పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16486

  1. నాకు నచ్చిన పద్యం: విశ్వనాథ అపురూప కల్పన గురించి lyla yerneni అభిప్రాయం:

    09/03/2009 1:22 am

    ఇతిహాసాలు, తెలుగు పద్యాలు, వాటిని ఆధారంగా తీసుకు చేసే రచనలు చదవటం నాకు చాలా ఇష్టం. చదివాక సరదాగా చర్చలోకి దిగకుండా ఎలా?
    విశ్వనాథ రచనలు బాగా ఇష్టమే నాకు. ఐనా ఈ పద్యం, ఈ సందర్భంలో, ఈ క్రింది కారణాల వల్ల నాకు నచ్చలేదు.

    “దుర్ముఖి, మహోదరి, విరూపాక్షి, తామ్ర మూర్ధజ, విరూప, భైరవ స్వర,
    దారుణ, వృద్ధ, యర్కప్రసూన కైశిక, రుండమాలా కాంచి, వసాకజ్జల యయ;కంకణ” – అని అప్పటికే శూర్పణఖను వర్ణించి ఉన్నాడు కవి. ఇంత సుందరి శూర్పణఖకు ముక్కూ చెవులూ కోసినంత మాత్రాన ఇంక ఆమెకు కొత్తగా వచ్చే వికారరూప మేమిటి! మళ్ళీ అంత కష్టపడి శూర్పణఖను ఎవరికోసం వర్ణిస్తున్నట్లు?

    ఇంతకీ ఇక్కడ ఇవ్వబడిన సందర్భంలో,
    ఈ రాక్షస స్త్రీని చూస్తున్నదెవరు! ఇంకో రాక్షసుడే. స్వయానా ఆమె తమ్ముడు ఖరుడు.
    ఏదో సగం కాలిన మద్ది, సగం కాలిన కాష్ఠం, ఏదో ఎండిన మట్టల బుల్లీత చెట్టు, పుట్టలున్న వెదురు గుబురు- ఖరుడికి శూర్పణఖ ఇలా ఎందుకు కనిపిస్తుంది! మనుషుల కన్నమద్దిచెట్లు పెద్దవి గానూ, చెట్ల కన్నా రాక్షసులు ఇంకా ఎంతో, ఎంతో పెద్దగానూ ఉంటారనుకున్నా. కాదా? Pygmy రాక్షసులా వీళ్ళు?
    ఎంత ఉన్నత శరీరం లేకపోతే రావణుడు కైలాసగిరిని ఎత్తుతాడు? శూర్పణఖ, ఖరుడు, దూషణుడు, అతని పినతల్లి సంతానమేగా?

    ఏమైనా,
    వాల్మీకి రాసిన రామాయణాన్ని తిరగరాస్తూ -వల్మీకాలున్న వెదురు తోపు లాగా శూర్పణఖ ఉందంటం – విశ్వనాథకు ఉచితమంటారా? 🙂
    పైగా ఆ తర్వాత పద్యంలో,
    ఖరుడు ముక్కూ, చెవులూ తెగి ఏడుస్తున్న పెద్ద అప్పగారిని – హెల్త్ ఇన్స్యురెన్స్ లేకుండా హాస్పిటల్ కి వచ్చిన పేషెంటును చూసినట్లు చూస్తూ- “వనమూలికల్ వెదకి గాయము మాన్పుకొనంగ రాదె..” అంటాడేమిటీ, అదీ నచ్చలేదు 🙂

    మరియు,
    వ్యాస రచయిత రామాయణం రాసిన విశ్వనాథను రావణాసురుడితో పోల్చటం చూశాక – విశ్వనాథ సత్యనారాయణ గాని – ‘Paradise Lost’ చదివి ఒకవేళ John Milton ని Satan తో పోలిస్తే ఎలా ఉంటుందో – అప్పుడు ఆ ఇద్దరు కవులకూ ఎంత 🙂 రావణ రామ యుద్ధం జరిగేదో- perhaps all hell will break loose in the Poets’ Heaven, after reading this essay even now – అని ఊహిస్తూ,

    ఈ అభిప్రాయము వెలిబుచ్చినందుకు అది దూషణగాను, నన్ను ఖరము గాను, కాకున్న శూర్పణఖ గాను ఎంచరనీ, విశ్వనాథ – “కల్పవృక్ష రహస్యములు” అన్న పుస్తకంలో వారే తొలిపలుకులో విమర్శకుల గురించి చెప్పినట్లు -విమర్శ చేసిన నన్ను ఒక పామరస్త్రీ గా మాత్రమే పరిగణిస్తారనీ ఆశిస్తూ,

