పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి Sowmya అభిప్రాయం:

    03/05/2011 12:39 am

    అద్భుతమైన వ్యాసం! అందించినందుకు ధన్యవాదాలు!

  2. ఇల్లు విడిచి పోతావా రమణా? గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/04/2011 6:57 pm

    రమగారూ,

    మీకూ, నాకూ నచ్చినా నచ్చకపోయినా నోరు తిరిగే పండితులకి నచ్చచ్చు. ఈ పాటలో సంగీతంతో ఏ పేచీ లేదు. ఇబ్బందల్లా మాటలతోనే!
    సాహిత్యాన్ని సంగీతానికి ముడివేసినప్పుడే కుదర్లేదు. అక్షరాలు స్వరాల్లోకి ఒదగ లేదు. ఇది నా అభిప్రాయం. భావం అంటారా? దాని మీదే కదా మాటలు పేరుస్తాం?
    ఇల్లు విడిచి పోతావా రమణా?
    గుళ్ళవెంట పోవుట తగునా?
    అని రెండు పాదాలతో పల్లవుంటే పాడుకోడానికి సౌలభ్యంగా వుండేది కదానిపించింది. కంచులా వున్న మన మాటలు కనకమవ్వవుకదా?

  3. ఈమాట ప్రచురణలో చిన్న మార్పు గురించి lyla yerneni అభిప్రాయం:

    03/04/2011 6:42 pm

    ఈమాట ప్రచురణ నియమాలలో ఒక చిన్న మార్పు, ఈ సంచిక నుండీ చేస్తున్నాం. …
    …అదేమిటంటే: ధారావాహికలుగా ప్రచురించబడే సాహిత్య వ్యాసాల కొత్త భాగాలను సంచికల మధ్య వ్యవధిలో నెలకొకసారి గానీ, 15రోజుల కొకసారి గానీ ప్రచురించబోతున్నాము….అయితే ఈ మధ్యంతర ప్రచురణ కేవలం అప్పటికే ప్రారంభమయి, ధారావాహికలుగా వస్తున్న సాహిత్య వ్యాసాలకి మాత్రమే ప్రస్తుతం వర్తిస్తుంది.

    సంపాదకులు.

    సరిగా తెలియలేదు. అలా ధారావాహికలుగా ఇప్పటి వరకూ మీరు ప్రచురించిన వ్యాసాలు ఏవి? ఏ వ్యాసాలకు ఈ మార్పు ప్రస్తుతం వర్తింపచేయ సంకల్పించారు? Which essays are being ‘grand fathered in’ ?

    థేంక్స్
    లైలా

    [సాయి బ్రహ్మానందం గొర్తి “మనకు తెలియని మన త్యాగరాజు”, ప్రస్తుతం కనకప్రసాద్ రాస్తున్న “మూడు ప్రశ్నలు” ధారావాహికలుగా ప్రచురించిన, ప్రచురిస్తున్న వ్యాసాలకి ఉదాహరణలు. – సం.]

  4. భాషల ఋతువు గురించి Madhu Mahesh అభిప్రాయం:

    03/04/2011 5:18 pm

    చాల బాగా, ప్రతి ఒక్కరి మనస్సులను తాకేల వ్రాసారు.

  5. ఇల్లు విడిచి పోతావా రమణా? గురించి మాగంటి వంశీ అభిప్రాయం:

    03/04/2011 2:52 pm

    కనకప్రసాదు గారు – పేరి పద్మావతి గారి గొంతు చాలా బాగుంది. బ్రహ్మాండం. అద్భుతం.

    నాలిక మడతేస్తే ముద్ద మాటలొచ్చి ఓలు మొత్తంగా సాహిత్యానికే ప్రమాదమొచ్చే ప్రమాదం ఉన్నది కాబట్టి పాట ఇప్పటికి ఇలాగుంచెయ్యండి. కాకుంటే అల్లా ఓ సారి ఆ మూడో చరణంలో నాలుగో లైనులో “పన్నగ సాయికి లేదీ” అని కళ్ళకు కనపడి, “పన్నగ శాయికి లేదే” అని చెవులకు వినపడి కొద్దిగా గందరగోళకా-గగ్గోళకా పరిస్థితి ఎదురయ్యింది. ఓ సారి సరిచూసి ఏది కరకట్టో వివరించగలరు…:)

