పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. బోడి పద్యం గురించి lyla yerneni అభిప్రాయం:

    03/24/2009 3:22 pm

    అఫ్సర్ రచించిన ‘బోడి పద్యం’ నుండి:

    …ఆ తెగిన ముక్క రాల్చిన నెత్తురే
    నా ఇప్పటి పద్యం కదరా!..”

    “..వొళ్లంతా నెత్తుటిబుగ్గ.. ”

    Ouch! Is there a doctor in the house!

    It is some time since I had the bliss of attending a ceremony of ‘Bris Milah.’ How do/should individuals feel at this ceremony? Depends. If బోడి పద్యం = circumcised penis, how should one feel viewing it, in a mixed gathering? Depends.:-)

    The poet/poem draws you into a little fight, right from the time you lay your eyes on the title. ( Great heading. ) On first reading, the poet/poem repels you. You turn away. Then a nasty suspicion springs up. Perhaps the poet is making fun of you. Thus provoked, one can’t help but come back and ask – what the hell do you mean, Sir? What are you saying? Who are you laughing at?

    So one re-reads, and having read;
    the reader would then want to comfort himself thinking – No, the poet would not dare laugh at any one of us, our poetry, our lives. No. It is a self portrait. The poor bugger – he is upset with himself. Upset with his own act of writing an artificial, a contrived poem. That kind of an atrocious act does not seem to sit well with him. It bothers the poet -like AIG ‘s grotesque existence bothers US Fed Chairman Bernanke. It makes him lose his sleep.

    But such simple consoling thought may not suffice. To get the poem out of his system, the reader reads the poem again.

    The reader then muses – The poet is a teacher of literature. He reads lot of poetry of his own students. He reads lot of other poets all over the world, which puts him in the difficult position of being a judge. It perhaps thrusts a responsibilty on him of setting standards for others on how a poem ought to be. Tough job. Nerve racking. Enough to make him smash the silly poems against the walls.

    And, one such horrid artificial poem breaks into thousands of pieces. Look! Each piece creates a broken image. Look! multiple discordant images are lying all over the place. Each broken stanza, oh! even more painful – each broken sentence, phrase, – sings a different song. For Heavens sake! , the pieces do not even sing in one language. There is no one cohesive religious tune. Not one unified theme . Not a single consolidated thought. Nothing makes any sense.

    Surely, such smattered, loudly laughing, poetry pieces makes one restless. Agitated. Their ugliness makes one feel unholy, vulgar and unsanitary. Just like the clashing images of a corporate jet landing in Washington to borrow people’s money. And President Obama’s Airforce One taking off to get to Jay Leno’s late night show to crack jokes to make people laugh. The bank CEO waves thru the window, ( muttering under his breath ” What a joker”) The CEO of USA wags his sturdy index finger and says “Shameful!”

    The onlookers of such images feel unholy, అశ్లీలం all over again , knowing surely they are into new kind of trouble. Yes, Sir! All such imagery, in Afsar’s poem makes the reader, (Me,) unwillingly, disgustedly see – the broken pieces of clashing cultures, trans-racial marriages, transplanted lives, superimposed philosophies, mixed beliefs, mutilated languages, mangled words, cacophonic music, smashed architecture, mashed bodies. In essence , the tormented human spirit. Ouch! ouch!! Jesus! It hurts.

    The sudden outburst of pent up anger released by the poet in the last but one verse -the helpless fury is seen and heard. As vividly as in ‘ The Scream’ of Edvard Munch.

    And after the spent fury of mass human spirit, to see the consolidated final image of one small helpless child -molested, humiliated in public. -left to himself, feeling unholy. Left in a bloody mess, in the very last verse of poem. Allah mia! How it hurts!

    Yes, I like the opening image of a great giant sleeping adult to whose eye lids iron chains are attached and pulled. And the statue breaking. Quite interesting.
    Yes, I like the end image of a submissive infant/ male child sitting on a overturned clay pot – holding a small frail penis in one hand, and a piece of skin in another hand – bleeding from both. Quite interesting.

    If you are an artist, let it bleed. Let it bleed. By all means. Cry all you want.
    But, if you are a doctor, for God’s sake , why such agony over a few words? Really, it is teensy bleeding which can be easily stopped and after all, excised prepuce is a tiny piece of useless skin.

