పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    01/31/2011 2:18 pm

    రమ గారూ

    పుస్తకం తీసుకొద్దామన్న ఆలోచనయితే వుంది. కానీ కార్యరూపం దాల్చడానికే అన్ని అవరోధాలూనూ! ఈమాటలో వచ్చిన వేంటనే కాస్త అత్యుత్సాహ పడ్డ మాట వాస్తవం. ముందుమాటకని ఇద్దరు పెద్దల్ని సంప్రదిస్తే ఒకాయన రాస్తా, రాస్తా అని ఒక్కోనెలా ఊరించారు. ఇంకోరు దీనికి రాయడానికేమీ లేదు, ఈ పుస్తకంలో వస్తువే చాలా పెద్దమాట అని చెప్పారు. మరొకరు సంగీతం గురించి మాకు తెలీదు, రాయలేమన్నారు.
    చివరగా వేటూరి సుందరామ్మూర్తి గారు ఇది నచ్చీ, రాస్తానని మాటిచ్చి ఓ ఆర్నెల్లు తోసారు. ఇలా ఏణ్ణర్థం సాగింది. ఇంతలో ఆయన హరి హరీ అన్నారు. ఈలోగా డిటిపి చేయిస్తే ఒకమ్మాయి రాళ్ళల్లో బియ్యం ఏరుకోండన్న చందంగా చేసిచ్చింది. అది కాదని వేరొకావిడకిస్తే ఆవిడ పెళ్ళి చేసుకోవాలంటూ, త్యాగరాజుని సగంలో వదిలేసింది. ప్రస్తుతం ఒక సీతమ్మ తల్లి చేతిలో రూపు దిద్దుకుంటోంది. ఈలోగా ఈమాటలో రాని కొత్త సంగతులు కొన్ని జోడించాను. బాలమురళి గారిని అడిగితే అసలు ప్రతి పంపమని చెప్పారు. పంపాను.

    ఇహ పబ్లిషర్లంటారా, విశాలాంధ్ర వారిది మరీ పచ్చగా వుందీ, ఎర్రగా లేదన్నారు. ఎమెస్కోవారు చదివి చెబుతామని అన్నారు. బహుశా వాళ్ళు ఒక్కో అక్షరం పట్టి పట్టి చదువుతున్నారేమో తెలీదు, ఎప్పుడడిగినా ఇంకా కాలేదనే అంటున్నారు. చివరికి నా సొంతఖర్చులపై చేయడానికే నిర్ణయించుకున్నాను.

    మే ఆరో తేదీన మా వూళ్ళో ఓ చిన్న సంగీత కచేరీలో ఈ పుస్తకావిష్కరణ చేద్దామన్న ప్రయత్నం. చూద్దాం! చిన్న ప్రశ్నకి చేటంత కథ.

  2. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/31/2011 1:04 am

    వేదుల నారాయణ బాబు గారూ !!

    “కయి” అంటే చేయి అని అర్ధం అండీ! ఇది పాత తెలుగు పదం. ” కై” అన్నదానికి మరొక రూపం అంతే !! ” కైమోడ్పు “”కైవారం” అని ఇప్పటికీ వాడుతూంటాం కదా!! అందులో “కై “మీరు చెప్పిన త్యాగరాజ కీర్తన లోని ఈ ” కయి ” ఒక్కటే ! కయి[కై]బట్టి విడువకు అంటే చేయిపట్టి విడువకు అని.