    పద్యం బాగోక పోయినా, వ్యాసం బాగుందని తెలుపుతూ,

    లైలా

  2. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి sujatha అభిప్రాయం:

    09/02/2009 8:23 pm

    చాలా చాలా బావుంది! ఇలా రాగాల కూర్పు గురించి చదవాలంటే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అవి మళ్ళీ మళ్ళీ పాడుకోవడం, ఇతర పాటలతో పోల్చి చూసుకోవడం …ఆనందకరమైన అనుభవం! రోహిణీ ప్రసాద్ గారికి అనేకానేక ధన్యవాదాలు!

  3. తెలుగు నిఘంటువు గురించి… గురించి Veluri Venkateswara rao అభిప్రాయం:

    09/02/2009 6:14 pm

    మిత్రులందరికీ నమస్కారం.

    నేను ముందుగానే మనవి చేసుకున్నాను; మంచిమంచి సలహాలు కోకొల్లలుగా వస్తాయని. అయితే, ఈ మంచిమంచి సలహాలన్నీ ఆచరణసాధ్యాలా అన్నదే నా అనుమానం.
    విధ్యార్థులకు పనికి వచ్చే నిఘంటువు పునర్ముద్రించడం వద్దని ఎవరు అనగలరు? లేదా, విధ్యార్థులకి పనికి వచ్చే మరొక నిఘంటువు తయారుచేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అంటే నేను కాదంటానా?
    ఆ మాటకొస్తే ఉన్న నిఘంటులన్నీ ఇంటర్నెట్ లో పెట్టించి అందరికీ “ఉచితం”గా అందుబాటులోకి తేవడం మంచిది కాదని ఎవరు అనగలరు? ఇవన్నీ మంచి సలహాలే!

    పోతే, నేను సూర్యరాయాంధ్ర నిఘంటువు, బ్రౌణ్యం (మొదటిముద్రణ ప్రతి) లను ప్రత్యేకించి ప్రస్తావించడాని ముఖ్యకారణం: ఈ రెండు నిఘంటువుల కాపీరైట్ సాహిత్య అకాడమీ వారికి ఉండేది. ఇప్పుడు సాహిత్య అకాడమీ లేదుగా! ఆ కాపీరైట్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి చేతిలో ఉన్నది. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవా? ప్రభుత్వం వారు కావాలనుకుంటే, ఈ రెండు నిఘంటువులనీ వెంటనే పునర్ముద్రించి అందుబాటులోకి తేవచ్చు. అంతకన్నా మంచిపని. ఈ రెండు నిఘంటువులనీ ఇంటర్నెట్ లో పెట్టించి అందరికీ “ఉచితం” గా అందుబాటులోకి తేవచ్చు. ఆతరువాత, తీరిగ్గా ఈ నిఘంటువులను సంశోధించి, పరిష్కరించడానికి పూనుకోవచ్చు. ఆపేరుమీదైనా ఇంకా బ్రతికిఉన్న కొద్దిమంది పెద్ద పండితులకీ(?) కాస్త భుక్తి దొరుకుతుంది.

    ఒకవేళ, ప్రభుత్వం వారు అల్లాంటి మంచి పనులు చెయ్యడం మాకు అలవాటు లేదు అని ఒప్పుకుంటే, అప్పుడు లాభాపేక్షలేని ఏ “సాంస్కృతిక” సంస్థో (ఆటా, తానాలవంటివి అని నాభావం!) ఈ పనికి పూనుకోవచ్చు. కాపీరైట్లు పేరుతో ప్రభుత్వం వారు అడ్డం రామని హామీ ఇస్తే చాలు, శుభం! ప్రభుత్వం వారు “అమ్మ పెట్టాపెట్టదు; అడుక్కో తినానివ్వదు,” అన్న స్థితిలో ఉంటే, అది చాలా విచారకరమైన విషయం.

    ఇతర నిఘంటువులకి కాపీరైట్ ఎవరితో ఉన్నదో కనుక్కొని, వారికి తగు పారితోషికం ఇచ్చి ( ఇప్పించి) అచ్చు వెయ్యడమో, లేకపోతే ఇంటర్నెట్లో పెట్టించి అందరికీ “ఉచితం” గా అందుబాటులోకి తేవడమో చేస్తే, (ఈ పని ఎవరు చేస్తారు అన్నది ప్రశ్న!) అంతకన్నా కావలసినది ఏమున్నది?