    Not that I mind seeing the naked glans penis -బోడి పద్యం, at all. Do I like it?:-) Not any less than the unruly, wild Siva’s gigantic erectile penis, peeing /ejaculating on every sage who is in his way, in దేవదారు వనము. 🙂
    I like reading and writing such a రేచిక్క / testy poem sometimes. It all depends on my mood.

    లైలా

  2. బోడి పద్యం గురించి teresa అభిప్రాయం:

    03/24/2009 3:18 pm

    ఈ పద్యాన్ని మొదట చదివి ” బాగుంది, విభిన్నమైన థీమ్ కి పద్య రూపమిచ్చారు . టైటిల్ లో కవి sense of humor తొంగిచూసింది’ అనుకున్నాను. ఒక్కొక్క కొత్త కామెంట్ వస్తున్నప్పుడల్లా మళ్ళీచదివాను. అశ్లీలము,,ఈమాటలో ప్రచురణకి అనర్హమూ అని ఎందుకనిపించిందో నాకు అర్థం కాలేదు. కవి పేరు మీద వ్యంగ్య విమర్శలు, విసుర్లూ చూశాక పద్యంలో లేని అశ్లీలత, కుసంస్కారం కామెంట్ల లోనే కన్పించి నవ్వుకున్నాను. అస్తమానూ వాగుల్నో, వంకల్నో, చంద్రుడినో, సూర్యుడినో వర్ణించే కవితలే గాక వైవిధ్యంగా ఈ ‘బోడి పద్యం’ ని అందించిన ఈమాట కి అభినందనలు.

  3. బోడి పద్యం గురించి ప్రవీణ్ అభిప్రాయం:

    03/24/2009 2:24 pm

    రాళ్ళపల్లి గారూ, ఈ బోడి పద్యం రాసింది ముస్లిం అని అందరికీ గుర్తు చేస్తున్నారా? ముస్లిం అయితే ఆయన పేరు మీద పన్ చెయ్యకూడదా? ముస్లిం కాబట్టి ఈ కవితకి కొంచం వెయిట్ ఎక్కువ ఇవ్వాలా?

    మండవ రవిబాబు గారూ, గుజరాత్ లో హిందుత్వ వాదులు వేసిన కరపత్రాలూ ఈ కవిత్వం ఒకటే అంటారా? అది హిందుత్వ వాదులు గుజరాతులో ఇచ్చే కరపత్రమైతే ఇది హైదరాబాదు పాతబస్తీలో ఇచ్చే కరపత్రమా? కరపత్రమైతే కవిత్వం అని ఎందుకూ అనడం?
    ఈ కవిత ఏ ‘విషయం’ చెప్తోందని మీరు అనుకుంటున్నారో కొంచం వివరిస్తారా? తెలుసుకోవాలని ఉంది. మీరు వివరిస్తే, అసలు విషయం జోలికి పోయి చర్చించడానికి నేనూ, ఇంకా చాలామందీ సిద్ధంగానే ఉన్నాం.

    మన లోపలి అశ్లీలాలన్నీ కవిత్వ రూపంలో బయట పెట్టుకోడానికి ‘ఈమాట’ అనుమతిస్తే నేను కూడా పుంఖానుపుంఖాలుగా కరపత్రాలూ, కవితలూ రాయడానికి సిద్ధంగానే ఉన్నాను. సంపాదకులవారూ, ఓకేనా?

  4. బోడి పద్యం గురించి Mandava Ravibabu అభిప్రాయం:

    03/24/2009 11:44 am

    అయ్యా వినీతుల వారూ:

    విషయం జోలికి పోవాలనే ఈ పద్యం చెబుతున్నదేమో! కొంచెం ఆలోచించండి.

    విషయంలోకి వెళ్ళడానికి భయపడె పైన రాసిన బాబ్జీలూ, రమాప్రభలూ గట్రా బాబోయ్ అశ్లీలం అని అసింటా జరిగారు. కవిత్వం పేరుతో అకవిత్వాన్ని, సౌందర్యం , రసం పేరుతో కృత్రిమ పదాల లాలిత్యాన్ని పఠాభి లాంటి కవులు ఈసడించుకున్నారా? లేదా? దిగంబర కవులు ఇంకా ‘అశ్లీలాన్ని’ గుప్పించ లేదా? స్లమ్ డాగ్ సినిమాలో బాలీవుడ్ మలాన్ని పరదేశీ ఎవడొ మన ఒంటి మీద పూసేసినప్పుడు చూసి, ఆస్కార్లు ఇచ్చామా లేదా?