    నోట్ : గొర్తి బ్రహ్మానందం గారూ మీరు త్యాగరాజ కీర్తనలని గురించి మరికొంచెం విస్తరించి రాసి దాన్ని పుస్తకంగా తీసుకుని రండి. బాగుంటుంది. ప్రతీదాన్నీ ఇలా ఈమాట ఎలక్ట్రానిక్ పేజీల్లోంచే ఎంతకని చదువుకోగలరూ ఎవరైనా?? అన్ని సార్లూ అలా కుదరదు కదా?? అందుకు. ఐతే తెలుగులో మంచి పుస్తకాలకి పబ్లిషర్లు ఉండరు చాలాసార్లు. పెర్సొనాలిటీ డెవెలొప్మెట్ పుస్తకాలకి తప్ప. [తెలుగులు బుక్స్ చదివి గానీ తమతమ పెర్సొనాలిటీలని డెవెలొప్ చేసుకోలేకపోతున్నట్టున్నారు మరి.ప్చ్ ఏం కాలం!! ]. గనకనే మీరు బహుశా మీ వ్యాసాలని పుస్తకంగా తీసుకుని రాలేకపోయి ఉండొచ్చు.అంతేనా లేదా ఇంకేమన్నా కారణమా??

    రమ.

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    01/31/2011 12:15 am

    నారాయణ గారూ,

    మీరు విన్న కీర్తన బలహంస రాగంలోది. నాకు తెలిసి ఈ కీర్తన ఇలా వుంటుంది.

    పల్లవి: దండము పెట్టెదనురా కోదండ పాణి జూడరా

    అనుపల్లవి. అండజ సువాహన మార్తాండ చంద్ర లోచన
    కుండలి శయన బ్రహ్మాండ నాయక నీకు (దండము)

    చరణం. పేరుకా ప్రతిష్ఠకా ఊరుకా నిన్ను నమ్మితి
    ఊరువారు వీధివారు ఒక జాతివారు కారు
    వారిని చేయి పట్టి బ్రోవుము
    త్యాగరాజార్చిత నీకు (దండము)

    మీరు చెప్పినట్లు కయి అన్నపదం తెలుగులోనూ వుంది. కయి అంటే చెయ్యి అని అర్థం. తమిళంలో కూడా చెయ్యి అనే అర్థంతో వుంది. చాలామంది తమిళులు సంగీతం పాడేటప్పుడు కొన్నితెలుగు పదాల వక్రీకరణ వింటూ వుంటాం. ఇలాంటివి పంటిక్రింద రాళ్ళల్లా అనిపించినా, వారికి భాషపై పట్టులేక అని సరిపెట్టుకోవాలి.
    నా దగ్గరున్న రెండు మూడు ప్రతుల్లో చేయి అనే వుంది. ఈ కయి అన్న పదం వాడడం వల్ల అర్థం చెడకపోవడం యాదృచ్చికం తప్ప మరేమీ కాదు.

    ఆ మధ్య ఒక సంగీత కచేరీలో ఒక తమిళావిడ “మా జానకి చెట్ట పట్టగా మహరాజువైతివి” అని పాడడానికి బదులు
    “మా జానకి చేట పట్టగ మహరాజువైతివి” అని పల్లవందుకునే సరికి ఒక్కసారి ఉలిక్కిపడి, దేవుడా అనుకొంటూ ఇంటిముఖం పట్టాను. ఇలాంటివి తెలుగు వాళ్ళు ఖండించరు. అలా చెయ్యడానికి వాళ్ళు సంగీత కచేరీలకి వెళితే కదా?
    – సాయి బ్రహ్మానందం గొర్తి

  4. నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    01/30/2011 11:08 pm

    ‘సీత నెరుంగకుండ రఘుశేఖరుడర్థము గాడు పూర్తిగా’ అన్న వాక్యాలు మనన్సుని చలింపచేసాయి. వర్ణన చదువుతుంటే, సీతా దేవిని కళ్ళతో చూస్తున్నట్టే వుంది.
    రామాయణం వున్నంత కాలమూ, విశ్వనాథుడూ వుంటారు.
    అది రమణీయం.
    ఇది చిరస్మరణీయం.
    మీకు నచ్చిన పద్యం నాకూ ఎంతగానో నచ్చింది.మనసుకి హాయినిచ్చింది.
    మీకూ, ఈమాట వారికి నా అభినందనలు.
    కవి సామ్రాట్ కి నా సుమాంజలులు.
    అభివందనములతో _
    ఆర్.దమయంతి.

