరా?
శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి సమయం లోనే పానకం “పుచ్చుకోడం” “తాగడం” గురించి ఒక మామూలు రైతు “వాయించీసేడు”.
మా నాన్నమ్మ “ఈకా బరాబర్” అనేది. కన్యాశుల్కం లోని “బేహద్బీ” తరవాత “ఇలాకా” వగైరాలు తెలుగే? “వగైరా” సంగతి తేల్చండిముందు.
భాష “ప్రవాహోదకం”. “ప్రవాహోదకం ప్రశస్తం” కదా?
మీరు రాసిన “బ్యాంకు” కాగితం పూర్తి చెయ్యలేకపోవడం మీ లోపవే.
(అనునాసికాస్వరములెట్లు వ్రాయవలెనో “యూనికోడ్” తెల్పలేదు)
“ఈ మాట” లో మృణాలిని గారి వుపన్యాసం లో కూడా ఒకరు అడిగేరు “హౌఅర్యూ అండీ” లాటి తెలుగు గురించి.
మన “టైములో” మనం సరయిన తెలుగులో మాటాడేవా? అంటే అప్పటికి వాడుకలో వున్న భాష లేదా మన తాతల నాటి భాష.
మనం మన తాతల నాటి భాష మాటాడలేదు, మన తరవాత వాళ్ళు మన భాష ఎందుకు మాటాడాలి?
మారుతున్న కాలంతో పాటు మారని “సంస్కృతం” చచ్చిపోయింది. “పాలీ” చచ్చిపోయింది.
మారుతున్న కాలంతో పాటూ మారితే తెలుగు బతికే వుంటుంది.
మరొహటి, “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” లాటి వి మీ వ్యాసాల్లో రాయకండి. కృతకంగా వుంటాయి. తెలుగు “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” గా ప్రపంచ ప్రఖ్యాతి పోందలేదు.
వైదేహీ శశిధర్ గారూ,
“ఆమె చెక్కిలి మీద హేలగా విరిసిన చంద్రవంకని” చూసిన వారు,
“సంధ్య ఎరుపులో నా పారాణి మెరుపును మేళవిస్తూ” ఎలా చిత్రిద్దామని ప్రయత్నం చేయగలరు?
“…నా పారాణి..” నా పారాణి కాదా? ఆ పారాణా?
సమన్వయం అంటారు కాబోలు కొడవళ్ళ వారి లాటి విజ్ఞులు, అది కుదరిందా?
ఇది వదిలేయండి. మీ కవిత చాలా “సింపుల్” గా వుంటూనే చిక్కగా వుంటుంది.
“చిక్కని మజ్జిగ” లాగ. మా అదృష్టం.
మీ అభిప్రాయం చెప్పినందుకు సంతోషం!
“ఇలపావులూరి” వారబ్బాయి మీ అభిప్రాయం చదివి, మీ కోరికను తీరుస్తారని అనుకుంటాను.
ఈ మధ్య “ఈమాట” లో పలురకాల విషయాలపై మీ అభిస్థాయాలను బట్టి, మీకు చాలా లోతైన విషయ పరిజ్ఞానం, అవగాహన ఉన్నట్టు తోస్తోంది.
మీకు ఒక స్నేహపూర్వకమైన ఆహ్వానంతో కూడిన సవాల్!
మీరే రాబోయే “ఈమాట” సంచికల కోసం చక్కని మీ రచనల్ని అందించండి.
సంపాదకుల మూస పద్ధతి గురించి:
“ఈమాట” ప్రారంభించిన నాటి నుంచి కొన్ని ఏళ్ళు వరకు, అప్పటి సంపాదకులుగా మంచి రచనను పాఠకులకు అందించడానికి మేం కొన్ని తంటాలు పడ్డాం! కొందర్ని ప్రాధేయపూర్వకంగా రచనలు చేయమని కోరాం. మరి కొందర్ని, మీకు చేసినట్టే సవాల్ చేసి రాయించాం. మరికొందర్ని ప్రోత్సహించటం కోసం మేమే రచన ఏ విషయం పై రాస్తే బాగుంటుందో సూచించి రాయించాం! అప్పుడప్పుడు “ఈమాట” కోసం మేమే చెయ్యిచేసుకున్నాం! అందు వల్ల కొన్ని రచనలు అందరికీ నచ్చకపోవచ్చు.
