కృష్ణమోహన్ గారూ, నమస్తే.
వాడుక భాషలో ప్రస్తుతం ఎవరూ పద్యాలు రాయట్లేదు. విశాలాంధ్ర లో కాగడా పట్టుకుని వెతికినా కనబడరు. బహుశా చేతకాక అయ్యుండొచ్చు.
ఛందస్సు వగైరాల మీద పట్టున్న మీరూ, కామేశ్వర రావు గారూ, ఇంకా మీ లాటి వారు “వాళ్ళూ వీళ్ళూ రాసిన” ఛందోబద్ధమైన పద్యాల గురించి రాస్తూనే, వాడుక భాషలోనో, చిన్నయ సూరి భాషలోనో, ఇంకొ దాంట్లోనో పద్యాలెందుకు రాయరు?
“ఎవరో రాస్తారని, ఏదో చేస్తారని” ఎందుకు ఎదురు చూస్తున్నారు?
ఈ మంచి వ్యాసం చదివాక (ఎవడి గొడవ వాడిది అన్న పద్ధతిలో) నాకు సంగీతంలో దీనికొక పోలిక కనిపించింది. వాడుకభాషను ఛందస్సులో బిగించినట్టే శాస్త్రీయరాగాలను లైట్ మ్యూజిక్ లో ఇమిడించడం. భైరవి, తోడి వగైరా కర్నాటక రాగాలు మరీ గంభీరం. వాటిలో తేలిక ట్యూన్లు చెయ్యడం చాలా కష్టం. అయితే వాటిని ఆ రూపంలో గుర్తుపట్టడం కష్టం. ఉదా. పెండ్యాల చేసిన “నీవుండే దాకొండపై” అనే పాట ఆనందభైరవి అని చప్పున గుర్తుకు రాదు. ఈ కుస్తీతో పోలిస్తే వాడుకభాషలో వృత్తాలు రాయడమే చాలా సులువు!
నాకు తెలుసున్నంత వరకూ త్యాగరాజు తమిళం లో ఒక్క కృతీ రాయలేదు. మొదట్లో కొన్ని సంస్కృత రచనలు చేసినా, సింహ భాగం తెలుగులోనే రాసారు. త్యాగరాజుకి తమిళం ఖచ్చితంగా వచ్చే ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న శిష్యులు చాలామంది తమిళులే ! వారందరికీ తెలుగు వచ్చిందన్న నమ్మకం కలిగిన తరువాతే ఆయన స్వీయ రచనలు నేర్పాడు.
అప్పట్లో తెలుగు, తమిళం రెండూ రాజభాషలుగానే చెలామణీ అయ్యాయి. ముఖ్యంగా సాహిత్యభాషగా తెలుగుకి పెద్ద పీటే వేసారు తంజావూరు రాజులు.
త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు – మోహన
నమస్తే భాస్కర్ గారూ:
మీ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు. కానీ వాడుక భాషలో అల్లిన పద్యాలకు ఆదరణ లభిస్తే చాలామంది ఈ ఉద్యమంలో పాల్గొంటారని నా ఊహ. దేశి ఛందస్సులో (అంటే సీసము, ఆటవెలది, తేటగీతి, ద్విపద లాటి ఛందస్సులో) సామాన్యముగా ఏ పాదానికి ఆ పాదం స్వతంత్రంగా నిలిచి ఉంటుంది. ద్విపదకు ఇది ఒక నియమము కూడా. కంద పద్యాలలో సామాన్యంగా రెండవ పాదాంతములో విరామము ఉంటుంది. ఈ పాదాంత విరామము సంస్కృతమునుండి దిగుమతి చేసికొన్న వృత్తాలలో మాత్రం ఉండదు. కన్నడ తెలుగు భాషలలోని ఒక ప్రత్యేకత ఇది. నాకేమో ఇలా వ్రాస్తే పద్యాలు వచనాలలా ఉంటయని అనుమానం. పండితులు, విమర్శకులు పాదాంత విరామము లేకుడా వ్రాయడం ఒక ఉత్తమ కళ అనీ, అది తెలుగు భాషకు అందాన్ని ఇస్తుందని చెబుతారు. ఇందులోని ఊహలను, అపోహలను చర్చిస్తే బాగుంటుంది. ఉంటాను. – మోహన
త్యాగరాజుకు తమిళం వచ్చా? త్యాగరాజ కృతులన్నీతెలుగులోనే ఉన్నాయి. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు తమిళరాజ్యంలో ఎన్నో తెలుగు కీర్తనలు పాడిన త్యాగరాజు అక్కడి ప్రజల భాష తమిళం లో కొన్ని కీర్తనలు కూడా పాడి ఉంటాడేమో అని నా అనుమానం.
