పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. రచయితలు – ఎడిటర్లు గురించి శివ బండారు అభిప్రాయం:

    02/01/2009 11:18 pm

    సంపాదకుడు అంటే రచనలను రచయితలనుంచి సంపాదించి/సేకరించి గుదిగుచ్చి ప్రచురించడానికి ఒక క్రమపద్ధతిలో పెట్టువాడు అనే అర్ధమేమో అనుకుంటున్నాను. తదుపరి వ్యాసం కోసం ఎదురు చూస్తూ,
    శివ

  2. రచయితలు – ఎడిటర్లు గురించి marakkaDE.. అభిప్రాయం:

    02/01/2009 7:30 pm

    -నా సంపాదకీయాలు కూడా పది మంది చేతుల్లో పడి నలిగిన తరువాతే బయటకు వస్తాయి- అని చెప్పుకొన్న వేలూరి వారి రచనలో, మొట్ట మొదటి కంద పద్యమే క్రింద పడింది. కనీసం మరొకరి పద్యాలనుదహరించేటప్పుడైనా పదాలన్నీ పడ్డాయో, లేవో, గణాలు కుదిరాయో లేదో చూసుకొంటే బాగుంటుంది. మన పత్రిక నాణ్యత చాలా బాగుందని మనకు మనమే ముక్తాయించేసుకొంటే బాగుండదు. చదివే వాళ్ళున్నారు. వారిలో కొందరికైనా పద్యానికీ, పదానికీ, కవితకీ, కథకీ తేడా తెలుస్తుంది. ఇదే వ్యాసం మరొక రచయిత ద్వారా వచ్చి వుంటే, ఇలాగే చూసీ చూడక ప్రచురించే వారా? లేక మరింత పదును పెట్టి తిరగ వ్రాయమని పంపేసే వారా?

    [శ్రీశ్రీ కందాన్ని ‘సిప్రాలి, 1987 నవంబర్, విరసం ప్రచురణ, పేజీ 44’ నుంచి తీసుకున్నాం. ఎడిట్ చేయడంలో ఎక్కడో ‘కలదు’ అన్న పదం ఎగిరిపోయింది, చూసుకోకపోవడం మా పొరపాటే. క్షమాపణలు. అచ్చుతప్పులేవైనా కనపడితే పాఠకులు మాకు ఎత్తి చూపటమూ, వాటిని మేము క్షమాపణలు చెప్పి మరీ తప్పు దిద్దటమూ జరుగుతున్నదే, ఇక ముందు కూడా జరగబోయేదే. కానీ, ఇలా నొప్పించే విధంగా, పరదాల చాటు పుంగవులు చేసే ఈ రకమైన అనుచితపు దబాయింపులు ఎంత సమంజసమో సాటి పాఠకులే నిర్ణయించుకుంటారని మా విశ్వాసం – సం.]

  3. నందిని గురించి ఉష అభిప్రాయం:

    02/01/2009 6:12 am

    మాటల్లొ చెప్పలేని అనుభూతి. మళ్ళి చదవాలనే ఆత్రుత. నిజానికి ఒకసారిదివరలో చదివిందే. కొత్త పాళీ గారు మళ్ళీ గుర్తుచేసారు. చాలా చక్కని శిల్పం.

  4. జనరంజని: మహానటి సావిత్రి గురించి SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:

    01/31/2009 4:56 pm

    ఎంత చక్కటి చోటికి వచ్చానండీ. ఎంత చక్కటి శబ్దతరగం. ఇంతకాలంనుండి ఈ చోటుకు రాలేనందుకు బాధపడుతున్నాను.

    సేకరించి ఇక్కడకు లింక్ చేసిన మహానుభావులకు వందనములు.

    మరిన్ని ఇటువంటి చక్కటి శబ్దతరంగాలను అందిస్తారని అసిస్తున్నాను.

    శివరామప్రసద్ కప్పగంతు
    ముంబాయి, భారత్

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Dr.Tatiraju Venugopal అభిప్రాయం:

    01/29/2009 10:39 am

    ‘పట్టి’-‘వట్టి’-సమస్య (జనవరి 5, 2009) (వేణుగోపాల్ – మోహన)
    భకారానికి వకారం యతి సరిపోదనుకున్నాను. మోహన గారు కరెక్టు.

  6. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/29/2009 6:06 am

    నాకు గానీ ..హనుమంతరావు గారికి గానీ శ్రీనివాస్ గారి వ్యాఖ్య మీద అపార్ధం కలిగితే..అందుకు శ్రీనివాస్ గారి వాక్యాలే కారణం. అయినా ఆయన వివరంగా రాస్తానని అన్నారు గనక ఈ సారి నాలాంటి పాఠకులకి మరింత స్పష్టత కలుగుతుందని ఎదురుచూస్తాను. శ్రీనివాస్ గారు నా పేరుని quote in quote లో పెట్టరని ఆశిస్తాను.
    రమ.

