పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి mOhana అభిప్రాయం:

    03/18/2009 6:31 am

    యుగంధర్ గారూ –
    క్షీరసాగరవిహార ఛందస్సు చాల విశేషమైనది. ఈ పాట అమరిక ఇలా ఉంటుంది –
    ప్రతి పాదంలో మూడు భాగాలు, అవి ఐదు, మూడు, మూడు మాత్రలు
    ఐదు మాత్రలు ఐదు, మూడు, మూడు మాత్రలు
    మొదటి మూడవ భాగాలకు యతి, అంత్య ప్రాస.
    ఇలా పాదాలు తీసికొంటే పాదాలకు ద్వితీయాక్షర ప్రాస కూడా చెల్లుతుంది. పాడేటప్పుడు చివరి త్రిమాత్ర చతుర్మాత్రగా అవుతుంది.
    శతమఖాహిత విభంగ శ్రీ రామ శమన రిపు సన్నుతాంగ
    శ్రిత మానవాంతరంగ జనకజ శృంగార జలజ భృంగ
    ఇందులో తకార ప్రాస చెల్లుతుంది. రెండు పాదాలలో శత, శమన, శ్రిత, శృంగార లకు యతి. అంత్యప్రాస ంగతో ఆఖరయ్యే పదాలు.
    ఇందులోని అందమేమంటే రెండవ భాగములోని పంచమాత్ర. ఇది రెండు భాగాలను చేర్చడం మాత్రమే కాక పాటకు ఒక విధమైన తూగు నిస్తుంది. అర్ధ పాదాలకు అంత్యప్రాస ఉంచడం సంస్కృత సాహిత్యంలో తరచుగా చూస్తుంటాము. ఆశ్వాసాంత పద్యాలలో కూడా (ఉదా. మాలినీవృత్తము) ఇది అతి సామాన్యము.

    వృత్తాలలో ఇలాటి అమరికను గురించి నేను ఛందస్సు రచ్చబండ గుంపులో ఎన్నో మారులు చర్చించినది మీకు గుర్తు ఉందనుకొంటాను.

    విధేయుడు – మోహన

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి యుగంధర్ అభిప్రాయం:

    03/18/2009 5:05 am

    రెండవ అక్షరం ప్రాస గురించి నా ఉద్దేశాన్ని మోహన గారు చక్కగా వివరించారు.
    సాయిబ్రహ్మానందం గారూ, త్యాగరాజ కృతులకి వాటి నిర్దిష్టమైన ఛందస్సు ఉన్నదనేది నిర్వివాదాంశం. అన్ని కృతులకీ ఒకటే ఛందస్సు కాదు. ఐతే మరి ఈ ఛందస్సు నియమాలూ సూత్రాలూ ఏవిటీ అన్నది నాకు స్పష్టంగా తెలియదు. కొన్ని కొన్నిటిలో మాత్రా ఛందస్సు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చాలా కృతుల్లో కనబడదు. కనీసం నేను పట్టుకోలేక పోయాను.
    అలాగే ఒక తాళ ఆవృత్తం ఒక పాదమనే సూత్రం కూడా ఏమీ లేదు. నిన్న మీకు వ్యాఖ్య రాశాక అంత్య ప్రాస ఉన కృతి ఏమిటా అని ఆలోచిస్తే క్షీరసాగర విహారా గుర్తొచ్చింది. అందులో కూడా రెండేసి ఆవృత్తాలు ఒక పాదం అనుకుంటే రెండో అక్షరం ప్రాస చక్కగా సరిపోతుంది. చాలా కృతులలో పల్లవి ఒక ఆవృత్తమే అయినా, అనుపల్లవి ఒకటికి మించిన ఆవృత్తాలు ఆక్రమించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    03/17/2009 9:21 pm

    మోహన గారూ,

    మీ వివరణ బాగుంది. మీరు చూపించిన పద్ధతికి అన్ని ప్రాసలూ చక్కగా కుదిరాయి. కానీ సంగీత పరంగా చూస్తే చరణంలో ఒక్కో పాదం తాళానికొక ఆవృతంతో ముగుస్తుంది. ఈ కృతిలో తాళం ప్రకారం మొత్తం నాలుగావృతాలున్నాయి. ఆ రకంగా చూస్తే నాలుగు పాదాలున్నాయననుకోవచ్చు. కాబట్టి ఈ కృతిలో చరణానికి నాలుగు పాదాలున్నాయని అంటారు. ఈ పద్ధతి ప్రకారమే అంత్య ప్రాస గురించి రాసాను.

