పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16484

  1. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Kameswara Rao అభిప్రాయం:

    03/18/2011 4:53 am

    శ్రుతపేయం తప్పు, శ్రుతిపేయం ఒప్పు. శ్రుతపేయం అని ఎక్కడైనా ఉంటే అది అచ్చుతప్పై ఉండవచ్చు. శ్రుతి అంటే చెవి. శ్రుతము అంటే వినబడునది (heard about or of).

    ఈ రెండు చోట్ల ఉన్నది “శ్రు” కాని “శృ” కాదు.

  2. మేఘాంగన గురించి మోహన అభిప్రాయం:

    03/17/2011 6:02 pm

    కేలిక సంస్కృత పదమే. కొలోన్ సంస్కృత నిఘంటువులో ఇవ్వబడిన అర్థము
    kelika mfn. sporting , sportive W. ; the tree Jonesia As3oka L. #

    సంస్కృత కేలిక తెలుగులో కేళిక అవుతుంది, అంతే. అంతర్జాలములోని సంస్కృత నిఘంటువులను ఇక్కడ వెదుక వీలగును. విధేయుడు – మోహన

  3. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి t rao అభిప్రాయం:

    03/17/2011 2:22 pm

    Thank you for posting this essay by Ismail. It’s a great help for me, I am working on another article. I have to come back again and read it carefully.

    But I must take issue with his comment on Arudra. As one who has meticulously learnt some of his hit movie songs, I differ entirely with Ismail’s opinion. Most Telugu scholars (certainly those who sit in ivory towers) ignore a vast repertoire of lyrical poems, songs penned by Telugu lyricists. I have looked at some of Arudra’s movie songs (ex: preyasi manohari, Gandhi puttina desama, mukkoti devatalu) – they are at par with any excellent poetry, anywhere in the world. (cf. Neruda, Tagore, Pasternak..).

    In any literary criticism, we should be aware of one pitfall: We can never demand why an author did not write ‘a type of work/poem’. We must look at an author’s work with genuine unbiased perspective and highlight its merits. Even SriSri (and Tirupati Venkata kavulu) would grudgingly admit one thing – if a poem is remembered by some one (and sung, recited, hummed), that means it has succeeded! For a poet, any poet, that is enough. Who cares about critics?

  4. మేఘాంగన గురించి GSCS Siddhartha అభిప్రాయం:

    03/17/2011 1:30 pm

    “కాలాఖ్యబాలక కేళికాతాడిత” లో కేళిక వైకృత పదం. ఈ సమాసంలో కేళిక పదౌచిత్యం ఏమిటో తెలియడం లేదు. ఈసమాసానికి విగ్రహవాక్యం ఎలా చెప్పాలి?

    క్రింది ఉపమానం సరైందేనా? ఊగడానికి తిరగడానికీ లంకె ఒప్పుతుందా?
    “మందమారుతచాలితామ్రతరుశాఖ
    కరణి నల్లన నేనందుఁ దిరుగుచుండ.”

    “ముఖేందుబింబమును నల్పపు మేఘములట్లు గ్రమ్మె” – ఇందులో అల్పపు మేఘాలా? నల్పగు మేఘాలా? అల్ప శబ్దాన్ని పరిమాణార్థంలో కవి విరివిగా వాడుతున్నారు. అది సరికాదేమో!

    “వినిపించెను తత్కారణ
    మును నీగతి నక్కజంబు వొడమఁగ నాకున్.”- ఏ గతి?

    ఈ క్రింది పద్యం మొదలుకు తుదిలేదు అని నాకనిపిస్తుంది.

    “ఒక గంధర్వుఁడు మేఘమాలికలలో నూహించి నీరూపమున్
    బ్రకటోత్సాహముతోడ నీవు గల యారామస్థలిం జేరి నీ
    మొకమం దావృతమైన వంత గెడపం బూనం గలా డప్పుడే
    వికలంబౌను మదీయశాప, మిటకు న్వీతెంతు వీ వంచవై”

    “ఎన్ని యేఁడులు గడచెనో యెఱుగనైతి
    అన్యపురుషునితోడ మాటాడి నేను” – ఇది సాంకేతికంగా ఒప్పే కాని ఆడ హంస అలా అంటే పెడార్థం తీయడానికి ఆస్కారం కలిగించడం లేదూ?