  5. చేరా కు ఒక శతమానం గురించి మోహన అభిప్రాయం:

    01/30/2011 6:40 pm

    చేరాకు శతకాలంటే యిష్టం. శతకాలు కవి స్వేచ్ఛాప్రియత్వానికి ప్రతీకలు అంటారు చేరా. సంపత్కుమారులే ఇది సరదా రచన అని చెప్పుకొన్నారు. ఛందఃశాస్త్రములో ఉద్దండులైన సంపత్కుమారులే సరదాకు కావాలనే కొన్ని నియమాలను ఉల్లంఘించినట్లు చెప్పుకొన్నారు. ఇందులోని అన్ని పద్యాలకు మకుటం చేరాయే. ఇది డైలాగు కాదు, మానోలాగే. ఈ పుస్తకాన్ని ఆచార్యులు చేరాగారి సతీమణి శ్రీమతి రంగనాయకికి అంకితమిచ్చారు. ఈ శతకాన్ని ఆధారం చేసికొని ఆచార్యులను అంచనా వేయడము తప్పని నా వైయక్తిక భావన. విధేయుడు – మోహన

  6. మెరుపు గురించి akella ravi prakash అభిప్రాయం:

    01/30/2011 8:17 am

    మీ కవిత బాగున్నది. అన్నిటికన్నా మీకవిత నచ్చింది.

  7. మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి narayana babu vedula అభిప్రాయం:

    01/30/2011 3:35 am

    Ayya gorti garu,

    I am deeply indebted to you for having presented and enhanced my interest in సంగీతం. Pl. clarify a doubt in this immature సంగీత పిపాసి as I am a very tiny particle in your ocean of knowledge about musicology.

    నేను విన్న ఒక కీర్తనలోని పదం “కయి”. కీర్తన “దండము పెట్టెనురా కోడండపాణి చూడరా”. చరణం “పేరుకా ప్రతిష్టకా వూరికా నిను వేడితి, వూరు వారు వీధి వారు వొక్క జాతివారు కారు వారిని కయి బట్టి విడువకు త్యాగరాజార్చిత నీకు దండము పెట్టెనురా”

    Is “కయి” not a tamil word for hand? Another doubt why Tamil is called “ARAVAM” in telugu?

    mee abhimaani
    narayanam babu vedula

  8. నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:

    01/29/2011 8:58 pm

    పద్యము సొగసుగా ఉంది. శ్రీమాన్ చీమలమర్రి బృందావన్ రావు గారి వర్ణన మనోహరముగా ఉన్నది. వారికి ధన్యవాదములు.

  9. కవిత్వ మీమాంస గురించి lyla yerneni అభిప్రాయం:

    01/29/2011 12:15 pm

    చాలా బాగుందండి వ్యాసం. కవిత్వం గట్రా ఏమైనా వ్రాస్తుంటే గాని, ప్రతికొన్ని నెలల కొకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకుని, ఆలోచించుకుని, బుర్ర మళ్ళీ సరిగా ట్యూన్ చేసుకోవల్సిన వ్యాసం.

    థాంక్స్.

    లైలా

  10. ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:

    01/29/2011 7:34 am

    ఈ విషయం మీద నేను చాలా చోట్ల చర్చించాను కాబట్టి చర్విత చర్వణం అవుతుంది అని చర్చలోకి ప్రవేశించ లేదు.
    కవిత్వ మీమాంస అన్న వ్యాసంలో రెండవ భాగం కవిత్వ మీమాంస అన్న శీర్షిక కింద నా ఆలోచనలు చూడగలరు.అలాగే ఈ సంభాషణలో మూడవ ప్రశ్నకు నేనిచ్చిన జవాబు కొంతవరకు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది.

