పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. అన్నమయ్య సంకీర్తనలలో గొప్పతనం గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    08/22/2008 8:06 am

    “జో అచ్యుతానంద జోజో ముకుంద
    లాలి పరమానంద లాలి గోవింద”

    అనే ఈ లాలి జోల అన్నమాచార్యుడు రాసింది కాదని ఓ వివాదం ఉంది. ఇదే విషయాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు రాసిన రెండు మూడు వ్యాసాల్లో రాసారు. అలాగే చదివినట్లు గుర్తు. ఈ లాలి పాట చరణాలు ఇలా ఉంటాయి.

    అంగజుని గన్న మాయన్న యిటు రారా
    బంగారు గిన్నెలో బాలు పోసేరా
    దొంగ నీవన సతులు పొంగుచున్నారా
    ముంగిట నాడరా మోహనా కారా || జో ||

    గోవర్థనంబెల్ల గొడుగుగా బట్టి
    కావరమ్ముననున్న కంసు బడగొట్టి
    నీవు మధురా పురము నేల జేపట్టి
    ఠీవితో నేలిన దేవకి పట్టి || జో ||

    అంగుగా దాళ్ళ పాకన్నయ్య చాల
    శృంగార రచనగా జెప్పె నీ జోల
    సంగతిగ సకల సంపదల నీవేళ
    మంగళము తిరుపట్ల మదన గోపాల || జో ||

    ఈ జోల పాట ఆఖరి చరణంలో అన్నమయ్య పేరుంది కానీ తిరుపట్ల మదన గోపాల దేవుని ముద్రతో ఉంది. “తిరు”, వేంకట”, లాంటి ముద్రలేకపోవడం వల్ల ఇది అన్నమయ్య రాసింది కాదేమో నని ప్రభాకర శాస్త్రి గారు ఓ చోట రాసారు.

    పై మూడు చరణాలు కాకుండా, ఇలాంటిదే ఇంకో చరణం తెలుసు.

    అలిగి తృణావర్తు నవని గూల్చితివి
    బలిమిమై బూతన బట్టి పీల్చితివి
    వెలగి శకటాసురుని జేరి డొల్చితివి
    తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి

    ఇందులో ఏది ప్రక్షిప్తమో, ఏది అన్నమయ్య రాసిందో చెప్పలేమని పండితుల అభిప్రాయం. ఈ పాట అన్నమయ్య రాగిరేకుల్లో దొరికిందో లేదో తెలీదు. అన్నమయ్య కీర్తనల పుస్తకాల్లో నాకెక్కడా దొరకలేదు. ఇంతవరకూ ఈ కీర్తన అన్నమయ్యది గానే చెలామణీ అవుతూ వస్తోంది. ఎవరి దగ్గరైనా ఆధారాలుంటే తెలియజేయండి. సంతోషిస్తాను.

  2. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గురించి Ashwin అభిప్రాయం:

    08/22/2008 4:10 am

    Excellent. Did not expect such a love letter. You are right, true love doesn’t need to be expressed, but it shoud be felt by the lover through her heart. Thanks for giving me a chance to read such a unique love letter.

  3. ఈమాట గురించి గురించి jayaprabha అభిప్రాయం:

    08/21/2008 9:18 pm

    శ్రీశ్రీ బాబ్జీలు మహాశయ..

    మీరు బాబ్జీలు గానే రాయండి. భాస్కర్ అని ఈమాట పాఠకులని మరిచిపోనివ్వండి.

    ఇహ అభిప్రాయాలలోని స్పష్టత ముఖ్యం, ఎలాంటి విషయం మీద రాసినా. అది మీలో పుష్కలంగా వుంది. ఇంక మీరు రాయని భాస్కరుడు అన్నది కేవలం pun కోసం మాత్రమే. మీ ప్రవర చెప్పారు. అహంభో అభివాదయేత్ అనీను అనీసేరు. అందరికీ ఇవ్వాల్సిన బిరుదులు కూడా ఇచ్చేసేరు. చలం భాషలో చెప్పాలంటే “మర్యాదస్తులైపోయేరు”.