    అయితే, ఈ కాపీరైట్ వ్యవహారాలు పరిష్కరించడంలో అడ్డంకులు చాలా ఉన్నాయని నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటాను.

    విధేయుడు,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  4. తెలుగు నిఘంటువు గురించి… గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/02/2009 2:10 pm

    నేను ప్రస్తావించిన “శబ్దార్ధ దీపిక” చాలా మంచి నిఘంటువు. సీతారామాచార్యుల వారి “శబ్ద రత్నాకరం” కన్నా పదాల్ని వివరంగా పేర్కొన్న
    నిఘంటువు. ముసునూరి వేంకటశాస్త్రి గారి మూడవ ముద్రణని 1957 లో సికింద్రాబాద్ నించి దాచేపల్లి నరసయ్య& బ్రదర్స్ వారు
    ప్రచురించారు. ఆనాటి ప్రముఖ పండితులు ఈ నిఘంటువు ప్రాశస్త్యం వివరించి
    పేర్కొన్నారు. బ హుజనపల్లి వారి నిఘంటువుని మ ద్రాసు మిషనరీ సంస్థలు
    ప్రచురించిన కారణాన దాని ప్రతులు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. అదే ముసునూరి వేంకటశాస్త్రి గారి “శబ్దార్ధ దీపిక” ఉపయోగం అధికమైనప్పటికినీ..దాని పున: ప్రచురణ జరగనందువలన అది ఎక్కువ గా అందుబాటులోకి రాలేదు గనక ఇవాళ దాన్ని గురించి శ్రధ్ధ
    పెట్టటం మంచిది. ఏ గ్రంధాలయంలోనైనా. ఈ నిఘంటువు ప్రతి .ఒక్క కాపీ దొరికినా
    కనీసం..నెట్ లో పెట్టైనా..దీన్ని నలుగురి ప్రయోజనానికీ వీలుగా మళ్ళీ అందుబాటు
    లోకి తేవాల్సిన అవసరంవుంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు కన్నా..బ్రౌణ్యం
    కన్నా..శబ్దరత్నాకరం కన్నా కూడా..ముసునూరి వారి “శబ్దార్ధదీపిక “ఉపయోగం
    ఎక్కువ .గనకనే దీని గురించి మరొకసారి చెబుతున్నాను. నిఘంటువుల గురించి
    తెలిసిన వాళ్ళు దీనిని సంపాదించి పరిశీలించ గలరు.
    రమ.

  5. తెలుగు నిఘంటువు గురించి… గురించి Dr.R.P.Sharma అభిప్రాయం:

    09/02/2009 12:41 pm

    తెలుగు నిఘంటువుల విషయంలో ‘ఈ మాట’ వారి ఆవేదనలో ఎంతో అర్థం ఉంది. తెలుగు భాషకు ప్రాచీనభాషాహోదా వచ్చి ఒక సంవత్సరం పూర్తి కావచ్చిన ఈ సందర్భంలో ప్రస్తావించడం సందర్భోచితం కూడా. ఏ భాషాభివృద్ధికైనా నిఘంటువుల అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో సంప్రదాయ నిఘంటువులతో పాటు కొన్ని ప్రత్యేక నిఘంటువులను సిద్ధం చెయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందుకుగాను ప్రత్యేకంగా పండితసభలను ఏర్పాటు చెయ్యాలి.

    ఇక మీరన్నట్లు ఇది చాలా సమయాన్ని తీసుకునే ప్రయత్నం. అయినా వాటిని వేగంగా పూర్తి చెయ్యడానికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలి. విశ్వవిద్యాలయాల తెలుగు విభాగాలు విషయాలను పంచుకోవాలి. అక్కడ ప్రతీ ఆచార్యుడి పర్యవేక్షణలో విద్యార్థిగణాలను ఏర్పాటు చేసి, ప్రాజెక్ట్ వర్క్ గా ఇచ్చి సేకరణలు చేయించాలి. వాటిని ఆ ఆచార్యులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. వారికి కెటాయించిన విషయంలో ఎవరికి వారు వేగంగా పని పూర్తి చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఇంటర్ నెట్ ద్వారా సమాచార వినిమయం చేసుకోవాలి.దీనివల్ల విద్యార్థులకూ చక్కని శిక్షణ కలుగుతుంది. పనిలో వేగం పెరుగుతుంది. ఇటువంటి వాటివల్ల ఎన్నో రకాలైన నిఘంటువులను సిద్ధం చెయ్యడానికి అవకాశం ఉంది.
    ఇక ఆన్ లైన్ లో నిఘంటువులు దొరికితే ఎంత బాగుండూ? అనేది మంచి ఆశనే. ఒక్క నిఘంటువులే కాదు తెలుగులోని ప్రతి పుస్తకం ఆన్ లైన్ లో లభించాలనేది నా కోరిక. అలా లభించడం తెలుగువాడికి ఎంత అదృష్టం?
    ప్రస్తుతం ఆన్ లైన్ లో ఎక్కడో ఒకదగ్గర లభిస్తున్న శబ్దరత్నాకరం వంటి కొన్ని నిఘంటువులను తెలుగుపరిశోధన వెబ్ సైట్ సేకరించి ఒకేచోట అందుబాటులోకి తెచ్చింది.

