పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. కుతంత్రం గురించి teresa అభిప్రాయం:

    11/18/2008 9:54 am

    చాలా బావుంది. పరిచయమైన వాళ్ళింట్లో పెళ్ళి చూసినట్లు… పెళ్ళికూతురు మా పిన్నో, మేనత్తో లాగా అనిపించేసింది!

  2. కుతంత్రం గురించి యుగంధర్ అభిప్రాయం:

    11/18/2008 5:46 am

    అద్భుతం. అద్భుతం.

  3. రామా కనవేమిరా! గురించి mailkp అభిప్రాయం:

    11/18/2008 2:46 am

    చాలా మందికి కోరికలు తీర్చుకోడానికే దేవుడు.వాళ్ళ తప్పులు కాచడానికే దెవుడు.ఒకోసారి ఎందుకోగానీ దేవుడు కోరికలూ తీర్చడు.కష్టాలు గట్టెక్కించడు. అప్పుదు ప్రాక్టికల్ ప్రాబ్లంస్ కి ఫిలాసఫీ లో సమాధానాలు వెతుకుతాం.అప్పుడు “concept of God” ఏంటో తెలుస్తుంది. అప్పుదు రాముడు దేవుడవుతాడు…at least..కొందరికి.ఆ తరువాత కూడా ఇలాంటి doubts ఇంక వస్తై కద..తరువాత ఏమౌతుందో ఇంకా సశేషమే మరి.

  4. మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Krishna అభిప్రాయం:

    11/18/2008 12:42 am

    పిల్ల, అవ్వ చివరి లైన్లలో పెట్టారు.
    సన్యాసిని, దిసమొల వాడిని మధ్య లైన్లో పెట్టారు. ఎందుకూ!?
    వాటిని కూడా చివర వాక్యాల్లోనే పెట్టొచ్చుగా!?

    గుడ్డ మూట తల కింద పెట్టుకొని
    తత్వమొకటి ఎత్తుకుంటున్నాడు
    పాడుబడ్డ మండపంలో బవిరి గడ్డం సన్యాసి
    (ఇక్కడ మూట కింద పెట్టి, తత్వమెత్తుకోవటం కాంట్రాస్టు పదాల్లాగ చక్కగా కనబడతాయి గదా!)

    హ్హహ్హహ్హ అని కేకలు వేస్తున్నాడు
    సాలీడు లేసులల్లిన సమాధి మీద
    నిలబడ్డ దిసమొల వాడొకడు
    (సమాధికి లేసులున్నాయి.దాని మీద దిసమొల వాడు!)

    ఏమంటారు!?

  5. అసమర్థులు గురించి harish అభిప్రాయం:

    11/17/2008 7:44 pm

    lovely story madam
    hoping to read more from your pen

    Harish

  6. మరచిపొమ్మంటున్నారు గురించి krishna akkulu అభిప్రాయం:

    11/17/2008 11:43 am

    మంచి కవితనిచ్చినందుకు ధన్యవాదములు. చాలా బాగుంది.

  7. పేరు గలవాడేను మనిషోయ్ గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/17/2008 9:55 am

    “తెలుగు నాడి”లో చదివాక గానీ ఈమాటలో ఈ కథ ప్రచురితమైన సంగతి తెలియలేదు.

    పసి మనసుల ప్రాధామ్యాలనీ, భావ ఘర్షణనీ రానారె అక్షరాల్లోకి అద్భుతంగా తీసుకొస్తారు. నా బాల్యం నా పిల్లలకు వివరించాల్సి వస్తే రానారె కథలనీ సంపుటంగా చేసి చదువుకోమనేంతగా వుంటాయి.

    రేడియో కావాలని మా నాన్నని అడగడం. చదువులు పాడవుతాయని మా నాన్న ఆమోదించకపోవడం. చివరికి రేడియో వచ్చాక, ఇష్టమయిన కార్యక్రమం వినడానికి పడిన తాపత్రయం అన్నిటినీ ఈ కథ కళ్ళ ముందు పరిచింది.

    ఒక కామేశ్వరరావు గారు వుదహరించిన పేరా కొంచం అసహజంగా అనిపించినా, నిజ జీవితాల్లో అసహజమని జరక్కుండా వుండవు కదా?

    –ప్రసాద్
    http://blog.charasala.com

  8. పురూరవ గురించి రాఘవ అభిప్రాయం:

    11/17/2008 1:03 am

    93వ పుట సరిగ్గా లేదు. గమనించగలరు.

    [కృతజ్ఞతలు. పుట సరిదిద్దబడింది – సం.]

  9. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి malathi nidadavolu అభిప్రాయం:

    11/16/2008 3:56 pm

    హనుమంతరావు గారూ,
    మీ అభిమానానికి కృతజ్ఞతలు. అమెరికాలోనూ, ఇండియాలోనూ ప్రముఖ సాహిత్యాభిమానులం అంటూ హడావుడి చేస్తున్నవారినందరినీ అడుక్కోడం అయిందండీ.. నేను అడక్కుండా, పుస్తకం కొనుక్కుని మరీ సమీక్ష రాసినవారు వేలూరి వారొక్కరే.. ఈ తానాలూ, ఆటాలూ గురించి నేను మాటాడకపోవడమే మంచిది… మీకున్న నమ్మకాలు నాకు లేవు.

    సరదాగా వుంటే ఈలింకు చూడండి. నాతెలుగుతూలిక లో అచ్చంగా నేనే అచ్చేసుకున్న చిన్ని నాపొత్తము అని పేరుతో.
    Anyway, thanks.

    మాలతి

  10. A review of Telugu Women Writers 1950 – 1975 by Malathi Nidadavolu గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/16/2008 12:58 pm

    మాలతి గారికి,

    కల్పన గారు “మైలురాయిగా పొగిడారు” అని రాయడంలో నేను వ్యంగ్యాన్ని సూచిస్తే అది నా తప్పే. మైలురాయి అవునో కాదో తెలుగు సాహిత్య చరిత్ర లోతుపాతులు తెలిసిన వాళ్ళు నిర్ధారించాలి, నేను కాదు. నా దృష్టిలో మీ పుస్తకం కొత్త వెలుగుని ప్రసరించేదీ, కొంత వివాదాస్పదమైనదీ, తెలుగు సాహిత్యాభిమానులు చదవ్వలసినదీ. తగిన ప్రాచుర్యం వస్తుందనీ, విస్తృతంగా చర్చిస్తారనీ ఆశిస్తాను.

    పుస్తక ప్రచురణలో సాధక బాధకాలు నాకు తెలియవు. సాహితీ చరిత్రకి గిరాకీ లేకపోవచ్చు కాని అవసరం ఉంది. ఇలాంటి పుస్తకాలని తెలుగులో ప్రచురించడానికి సహాయం కావలసిన వాళ్ళు తానా ప్రచురణ వాళ్ళని సంప్రదించండి; రచ్చబండ లోనో, ఈమాట లోనో, మీ వెబ్ సైటులోనో ఓ మాట వెయ్యండి. ఓ చెయ్యిచ్చే వాళ్ళుండకపోరు. పరపతి ఉంటేనే ప్రచురించుకునే దుస్థితికి తెలుగు సాహిత్యం దిగజారకూడదు.

    మీ పుస్తకం మీద “చిరు సమీక్ష” లాంటిది రాయాలనే ఉద్దేశం ఉంది. వీలు చూసుకొని రాయాలి.

    కొడవళ్ళ హనుమంతరావు