ఇప్పటి సంపాదక వర్గం, “ఈమాట” ను మరింత బాగా తీర్చిదిద్దారు అనటంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. అందుకు నిదర్శనం, ఇప్పటి రచనల్లోని వైవిధ్యం, రచనల ఉన్నతస్థాయి. పెరిగిన పాఠకుల సంఖ్య, ఆదరణ.
తెలుగులో రచనలు చేసే వాళ్ళు తక్కువ. అందులో “మంచి” రచనలు చేసే వాళ్ళు మరీ తక్కువ. అయినప్పటికీ, “ఈమాట” ఇంతమంది ఉత్తమ రచయితలని – అభిరుచి, సహృదయత ఉన్న పాఠకులని ఆకర్షిస్తోంది అంటే….
పెద్దలకు ఒక విన్నపం. ఈమాటలో రచనలు, ఆ రచనలపై వ్యాఖ్యానాలు ఇలా పంపినవారికి ఆయా ఇమెయిల్ చిరునామాకు ఆ తర్వాతి స్పందనలు తెలియజేసే ప్రక్రియను ప్రారంభించ మనవి.
[రాజేంద్ర కుమార్ గారు: మీ సూచనకి కృతజ్ఞతలు. మేము రచనలని, వాటిపై వచ్చిన అభిప్రాయాలని ఎప్పటికప్పుడు పాఠకులకి ఈమెయిల్ (Server Push) చేయడం కన్నా, పాఠకులు వాటిని RSS Feed (ఈమాట రచనల ఫీడు, ఈమాట అభిప్రాయాల ఫీడు) ద్వారా తమకి వీలైనప్పుడు చదువుకోవడం (Client Pull) మెయిన్టెనెన్సు కారణాల దృష్ట్యా సులభం. (అంతే కాక, అభిప్రాయాలు రాసిన ప్రతివారి ఈమెయిలు అడ్రస్‌నీ validate చెయ్యడం సాధ్యం కాదు.) పాఠకుల సౌకర్యం కోసం అభిప్రాయాల ఫీడులో 25 అభిప్రాయాలు చూపిస్తున్నాము. భవిష్యత్తులో మరికొంతమంది పాఠకులు కోరితే ఈ సూచనని పరిశీలించగలము. — పద్మ, ఈమాట సంపాదక వర్గం]
నేను గత కొంత కాలంగా ఈమాట చదువుతున్నాను. ముఖ్యంగా కొందరి కవితలు ఎంతగానో ఆకట్టుకుంటున్నయి. ఉదా: వైదేహి శశిధర్ గారివి చాలా చాలా ఇష్టము.
ఆయితే, నాకూ ఈమాటలో సభ్యుడినయ్యి నావీ కొన్ని కవితలు పంపాలని ఉంది. చాలా సార్లు యెలా పంపాలని అడిగాను. ప్రవాసాంధ్రులకే ఈ ఈమాట ప్రత్యేక మైతే సరే. అదే తెలియజేయండి. అదీ సంతొషమే ఒక పాఠకుడిగానే ఆనందిస్తా.
పింగళి శశిధర్ (జాబిల్లి)
[శశిధర్ గారు: ఈమాట ఎల్లలులేని ప్రపంచ పత్రిక. మీ రచనలకి ఆహ్వానం. దయచేసి రచయితలకి సూచనల పేజీ చూడండి. మీ రచనలని ఈ పేజీ క్రింద ఉన్న ఈమెయిల్ అడ్రస్‌కు మెయిల్ చెయ్యవచ్చు. అన్ని రచనలూ సమీక్షించబడతాయని గమనించగలరు. మీ నించి మంచి రచనలకై ఎదురు చూస్తాము.