    వికటం కూడా ఒక సుగుణం. మొహమాట పడకుండా అభిప్రాయాల్ని చెప్పగలగటానికి అది ఒక తరహా తోవ. శ్రీశ్రీలో కూడా బాగా వున్న లక్షణం అది. కించిత్ పొగరు, కాస్తా తిక్క ధిషాణ … అన్నీ వున్నవాడు ఆయన. నేను వికటకవి అవతారమని మిమ్మల్ని అన్నప్పుడు ఇవన్నీ కలుపుకొనే అన్నాను.

    నేను ఈమాట ను చూడటం మొదలు పెట్టింది ఇటీవలే. ముందు చదవటం చేసాను. ఎందుకంటే mainstream పేపర్ల సాహిత్యప్పేజీలు విసుగొచ్చి వాటిని చదవటం మానేసాను. వాటిలో సాహిత్యం కన్నా మిగితావి ఎక్కువ అయిపోతుండటం విషాదం.

    నాకు కంప్యూటర్ మీద రాయటం ఇంకా సరిగ్గా రాకపోయినా మీ కామెంట్లకి మురిసి ఈమాటలో అభిప్రాయాలు చదవటం, రాయటం మొదలు పెట్టాను. నాకు “వులిపికట్టె”ల మీద కాస్త నమ్మకం ఎక్కువ. అంతే సుమా.

    ఇహపోతే, మరోవిషయం. పైటల్ని, చున్నీల్ని తగలపెట్టేయటం లాంటి వాక్యాలతో నన్ను provoke చెయ్యాలని చూసారు. కానీ, మీరు చెప్పినట్టే, మా “చత్రిబాబు” చెప్పినట్టే గొప్పదనం అక్షరంలో వుంటే దాన్ని ఎవరు ఏమన్నా నిలబడుతుంది. ఆ గుణం అందులో లేదా గాలికెగిరి పోతుంది కదా. నాను సెప్పేది అదే!

    మీరు బాబ్జీలు గానే రాయండి. మీ వికటత్వాన్ని నిలుపుకోండి.

    మీరు హైదరాబాద్ అని అన్నారు. రోడ్డు మీద ఎక్కడన్నా నేను కనిపిస్తే ‘చెప్పకపోతే “ఆయమ్మొప్పుకోదు”‘ అనుకొని ఒక “హల్లో” పడేయండి.

    జయప్రభ.

  4. ఛందోధర్మము గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    08/21/2008 11:38 am

    బాబ్జీలు గారూ,

    మోహన రావు గారన్నట్లు “మీరొచ్చాక ఈ మాట క్లిక్ చేయని రోజు” లేదు. వచ్చీ రాగానే మీ కామెంట్ల కోసం చూస్తాను. అవి చదవడం ఇప్పుడోక వ్యసనం లా తయారయ్యింది. నాకూ “రావి శాస్త్రి” రచనలంటే చాలా ఇష్టం. ఆయన “వేతన శర్మ” అని, 1970 ల్లో అనుకుంటా, ఓ కథ రాసారు. అది ఇప్పటికీ వర్తిస్తుంది. ఇదే కథనాధారంగా నేను “చినుకు” అనే నాటకం రాసాను, ఓ నాటకాల పోటీకి. అది విశాఖ పట్నంలో ప్రదర్శించారు. 1984 లో జగదాంబ సెంటర్లో రావిశాస్త్రి గార్ని కలిసాను. దాదాపు పాతికేళ్ళ తరువాత కూడా “అక్షరం పొల్లుపోకుండా” నాకింకా గుర్తున్నాయి ఆయన మాటలు. ఆయన రాతలతో నిమిరిన తెలుగు కథ అజారమరం.
    మీరన్నట్లు “సత్తు” వుంటే కాలం మోస్తుంది. లేకపోతే అది రచయత భుజాల మీద బ్రతుకుతుంది.
    మీ వాక్యాలు పాత జ్ఞాపకాలని తవ్వుతున్నాయి.