    చేరా ఆచార్యుల గారి చర్చ గురించి నేను చాలా విన్నాను. కానీ, ఆ పుస్తకం సంపాదించి చదివినప్పుడు (1990 లలో) నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ‘vers libre ‘(free verse) గురించి వీరిద్దరూ పట్టించుకోక పోవడం. చారిత్రక నేపథ్యాన్ని విస్మరిస్తే చర్చలో పదును పోతుంది, ఎన్ని విలువైన విషయాలను ప్రస్తావించినా. సమస్య మూలాలను వదిలి అనేకానేక విషయాలు చర్చించడం వల్ల ప్రయోజనం శూన్యం. ఏది ఏమైనా ఈ చర్చ చరిత్రలో భాగమే కనుక తప్పక చదవ వలసిందే.

    శుష్క వచనాన్ని, శుద్ధ కవిత్వాన్ని విడదీసేది భావనా శక్తి. వచనంలో మామూలు తర్కంతో బండి నడుస్తుంది.ఎక్కువ ఖాళీలు ఉండవు. పాఠకుని ఊహా శక్తికి మేత వేయడు రచయిత. దానికి భిన్నంగా కవి పాఠకుని భావనా శక్తిని పరీక్షిస్తాడు. కవిత్వంలో తర్కం లేదు అన్న వితండ వాదం చేయడం లేదు నేను. తర్కాన్ని మించిన భావనా బలం కవితకు ప్రాణం. దాన్ని పాఠకునిలో స్ఫురింప చేయడానికి పాదకల్పన అవసరమవుతుంది. పాదకల్పన కంద పద్యాల్లోనో ఆటవెలదిలోనో ఉన్నట్టు కాకుండా స్వేచ్చగా ఉంటుంది. పాఠకునికి కవి తాను చూసిన జగత్తును చూపి తద్వారా తాను పొందిన అనుభవాన్నిసూచించడానికి సాధనం పాదకల్పన. పాద కల్పన లేకుండా , వాక్యం తరువాత వచ్చే వాక్యం ఒక తర్క ధోరణిలో పడి పోతుంది. వాక్యాల మధ్య అన్వయం హేతుబుద్ధికి అందుతుంది. కవిత్వంలో వాక్యాల మధ్య అన్వయం
    హేతుబుద్ధిని దాటిన భావనా శక్తికి సంబంధించినది.దాన్ని సాధించడానికి ఒక సాధనం పాద కల్పన.కవితకు ఒక క్రమం, నడకా,నిర్మాణం ఉన్నాయి మరి. అంతేకాదు,పాదకల్పన లేకుండా కవితలోని ఎత్తుగడ అర్థం కాదు.లయ అవగతం కాదు.

    చివరికి చెప్పేదేమిటంటే వచనం రేఖీయం(linear). కవిత వృత్తం. అది ఎలాంటి వృత్తం? దాని గణితం జోలికి పోవడం అభిప్రాయాన్నిమించిన చర్చ.

    ఈ విషయంలో ఇస్మాయిల్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవడం ఉపయోగిస్తుంది.

    “ఆధునిక కవిత్వానికి వచన కవిత్వ మనే దౌర్భాగ్యపు పేరు ఎవరు పెట్టారో కాని,నిజమే ననుకొని శుష్క వచనం రాసేస్తున్నారు చాలామంది.వచనంలాగే కవిత్వానికి ఒక క్రమం, నడకా,నిర్మాణం అవసరం లేదని వీళ్ళ అభిప్రాయం.ఆ మాట కొస్తే,వచనానికి కూడా క్రమం, నిర్మాణం కావాలి కదా!మనం మాట్లాడే భాషే మన అనుభవాన్ని,ఆలోచనల్నీ క్రమబద్ధం చేసే ఉపకరణం.కవిత్వం జీవితానుభవాన్ని క్రమబద్ధం చెయ్యటమే కాదు, వాటి చాటునున్న అర్థవత్వ్తాన్ని కూడా ఆవిష్కరిస్తుంది.” (నిశ్శబ్దంలో నీ నవ్వులు, నా కవితా సంకలనానికి రాసిన ముందుమాట , భూషణీయం నుంచి.)