    మన లోపల ఎన్ని అశ్లీలాలు వున్నాయో అవన్నీ ఇంకా కవిత్వంలోకి రావాల్సిందే….గుజరాత్ లాంటి చోట్ల ముస్లిం ఆడవాళ్ల మీద హిందూత్వ వాదులు వేసిన కరపత్రాలు ఒక సారి చదూకోండి. అశ్లీలం అంటే ఏమిటొ తెలుస్తుంది.

    రవి బాబు

  5. కథ దేని గురించి? గురించి baabjeelu అభిప్రాయం:

    03/24/2009 8:41 am

    సీతారామయ్యగారూ, మీ అహ్వానానికి క్రుతగ్యతలు. మీరు ప్రత్యేకించి ఆహ్వానించకపోయినా “పిక్క” సత్తువ వున్న వాళ్ళందరూ తప్పక వస్తారు. ఆహ్వానించిన తరువాత లేని సత్తువ తెచ్చుకుని మరీ వస్తారు. రాలేని వాళ్ళు ఈ మాట తరువాయి సంచికలో ఆ విశేషాల కోసం ఎదురుచూస్తారు.
    అయితే మొక్కుబడిగా చేసెయ్యకండి ఈ వుత్సవాల్ని. చెయ్యరని తెలుసు. అయినా వోపలేక అనడం. ఎందుకంటే ఇలాటి సభల్లో “… వీరందరివీ చారడేసి కళ్ళు.” అని పొగడ్డం సంప్రదాయం. Tradition should be respected but can be broken. దయచేసి సంప్రదాయాన్ని గౌరవిస్తూనే నూతన సంప్రదాయానికి తెర తీయండి.
    శ్రీశ్రీ గురించి రాయను, గోపీచంద్ గారి గురించి రాయలేను. కుటుంబరావు గారి గురించి, కాదు కాదు కుటుంబరావు గారి సాహిత్యం గురించి “లంపెన్ బూర్జువా వర్గాన్ని ఆ వర్గానికి సామాజికంగా సన్నిహితమయిన మధ్యతరగతి కళ్ళతో చూపించడం వల్ల అనివార్యంగా ఏర్పడే శైలి, వ్యంగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వాళ్ళకు సంతృప్తి కలిగించవచ్చుగాని, మార్క్సిస్టు దృక్పథం నుండి ఒక తీవ్రమయిన పరిమితిగానే పరిగణించాలి. ఆ పరిమితే బూర్జువా విమర్శకులకు కుటుంబరావు పట్ల ఉండే సద్భావానికి కారణం (ఉదాహరణకు, వాళ్ళు కుటుంబరావు పట్ల చూపుతున్న ఆదరణ అల్లం రాజయ్యకు ఎన్నటికీ చూపరని నా అనుమానం)” అని బాలగోపాల్ గారు అభిప్రాయ పడ్డారు. దీని మీద చర్చించండి. లేకపోతే మానీయండి.
    బాలగోపాల్ గారి వ్యాఖ్యని పట్టించుకోనక్కర్లేదని మీరు ఖచ్చితంగా నమ్మితే, వదిలీయండి, నమ్మి చెడిన వాళ్ళు లేరు. నమ్మాలో, నమ్మకూడదో తెలియని నాలాటి వాళ్ళు ఇంకొన్నాళ్ళు గిజగిజ లాడతారు.

  6. బోడి పద్యం గురించి sarma rallapalli అభిప్రాయం:

    03/24/2009 6:27 am

    రమ గారు:

    ఈ కవిత ఒక ముస్లిం రాయబట్టి అతని పేరు మీద పన్ చేస్తున్నారా? అఫ్సర్ని అఫ్సరుడు అనీ, absurd అనీ అనడం, ఆ తిక్క కి మీరు చంకలు కొట్టుకోవడం ఎలాంటి సంస్కారం?
    శర్మ రాళ్ళపల్లి

  7. నాచన సోమన చతుర వచో విలాసం గురించి Kameswara Rao అభిప్రాయం:

