పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    01/21/2009 3:53 pm

    Dear Rama garu:

    Chavali Bangaramma, as you have said did not get the recognition she deserved during her time, and probably even later! But, there were quite a few poets, particularly women poets who were “ignored.”

    I would like to share the following information with the eemaata readers.

    Velcheru Narayana Rao of University of Wisconsin (currently visiting professor at Emory University, Atlanta) edited and translated a collection of one hundred telugu poems of the 20th century. The collection bears the title, “Hibiscus on the Lake.” It is published by the University of Wisconsin Press in 2003. I need not emphasize the very title for the book chosen by Narayana Rao. You could guess it!

    If you haven’t already read , I would request you to read “A Historical After-Essay” at the end of the book . A lengthy critical appreciation of Chavali Bangaramma’s poetry appears in the essay, and in particular on the poem neeDa translated as Hibiscus on the Lake.

    With best regards,

    Veluri Venkateswara Rao.

  2. టేబుల్ పై చేతి వాచీ గురించి రవి అభిప్రాయం:

    01/21/2009 4:10 am

    చాలా బావుంది. తిలక్ అమృతం కురిసిన రాత్రి ప్రభావం మీపై ఉండాలి అనుకుంటున్నాను.

  3. తెలుగుదనం (not in lighter vein) గురించి Pavan Kumar Hari అభిప్రాయం:

    01/19/2009 7:53 pm

    వ్యాసం చాలా బాగుంది. అసలు పెసరట్టు వేయాలనే సంకల్పమే ఒక గొప్ప అనుభూతినిస్తుంది. ఇక పిండి రుబ్బి, వేసి, తినడం అంటారా. అబ్బో, చెప్పనే అక్కర్లేదు. ఇది నా స్వానుభవం. అయ్యా వెంకటేశ్వరరావు గారూ! మరి “ఆంధ్రమాత” గురించిన వ్యాసంతో మాకెప్పుడు విందు చేస్తారు? నాకు తెలిసి ఆంధ్రులే చెయ్యగల ఇంకొక వంటకం “చిట్టింటపొట్టు కూర”.

  4. ఈ మాసపు పాట గురించి Rajesh Kumar.D అభిప్రాయం:

    01/19/2009 4:47 am

    ఉదయకళ గారు ,
    మీరు రాసిన ఈ కథ, కథ మధ్యలో వ్రాసిన కవితలు కూడా చాల అర్థవంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నా పరిస్థితులకు చాల దగ్గరగా ఈ కథ ఉంది. ఆ కథ వ్రాసిన తీరు హృదయాన్ని హత్తుకునే విధముగా ఉంది. మీరు ఇలాంటి కథలు ఇంకెన్నో వ్రాయాలని కోరుకుంటూ,

    రాజేష్ కుమార్ దేవభక్తుని.

  5. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama అభిప్రాయం:

    01/19/2009 4:39 am

    హనుమంతరావు గారూ !!

    మీరు సాహిత్యరంగం లోపలి వారు కారు గనక, మీకు “వైతాళికులు” పుస్తకం లోని కవయిత్రులని గురించి తెలియదన్నారు. బైరాగి గురించి ఎలా మాట్లాడ గలిగేరో..రేవతీదేవి గురించి ఎలా మాట్లాడ గలిగేరో….అలాగే వైతాళికులు లోని కవయిత్రులని గురించి కూడా మీరు మాట్లాడగలరు. చైతన్యం కల్గిన పాఠకులు గనక. కాకుంటే అలా మాట్లాడాలని అనుకోవాలి ముందు.

    చాలా మందికి చావలి బంగారమ్మ గారి పేరు పరిచయం కాక పోయినా..ఆమె రాసిన బహు చక్కని కవిత్వం తెలియక పోయినా…అది సాహిత్య విమర్శకుల పొరపాటే !! దేవులపల్లి వెంకట క్రిష్ణశాస్త్రి గారి తో సరిసమానమైన ధీటైన గేయాలు రాసినవారు బంగారమ్మ గారు…”వైతాళికులు” లో!! మరి ఎంతమందికి ఆవిడ రాసిన గేయాలతో పరిచయం ఉందివాళ?? ఆమె కవితల విడి సంపుటి గురించిన ఊసైనా ఎవరికి తెలుసు?? వాటిలోని అందాలని విశ్లేషించిన వారేరీ?? పురుషుల చేతి లో ఒక అస్త్రంగా పనిచేసిన “విమర్శ” ఇలా ఎందరి స్త్రీల అద్భుత కల్పనా ప్రపంచాలని చిన్న చూపు చూసిందో తెలిసినప్పుడు కదా..విమర్శనా రంగం..ఎంత సంకుచితత్వం తో ప్రవర్తించిందీ స్పష్టపడేదీ??

    మంచి కల్పనని దర్శించవచ్చు…అందుకు మన మనసు కిటికీలు తెరుచుకోవాలి …ఏ భేద భావమూ అడ్డురాకుండా !!

    రమ.

