పరచూరి శ్రీనివాస్ గారు,
ఎన్నో చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి ఈ రూపకం విని. శతసహస్ర వందనాలు అందించినందుకు. “ఉప్పొంగి పోయింది గోదావరి…” ఎప్పటిదో తెలుగు పాఠ్యపుస్తకంలో చదివిన గుర్తు. Hyderabad AIRలో “ఈ మాసపు పాట” తదితర లలిత సంగీత కార్యక్రమాలలో చాలా మంచి గేయాలు ప్రసారమయ్యేవి. వాటిలో “నదీ సుందరి సుధాస్యందిని నగాధీశ్వర నందిని…” ఇంకా “గోదావరీ, నాదఝరీ, ఎన్నెన్ని యుగాల స్మృతులు యద బరువై పారుదువో…” ఇప్పటికీ గుర్తున్నాయి. చక్కని సాహిత్యం, అంతకు మించిన సంగీతం ఈ పాటలు ఇప్పటికీ గుర్తుండడానికి కారణం. ఇవి మీరు సేకరించి ఈమాటలో అందించగలిగితే మీకు సదా ఋణపడి ఉంటాను.
రాజాశంకర్
ఉప్పొంగిపోయింది గోదావరి … ఈ గీతాన్ని ఎప్పుడో విన్నట్టు లీలగా జ్ఞాపకం. ఈ సంగీతరూపకంలో అది మళ్లీ వినబడేసరికి ఏదో ఆనందం.
జోర్ సెయ్ బార్ సెయ్ … ఈ మాటలు శేఖర్‌కమ్ముల సినిమా ‘గోదావరి’లోని – ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి – అనే పాటలో కూడా వినబడతాయి. ఈ రూపకంలో వినేటప్పుడు నాకనిపించింది బహుశా ఇవి నదిలో లయబద్ధంగా తెడ్డు వేసేటప్పుడు అలుపురాకుండా పాడే ఊతపదాలని. నదీప్రవాహాలు, సముద్రతీరాలు, జాలర్లు, నావలు… వీటితో నాకు పరిచయం లేదు. నేను పెరిగిన (కరువు)ప్రాంతంలో ఇవేవీ లేకపోయినా, గోదావరిని నేనెప్పుడూ చూడకపోయినా, వింటూవుంటే చాలా బాగుంది.
మాచిరాజు సావిత్రిగారి కథ ‘తరవాణి కేంద్రం’లో చెప్పినట్టుగా, మనజీవనవిధానంలో సంస్కృతిలో వస్తున్న మార్పులతోపాటుగా శ్రామికులపాటలూ కనుమరుగు కావలసిందే, వాటినిలా భద్రపరచి విని తెలుసుకొని ఆనందించడం మాత్రమేనేమో మనం చేయగలిగినది!
వినటానికి ఈ కథపేరు ఆకాశవాణి కడపకేంద్రం అన్నట్టుగా వుంది. ఈ కథలో సన్నివేశాలూ, సంభాషణలు ఎంతో సహజంగా, సరసంగా, హాస్యస్ఫోరకంగా భలే వున్నాయి. సాంస్కృతికపరిణామాన్ని గురించిన సంగతిని తరవాణిలో కలిపి తాగించినట్టుగా చెప్పారు. ఈ తరవాణి అనేపదం నాకు కొత్త. దీన్ని మేం గంజి లేదా పుల్లగంజి లేదా పులినీళ్లు అంటాం. కానీ దాంట్లో దబ్బాకులు కలపడం కూడా కొత్తే. నిమ్మచెట్లు కనబడతాయిగానీ దబ్బచెట్లనేవి నేనెప్పుడూ చూళ్లేదు. యర్రగడ్డ (ఉల్లి) తో కలిపి కొరికి తింటే, ముఖ్యంగా యండాకాలంలో, కమ్మగా బాగుండేది.