    03/24/2009 12:26 am

    ప్రసాద్ గారు,
    శ్రమకోర్చి గుర్తున్న గౌరన పద్యాలని ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆ పద్యాలు అందంగా లేవని ఎవరనగలరు! ఇక్కడొక్క చిన్న విషయం స్పష్టం చెయ్యాల్సిన అవసరం ఉందనుకుంటున్నాను. నేను హరిశ్చంద్రోపాఖ్యానం చదవనిది “ద్విపద కావ్యాలపై నాకున్న వ్యక్తిగత అరుచి” వల్ల మాత్రమే అని చెప్పాను. దీని అర్థం నాకు ద్విపద ఛందస్సు నచ్చదనీ కాదు, ద్విపద కావ్యాల మీద నాకు తక్కువ భావముందనీ కాదు.
    మోహనగారు చెప్పినట్టు ద్విపద అచ్చమైన తెలుగు ఛందస్సు, తెలుగు జానపదసాహిత్యమంతా అది కనిపిస్తుంది, పాటలుగా పాడుకోడానికి చాలా అనువైనది. దీనితో నాకే మాత్రం విభేదం లేదు. నాకు కూడా ద్విపదలో ఉన్న ఎన్నో పాటలు నచ్చుతాయి.

    ఇక ద్విపద కావ్యాల విషయానికి వస్తే, నాకవి రుచించనంత మాత్రాన వాటిని తక్కువగా భావించే మనస్తత్వం నాకు లేదు. ఒక కవితో ఒక కావ్యమో మనకి బోధపడనంత మాత్రాన, రుచించనంత మాత్రాన అది మంచి కవితో, కావ్యమో కాదని నిర్ధారించెయ్యడం తెలివితక్కువ పని అని నా ఉద్దేశం.

    ఇంకొక్క విషయం. నాకు ద్విపద కావ్యాలు రుచించకపోవడానికి “పొలిటికల్” కారణాలేవీ (నాకు తెలిసి) లేవు. నేను పద్య కావ్యాలని చదువుతున్నప్పుడు, చాలా వరకూ పద్యాలని బయటకే చదువుకుంటాను, అప్పుడప్పుడు (తప్పని పరిస్థితుల్లో 🙂 మనసులో చదువుకుంటాను. ఎలా చదువుకున్నా, పద్యాల అర్థంతో పాటు (ఇంకా చెప్పాలంటే అర్థం గ్రహించే ముందు) పద్యాలలో నడకని, వాక్య విన్యాసాన్ని ఆస్వాదిస్తాను. అంచేత పద్యాలలో అర్థం ఎంత ప్రధానమో, నాకు పద్య రచనా విధానమూ అంతే ప్రధానం. ఈ విషయంలో చంపూ కావ్యాలు నాకు బాగా ఆస్వాదనీయంగా అనిపిస్తాయి. రకరకాల ఛందస్సులో పద్యాలు, రకరకాల నడకలతో నన్ను అలరిస్తాయి. వడివడిగా కందాలలో సాగుతున్న కథనంలో హఠాత్తుగా ఒక వర్ణన వయ్యారంగా సీసంతో ఎదురైనప్పుడు మనసు ఒక విధమైన ఉత్తేజాన్ని పొందుతుంది. ద్విపద కావ్యాలలో ఒకే రకమైన ఛందస్సు, ఇంచుముంచు ఒకే నడకతో పుటలకొద్దీ సాగుతుంది కదా. ఇది నాకు చదవడంలో అనాసక్తత కలిగిస్తుంది. అంతే! ఇంతకన్నా దీని వెనుక మరే కారణాలూ లేవు. ఇలా నాకు అనాసక్తి కలుగినంత మాత్రాన ద్విపద కావ్యాలు గురించి నాకెలాంటి తక్కువ అభిప్రాయమూ లేదు.

  8. నన్నెచోడుని క్రౌంచపదము గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/23/2009 10:32 pm

    మోహనరావు గారూ!!

    మీకు తెలుగు..కన్నడ ..తమిళ భాషలు క్షుణ్ణంగా వచ్చిన ట్టు కన్పిస్తుంది. ఆసక్తి కరమైన అంశాలని వీటి సాహిత్యాల్లోంచి ఎన్నుకుని పోల్చి ఏదైనా రాయాలని మీకు అన్పించలేదా? అటువంటి శక్తి మీకు ఉన్నప్పుడు..మీరు ఆ తోవలో కృషి చేయగల్గితే..అందువలన ఈ ప్రాచీన ద్రావిడ భాషా సాహిత్యాలకి లాభమ్ కలుగుతుంది.. అలాగే వీటిలో ఉన్న ప్రత్యేకతల గురించీ.. ఇటుపై. తరాల వరకూ కూడా …మీరు చెప్పే తులనాత్మక విషయాల వలన మరింత..మేలు బ హుశా ఉండొచ్చును…అన్న ఆలోచన నాకు కలిగి మీకీ సూచన చేయాలనిపించింది .మీరు కూడా ఆలోచంచండి.
    రమ.