  6. ఖాళీ సీసాలు గురించి Rajesh Kumar.D అభిప్రాయం:

    01/19/2009 1:31 am

    మొట్టమొదటగా ఈ సాహిత్యపత్రికని నడుపుతున్న వారందరికీ నా కృతజ్ఞతలు. ఇది సాహిత్య పత్రిక కబట్టి కుదిరినంత వరకు అన్ని మాటలు తెలుగులో ప్రచురిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఉదాహరణకు : –

    Hospital = వైద్యశాల
    Pants = బారు నిక్కరు

    పైన చెప్పిన విధంగా నాలాగ సాహిత్య అభిలాష ఉన్నవారు అన్ని మాటలు తెలుగులో ఉంటే తెలుసుకోవాలని లేక నేర్చుకోవాలని అనుకుంటారు కదా.

    కృతజ్ఞతలు
    Rajesh Kumar.D

    [రాజేశ్ కుమార్ గారు, మీ సూచనకు ధన్యవాదాలు. మీరు ఇంగ్లీష్ లిపిలో రాసిన తెలుగుని తెలుగు లిపిలోకి మార్చి ప్రచురిస్తున్నాము. ఇది తెలుగు సాహిత్య పత్రిక కాబట్టి మీ అభిప్రాయాలను కూడా ఇకనించి తెలుగు లిపిలోనే రాయమని కోరుతున్నాము. వివరాలకు రచయితలకు సూచనలు పేజీ చూడగలరు. -సం.]

  7. ఖాళీ సీసాలు గురించి Navuluri Venkateswara Rao అభిప్రాయం:

    01/18/2009 10:16 pm

    A very long time ago I read a novel by Emile Zola in which two poor women fight over (empty bottles?) a truffle and tear off each other’s clothes. I have forgotten its name. “Smile” may have been inspired by that novel. I have not come across any reader who has pointed it out.

  8. రాగలహరి: మోహనం గురించి K. Rohiniprasad అభిప్రాయం:

    01/18/2009 10:54 am

    ఈ శ్రు అనే విషయంలో చాలా ఏళ్ళ క్రితం నేను చేసిన పొరబాటును గురించి ఈమాట సంపాదకులకు ఎప్పుడో చెప్పాను కాని వారింకా నా పాత వ్యాసం శీర్షికను సరిదిద్దలేదు.

    [రోహిణీ ప్రసాద్ గారు, మీ వ్యాసం శీర్షికను సరిదిద్దాము. ఈమాటలో మరికొన్ని చోట్ల ఉటంకించిన “శృతి” అన్నమాటను కూడా “శ్రుతి” గా సరి దిద్దాము. దీనిని మా దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. -సం.]

  9. రాగలహరి: మోహనం గురించి Pavan Kumar Hari అభిప్రాయం:

    01/18/2009 9:39 am

    లక్ష్మన్న గారూ,
    కొంత మంది పండితుల అభిప్రాయసేకరణకు సమయం పట్టింది.
    సంస్కృతంలో ” శృతి ” అన్న పదం అసలు లేదు. ” శ్రుతి ” యే సరియైన పదము.
    “శృ” మరియు “శ్రు” – ఈ రెంటికీ ఉచ్చారణ ఒకే విధంగా ఉండదు.
    ఎందుకంటే “శృ” అనే అక్షరంలో ఒక హల్లు + ఒక అచ్చు ( శ్ + ఋ ) ఉన్నాయి. ఇది ” శ ” గుణింతములో వస్తుంది.
    కాని ” శ్రు ” లో రెండు హల్లులు, ఒక అచ్చు ఉన్నాయి ( శ్ + ర్ + ఉ ). ఇది సంయుక్తాక్షరము. కనుక దీని ఉచ్చారణ వేరు.
    మూలమైన ధాతువు ” శ్రు – శ్రవణే ” అనేది. అందులో కేవలం వర్తమాన కాలంలో ప్రయోగింపబడే రూపములు ” శృణోతి ” మొదలైన వాటిలో మాత్రమే “శృ” అనేది కనిపిస్తుంది. ఇదొక విలక్షణమైన రూపము.
    ” అమరకోశం ” లో కూడా దీనిని గురించి మంచి వివరణ ఇవ్వడం జరిగినది.
    కాబట్టి ” శ్రుతి ” అన్నదే సరియైనదని పండితుల అభిప్రాయము.
    నేనూ సంగీతాభిమానినే. ఈ విషయం ఎందుకు వ్రాశానంటే, సంగీతశాస్త్రం గురించి వ్రాసేటప్పుడు సంస్కృత వ్యాకరణశాస్త్రం కూడా ప్రధానమైనదే కదా.. అందుకని.
    అన్యథా భావించవలదని మనవి.

  10. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి అరుణ పప్పు అభిప్రాయం:

    01/18/2009 3:06 am

    ‘ఈ శిల శిలేగాని,
    ….. అనురాగం తాగి మత్తెక్కి,
    మంచులో తడిసి
    వెన్నెట్లో మెరిసి
    లలితంగా స్థిర చిత్తలోలితంగా ఈ శిల!’
    స్త్రీ జీవితాన్ని అంతందంగా, అల్పాక్షరాలలో ఆవిష్కరించడం ఎవరికి సాధ్యం?
    ‘అనురాగదగ్థ సమాధి’ వంటి అద్భుతమైన కవితల్ని అందించిన విన్నకోట రేవతీదేవికి మీరన్నట్టు లౌకికంగా రావాల్సినంత పేరు రాలేదు.. కానీ రసహృదయులైన పాఠకుల మనో ప్రపంచంలో ఆవిడ దీపంలా వెలుగుతూనే ఉంటారు. ఆమె గురించి రాసినందుకు మీకు, ఈమాటకు ధన్యవాదాలు.