    భవదీయుడు
    మాగంటి వంశీ

  6. ఇల్లు విడిచి పోతావా రమణా? గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/04/2011 2:25 pm

    గొర్తి బ్రహ్మానందమ్ గారూ !! మీకు కొంచెం సంతృప్తి ఉండాలండీ !! ఎందుకంటే ఇప్పుడీ పాటలో కనీసమ్ తెలుగు పదాల మధ్య ఒక లింకు లాంటిది ఏదో ఒకటి ఉన్నట్టుగా కనిపించడమ్ లేదూ?? కదా?? ఇదివరకటి కనకప్రసాద్ గారి గేయాలతో పోలిస్తే ఇప్పుడు ఆయన కొంచెమ్ నాలాంటి మామూలు వారికి సైతమ్ తెలిసిన తెలుగేదో రాయడానికి ప్రయత్నం చేశారు కద! అదే మాబాగు.మీరందుకు మెచ్చుకోరేమీ??

    ఆ పద్మావతి గారు అంత మంచి గొంతు పెట్టుకుని ఏ శ్రీ రంగమ్ గోపాల రత్నం గారి లాగో అన్నమయ్య పదాలని తన శ్రావ్యమైన కంఠం తో తన్మయంగా … లోకులందరూ పరవశించేలాగా ఆలపించకుండా ఇలా” ఇల్లువిడిచిపోతావా ……ర..మ..ణా!! అంటూంటే చెప్పొద్దూ ప్రాణం ఉసూరుమంటోంది.

    రమ.

  7. కథ కథ గురించి అచంగ అభిప్రాయం:

    03/04/2011 8:31 am

    రచయితగారూ, బ్రహ్మానందం గారి అభిప్రాయంతో నూటికి నూరుపాళ్ళూ ఏకీభవిస్తున్నాను.

  8. భాషల ఋతువు గురించి అచంగ అభిప్రాయం:

    03/04/2011 8:24 am

    సాంఘిక జీవనములో, అదీ నేటి ప్రపంచములో ఇతరభాషల సాయం అత్యవసరమే…… తెలుగువారందరమూ ఒక్కవిషయం ఆలోచిద్దాం. శబ్దములో శ్రావ్యతా, రూపములో ఆధునికతా ఉన్నా ఎందుకు మనకి ఈ పర భాషల మోజు? సమకాలీన రచయితల రచనలలో మరీ ముఖ్యంగా కవితలలో కూడా ఆంగ్లపదాల విరివి నన్ను బాధించింది.
    అదృష్టవశాత్తూ చాలా పెద్ద విషయాన్ని మూడుముక్కల్లో చెప్పారు.

  9. ఈమాట గురించి గురించి అచంగ అభిప్రాయం:

    03/04/2011 8:16 am

    సంపాదక వర్గానికి,
    తెలుగులో తెలుగును బ్రతికించుకోవాలని ఆరాటపడేవారిలో నేనొకడిని. నేటి తెలుగులోకి ధారాళంగా వస్తున్న పరభాష పదాలకు సమాన తెలుగు పదాలను సూచించే వేదిక, చర్చా వేదికను అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
    ఉదా:
    ఇంటర్నెట్: అంతర్జాలము.
    బల్బు: బుగ్గ.

  10. విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Subramanyam.Ravuluri అభిప్రాయం:

    03/04/2011 7:00 am

    Shyamala rao garu,
    I also read the books vijaya nagara samrajya naval malika in 1960-65. i am not sure whether it was Vidya nagara navala maallika. The kannada writers are Korati sreenivas puram brothers and i don’t remember who translated them in to Telugu .The series covered the history prior to Vijaya nagara kingdomalso. There are 20 books in the series and few titles in my memory are Devagiri durgamu, Devagiri Pathanam, Kampila rayalu,Rajoydayamu and towlaveswarudu.These books were part of Erramanazil colony library. As rightly said by you keeping the historic authenticity of books aside ,they are books evinced great interest.. I wish these books are published once again for the benefit one and all.

    Subramanyam.Ravuluri,.Hyderbad