బృందావన రావు గారికి,
నాకున్న భాషా పాండిత్యానికి అభిప్రాయాలు తెలియజెప్పేంత గొప్పవాణ్ణి కాదుగాని ఒక చిన్న విన్నపం: మీరు ఇలాగే రామరాజభూషణుని “లలనా జనపాంగ వలనా” వివరిస్తే చదవాలని కోరిక. బహుశా తీరుస్తారనుకుంటాను.
‘Play’ బొత్తాన్ని నొక్కాక “Error opening file” అని వస్తోంది. ఫైర్‌ఫాక్స్-3.0.5, ఐఈ-7లలో ప్రయత్నించి చూశాను. రెండు వేర్వేరు నెట్వర్కులలోనూ ఇదే సమస్య కనిపించింది. దయచేసి దారి చూపండి.
[తప్పుని సరిదిద్దాము. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించండి – సం. 1/9/09 9:20am]
To be fair to literary enthusiasts, సంగీతాభిమానులు కొందరికి నా వ్యాసాల గురించి చెప్పాను కాని వాటిలో వారికి ఎక్కువ ఆసక్తి కలిగినట్టుగా అనిపించలేదు. ‘వినేవాళ్ళూ చదవరు, చదివేవాళ్ళు వినరు’ అనుకోవాలేమో. వెబ్ పత్రికలో రెండు పనులూ ఒకేసారి చెయ్యవచ్చు కనక వీలున్నప్పుడల్లా నాకు audio links ఇవ్వబుద్ధి అవుతుంది.
త్యాగరాజ కీర్తనలు వింటానికి ఎంతో బాగుంటాయి. అందునా పాడే గాయకుల సామర్ధ్యాన్ని బట్టీ ఇంకా రుచిగా ఉంటాయి. కానీ సాహిత్యం విషయంలో మాత్రం చాలవు. కల్పనకి వాటిల్లో చోటు తక్కువ. రాళ్ళపల్లి వారి అభిప్రాయం ఈ విషయంలో నిజమైందే! అన్నమయ్య పదం ముందు మిగిలిన అందరి పదకర్తల ఊహలూ దిగతుడుపు గానే కన్పిస్తాయి. త్యాగరాజు స్వరానికి వశ్యుడు. కవి కాడు. అన్నమయ్య కవులకే కవి. సంగీతం విండానికి త్యాగరాజు. కానీ కవిత్వ దాహం తీరాలంటే మాత్రం “దాసోహం” కావాల్సిందే అన్నమయ్య అక్షరానికి. – రమ.
ఈ వివరణ చాలా విషయాలు స్పష్టం చేస్తుంది. బాగుంది. ధన్యవాదాలు.
మరొక సందేహం. ఈమాటలో ప్రచురించిన రచనలు తొలిగించినప్పుడు రచయితలకు తెలియజేసే అవకాశం వుందా? నా రచనలు రెండు (“రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం” అన్న వ్యాసమూ, “అంపకాలు” అన్న కవితా తొలిసారిగా ఈమాట.కాంలోనే ప్రచురింపబడినాయి) ఇప్పుడు కనిపించడంలేదు.
– నిడదవోలు మాలతి
[ఈమాటలో ప్రచురించబడిన రచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతనూ తొలగించబడవు.
మీ ‘రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం‘ వ్యాసం, మీ ‘అప్పగింతలు‘ కవిత (‘అంపకాలు’ కాదు) తిక్కన ఫాంట్‌లో లేని కొన్ని ఇతర రచనలతో పాటుగా సాంకేతిక కారణాల వల్ల ఇంకా పీ.డీ.ఎఫ్ ఫైళ్ళు గానే ఉన్నాయి. వీటిని కూడా యూనికోడ్‌కి మార్చే ప్రయత్నాలు చేస్తున్నాము. మరి కొంతకాలం పట్టవచ్చు. పాత సంచికల్లో తమ రచనలు కనిపించని రచయితలు వాటి వివరాలతో మమ్మల్ని సంప్రదించవలసినదిగా కోరుతున్నాం – సం.]
