పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. తెలుగు సినిమాలు స్త్రీ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/28/2008 2:24 pm

    గురివింద గింజ, చక్కెర గుళిక

    జె. యు. బి. వి. ప్రసాద్ గారు చేరా ని ఇప్పుడు తప్పు పడుతున్నారు కాని రంగనాయకమ్మ “ఇదంతా డిగ్రీల అహంకారమే!” అని చేరా ని ఘాటుగా విమర్శించింది. ఎప్పుడు? 1991 లో. ఇన్నేళ్ళ తర్వాత గూడా చేరా తను ఒకప్పుడు చేసిన తప్పును ఇతరులు చెయ్యొద్దని చెప్పకూడదు! ప్రసాద్ గారి ప్రపంచంలో చేరా కి నిష్కృతి లేదు.

    “ఇది ఎలా ఉంటుందంటే,” అంటూ మనకి సులభంగా బోధపడటానికన్నట్లు కుటుంబరావుని లాక్కొచ్చారు. చేరా అన్న దానికీ కొకు అన్న దానికీ ఏమిటి లంకె? రంగనాయకమ్మని వేర్వేరు సందర్భాల్లో విమర్శించడం తప్ప.

    విషవృక్షానికి సమీక్ష రాస్తూ (1974-75) కుటుంబరావు సోషల్ ఆంత్రోపాలజీ అధ్యయనం చెయ్యడానికి వాల్మీకి రామాయణం సరయిన గ్రంథం కాదన్నాడు. అన్న తర్వాత “ఆశోక వనం” రాయలేదు – ఆకథ 1937లో వచ్చింది. రామాయణంలో ఆర్యులూ అనార్యులూ గురించి, “రామాయణంలో దాగిన నిజం ఫాసిజం,” అని రాసింది 1944లో. “నా కథా రచన” అన్న వ్యాసంలో తను మార్క్సిజం చదివింతర్వాత గాని సంఘం వ్యాధిని అర్థం చేసుకోలేదనీ, ఆపాటి జ్ఞానోదయం కలిగిన తర్వాత రాసిన మొదటి రచన “కులంగాడి అంత్యక్రియలు,” (1945) అన్నారు. కాలానుక్రమాన్ని పాటిస్తూ కుటుంబరావుని విమర్శిస్తే సరిగా ఉంటుంది.

    కుటుంబరావు రాసిన సమీక్షలో కొన్ని విలువైన విషయాలు ఉన్నాయి – ఎపిక్ లక్షణాలు, నాటి ఆచార వ్యవహారాలని నేటి విలువలతో అంచనా కట్టటం. వీటికి రంగనాయకమ్మ దీర్ఘమైన ఘాటైన జవాబే ఇచ్చింది. ఇద్దరు చెప్పినవీ కాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయాలే.

    లోతుగా పోవడానికి ఎవరికి టైముంది? అని నిరాశ పడొద్దు. వాటి సారాంశాన్నంతా, ప్రసాద్ గారు గురువింద గింజంత చక్కెర గుళికగా ఇచ్చారు. మింగి చైతన్యవంతులమవుదాం.

    కొడవళ్ళ హనుమంతరావు

  2. తెలుగు సినిమాలు స్త్రీ గురించి జె. యు. బి. వి. ప్రసాద్ అభిప్రాయం:

    09/27/2008 10:34 am

    చేరా అలా అన్నారా? అచ్చో చ్చొ చ్చొ చ్చొ!

    ఈయనే, ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక చేరాతలో, “కధలూ, నవలలూ రాయటం మీద చాలా అనుభవం ఉన్న ఒక రచయిత్రి వాడుక భాష రాసే పద్ధతి గురించి వ్యాస పరంపర ప్రకటిస్తున్నారు.” అంటూ డొంక తిరుగుడుగా ఒక వ్యాసం రాశారు. అందులో ఆ రచయిత్రి ఎవరో, పేరు ఏమిటో ఎక్కడా లేదు.

    మరిప్పుడు ఇలా అంటున్నారు ఆయన.

    గురివింద గింజ సామెత గుర్తొస్తూ వుంటుంది ఇలాంటివి చదివి నప్పుడు.

    ఇది ఎలా వుంటుందంటే, “రాయాయణం కధ ఏ సామాజిక విషయాల్నీ తెలుగుకోవడానికి పనికి రాదు” అని అన్న కొడవగంటి కుటుంబరావు, “అశోక వనం” అన్న కధ రాసి, ఆ కధ ద్వారా “ఆర్య ద్రావిడ ద్వేషాల్ని గ్రహించడం” చెప్పి, “రామాయణంలో ఆర్యులూ, అనార్యులూ అనే జాతి భేదాలు వున్నట్టు”గా తన వ్యాసాల్లో రాసి, “రామాయణ కధ ఏ సమాజాన్నీ చూపించడానికి పనికి రాదు” అని అనడం లాగా.