తెలుగు సినిమా? తెగులు సినిమా? గురించి venugopal.nori అభిప్రాయం:
10/29/2008 9:39 am
I do accept your opinion 100%. There is lot of change in society[viewers]. We should know our responsibility in in the country.
వాడుక భాషలో పద్యాలు గురించి baabjeelu అభిప్రాయం:
10/29/2008 7:06 am
కృష్ణమోహన్ గారూ, నమస్తే.
వాడుక భాషలో ప్రస్తుతం ఎవరూ పద్యాలు రాయట్లేదు. విశాలాంధ్ర లో కాగడా పట్టుకుని వెతికినా కనబడరు. బహుశా చేతకాక అయ్యుండొచ్చు.
ఛందస్సు వగైరాల మీద పట్టున్న మీరూ, కామేశ్వర రావు గారూ, ఇంకా మీ లాటి వారు “వాళ్ళూ వీళ్ళూ రాసిన” ఛందోబద్ధమైన పద్యాల గురించి రాస్తూనే, వాడుక భాషలోనో, చిన్నయ సూరి భాషలోనో, ఇంకొ దాంట్లోనో పద్యాలెందుకు రాయరు?
“ఎవరో రాస్తారని, ఏదో చేస్తారని” ఎందుకు ఎదురు చూస్తున్నారు?
వాడుక భాషలో పద్యాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
10/28/2008 11:30 am
ఈ మంచి వ్యాసం చదివాక (ఎవడి గొడవ వాడిది అన్న పద్ధతిలో) నాకు సంగీతంలో దీనికొక పోలిక కనిపించింది. వాడుకభాషను ఛందస్సులో బిగించినట్టే శాస్త్రీయరాగాలను లైట్ మ్యూజిక్ లో ఇమిడించడం. భైరవి, తోడి వగైరా కర్నాటక రాగాలు మరీ గంభీరం. వాటిలో తేలిక ట్యూన్లు చెయ్యడం చాలా కష్టం. అయితే వాటిని ఆ రూపంలో గుర్తుపట్టడం కష్టం. ఉదా. పెండ్యాల చేసిన “నీవుండే దాకొండపై” అనే పాట ఆనందభైరవి అని చప్పున గుర్తుకు రాదు. ఈ కుస్తీతో పోలిస్తే వాడుకభాషలో వృత్తాలు రాయడమే చాలా సులువు!
వాడుక భాషలో పద్యాలు గురించి Rohiniprasad అభిప్రాయం:
10/28/2008 11:16 am
శ్రీశ్రీ రాసిన వచనంలాంటి కందపద్యం:
అవురా శ్రీరంగం శ్రీ
నివాసరావూ బలే మనిషివే ఇక నీ
కవితావాద్యం చాలిం
చి వెళ్ళిపొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:
10/28/2008 11:07 am
నాకు తెలుసున్నంత వరకూ త్యాగరాజు తమిళం లో ఒక్క కృతీ రాయలేదు. మొదట్లో కొన్ని సంస్కృత రచనలు చేసినా, సింహ భాగం తెలుగులోనే రాసారు. త్యాగరాజుకి తమిళం ఖచ్చితంగా వచ్చే ఉండాలి. ఎందుకంటే ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్న శిష్యులు చాలామంది తమిళులే ! వారందరికీ తెలుగు వచ్చిందన్న నమ్మకం కలిగిన తరువాతే ఆయన స్వీయ రచనలు నేర్పాడు.
అప్పట్లో తెలుగు, తమిళం రెండూ రాజభాషలుగానే చెలామణీ అయ్యాయి. ముఖ్యంగా సాహిత్యభాషగా తెలుగుకి పెద్ద పీటే వేసారు తంజావూరు రాజులు.