  5. ఛందోధర్మము గురించి పామర్తి సత్యనారాయణ అభిప్రాయం:

    08/21/2008 11:17 am

    పైకింకోసారి వెళ్ళి అభిప్రాయాలన్నింటినీ మళ్ళీ చదివాను. ఎక్కడో కుకవులన్న మాట కనపడింది. అంటే ఏమిటబ్బా అని ఆలోచించాను.

    సుకవులు సుక్కలు (stars) కదా. ప్రాస కలవాలంటే కుకవులు కుక్కలవక తప్పదు.

    నాకొద్దు బాబోయ్ ఆ శునక సంబరం.

    కాబట్టి తక్షణ కర్తవ్యంగా

    ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః
    ఏతేషామవిరోధేన పద్య కర్మ సమారభే

    ఛందామావాహయామి, ప్రాసామావాహయామి, యతీమావాహయామి
    యమాతారాజభానసలగమావాహయామి, చంద్రామావాహయామి, సూర్యామావాహయామి, ఇంద్రామావాహయామి, నానావిధాని దివ్యాని గణానామావాహయామి.

    నమో నమః

    పామర్తి కాలభైరవ (సొంత పేరు చెప్పుకుంటే వున్న వూరు అచ్చిరాదు అన్నారు పెద్దలు!)

    తాజా బలపం: గొర్తి వారి హిట్సూ, తిట్సూ ప్రాస బ్రహ్మాండంగా వుంది.

    తాజా తాజా బలపం: దీపావళి మాట దేవుడెరుగు. వినాయక చవితి మంత్రాల్లో కూడా గణాలే వినబడుతున్నాయి నాకు. నమ్మ శక్యం కాక పోతే మీరే చెప్పండి. గణానాంత్వా గణపతి …

    All this is for fun. I love both metrical and non metrical poetry as long as it is good. 🙂

  6. ఛందోధర్మము గురించి baabjeelu అభిప్రాయం:

    08/21/2008 10:24 am

    సాయిగారూ,

    రాసేవాళ్ళకి అర్హత అక్కర్లేదు.

    ఎందుకంటే వాళ్ళు రాసిన దాని “అర్హత” మీద అది బతికితే బతుకుతుంది, లేకపోతేలేదు. రాసినవాళ్ళు “మలబారు పోలీసు గేంగీల్నెట్టి, రాసింది బాగోలేదని రాసిన వాళ్ళందర్నీ సితక్కొంటీచిసినా” దాని అర్హత మారదు.

    రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు “రత్తాలు రాంబాబు” నవల విషయంలో చెప్పింది, రాసే వాళ్ళందరూ ఆచరించదగ్గది.

    “కథ రాసేక, దాన్ని మరింక విడిచి పెట్టక, దాని మానాన్న దాన్ని బతకనివ్వక (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు, దాన్ని సాకుతూ, సంరక్షించుకుంటూ, సమర్థించుకుంటూ, నెత్తిని పెట్టుకొని తిరగడం నాకు ఇష్టం లేదు.

    నిజానికి దగ్గరగా వుంటే కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది, లేకపోతే పోతుంది.

    “రత్తాలు రాంబాబు” నవల గురించి ఏమైనా తెలియాలంటే, అది నవల వల్లే తెలియాలి కాని నా వల్ల కాదు.”

    అందుచేత, రాసిన ప్రక్రియకి అర్హత ఉండాలి, చదివే వాళ్ళందరిచేతా “సెబాస్” అనిపించుకునే అర్హత. చదివే వారికి అర్హత కావాలి. అర్థం చేసుకునే అర్హత. “సెబాస్” అనగలిగే అర్హత. రాసే వాళ్ళకి ఏ అర్హతా అక్కర్లేదు. రాయగలిగే అర్హత తప్ప.

  7. ఛందోధర్మము గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    08/21/2008 9:52 am

    బాబ్జీలు గారు,
    మీరొచ్చాక ఈమాట కి హిట్లూ, రాసే వాళ్ళకి తిట్లూ పెరిగాయి : )-
    మీకు “అర్హత” తో పేచీ – నాకు “ప్రశ్న” లతో పేచీ!