    కామేశ్వర రావు గారూ ,
    ఇప్పటికి మీ మొదటి ,మూడవ ప్రశ్నల కు సమాధానం వచ్చిందే అనుకొంటున్నాను. ఇక మిగిలింది రెండవ ప్రశ్న.
    ౨.
    ” అ.ఆ కవితలు పాదబద్ధమవ్వాలని కాని,
    ఆ. పాదాలుగా విభజించిన వాటికి నిర్దిష్టమైన సూత్రాలు ఉంటయని/ఉండాలని కాని అనుకోవడం సమంజసమా?”
    ( అ. ఆ లు నావి , స్పష్టత కోసం )

    ‘vers libre ‘(free verse ) స్ఫూర్తితో ఆలోచిస్తే (ఆ )సమంజసం కాదు. కానీ, ‘vers libre ‘(free verse ) పాద కల్పనకు వ్యతిరేకం కాదు. ఫ్రెంచి కవులు బిర్ర బిగుసుకుపోయిన ఛందో నియమ నిబంధనలను అతిక్రమించి వాటిని పాటించడమే కవిత్వం కాదు వాటికి బయట కూడా కవిత్వం ఉంటుంది అని చెప్ప దలుచుకున్నారు. (మోహన గారి విలువైన అభిప్రాయం చూడండి పద్యం కూడా ఒక రకమైన వచనమే).ఈ స్ఫూర్తిని గ్రహించిన కవులు చాలా వరకు అన్ని భాషల్లోనూ వారికి తోచిన రీతిలో పాద కల్పన పాటించారు. జర్మన్ , రష్యన్ లో అంత్య ప్రాసలు వదులుకో లేదు అక్కడి కవులు.(ఈ విషయంలో ఈ నాటికీ రష్యన్లు అమెరికన్ లను ఎద్దేవా చేయడం నేను ప్రత్యక్షంగా చూసిన విషయం.) సారాంశం ఏమంటే ఈ స్ఫూర్తిని గ్రహించి, నీ భాషకు ఏది అందమో దాన్ని వదలకుండా కవిత్వ రచన చేయాలి.

    ఇక మిగిలింది prose -poem . కవిత్వాన్ని బహువచనాల బారీ నుండి కాపాడడానికి పుట్టుకొచ్చింది అంటారు Robert Bly. శ్రీ శ్రీ కవిత్వం తీసుకోండి పతితులారా భ్రష్టులారా ..అన్నీ బహువచానాలే. రాజకీయ కవిత్వంలో ఇది తప్పదు. కానీ , ఇది కవిత్వానికి చేటు చేస్తుంది. మనం చూసేది ఒక్కొక్క వస్తువునే. వస్తు సముదాయాలను కాదు. ఈ ఎరుకతో రాసేది prose -poem ఇది కూడా ముందు ఫ్రెంచి కవులే సాధించి చూపారు. ఎక్కువ వివరాలకు Talking All Morning, పుస్తకంలో On Writing Prose Poems అన్న ఇంటర్ వ్యూ (1975 లో వచ్చింది.). అలాగే తొలినాటి ఫ్రెంచి కవుల కవితా సంగ్రహం సవిమర్శకంగా చదవాలి.

    మన విమర్శకులకు పరభాషా సాంగత్యం లేక చాలా చేటు జరిగింది. పట్టు మని పది భాషల్లో వచ్చిన విమర్శలు చదవరు. అనువాదాల మీద శ్రద్ధ లేదు.చరిత్ర తెలుసుకోరు.ఆధునిక కవిత్వం దాని విమర్శ ఒక ప్రత్యేక విభాగం అన్న స్పృహే లేదు. పిండి కొద్దీ రొట్టె. శుష్క వాదాలు శూన్య హస్తాలు. ఇక జాలింతును; స్వస్తి.

    తమ్మినేని యదుకుల భూషణ్.