— ఈమాట సంపాదక వర్గం]
ఈమాట కొత్త వేషం గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
08/02/2008 4:07 am
ధన్యవాదాలు పద్మ గారు 🙂
గుల్మొహర్ గురించి jayaprabha అభిప్రాయం:
08/01/2008 10:52 am
డియర్ వైదేహి,
చెట్టు అందాన్ని అక్షరం లో పట్టుకోగలగటం అంత తేలిక కాదు. అలాంటిది ఆ అందాన్ని సునాయాసంగా అంతే అందంగా కవిత్వం చేసేరు. చదువుతూంటే మనసుకి కూడా ఆ రంగు అంటింది సుమా. హాయిగా అనిపించింది. బాగా రాస్తున్నారు. కంగ్రాట్స్. మరిన్ని రంగుల్ని మీ ఊహ ప్రతిఫలించాలని …
జయప్రభ
note for babjeelu; బాబ్జీలుగారు రామలింగని అవతరమా మీది?? మీ ధోరణి నాకు బాగా నచ్చింది, అభిప్రాయాలు చెప్పటంలో. ఎన్‌జాయ్ చేస్తున్నాను వాటిని చదువుతూ. — జయప్రభ.
తెలుగు భాషకి భవిష్యత్తులేదా? గురించి baabjeelu అభిప్రాయం:
08/01/2008 8:08 am
వేలూరి గారికి,
నమస్కారం. మీ వ్యాసం శీర్షిక కూ మీరు రాసినదానికీ పొంతన లేదు.
మీరు మీ తాతగారి తెలుగే మాటాడేరా?
శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి సమయం లోనే పానకం “పుచ్చుకోడం” “తాగడం” గురించి ఒక మామూలు రైతు “వాయించీసేడు”.
మా నాన్నమ్మ “ఈకా బరాబర్” అనేది. కన్యాశుల్కం లోని “బేహద్బీ” తరవాత “ఇలాకా” వగైరాలు తెలుగే? “వగైరా” సంగతి తేల్చండిముందు.
భాష “ప్రవాహోదకం”. “ప్రవాహోదకం ప్రశస్తం” కదా?
మీరు రాసిన “బ్యాంకు” కాగితం పూర్తి చెయ్యలేకపోవడం మీ లోపవే.
(అనునాసికాస్వరములెట్లు వ్రాయవలెనో “యూనికోడ్” తెల్పలేదు)
“ఈ మాట” లో మృణాలిని గారి వుపన్యాసం లో కూడా ఒకరు అడిగేరు “హౌఅర్యూ అండీ” లాటి తెలుగు గురించి.
మన “టైములో” మనం సరయిన తెలుగులో మాటాడేవా? అంటే అప్పటికి వాడుకలో వున్న భాష లేదా మన తాతల నాటి భాష.
మనం మన తాతల నాటి భాష మాటాడలేదు, మన తరవాత వాళ్ళు మన భాష ఎందుకు మాటాడాలి?
మారుతున్న కాలంతో పాటు మారని “సంస్కృతం” చచ్చిపోయింది. “పాలీ” చచ్చిపోయింది.
మారుతున్న కాలంతో పాటూ మారితే తెలుగు బతికే వుంటుంది.
మరొహటి, “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” లాటి వి మీ వ్యాసాల్లో రాయకండి. కృతకంగా వుంటాయి. తెలుగు “ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” గా ప్రపంచ ప్రఖ్యాతి పోందలేదు.
రంగులప్రవాహం గురించి baabjeelu అభిప్రాయం:
08/01/2008 7:02 am
వైదేహీ శశిధర్ గారూ,
“ఆమె చెక్కిలి మీద హేలగా విరిసిన చంద్రవంకని” చూసిన వారు,
“సంధ్య ఎరుపులో నా పారాణి మెరుపును మేళవిస్తూ” ఎలా చిత్రిద్దామని ప్రయత్నం చేయగలరు?