    ప్రశ్నించే వాళ్ళ “అర్హత” తో పేచీ?
    ప్రశ్నించే వాళ్ళ “ప్రశ్నల” తో పేచీ?
    “అర్హత” లేన్నివాళ్ళు మంచి ప్రశ్న వేస్తే పేచీ?
    “అర్హత” వున్న వాళ్ళు ఎలా ప్రశ్నించినా “పేచీ”?
    అసలు ఏ “ప్రశ్నా” లేకపోతే పేచీ!

    చాలా పెద్ద పేచీ.
    ఈ “పేచీ” యే అంతు చిక్కని ప్రశ్న!

    సరదాకి రాసాను – దయచేసి బాణాసంచాలు బయటకి తీయకండి. దీపావళి దగ్గర్లో లేదు 🙂

  8. ఈమాట గురించి గురించి baabjeelu అభిప్రాయం:

    08/21/2008 9:50 am

    క్రుష్ణమోహను గారూ,

    మిమ్మల్నీ, భైరవభట్ల కామేశ్వర రావు గారినీ, రోహిణీప్రసాదు గారినీ, వైదేహీ శశిధర్ గారినీ, పామర్తి వారినీ, రవికిరణ్ గారినీ, మురళి గారినీ, మూలా సుబ్రహ్మణ్యం గారినీ, లక్ష్మన్న గారినీ మీ అందర్నీ మించి ఉదయకళ గారినీ, వగైరాలతో పోలిస్తే మీ పక్కన నిలబడ గలిగే అర్హత లేదు నాకు. అది నాకు తెలుసు. ఎందుకంటే, ఈ అభిప్రాయాలు రాయకముందు “నథింగ్ టు రైట్ అబౌట్”.

    కావాలని మారు పేరుతో అభిప్రాయాల్ని రాయటం లేదు.

    2006లో ఈమాట ని మావగాడు పరిచయం చేసినా పట్టించుకోలేదు. అది నా దురద్రుష్టం. ఈ ఏడాది మళ్ళీ న్యూయార్క్ నుంచి వచ్చి తిట్లుతిట్టి “మీ అభిప్రాయం తెలిచేయండి” ని చూపించేడు, మావ గాడు. వున్న వ్యసనాలని మించి ఈమాట చదవడం, అభిప్రాయాలు రాయడం వ్యసనవైపోయింది.

    నా ప్రవర చెప్పమని “జయప్రభ” గారన్నారు. ఇదీ వరస.

    నా మట్టుకి నేను, నా గురించి “సహస్ర శిరఛ్చేద అపూర్వ చింతామణి” లో దొంగ సన్యాసిననీ, “ఆషాఢభూతి” గురువుగారిననీ, “మందుల భీముడి” మేనల్లుడిననీ, “ముంగేరీలాల్ కె హసీన్ సప్నే” లోని రఘువీర్ యాదవ్ ననీ, “బైరాగినా, అసిరిగాడినా” అన్న సందిగ్ధంలో వున్నవాడిననీ, “సింహాచలాన్నా,అడ్డబుర్రనా” అన్నఅనుమానంలో వున్నవాడిననీ ఖచ్చితంగా నమ్ముతున్నవాడిని. “ధర్మవ్యాధుడిలా” బతకాలని తెలిసికూడా అదెలాగో తెలియనివాణ్ణని అనుకుంటున్నాను.

    “రాయని భాస్కరుణ్ణని” మొదట తెగ ఫీలయిపోయీవాడిని.ఎందుకంటే “క్రుశా” గురించి శ్రీశ్రీ అలా అన్నాడు కాబట్టి. తరవాత తెలిసింది రాయడం “చేతకాని” భాస్కరుణ్ణని.