రోహిణీ ప్రసాద్!
సంగీత జ్ఞానము, భక్తి -రెండూ లేని పాఠకులము కొందరము ఉంటాం కదా! :)మీకు ఐతే రెంటిలో ఒకటైనా మస్తుగా ఉంది. కాని మీరు పాఠకులు కారయ్యే! మా బోంట్లకు – అంటే సైన్సు, ఆర్ట్సు అసలు ఏవీ రాని, మామూలు పాఠకులకు- అందునా ఆడవాళ్ళకు, అర్థమయ్యేట్లు తేలిక మాటల్లో వ్యాసాలు రాసి, చదువు చెప్పి, సన్మార్గంలో పెట్టే రచయితలు మాత్రమే మీరు.
దుడుకు గల లైలాను ఏ దొర బ్రోచురా – అని నవ్వుకుని ‘వీణ తీగల గురించిన చర్చ’ ఎటువంటిదో చెప్పగలరు. నాకు ఏమీ అర్థం కాలేదు.
పోనీ త్యాగరాజు సంగీతములో ఎందుకు అద్వితీయుడో , ఈ ఒక్కసారికి పాఠకుడి స్థానానికి దిగజారి మీరే స్వయంగా ఒక్క కామెంటైనా చెయ్యరాదూ.
అందరు మహామహోపాధ్యాయులూ – ఎవరికి వారే -ఇతరులకు ఉపయోగించే విషయాలు పరాపరా రాసేస్తూ, బిజీగా ఉండి, వేరేవారి రచనలు, పుస్తకాలు చదవ(లే)క పోయినా, అలాటి పరోపకార బుద్ధి ఏ మాత్రం లేని నేను చదువుకుంటాను. తెలియని విషయాలు కొంచెమైనా తెలుసుకుని ఆనందిస్తాను. కోరిక మన్నించి రాస్తారుగా.
మీరు రాసే లోపు ‘శాంతము లేక సౌఖ్యము లేదు’ సాధన చేస్తూ ఉంటాను. ఎంత గింజుకున్నా రాదనుకోండి.:) ఐతే ఏం.
కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar అభిప్రాయం:
01/09/2009 6:51 pm
పరచూరి శ్రీనివాస్ గారు,
ఎన్నో చిన్ననాటి విషయాలు గుర్తుకొచ్చాయి ఈ రూపకం విని. శతసహస్ర వందనాలు అందించినందుకు. “ఉప్పొంగి పోయింది గోదావరి…” ఎప్పటిదో తెలుగు పాఠ్యపుస్తకంలో చదివిన గుర్తు. Hyderabad AIRలో “ఈ మాసపు పాట” తదితర లలిత సంగీత కార్యక్రమాలలో చాలా మంచి గేయాలు ప్రసారమయ్యేవి. వాటిలో “నదీ సుందరి సుధాస్యందిని నగాధీశ్వర నందిని…” ఇంకా “గోదావరీ, నాదఝరీ, ఎన్నెన్ని యుగాల స్మృతులు యద బరువై పారుదువో…” ఇప్పటికీ గుర్తున్నాయి. చక్కని సాహిత్యం, అంతకు మించిన సంగీతం ఈ పాటలు ఇప్పటికీ గుర్తుండడానికి కారణం. ఇవి మీరు సేకరించి ఈమాటలో అందించగలిగితే మీకు సదా ఋణపడి ఉంటాను.
రాజాశంకర్
కొండ నుంచి కడలి దాకా గురించి రానారె అభిప్రాయం:
01/09/2009 3:11 pm
ఉప్పొంగిపోయింది గోదావరి … ఈ గీతాన్ని ఎప్పుడో విన్నట్టు లీలగా జ్ఞాపకం. ఈ సంగీతరూపకంలో అది మళ్లీ వినబడేసరికి ఏదో ఆనందం.