    మీరు చూపించినట్లుగా రెండేసి కలిపి ఒక పాదంగా ఎలా పరిగణిస్తారో నాకు తెలీదు. కేవలం ఛందస్సు కోసం అలా అనుకోవాలా?

  4. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Kameswara Rao అభిప్రాయం:

    03/17/2009 8:44 pm

    మోహనగారు చక్కగా వివరించారు. ఇది చదవగానే నాకు శంకరాభరణంలోని “బ్రోచే వారెవరురా…” అన్న పాట గుర్తుకువచ్చింది. అందులో కూడా యిలాగే ప్రాస ఉంది కాని పొడవైన పాదాల వల్ల గుర్తించడం కష్టం.
    “ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా
    నీ చరితము పొగడలేని నా చింతదీర్చి వరములిచ్చి వేగమె రా”
    ఇలా ప్రతి చరణంలోనూ ప్రాస ఉంటుంది. ఈ విషయం గమనించకుండా పాట చివరి చరణంలో మార్పు చేసారు.
    “ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా! నా
    పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయిబట్టి విడువకు” అన్న సాహిత్యాన్ని
    “భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు” అని మార్చారు. బహుశా ఇక్కడ “వాసుదేవుడవు” అన్న పదంతో యతి/ప్రాస కోసం ఈ మార్పు చేసారేమో!

  5. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి mOhana అభిప్రాయం:

    03/17/2009 4:22 pm

    వాసుదేవయని వెడలిన పాటను నేను ఈ విధంగా అర్థం చేసికొన్నాను. ఇందులోని చరణాలలో ప్రతి చరణానికి రెండు పాదాలు. ఒక్కొక్క పాదంలో రెండు అర్ధపాదాలకు అంత్యప్రాస. అర్ధ పాదాలకు యతియో,
    లేక ప్రాసయతియో చెల్లుతుంది. రెండు పాదాలకు ప్రాస ఉంది.
    ఉదాహరణ –
    మాటిమాటికిని మీసము దువ్వి మన్మథరూపుడు తానని క్రొవ్వి
    దాటిదాటి పడుచును తా నివ్విధంబున పలుకుచు పకపక నవ్వి

    1. రెండు పాదాలకు ప్రాస (ట-కారము) ఉంది.
    2. మొదటి పాదములో మాటిలోని మా అక్షరానికి మన్మథ లోని మ అక్షరానికి యతి, రెండవ పాదంలో దాటి లోని దా అక్షరానికి విధంబున లోని ధకారానికి యతి.
    3. అర్ధ పాదాలలోని చివరి వ్వి కి అంత్యప్రాస.

    చివరి చరణంలో బాగుకు పతితకు అక్షరయతి, రాగ కు త్యాగ కు ప్రాసయతి. పాటలలో యతియైనా ప్రాసయతియైనా ఉంటే చాలు. పద్యాలలో అక్షరయతి మాత్రమే వృత్తాలలో, జాతులలో ఉంటాయి. ఈ పాట ఒక విధంగా ఉపజాతి వంటిది. యతియైనా ప్రాసయతియైనా అక్కడ చెల్లుతుంది. అదనంగా ఇక్కడ ప్రాస, అంత్యప్రాసలు కూడా ఉన్నాయి.

    విధేయుడు – మోహన

  6. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/17/2009 11:09 am

    యుగంధర్ గారూ,

    కళ్యాణి రాగంలో ఈ కృతి గురించి మూడవ భాగంలో చెప్పాను. చూడండి.
    ఇందులో అంత్య ప్రాస మాత్రమే ఉంది. గమనించగలరు.
    మరోసారి మీకోసం ఈ కృతి మొత్తం ఇస్తున్నాను.