“…నా పారాణి..” నా పారాణి కాదా? ఆ పారాణా?
సమన్వయం అంటారు కాబోలు కొడవళ్ళ వారి లాటి విజ్ఞులు, అది కుదరిందా?
ఇది వదిలేయండి. మీ కవిత చాలా “సింపుల్” గా వుంటూనే చిక్కగా వుంటుంది.
“చిక్కని మజ్జిగ” లాగ. మా అదృష్టం.
తెలుగు సినిమా పాట గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
08/01/2008 5:53 am
బాబ్జీలు గారూ:
మీ అభిప్రాయం చెప్పినందుకు సంతోషం!
“ఇలపావులూరి” వారబ్బాయి మీ అభిప్రాయం చదివి, మీ కోరికను తీరుస్తారని అనుకుంటాను.
ఈ మధ్య “ఈమాట” లో పలురకాల విషయాలపై మీ అభిస్థాయాలను బట్టి, మీకు చాలా లోతైన విషయ పరిజ్ఞానం, అవగాహన ఉన్నట్టు తోస్తోంది.
మీకు ఒక స్నేహపూర్వకమైన ఆహ్వానంతో కూడిన సవాల్!
మీరే రాబోయే “ఈమాట” సంచికల కోసం చక్కని మీ రచనల్ని అందించండి.
సంపాదకుల మూస పద్ధతి గురించి:
“ఈమాట” ప్రారంభించిన నాటి నుంచి కొన్ని ఏళ్ళు వరకు, అప్పటి సంపాదకులుగా మంచి రచనను పాఠకులకు అందించడానికి మేం కొన్ని తంటాలు పడ్డాం! కొందర్ని ప్రాధేయపూర్వకంగా రచనలు చేయమని కోరాం. మరి కొందర్ని, మీకు చేసినట్టే సవాల్ చేసి రాయించాం. మరికొందర్ని ప్రోత్సహించటం కోసం మేమే రచన ఏ విషయం పై రాస్తే బాగుంటుందో సూచించి రాయించాం! అప్పుడప్పుడు “ఈమాట” కోసం మేమే చెయ్యిచేసుకున్నాం! అందు వల్ల కొన్ని రచనలు అందరికీ నచ్చకపోవచ్చు.
ఇప్పటి సంపాదక వర్గం, “ఈమాట” ను మరింత బాగా తీర్చిదిద్దారు అనటంలో నాకు ఏమాత్రం సందేహం లేదు. అందుకు నిదర్శనం, ఇప్పటి రచనల్లోని వైవిధ్యం, రచనల ఉన్నతస్థాయి. పెరిగిన పాఠకుల సంఖ్య, ఆదరణ.
తెలుగులో రచనలు చేసే వాళ్ళు తక్కువ. అందులో “మంచి” రచనలు చేసే వాళ్ళు మరీ తక్కువ. అయినప్పటికీ, “ఈమాట” ఇంతమంది ఉత్తమ రచయితలని – అభిరుచి, సహృదయత ఉన్న పాఠకులని ఆకర్షిస్తోంది అంటే….
మీ,
విష్ణుభొట్ల లక్ష్మన్న
ఈమాట కొత్త వేషం గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
07/31/2008 9:35 pm
పెద్దలకు ఒక విన్నపం. ఈమాటలో రచనలు, ఆ రచనలపై వ్యాఖ్యానాలు ఇలా పంపినవారికి ఆయా ఇమెయిల్ చిరునామాకు ఆ తర్వాతి స్పందనలు తెలియజేసే ప్రక్రియను ప్రారంభించ మనవి.