  9. నాచన సోమన చతుర వచో విలాసం గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/23/2009 11:00 am

    ప్రసాదు గారూ!! చంద్రమతి వర్ణన అందంగా ఉంది. ఎంత బాగుందో!! మీకన్నా తెలుగు వచ్చిన వారేరీ?? నాకు కూడా మరి కొన్ని ద్విపదలు గుర్తొచ్చేయి.ద్విపద ధారణకి బాగా లొంగుతుంది.

    రమ.

  10. కథ దేని గురించి? గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/23/2009 10:37 am

    నా అభిప్రాయం బాబ్జీలు గారి అభిప్రాయం మీద చెప్పిందని మీరు మరిచినట్టున్నారు సీతారామయ్య గారూ!! చర్చలో నిరుపయోగం అంటూ ఉండదు. విరసం పాత్ర గురించి కూడా చర్చ జరగటంలో లోటు ఉండనఖ్ఖరలేదు, దాని ప్రతికూల ప్రభావం సృజన మీద పడినప్పుడు.

    ఇది అటుంచితే.. రచయితల్ని సంస్థలు తయారుచేయవు ..అలాగే చంపవు..అని నేనన్నాను. ఇప్పుడూ అంటున్నాను. శ్రీశ్రీ..కాళీపట్నం లని విరసం కాదు కవినీ..కధకుడినీ చేసింది. వాళ్ళలో తదనంతర కాలంలో.. స్వేచ్చగా రాయలేక పోవడంలో విరసం పాత్ర ఉందని పరిశీలనకి స్పష్టంగానే తెలుస్తుంది.ఇదే నేను వివరించి చెప్పాను. అయితే ఇందులో రచయితలుగా ఆయా వ్యక్తుల పాత్ర కూడా అంతే ముఖ్యమైంది.వాళ్ళ సృజనని పరిరక్షించుకోవటంలో వాళ్ళ మెలకువలూ..వాళ్ల మొహమాటాలూ..వాళ్ళ రాజకీయాలూ..వాళ్ళ పరిమితులూ వాళ్ళే అల్టిమేట్ గా నిర్ణయించుకోవాలి గనక. నేను చెప్పింది patterns.. trend setters.. influences.. imitations.. వీటి గురించి. ఇది విస్త్రుతంగా విడిగా మాట్లాడాల్సిన విషయం.

    ఇంక తెలుగు కధల గురించి మీ పరిశీలన లో లోతులేదు. బహుశా మీరు మరింత స్పష్టంగా..విస్త్రుతంగా మాట్లాడివుంటే మీ వ్యాసానికి ఒక రూపం వచ్చి ఉండేది. కధ అన్నది తెలుగులో నిజానికి ఎదగలేదు. మన దగ్గర వస్తువైవిధ్యం.. ప్రక్రియా వైవిధ్యం పెద్దగా కన్పించవు. కధ రాయగల్గిన చతురత కూడా ఎక్కువ మందిలో లేదని తెలుగు కధ దానికదే loud గా చెప్పుకుంటుంది.ప్రతీదీ కధ కాలేదు.కానీ ఆ సంగతిని తెలుసుకోగల కధకులు సంఖ్యలో మన దగ్గర తక్కువ. మన దగ్గర ఇప్పటికీ approved themes ఎక్కువ కన్పిస్తాయి. హిపోక్రసీ లోంచి మేలైన సృజన రాదు. అందువల్ల తెలుగు కధల్లో రుచి ఉన్నవి కొద్ది మాత్రమే!! క్లుప్తంగా ఇది నా అభిప్రాయం. ఇన్హిబిషన్ లేని శైలి లో ‘సమాజపు ఒప్పుదల’ని ఆశించని వస్తువుతో వస్తే తప్ప తెలుగు కధల్ని చదవడం ప్రస్తుతానికి బోరు .

    రమ.