    వాసుదేవయని వెడలినయీ
    దౌవారికుని కనరే

    అనుపల్లవి: వాసవాది సుర పూజితుడై
    వారిజ నయనుని మదిని తలచుచును (వాసు)

    నీరు కావి దోవతులను కట్టి
    నిటలమునను శ్రీచూర్ణము పెట్టి
    సారి వెడలియీ సభలో జుట్టి
    సారెకు బంగరు కోలను పట్టి (వాసు)

    మాటి మాటికిని మీసము దువ్వి
    మన్మథ రూపుడు తానని క్రొవ్వి
    దాటి దాటి పడుచును తానివ్వి
    ధంబున పలుకుచు పక పక నవ్వి (వాసు)

    బాగు మీర నటనము సేయుచును
    పతిత పావనుని తా వేడుచును
    రాగ తాళ గతులను పాడుచును
    త్యాగరాజ సన్నుతుని పొగడుచును (వాసు)

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి యుగంధర్ అభిప్రాయం:

    03/17/2009 10:19 am

    Sir,
    I quote from page 1 of your essay
    “మధ్యమావతి రాగంలో ‘నగుమోమూ కనలేనీ’, శంకరాభరణంలో ‘సీతా కళ్యాణ వైభోగమే’ వంటివి కొన్ని ఉత్సవ సంప్రదాయకీర్తనలుగా పరిగణిస్తారు. ”
    I submit that the song in Madhyamavathi goes “నగుమోము గలవాని నా మనోహరునీ” and not “నగుమోమూ కనలేనీ”.
    On the matter of anthya praasa, please quote an example of a song with anthya prasa where the 2nd syllable prasa was not present.

  8. కథ దేని గురించి? గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/17/2009 8:44 am

    హనుమంతరావు గారూ!!

    “మనసుకి సుఖాన్నివ్వాలి”..అన్న దాన్ని వివరణ ఇవ్వాలని నాకు అన్పించలేదు..కానీ మరొక్క మాట చేర్చాలంటారా?? నొప్పి కల్గించి..అస్తిమితం చేసి ఆ చదివిన దేదో మనకీ అనువర్తించి..చివరికి దాన్ని మరిచిపోవటం అసాధ్యమై..మళ్ళీ మళ్ళీ దాని వైపే ఆలోచన పరిగెత్తి……….ఇది సుఖమా? అంటే అదే సుఖం..నేను చేప్పింది సాహిత్యంలో అలాటి సుఖాన్ని.

    కాఫ్కా నాకు మరీ ఇష్టం. మీరు పేర్కొన్న ఆతని వాక్యం very kafkaesque.
    మంచి వివరణ నా భావానికి. థాంక్యూ.
    రమ.

  9. మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    03/17/2009 7:02 am

    యుగంధర్ గారూ,

    “సారమతి రాగం మోక్షముగలదా కృతిలో ఆరాధ్యదైవం శివుడు, రాముడు కాదు. వీణావాదన లోలుడౌ శివ మనోవిధ మెరుగరు అని ఉంటుంది సాహిత్యం” అని రాసారు. మీరు చెప్పింది సరైనదే! నాదే తప్పు. సంపాదకుల్ని రాముణ్ణి: శివుడిగా మార్చమని అడుగుతాను. రెండు “నగుమోము” కీర్తనలున్నాయి. ఒకటి మధ్యమావతిలో, రెండోది ఆభేరిలో. ఇది తప్పు కాదు.

    “శ్రీగణనాధం కృతి దగ్గర సాహిత్యాంశాల చర్చలో త్యాగరాజు ఎక్కడా రెండో అక్షరం ప్రాస, అంత్య ప్రాస కలిపి వాడలేదు అన్నారు.” నా దగ్గరున్న తొమ్మిదొందల పైచిలుకు కృతులున్నాయి. అందులో ఏ కృతులోనూ ఆది, అంత్య ప్రాసలు ఒకేసారి వాడినట్లు లేదు. మీ ఎరికలో ఏదైనా ఉంటే చెప్పండి.

    మీరు తప్పు ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. సవరించమని సంపాదకులకి నా విన్నపం.

    [తప్పు సవరించబడినది – సం. 3/17/09]

  10. అతడు, నేను, అతడి కథ గురించి యుగంధర్ అభిప్రాయం:

    03/17/2009 6:32 am

    చాలా మంచి వివరణ, విశ్లేషణ, మాధవ్ గారూ. మంచి పోలికల్తో, ఉదాహరణల్తో, చారిత్రక నేపథ్యాల్తో చాలా బాగా రాశారు. ఎటొచ్చీ ఈ కథ ఆత్మహత్య గురించని మాత్రం నేనస్సలు కల్లో గూడా అనుకోలేదు.