[రాజేంద్ర కుమార్ గారు: మీ సూచనకి కృతజ్ఞతలు. మేము రచనలని, వాటిపై వచ్చిన అభిప్రాయాలని ఎప్పటికప్పుడు పాఠకులకి ఈమెయిల్ (Server Push) చేయడం కన్నా, పాఠకులు వాటిని RSS Feed (ఈమాట రచనల ఫీడు, ఈమాట అభిప్రాయాల ఫీడు) ద్వారా తమకి వీలైనప్పుడు చదువుకోవడం (Client Pull) మెయిన్టెనెన్సు కారణాల దృష్ట్యా సులభం. (అంతే కాక, అభిప్రాయాలు రాసిన ప్రతివారి ఈమెయిలు అడ్రస్‌నీ validate చెయ్యడం సాధ్యం కాదు.) పాఠకుల సౌకర్యం కోసం అభిప్రాయాల ఫీడులో 25 అభిప్రాయాలు చూపిస్తున్నాము. భవిష్యత్తులో మరికొంతమంది పాఠకులు కోరితే ఈ సూచనని పరిశీలించగలము. — పద్మ, ఈమాట సంపాదక వర్గం]
తెలుగు సినిమా పాట గురించి baabjeelu అభిప్రాయం:
07/31/2008 4:45 am
లక్ష్మన్నగారూ,
తెలుగు సినిమా పాట గురించి రాయండి అని మీరు అడిగుంటారు “ఇలపావులూరి” వారబ్బాయి “ప్రైమరీ” కుర్రాళ్ళకి రాసిన రామాయణవో భారతవో రాసినట్టు రాసేరు.
ఒకొక్కరి గురించి రాయమని మళ్ళీ అడగండి దయచేసి. బోల్డు మంచి వ్యాసాలు.
లేకపోతే సీతారామశాస్త్రిని వదిలేసి తరవాతి కవుల మంచి పాటల గురించి రాయమనండి. సంపాదకులు మూసపధ్ధతిలో వుండకూడదుకదా?
తెలుగదేమిటనిన… కాదు… తెలుగదెందుకనగ… గురించి pingali sasidhar అభిప్రాయం:
07/31/2008 1:55 am
నేను గత కొంత కాలంగా ఈమాట చదువుతున్నాను. ముఖ్యంగా కొందరి కవితలు ఎంతగానో ఆకట్టుకుంటున్నయి. ఉదా: వైదేహి శశిధర్ గారివి చాలా చాలా ఇష్టము.
ఆయితే, నాకూ ఈమాటలో సభ్యుడినయ్యి నావీ కొన్ని కవితలు పంపాలని ఉంది. చాలా సార్లు యెలా పంపాలని అడిగాను. ప్రవాసాంధ్రులకే ఈ ఈమాట ప్రత్యేక మైతే సరే. అదే తెలియజేయండి. అదీ సంతొషమే ఒక పాఠకుడిగానే ఆనందిస్తా.
పింగళి శశిధర్ (జాబిల్లి)
[శశిధర్ గారు: ఈమాట ఎల్లలులేని ప్రపంచ పత్రిక. మీ రచనలకి ఆహ్వానం. దయచేసి రచయితలకి సూచనల పేజీ చూడండి. మీ రచనలని ఈ పేజీ క్రింద ఉన్న ఈమెయిల్ అడ్రస్‌కు మెయిల్ చెయ్యవచ్చు. అన్ని రచనలూ సమీక్షించబడతాయని గమనించగలరు. మీ నించి మంచి రచనలకై ఎదురు చూస్తాము.
— ఈమాట సంపాదక వర్గం]
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి నాగమురళి అభిప్రాయం:
07/30/2008 5:02 am
రాజేంద్ర గారూ, నేనా పుస్తకం చదవలేదండీ. అందులో జ్యోతిష్యం గురించి ఏం రాసారో కొంచెం క్లుప్తంగా వివరించగలరా?
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 3 గురించి రాజేంద్ర కుమార్ దేవరపల్లి అభిప్రాయం:
07/29/2008 9:05 am
మురళీ గారు,మీరు మాస్తి వెంకటేశ అయ్యంగారు రచించగా,అయాచితుల హనుమచ్ఛాస్త్రులు అనువదించిన చిక్కవీరరాజేంద్ర చదివారా?అందులో జ్యోతిష్య చర్చ చాలా ఉంది
🙂