  6. జమ్మిబంగారం చెట్టు గురించి అపూర్వ అభిప్రాయం:

    09/02/2009 9:13 am

    విభీషణుడు రహస్యాన్ని చెప్పిన సందర్భం ఏమైనా
    దెలీలా ..రహస్యం తెలుకోవడానికి ఏ పరిస్థితుల్లో నియమింపబడినా

    అత్యంత రహస్యాన్ని బయటుకు లాగడం కీలకం
    ప్రతీకలు చాలా బాగున్నాయి

    అభినందనలు

  7. మరోపువ్వు గురించి రాజశేఖరుని విజయ్ శర్మ అభిప్రాయం:

    09/02/2009 7:47 am

    చాలా బాగా రాశారు.

    ” ఆత్మకొక పుష్పంగా ” అని కాకుండా
    ఆత్మ నొక పుష్పంగా అంటే బాగుండేదేమో.

  8. తెలుగు నిఘంటువు గురించి… గురించి mOhana అభిప్రాయం:

    09/02/2009 5:29 am

    మంచి నిఘంటువు ఎంతైనా అవసరమే. నేను సూర్యాంధ్రరాయ నిఘంటువును
    నా కళ్లతో ఇంతవరకు చూచింది లేదు 🙂 కాని ఎనిమిది సంపుటాల నిఘంటువు సామాన్య విద్యార్థులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో? సామాన్య విద్యార్థికి కావలసింది చేతిలో పెట్టుకొని తిప్పి చూసికొని పదాలకు అర్థాలు తెలిసికొనేటట్లు ఉండే ఒక నిఘంటువు. అలాటిది ఎక్కడైనా ఉందేమో? జీ. ఎన్‌. రెడ్డిగారిచే పరిష్కరించబడి 1989లో తెలుగు విశ్వవిద్యాలయంచే ప్రచురించబడిన 868 పుటల “తెలుగు నిఘంటువు (విద్యార్థులకోసం)” బహుశా ఈ కొరతను తీరుస్తుందేమో?
    విధేయుడు – మోహన

  9. తెలుగు నిఘంటువు గురించి… గురించి Sowmya అభిప్రాయం:

    09/01/2009 11:30 pm

    ఆహా…మంచి తెలుగు నిఘంటువు ఆన్లైను లో దొరికితే ఎంత బాగుండు… ఎంచక్కా నెట్లో చదువుతున్నప్పుడు అర్థంకాని పదం కనబడ్డ ప్రతిసారీ ఆ నిఘంటువుకు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదీ నా సందేహాలను పూర్తిగా తీర్చడంలేదు 🙁

  10. ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి Dr.Darla అభిప్రాయం:

    09/01/2009 10:19 pm

    బాబా గారు!
    అద్భుతమైన కవితను పరిచయం చేశారు. ఆ తడబాటు కూడా కవి తన శైలిలో చూపినట్లుంది. అనుభూతితో నిండిపోయింది.
    ”ఆమెలేనితనం వల్ల మరింత చిక్కబడ్డ రాత్రిని వినటానికి
    పచ్చికపై రాలే మంచులా పదాలు హృదయంపై కురుస్తున్నాయి.”
    * * * *
    “రాత్రి గాలి, ఆకాశంలో సుళ్లుతిరుగుతూ పాడుతూంది.”
    ”అదే రాత్రి అవే చెట్లు అదే వెలుతురు
    * * * *
    కానీ మేమిరువురమూ అప్పటిలా లేము”
    నా హృదయాన్నేదో ఆవహించినట్లుందీ కవిత చదువుతుంటే!
    బాబాగారూ! మీది మంచి టేస్ట్!
    అభినందనలు.
    మీ
    దార్ల