    ఇలాంటి విషయాలు ఇక పాఠకుల చైతన్యానికి వదిలెయ్యడమే సరైన పద్ధతి.

    జె. యు. బి. వి. ప్రసాద్

  3. చంద్రోదయం గురించి M S Naidu అభిప్రాయం:

    09/26/2008 11:41 pm

    chandrodayam is as delicate as its coming.
    Thank you.

  4. ఈమాట గురించి గురించి essemCHELLURI అభిప్రాయం:

    09/26/2008 9:19 pm

    మీ పత్రిక పదిమందికి ఉపయోగపడుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

  5. తెలుగు సినిమాలు స్త్రీ గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    09/26/2008 9:00 pm

    సినిమాల గురించి రాయడానికి నాకు కనీస అర్హత గూడా లేదు. అయినా దీంట్లో ఇతరులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉంటుందనే ఆశ. ఇది మంచి వ్యాసం. అయిటే దీంట్లో ఉన్న పెద్ద లోపం – విమర్శించిన సినిమాల పేర్లు మన ఊహకి వదిలెయ్యడం!

    చలసాని ప్రసాద్ “సాహిత్య వ్యాసాలు” కి చేరా ఇచ్చిన కితాబు మొన్ననే చదివాను. చివర్లో చేరా అన్న మాటలు గుర్తొచ్చాయి:
    “కొందరు తెలుగు రచయితల కున్న ఒక జబ్బు ప్రసాదులో కూడా నాకు నచ్చలేదు. విరసం చరిత్ర అనే వ్యాసంలో మొదటి పేరాలో ఒక పత్రిక రాసింది అంటాడు. ఆ పత్రిక పేరు ఎందుకు చెప్పకూడదు? తెరవెనుక కన్యాశుల్కం అనే వ్యాసంలో మొదటే ఒక పారశీక కవి అంటాడు. ఎవరా పారశీక కవి? ఒక వ్యాసంలో పేరు చెప్పకుండా ఒక వార పత్రిక అంటాడు. అదే వ్యాసం చివర కొన్ని ఎలుకలూ, పిల్లులూ అంటాడు. ఎవరీ పిల్లులు, ఎలుకలూ?”

    అర్థంలేని మర్యాదలకీ, ముసుగులో గుద్దులాటలకీ తెలుగు రచయితలు స్వస్తి చెప్పాలి.

    పోయినేడు రచ్చబండలో ఒకరు అడిగారు – దాశరథి రంగాచార్య నవల “చిల్లర దేవుళ్ళు” కి ముందుమాట రాసిన “రహి” ఎవరు? అని. హరిగా “ప్రసిద్ధి” గాంచిన సూరపనేని హరిపురుషోత్తమరావు అన్నారు నవోదయ రామమోహనరావు. ఆపేరు వినడం నాకదే మొదటిసారి. ఆయన రచనల కోసం వెతికితే ఏమీ కనబడలేదు.. ఇంతలో “హరి” చనిపోయారు. “విభిన్న” పేరిట ఆయన రచనలని కొన్నిటిని ఇటివలే పర్స్పెక్టివ్ వాళ్ళు ప్రచురించారు.

    సినిమా, సాహిత్యం ఆయనకి ఇష్టమైన రంగాలు. నాటి రఘుపతి వెంకయ్య మొదలు నేటి రామానాయుడు దాకా, మన సినిమాలలో కథానాయిక పాత్రలో పెద్ద మార్పేమీ లేదు. ఏమిటా పాత్ర అంటే పతివ్రత పాత్ర! “పొందిగ్గా చీరకట్టుకుని, సూర్యబింబం లాంటి బొట్టుపెట్టుకుని, భర్తగారి సేవకూ, అత్తమామల ఊడిగానికీ అంకితమైన ఆదర్శ భారతనారి” కి మించి స్త్రీ కి వేరే వ్యక్తిత్వం ఉన్న పాత్రలు దాదాపు శూన్యం అంటారాయన.

    చివరగా, పోయిన ఆదివారం డెట్రాయిట్ లో జరిగిన సాహితీ సభలో, “నడిచే విజ్ఞానసర్వస్వం” గా పేరున్న పరుచూరి శ్రీనివాస్ మన సినిమా చరిత్ర మీద సాధికారికమైన ప్రసంగమిచ్చారు. కొన్ని PhD లకి సరిపడా ముడిసరుకు పరుచూరి దగ్గరుంది – వాడుకునే వాళ్ళుంటే. 1987 తర్వాత వచ్చిన తెలుగు సినిమాలేవీ చూడలేదన్నారాయన. ఎందుకో మన ఊహకి వదిలేద్దాం.

