పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. ఈమాట గురించి గురించి Suresh Babu Kosana అభిప్రాయం:

    03/14/2011 7:14 am

    ఈమాట సంపాదకులకు మరియు కార్యవర్గ సభ్యులకూ అభినందనలు,
    ఈ మాటల”స్రవంతి” ఎప్పటికీ ప్రవహిస్తూండాలని ఆకాంక్షిస్తున్నాను.
    కొసన సురేషు బాబు

  2. ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి BEVARA GOVINDU అభిప్రాయం:

    03/14/2011 5:17 am

    కధ చాలా బాగుగా ఉన్నది.రచయిత రచనా విధానాము చాలా ఉన్నతముగా ఉన్నది.

  3. కథాశిల్పం గురించి v.Haish Kumar అభిప్రాయం:

    03/14/2011 4:47 am

    This is very good story.

  4. About eemaata గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/14/2011 2:56 am

    మీ పత్రికలోని రచనా నిర్వహణలో ” పీర్ రివ్యూ” ముఖ్యమైన విధానంగా ముందునించీ మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఆ “పీర్ “లు ఎవరో… సృజనని తీర్చిదిద్దటంలో వారి వారి స్థాయి ఏమిటో మాత్రం మీరు ఎప్పుడూ స్పస్టం చేయలేదు. మీ పత్రికా నిర్వహణ గురించి మీరు ఏం చెప్పుకున్నా… ఆ పధ్ధతిలోని ప్రత్యేకత మీ పత్రికలో ప్రత్యక్షంగా కనిపించాలి. ఈసారి దమయంతి కవిత చూస్తే ఆమె రచనలో పదాల తప్పులని కూడా సవరించలేని ఆ పీర్ రివ్యూదారులెవరు? అని గానీ..లేదా మీరసలు నిజంగా మీరు చెప్పుకున్న విధానం లోనే మీ పత్రికని నిర్వహించగలుగుతున్నారా? అనిగానీ …చదువరులకి సందేహాలు తప్పక వస్తాయి. రచనలోని ప్రాధమిక దోషాలని కూడా సవరించలేనప్పుడు మీ సంపాదకమండలి.. అలాగే ఆ రచనని చదివి దాని గురించి చెప్పడానికి పూనుకున్న ఇతరులు పత్రికమీద అయితే తగిన శ్రధ్ధనైనా చూపించడం లేదని అనుకోవాలి. లేదా తప్పులని గుర్తించగలంత భాష …ఈ అందరిలోని కూడా లేదని అనుకోవాలి పాఠకులు.

    రమ.

    [ఈ సంచికలో అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు మేమూహించని విధంగా మామూలు కంటే ఎక్కువగానే ఉన్నాయి. క్షంతవ్యులం. – సం.]

  5. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి వినీల్ అభిప్రాయం:

    03/13/2011 8:30 am

    బ్రహ్మానందం గారు, వ్యాస విషయానికి అసంబంధితమైనా ఎప్పట్నుండో అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న. చాలా మట్టుకు పాటల్లో అంత్యప్రాస ఉంటే ఆది/రూపక తాళాల్లో ఉండడం, ద్వితీయ అక్షర ప్రాస ఉన్న చోట ఖండ/మిశ్ర చాపు తాళాలు వాడటం గమనించాను. ప్రాసకు తాళాలకు ఏదైనా సంబంధం ఉందా? ఈ విషయం గురించి ఎక్కడైన చర్చ ఉందా? (నేను చెప్పేది చాలా మట్టుకు రామదాసు/తూము నరసింహదాసు కీర్తనల్లో చూడగలం).

  6. సిరుల సంక్రాంతి గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/13/2011 6:32 am

    అరుణ్ చంద్ర గారూ,
    మీ వూరి జ్ఞాపకాలు బాగున్నాయి, చెబుతూంటే.
    మనమెంత దూరం వెళ్ళినా, వున్న వూరు, కన్నవారు అంతరాన వుంటూనే వుంటారు. సహజమే.
    మీకునూ నా కృతజ్ఞతలు.
    ఆర్.దమయంతి.

  7. భాషల ఋతువు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/12/2011 12:34 am

    సరళంగా ఉంది.బావుంది కూడా.

    పలచగా కూడా ఉందేమో…

    “బలానికి పాలు/జేబులో బలపాలు”? హార్లిక్స్‌ ప్రకటన గుర్తుకువస్తున్నది.

    “ఎన్ని విస్ఫోటనాలెదురైనా సరే ఇక దీన్ని తలకెత్తుకోక తప్పదు” అన్నంత తప్పనిసరితనంలో పుట్టలేదనుకుంటా ఈ కవిత.

  8. నిరాశకై ఆశపడుతూ… గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/11/2011 11:19 pm

    ఒకటి సురేశ్ గారు చెప్పిందే: “తెలవారదేమో స్వామీ”). ఇంకోటి “చందమామ రావే” (“కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే/గగనపు విరితోటలోని గోగుపూలు తేవే”)

    సురేశ్‌ గారూ, చెలువ బదులు చెలిమి అంటే సరిపోతుంది. చెలువు అన్నా సరిపోతుంది.

    [తప్పులు సవరించాం. సూచనకు కృతజ్ఞతలు – సం.]

  9. నిరాశకై ఆశపడుతూ… గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/11/2011 9:45 pm

    నమస్కారమండి, సురేశ్ కొలిచాల గారూ!

    గుర్తుతెచ్చిన గీతాలకు కృతజ్ఞతలు.
    అభినందనలతో-
    ఆర్.దమయంతి

  10. నిరాశకై ఆశపడుతూ… గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/11/2011 10:01 am

    “కెందామరలు”, చెలిమిమీర” అంటే సరిపోయేదెమో!

    నాకు గుర్తుకు వచ్చిన రెండు పాటలు “తెలవారదేమో స్వామి (మక్కువ మీరగ … చెలువము నేలగ)”, “చిరుగాలే వింజామర, చిట్టిపాపే కెందామర” (సీతారామశాస్త్రి కాదు).