పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. అర్థంకాని మాటలు – అర్థమవని కవితలు – గురించి geyamala అభిప్రాయం:

    04/22/2010 5:19 am

    one of the greatest symbolist poets of this century, Gunturu Seshendra sarma discussed this issue in detail in his “kavisena manifesto”. How a poem is made important. A good poem communicates the emotional feelings to the reader even if he could not understand each word. Biragi also extensively used Sanskrit words in his poems. Even Marx and Mao also wrote poems but in classical meter. It is wrong to think that every thing should be understood.

    Seshendra says, ” can all people understand Einstein’s theory of relativity?” Writing for people and writing in their dialect are different issues. That was why many people could not accept, SRI SRI’s ” Ninnati jatkawala” as poetry, though one can understand the meaning of all the words used in that poem.

  2. కత్తి పడవలు గురించి krishna అభిప్రాయం:

    04/22/2010 1:47 am

    చాల బావుంది. చదువుతున్నంత సేపు మనసు సంతోషంగా వుంది. నన్ను ఆ రోజుల్లోకి తీసుకెళ్ళారు.

  3. సా విరహే తవ దీనా గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/22/2010 1:08 am

    తెలుగు పాఠకులని గురించి వదిలేయండి రోహిణీప్రసాదు గారూ!! అసలు సంగీతపు టీచర్లు గా చెప్పుకుంటున్నవాళ్ళకే సంగీతపు పూర్వాపరాలని గురించి ఏ పరిజ్ఞానమూ ఉన్నట్టు కనబడని రోజులివి. ప్రొఫెసర్ సాంబమూర్తి గారి వ్యాసాలనీ ..పుస్తకాలనీ సంగీతంమీద ఆసక్తి ఉన్నవాళ్ళు చదవడానికైనా వీలుండాలి. ఆ లోపం అంటూ ఉంటే అది సంగీతరంగం లోని వారిదే కద?

    ఇక కేవలం సంగీతాన్ని గురించే అంటే అది హిందుస్తానీ పధ్ధతిలోనే సాధ్యం! కర్నాటకానికి సాహిత్యమే ప్రధానమైనది. దక్షిణాదిన సాహిత్యంలేని సంగీతానికి ప్రాముఖ్యత లేదు. ఇదిమీకు తెలియని విషయమూ కాదు. అయినా మీ అసంతృప్తి సాహిత్య పాఠకులమీదికి మళ్ళుతూంటుంది.

    రమ.

  4. తెలగాణెము గురించి ధేశికాచారి అభిప్రాయం:

    04/21/2010 9:55 pm

    శ్రీనివాసుగారూ,
    మీరు భయపడవలసింది కవులకు గాదు, కేవల స్వలాభాపేక్షతో, అధికారదాహంతో ప్రజానీకాన్ని మభ్యపెట్టే ప్రసంగాలూ, కృత్రిమనిరాహారదీక్షలూ చేసే “మతిం దలక్రిందుగ నూహసేయు పార్టీరథచోదకుల”కు. వారి ముందు కవులేపాటి? “కవయః క్రాంతదర్శినః” – అని పెద్దలు పలికిన వాక్యం సత్కవుల పట్ల సర్వదా సత్యం నేటి “పార్టీరథచోదకులు” చేసే స్వార్థపూరితప్రసంగాలు వారి కండ్లముందే బుగ్గిపాలౌతాయి గాని సత్కవుల వాక్యాలు సర్వదా జీవించి సమాజాన్ని సత్పథగామిని చేస్తాయనడం నిర్వివాదాంశం. సత్కవుల సద్వాక్యాలు . సనాతనంగా సమాజాన్ని ఉత్తేజపరుస్తాయనడంలో సందేహం లేదు. వీటికి వెఱవడం ఆత్మభీరుత్వమే కాని అన్యధా కాదు.

  5. రాగలహరి: హిందోళం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    04/21/2010 4:26 pm

    హిందోళం 20వ మేళకర్త “నఠభైరవి” జన్యమే!

    ఎలా చేసానో ఈ తప్పు! సవరించగలరు

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. రాగలహరి: హిందోళం గురించి Rohiniprasad అభిప్రాయం:

    04/21/2010 3:40 pm

    మేళకర్త పేరు నఠభైరవి. దాన్ని తమిళుల పద్ధతిలో నటభైరవి అనో, నడభైరవి అనో అంటే కటపయాది సూత్రం పనిచెయ్యదు.

  7. సామాన్యుని స్వగతం: టెలిఫోనుతో నా అనుభవాలు గురించి శ్రీహర్ష అభిప్రాయం:

    04/21/2010 2:46 pm

    చక్కటి వ్యాసం. మొదలుపెట్టాక చివరకంటూ అలా చదువుతూనే వున్నాను. శైలి, విషయం రెండూ బావున్నాయి.