-సాయి బ్రహ్మానందం
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి mOhana అభిప్రాయం:
10/28/2008 7:13 am
త్యాగరాజుగారికి తమిళం బాగానే వచ్చి ఉంటుంది. కాని వారికి అందులో కవిత్వం వ్రాయగలిగిన శక్తి లేదేమో? ఆ కాలంలో దక్షిణదేశంలో తెలుగుకు ఒక ప్రత్యేక స్థానం ఉండింది సాహిత్యభాషగా. అదీకాక వారి మాతృభాష తెలుగు కాబట్టి ఆ భాషలోనే తమ పాటలను వ్రాసి వాటికి స్వర జీవాన్ని పోశారు. ఆత్మ పొందే అవస్థను మాతృభాషలో కాక మరే భాషలో సులభంగా చెప్పగలం? ముత్తుస్వామి దీక్షితులు వ్రాసిన మణిప్రవాళ కీర్తనలు కొన్ని తెలుగు తమిళ భాషలలో ఉన్నాయి. విధేయుడు – మోహన
వాడుక భాషలో పద్యాలు గురించి mOhana అభిప్రాయం:
10/28/2008 6:31 am
నమస్తే భాస్కర్ గారూ:
మీ ప్రశ్నకు జవాబు నా దగ్గర లేదు. కానీ వాడుక భాషలో అల్లిన పద్యాలకు ఆదరణ లభిస్తే చాలామంది ఈ ఉద్యమంలో పాల్గొంటారని నా ఊహ. దేశి ఛందస్సులో (అంటే సీసము, ఆటవెలది, తేటగీతి, ద్విపద లాటి ఛందస్సులో) సామాన్యముగా ఏ పాదానికి ఆ పాదం స్వతంత్రంగా నిలిచి ఉంటుంది. ద్విపదకు ఇది ఒక నియమము కూడా. కంద పద్యాలలో సామాన్యంగా రెండవ పాదాంతములో విరామము ఉంటుంది. ఈ పాదాంత విరామము సంస్కృతమునుండి దిగుమతి చేసికొన్న వృత్తాలలో మాత్రం ఉండదు. కన్నడ తెలుగు భాషలలోని ఒక ప్రత్యేకత ఇది. నాకేమో ఇలా వ్రాస్తే పద్యాలు వచనాలలా ఉంటయని అనుమానం. పండితులు, విమర్శకులు పాదాంత విరామము లేకుడా వ్రాయడం ఒక ఉత్తమ కళ అనీ, అది తెలుగు భాషకు అందాన్ని ఇస్తుందని చెబుతారు. ఇందులోని ఊహలను, అపోహలను చర్చిస్తే బాగుంటుంది. ఉంటాను. – మోహన
మనకు తెలియని మన త్యాగరాజు -1 గురించి rahamthulla అభిప్రాయం:
10/28/2008 3:53 am
త్యాగరాజుకు తమిళం వచ్చా? త్యాగరాజ కృతులన్నీతెలుగులోనే ఉన్నాయి. ఎక్కడో తెలుగు రాజ్యాలకి దూరంగా ఉన్న తంజావూరు తమిళరాజ్యంలో ఎన్నో తెలుగు కీర్తనలు పాడిన త్యాగరాజు అక్కడి ప్రజల భాష తమిళం లో కొన్ని కీర్తనలు కూడా పాడి ఉంటాడేమో అని నా అనుమానం.
ఈమాట గురించి గురించి baabjeelu అభిప్రాయం:
10/28/2008 2:19 am
ఈమాట పదో “హేపీ బర్త్ డే” వచ్చేనెలలోనే అనుకుంటాను.
ఈమాటకి “బహుమతులేటివ్వగలం?”
ఈమాటని “రిటన్ గిఫ్టు” అడగక్కర్లెద్దు.
ఈమాట పేరుకుతగ్గట్టు, ఎప్పుడూ ” in currnecy” గా వుండాలి.
ఈమాట “హిమాలయముపై జెండా పాతినా”, “ఆకాశంలో షికార్లు చేసినా” మౌలికంగా మారకుండా, మారుతున్న కాలంతో పాటూ వెయ్యేళ్ళు ప్రయాణం చెయ్యలని ఆశిస్తున్నాను.
వాడుక భాషలో పద్యాలు గురించి baabjeelu అభిప్రాయం:
10/28/2008 1:49 am
క్రు(కృ)ష్ణమోహన్ గారూ,
వాడుకభాషలో ఛందొబద్ధమైన పద్యములనల్లి, సాహితీపిపాసులనలరించుతున్న కవివరేణ్యులు, ప్రస్తుతంలో ఎవరూ?
రహ్మతుల్లా గారు చెప్పిన, పాదాంతంలో విరామం: “అలా విరామం ఇచ్చేరో వేపా/చింతావారమ్మాయితో పెళ్ళి చేసేస్తాను” అని ఛందో గురువులెవరైనా జీ.వో.జారీ చేసేరా?
వేమన పద్యాల్లో ఈ “పాదాంతంలో విరామం” ?
బాబ్బాబూ “వేమన పద్యాల్లో కవిత్వం వుందా?” అని అనకండి.