    కొడవళ్ళ హనుమంతరావు

  6. ఔరంగజేబు తన గురువునకు వ్రాసిన యుత్తరము గురించి baabjeelu అభిప్రాయం:

    09/26/2008 8:14 am

    ఔరంగజేబు సంగతి వొదిలెయ్యొచ్చేమో, కానీ ఆయన చెప్పినవి పెరుగన్నం మూటలు. అర్థం పర్థం లేని విషయాలు పిల్లలకి చెప్పడం. అవి వాళ్ళు కంఠతా పట్టలేదని బాధపడ్డం ఇప్పుడే అనుకుంటున్నాను. అప్పట్లో కూడానా?

    కొమర్రాజు లక్ష్మణరావు గారు పడ్డ బాధ, ఇప్పటికీ వుండడం ఆశ్చర్యం కలిగించీ విషయం.
    ఔరంగజేబు గురువులు, ఈ తరంలో “యూనివెర్సిటీల్లో” కుదురుకున్నారు కాబోలు.
    అయితే, ఈ బాధ పరాయి పాలనలో వున్న దేశాలకి ఎక్కువేమో?
    స్వధర్మో నిధనం శ్రేయః/పరధర్మో భయావహః అన్నది వొప్పుకుందావంటే, కాలంతో పాటూ మారిపోయీ ధర్మాన్ని పట్టుకోడం మామూలు గురువుల తరం కాదు.
    కొమర్రాజు లక్ష్మణరావుగారి పుణ్యవాఁని, ఒకటి ఋజువైపోయింది, పిల్లలు విశ్వనాథ వారి వేయిపడగలూ, శ్రీశ్రీ మహాప్రస్థానం కంఠతా పెట్టినా పనికిరారని తెలిసిపోయింది. మా పిల్లలకి అ ఆ లూ, ఒంట్లూ, వాటికన్నా ముందుగా,”ఎందుకు? ఎక్కడ? ఎలా? ఎప్పుడు?” అని “క్రొశ్నించడం” మాత్రం నేర్పుతాను.

  7. గుప్పెడంత మనసు గురించి essem.chelluru అభిప్రాయం:

    09/25/2008 3:38 am

    చాలా బాగుంది. చాలా అవసరము కూడా.

  8. నాన్నగారు కట్టిన ఇల్లు గురించి vasu M.S.C. అభిప్రాయం:

    09/25/2008 2:34 am

    మీ ఇంటి కథ బాగుంది. ఇల్లు కట్టడము ఎంత గొప్పో చెప్పారు.

  9. తెలుగు సినిమాలు స్త్రీ గురించి murali అభిప్రాయం:

    09/24/2008 9:03 pm

    సినిమాలపై మీ అభిప్రాయం చాలా బాగుంది. మనది హిపోక్రసీ సమాజం. వాస్తవాల టోన్ సినిమాలు తీస్తే చూసేది యెవరు? మీ ఆవేదనాపూరితమైన అభిప్రాయం బాగుంది. – మురళి.

  10. కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా? గురించి baabjeelu అభిప్రాయం:

    09/24/2008 8:59 am

    కొడవళ్ళ వారికి,
    కుటుంబరావుగారి రచనా ప్రపంచం వస్తుందన్న ఆనందం, నిజంగా ఆనందవేఁ.
    మాకందరికీ, ఇవాల్టికికూడా, మమ్మల్ని వుధ్ధరించడానికి, ఆలోచన రేకెత్తించే అక్షరం వస్తోందంటే, ” దేవ దేవ రమ్ము, కావుమయ్య మమ్ము” అని చిన్నప్పుడు చదువుకున్న పెద్దబాలశిక్ష మళ్ళీ చదువుకుంటున్నాం.
    “ఆయన” పుస్తకాలు, outdated అయిపోలేదు. అందుకు కారణం మేవేఁ. మేం మారం గాక మారం. అది మా దగుల్బాజీతనవేఁనని నా నమ్మకం. ఈసారైనా “ఆయన” అక్షరాలు, మాలో కొంతమందినైనా వుధ్ధరించాలని ఆశిస్తున్నాను.
    అయితే, “ఆయన” పేర సభలకీ మిగతావాటికీ తగలెట్టే ధనాన్ని, ఆయొక్క సభలకీ గట్రాలకీ తగలెట్టకుండా, “బోల్డు” పుస్తకాలూ అచ్చేసి, “ప్రెపెంచెం” మీదకొదిలేస్తే, “అ, ఆ” లు నేర్చుకొనేవాళ్ళు, ఆలోచింపచేసే “అ, ఆ” లని నేర్చుకుంటారు.
    అదేకదా “ఆయనకి” కావల్సింది. అదేకదా కాళిదాసుకి మల్లినాధసూరి చేసింది.