    నా పేరు భాస్కర్. సివిల్ ఇంజినీర్ని, మూడేళ్ళయి హైద్రాబాదులో వుంటున్నను. అంతకుముందు, దేశం అంతా తిరిగేను. బొంబాయిలో పదకొండేళ్ళు వున్నాను. చదవడం ఎంత వ్యసనం అంటే, బొంబాయి లోకల్ ట్రైన్లో కూడా, క్రిక్కిరిసిన జనం మధ్య కూడా నిలబడి చదివీ వాడిని. ఇది నా “స్ట్రెంగ్త్” అని నా అనుమానం.

    ఈ మాట “ఫార్మాట్” లో వున్న సులువువల్ల తెగించి అభిప్రాయాలు రాసేస్తున్నాను, అంతే.

    ధర్మవ్యాధుడిలాటి కొడవళ్ళ హనుమంతరావు గారిని, మీ అందరితో పాటూ స్మరించకపోవడం నా తప్పు.

  9. ఈమాట గురించి గురించి mOhana అభిప్రాయం:

    08/21/2008 7:52 am

    నమస్తే /\
    ముందంతా ఈమాట అంటే రెండు నెలలకోసారి కొత్త వ్యాసాలను,
    కవితలను, కథలను ఒక నాలుగు రోజులు చదవడం, అప్పుడప్పుడు
    వీలున్నప్పుడు పాత సంచికలను చదవడం వాడుకగా ఉండేది.
    మరి ఇప్పుడో, అదెవరో గాని (వారికి భగవంతుడు నూరు సంవత్సరాల
    ఆయుస్సును ప్రసాదిస్తాడు తప్పక) శ్రీ(మతి) బాబ్జీలుగారి ధర్మమా
    అని ప్రతిరోజూ ఒక్కమారైనా ఈమాటను అభిప్రాయాలకోసం
    చూడాలనే ఆకాంక్ష కలుగుతూ ఉంది. వారి అభిప్రాయాల
    ముత్యాలను ఏ వ్యాసుడైనా ఒక వ్యాస హారంగా నిర్మిస్తే ఎంత
    బాగుంటుందో?
    – మోహన

  10. ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి పాఠకుడు అభిప్రాయం:

    08/21/2008 6:56 am

    బాబ్జీలు గారూ,
    “సిరివెన్నెల” అనేది ఒక బిరుదు. ఆ కవి మొదటి సినిమాని ఆ కవికి బిరుదుగా ఇస్తే, ఆ కవి దాన్ని సంతోషంగా అంగీకరించారు. ఇదంతా ఫార్మల్ గా జరిగిందని కాదు. అలా సహజంగా జరిగిపోయింది. “ఘంటసాల” అనేది బిరుదు అనీ, వ్యాసంలో వున్న విషయాల బట్టి, ఆ పేరు బిరుదుగా వాడారనీ చెప్పలేము. ఒకరి ఇంటిపేరుని బిరుదుగా ఇచ్చే పద్ధతి ఎక్కువగా లేదు. వ్యాసంలో మొదటి పేరాలోనే వ్యాసకర్త తన వుద్దేశ్యం చక్కగా చెప్పారు. ఘంటసాల వారసుడు బాలసుబ్రహ్మణ్యం అని వ్యాసకర్త ఎక్కడా అన్న దాఖలాలు లేవు. కామా లేకపోవడం ప్రింటింగు మిస్టేకేమోనని కూడా అనుకున్నాను. కాదని మీరంతా అంటున్నారు. ఘంటసాల వారసుడిగా కాకుండా, బాలసుబ్రహ్మణ్యం తన ప్రతిభతోనే పైకి వచ్చారని వ్యాసకర్త అన్నారు.
    ఈ నేపథ్యంలో వ్యాసకర్త వుద్దేశ్యం అర్థం కాక, ప్రశ్నించాను. కొంతమందిని ఇంటిపేరుతో సంబోధిస్తారు. ఎక్కువమందిని అసలు పేరుతో సంబోధిస్తారు. వ్యాసంలో రాసిన విషయాలకీ, వ్యాసానికి ఇచ్చిన టైటిల్ కీ పొత్తు కుదరలేదనే అనుకుంటున్నాను.

    పాఠకుడు