    మొబైల్ ఫోనులు రాని క్రితం నాకు బాగా గుర్తుండే ఫోను సంగతి – STD కి రోజులో ఒక్కో సమయంలో ఒక్కో రేటు వుండడం – సగం రేటు, పావు రేటు ఇలా. సరిగ్గా గుర్తులేదు కాని, పొద్దున్న ఐదున్నర లేక ఆరు ముందర పావు రేటు వుండేదనుకుంటా. మా అమ్మ వాళ్ల అక్కచెళ్లల్లందరూ పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండగ శుభాకాంక్షలు వగైరా వగైరా… ఆ పావు రేటు వున్న సమయంలోనే చెప్పేసుకునేవారు. పొద్దున్నే ఆ ఫోనులో గట్టి గట్టిగా చెప్పుకునే పండగ పలకరింపులూ, కుశల ప్రశ్నలతోటే మాకు శుభోదయమయ్యేది, పైగా ఎవరయినా ఫుల్ రేటు లో ఫోన్చేసి మాట్లాడుకుంటుంటే, “వీళ్ళు ఎంత దుబారా చేస్తారు? ఎంచక్కా పొద్దున్నే పావు రేటులో మాట్లాడుకోవచ్చు కదా” అని అనేవారు.

  8. సా విరహే తవ దీనా గురించి Rohiniprasad అభిప్రాయం:

    04/21/2010 2:17 pm

    బ్రహ్మానందంగారూ,

    ఈ చర్చలో అందరూ ఉదహరిస్తున్న పాటల్లో చాలామటుకు నాకు తెలియవు కనక రాగాల పేర్లు చెప్పలేను. ఎటొచ్చీ ఏ మాత్రమూ పోలిక లేని రాగాల విషయంలో కనబడుతున్న వ్యాఖ్యలను చదివాక నేను వాటి సంగతి వదిలెయ్యమన్నాను. ఈమాట పాఠకులకు సాహిత్యం మీదున్న అభిమానం, ప్రవేశం సంగీతంలో కనబడటంలేదు కనకనే నేనలా చెప్పాను.

    ఓపిక ఉన్నప్పుడు ఈమాటలో ఒక సంగీతపు విభాగాన్ని మొదలుపెట్టవచ్చునేమో ఆలోచించాలి. నిజమైన సంగీతాభిమానులెవరూ సాహిత్యపత్రికల జోలికి రాకపోవడం కూడా బాధాకరమే. రాగాలనూ, స్వరాలనూ గుర్తించే పద్ధతుల గురించి నేను గత వ్యాసాల్లో కొంత ప్రస్తావించాను కాని మనవాళ్ళకు సాహిత్యం లేని సంగీతం ఒకంతట అర్థం అవుతున్నట్టుగా అనిపించలేదు. పాట గురించి రాయగానే సాహిత్యం గురించిన చర్చ మొదలవుతుంది.

    పబ్లిక్‌గా కాకపోయినా వ్యక్తిగతంగా నాకు ఎవరైనా సందేహాలు పంపితే నాకు తెలిసినంతవరకూ వాటికి సమాధానాలివ్వగలను.

  9. సా విరహే తవ దీనా గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    04/21/2010 1:59 pm

    రోహిణీ ప్రసాద్ గారూ,

    ఈ వ్యాసం సంగీతానికీ, సాహిత్యానికీ సంబంధిచినది కాబట్టి వ్యాఖ్యలు వచ్చాయి. తప్పులేమయినా వుంటే చెప్పండి. సరిదిద్దుకుంటాము. మీ వంటి పెద్దలూ, సంగీత విద్వాంసులూ కొత్త విషయాలూ, దొర్లిన తప్పులూ చెబితే నేర్చుకోడానికి నేను సిద్ధమే! ఎటువంటి అభ్యంతరమూ లేదు. నాకు సంగీతంలో లోతైన అనుభవమూ, పరిజ్ఞానమూ లేదు. కాబట్టి తప్పులు వచ్చే అవకాశముంది.
    మీరు అవి చెప్పకుండా కేవలం సంగీత చర్చ చేయకూడదనడం భావ్యం కాదు. మీ వ్యాఖ్య అభ్యంతరకరంగానూ, బాధాకరంగానూ వుంది. క్షమించండి.

  10. తెలగాణెము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    04/21/2010 1:39 pm

    అభిప్రాయాల్లో సైతం ఆట వెలదులని భరించే ఓపిక తెలుగు వారి స్వంతం.