జోర్ సెయ్ బార్ సెయ్ … ఈ మాటలు శేఖర్‌కమ్ముల సినిమా ‘గోదావరి’లోని – ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి – అనే పాటలో కూడా వినబడతాయి. ఈ రూపకంలో వినేటప్పుడు నాకనిపించింది బహుశా ఇవి నదిలో లయబద్ధంగా తెడ్డు వేసేటప్పుడు అలుపురాకుండా పాడే ఊతపదాలని. నదీప్రవాహాలు, సముద్రతీరాలు, జాలర్లు, నావలు… వీటితో నాకు పరిచయం లేదు. నేను పెరిగిన (కరువు)ప్రాంతంలో ఇవేవీ లేకపోయినా, గోదావరిని నేనెప్పుడూ చూడకపోయినా, వింటూవుంటే చాలా బాగుంది.
మాచిరాజు సావిత్రిగారి కథ ‘తరవాణి కేంద్రం’లో చెప్పినట్టుగా, మనజీవనవిధానంలో సంస్కృతిలో వస్తున్న మార్పులతోపాటుగా శ్రామికులపాటలూ కనుమరుగు కావలసిందే, వాటినిలా భద్రపరచి విని తెలుసుకొని ఆనందించడం మాత్రమేనేమో మనం చేయగలిగినది!
కృతజ్ఞతలు శ్రీనివాస్ గారూ.
తరవాణి కేంద్రం గురించి రానారె అభిప్రాయం:
01/09/2009 11:30 am
వినటానికి ఈ కథపేరు ఆకాశవాణి కడపకేంద్రం అన్నట్టుగా వుంది. ఈ కథలో సన్నివేశాలూ, సంభాషణలు ఎంతో సహజంగా, సరసంగా, హాస్యస్ఫోరకంగా భలే వున్నాయి. సాంస్కృతికపరిణామాన్ని గురించిన సంగతిని తరవాణిలో కలిపి తాగించినట్టుగా చెప్పారు. ఈ తరవాణి అనేపదం నాకు కొత్త. దీన్ని మేం గంజి లేదా పుల్లగంజి లేదా పులినీళ్లు అంటాం. కానీ దాంట్లో దబ్బాకులు కలపడం కూడా కొత్తే. నిమ్మచెట్లు కనబడతాయిగానీ దబ్బచెట్లనేవి నేనెప్పుడూ చూళ్లేదు. యర్రగడ్డ (ఉల్లి) తో కలిపి కొరికి తింటే, ముఖ్యంగా యండాకాలంలో, కమ్మగా బాగుండేది.
నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి Indrajit అభిప్రాయం:
01/09/2009 9:01 am
బృందావన రావు గారికి,
నాకున్న భాషా పాండిత్యానికి అభిప్రాయాలు తెలియజెప్పేంత గొప్పవాణ్ణి కాదుగాని ఒక చిన్న విన్నపం: మీరు ఇలాగే రామరాజభూషణుని “లలనా జనపాంగ వలనా” వివరిస్తే చదవాలని కోరిక. బహుశా తీరుస్తారనుకుంటాను.
కొండ నుంచి కడలి దాకా గురించి రానారె అభిప్రాయం:
01/09/2009 6:02 am
‘Play’ బొత్తాన్ని నొక్కాక “Error opening file” అని వస్తోంది. ఫైర్‌ఫాక్స్-3.0.5, ఐఈ-7లలో ప్రయత్నించి చూశాను. రెండు వేర్వేరు నెట్వర్కులలోనూ ఇదే సమస్య కనిపించింది. దయచేసి దారి చూపండి.