  7. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    01/29/2009 4:55 am

    It is really amusing to read the last two comments by “Rama”, attributing things to me that I haven’t said. I stick to my earlier comment, that no bias was made towards Bangaramma for her gender reasons. Nor was I talking about “gossip” and “scandals”. Also, women writings of later years received no less attention. I intend to write a long note responding to “Rama” and Sri KHR’s comments on this thread and submit for publication to this webzine (subject to editor’s approval) in the coming weeks.

    Regards,
    Sreenivas

  8. వానకు తడిసిన పువ్వొకటి గురించి sree rama murthy అభిప్రాయం:

    01/28/2009 10:56 pm

    ఇంద్రాణి గారికి,
    మీ కవితలు పొందికగా ఉన్నాయి.”వానకు తడిసిన పువ్వొకటి” కవిత మంచి పదచిత్రం.ఇలాంటి కవితలు మీరు మరిన్ని రాయాలని ఆశిస్తూ__

    శ్రీరామమూర్తి.

  9. శిలాంతరాళలోలిత రేవతీదేవి గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/28/2009 9:13 pm

    రవి కిరణ్ గారూ..

    తెలుగు కవిత్వం లో మరీ ముఖ్యంగా late80 ల్లో, అలాగే early 90 ల్లో స్త్రీలు అన్ని రకాల ప్రశ్నలూ అడిగేరు. అలా అడిగిన కారణానికి అనేక నిందలూ పడ్డారు. పరుచూరి శ్రీనివాస్ గారి అభిప్రాయం వలన నాకు అర్ధమైందేమంటే ఇప్పటికీ ఎంత చదువుకున్నా ఆలోచనా విధానాల్లో ఏమంతగా తర్వాతి తరాల్లో సైతం పెద్ద మార్పులేమీ లేవని.

    ముందటి తరాల కన్నా అటు పిమ్మటి తరాలు భిన్న సిధ్ధాంతాల విషయంలో [కనీసం అభివృధ్ధి చెందిన దేశాల్లో ఐనా] మరింత సంయమనంతో ఉంటారనుకోవడం అత్యాశేనని శ్రీనివాస్ గారి గొంతు విన్నాక నాకు అర్ధమైంది. అయితే దాని వలన స్త్రీల కవితా సంపదకి వచ్చిన లోటు ఏమీ లేదు. ఎప్పుడైతే తమ కన్నా మంచి వ్యక్తీకరణ ఆడవాళ్ళు చేస్తున్నారని అన్పించినప్పుడల్లా వారి విషయంలో అయితే మౌనం పాటించడమో లేదా వారి రచనల మీద కాకపోతే ఆ రాసిన వారి మీద బురద చల్లడమో అన్ని కాలాల్లోనూ చేసారని మనం గమనించవచ్చు. అందువల్ల శ్రీశ్రీ, బంగారమ్మ గారి కవిత్వం గురించి మాట్లాడివుం టే ఆశ్చర్యపోవాలి గానీ లేకుంటే కాదు.

    scandals మీదకి దృష్టిని మళ్ళించడం తేలిక కదా? మార్పు శాశ్వతం గానీ. ఏ కాలంలోనైనా నీతి శాశ్వతం కాదు. కవితా విశ్లేషణ ఒక శ్రీశ్రీ కవిత్వంకి జరిగినట్టో ఒక కృష్ణశాస్త్రికీ, ఒక నండూరి ఎంకిపాటలకీ జరిగినట్టో, ఇప్పటికీ కవయిత్రుల కవిత్వం గురించి మరింత విస్తృతంగా ఇంకా జరగడం లేదేమని నేను ప్రశ్నించాను. బంగారమ్మ గారు కవిత్వం రాసి ఒక 60 ఏళ్ళు దాటాయా? చర్చఎక్కడన్నా మీరు చది వారా ఆమె కవిత్వం మీద? ఆధునిక కాలంలో సైతం కవయిత్రుల కవిత్వం మీద ఆరోపణలు చేసినంత జోరుగా వారి కవితావిశేషాల మీద చర్చని చేయలేదే? వారి కవిత్వం వచ్చి కూడా రెండు దశాబ్దాలు దాటిందే?? ఈ జాప్యం సమర్ధనీయమా? వాంఛనీయమా అన్నది నా ప్రశ్న. నా ప్రశ్నని పక్కదారి పట్టించ వద్దని నా మనవి.

    రమ.

  10. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Malika అభిప్రాయం:

    01/28/2009 3:47 pm

    నాకు కూడా సంగీతం కాని, సాహిత్యం గురించి కాని ఎమి తెలియదు. Comment చెయడానికి అర్హత లెదు అనుకుంటాను ఎప్పుడు, కాని మీ వ్యాసం చాలా intresting గా ఉంది. త్యాగరాజు గురించి ఇంకా తెలుసుకొవాలని అనిపించెలా చెసారు.
    Thanks