[తప్పుని సరిదిద్దాము. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించండి – సం. 1/9/09 9:20am]
శబ్ద తరంగాలు గురించి Dr.tadepalli patanjali అభిప్రాయం:
01/08/2009 3:49 pm
మంచి సేవ చేస్తున్నారు. హృదయపూర్వక అభినందనలు.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Rohiniprasad అభిప్రాయం:
01/08/2009 11:24 am
To be fair to literary enthusiasts, సంగీతాభిమానులు కొందరికి నా వ్యాసాల గురించి చెప్పాను కాని వాటిలో వారికి ఎక్కువ ఆసక్తి కలిగినట్టుగా అనిపించలేదు. ‘వినేవాళ్ళూ చదవరు, చదివేవాళ్ళు వినరు’ అనుకోవాలేమో. వెబ్ పత్రికలో రెండు పనులూ ఒకేసారి చెయ్యవచ్చు కనక వీలున్నప్పుడల్లా నాకు audio links ఇవ్వబుద్ధి అవుతుంది.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి rama అభిప్రాయం:
01/08/2009 11:03 am
బ్రహ్మానందం గారూ ! మంచి వ్యాసం. సంతోషం.
త్యాగరాజ కీర్తనలు వింటానికి ఎంతో బాగుంటాయి. అందునా పాడే గాయకుల సామర్ధ్యాన్ని బట్టీ ఇంకా రుచిగా ఉంటాయి. కానీ సాహిత్యం విషయంలో మాత్రం చాలవు. కల్పనకి వాటిల్లో చోటు తక్కువ. రాళ్ళపల్లి వారి అభిప్రాయం ఈ విషయంలో నిజమైందే! అన్నమయ్య పదం ముందు మిగిలిన అందరి పదకర్తల ఊహలూ దిగతుడుపు గానే కన్పిస్తాయి. త్యాగరాజు స్వరానికి వశ్యుడు. కవి కాడు. అన్నమయ్య కవులకే కవి. సంగీతం విండానికి త్యాగరాజు. కానీ కవిత్వ దాహం తీరాలంటే మాత్రం “దాసోహం” కావాల్సిందే అన్నమయ్య అక్షరానికి. – రమ.
రచయితలకు సూచనలు గురించి Malathi Nidadavolu అభిప్రాయం:
01/08/2009 7:15 am
ఈ వివరణ చాలా విషయాలు స్పష్టం చేస్తుంది. బాగుంది. ధన్యవాదాలు.
మరొక సందేహం. ఈమాటలో ప్రచురించిన రచనలు తొలిగించినప్పుడు రచయితలకు తెలియజేసే అవకాశం వుందా? నా రచనలు రెండు (“రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం” అన్న వ్యాసమూ, “అంపకాలు” అన్న కవితా తొలిసారిగా ఈమాట.కాంలోనే ప్రచురింపబడినాయి) ఇప్పుడు కనిపించడంలేదు.
– నిడదవోలు మాలతి
[ఈమాటలో ప్రచురించబడిన రచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణం చేతనూ తొలగించబడవు.
మీ ‘రచయితలకీ పాఠకులకీ మధ్య గల అవినాభావసంబంధం‘ వ్యాసం, మీ ‘అప్పగింతలు‘ కవిత (‘అంపకాలు’ కాదు) తిక్కన ఫాంట్‌లో లేని కొన్ని ఇతర రచనలతో పాటుగా సాంకేతిక కారణాల వల్ల ఇంకా పీ.డీ.ఎఫ్ ఫైళ్ళు గానే ఉన్నాయి. వీటిని కూడా యూనికోడ్‌కి మార్చే ప్రయత్నాలు చేస్తున్నాము. మరి కొంతకాలం పట్టవచ్చు. పాత సంచికల్లో తమ రచనలు కనిపించని రచయితలు వాటి వివరాలతో మమ్మల్ని సంప్రదించవలసినదిగా కోరుతున్నాం – సం.]
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి lyla yerneni అభిప్రాయం:
01/07/2009 8:30 pm

లైలా.