    గంధర్వపతియే తన పతి అని నిర్ధారణ కాకుండానే అతని కౌగిల్లో వాలిపోతుంది హంసి – అన్య పురుషుని కోసం మొహం వాచినదానిలా. ఎందుకో?

    “నాకుఁ దెలియ దేరీతి గంధర్వరూప మబ్బెనో కాని” అని భలేగా కవికి కారణం చెప్పకుండా తప్పించుకున్నాడు హంసవతంసము.

    ఎన్నో సందేహాలున్నాయి ఇంకా – సమయం దొరికితేఅడిగి తెలుసు కొంటాను.

    జగదఖిలమసారం
    మాయికమేవేతి మనసి మనన్వా:
    పర్యటతి పాటితాశః
    ప్రగలిత మదమాన మత్సరః కో2పి.

  5. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/17/2011 12:34 pm

    బ్రహ్మానందం గారికి, రమ గారికి

    కర్ణపేయం అనే మాట విన్నాను (చెవులతో తాగదగ్గది). శ్రుతపేయం కొత్త.

    నిజమే, ముందు వాడుకలోవచ్చాకే కొత్త పదాలను, ప్రయోగాలను నిఘంటువులు స్వీకరిస్తాయి.

  6. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    03/17/2011 9:11 am

    “సాయి బ్రహ్మానందంగారూ,

    త్యాగరాజు సంగీతం గురించి మరికొంచెం రాసి మరొకమారు మురిపించారు.

    శబ్దాలంకారాలూ, కీర్తనలలో వాటి ప్రయోగాలూ సోదాహరణంగా ఉన్నాయి. మీ శీర్షిక చూడగానే, మనసు అఠాణా రాగం లో కట్టిన రెండు కీర్తనల మీదకి మళ్ళింది.

    మొదటిది: ఏల నీ దయ రాదు (బాల కనకమయ…): దీనిలో మూడు చరణాలూ శబ్దాలంకార భూయిష్టాలే (సాహిత్యం ఇక్కడ చేర్చలేకపోయాను).

    రెండవది: అనుపమ గుణాంబుధీ… దీనిలో

    పల్లవి
    అనుపమ గుణాంబుధీ యని నిన్ను నెరనమ్మి
    అనుసరించిన వాడనైతి

    ఆనుపల్లవి

    మనుపకయె యున్నావు మనుపతీ వ్రాసిమే
    మనుప మాకెవరు వినుమా దయరాని

    చరణాలు:

    జనకజామాతవై జనకజా మాతవై
    జనక జాలము చాలు చాలును హరి || 1 ||

    కనకపటధర నన్ను కన కపటమేల
    తనుకనక పఠనము సేతుగాని బూని || 2 ||

    కలలొన నీవె సకలలోకనాథా
    కో-కల లోకువగ నిచ్చి గాచినది విని || 3 ||

    రాజకుల కలశాబ్ధి రాజ సురపాల
    గజరాజరక్షక త్యాగరాజవినుత || 4 ||

    అలాగే, పరిపాలయ, పరిపాలయ అన్న రీతిగౌళ కీర్తనలో ఉన్న అలంకారం నిజంగా అలంకారమే.

    పల్లవి:
    పరిపాలయ పరిపాలయ పరిపాలయ రఘు నాథ

    చరణాలు:
    తనువే నీకనువైన సదనమౌరా రఘు నాథ (పరి)
    స్థిర చిత్తము వర చామీకర పీఠము రఘు నాథ (పరి)
    సు-పద ధ్యానము గంగా జలమౌరా రఘు నాథ (పరి)
    ఇభ పాలక అభిమానము శుభ చేలము రఘు నాథ (పరి)
    ఘన కీర్తిని పల్కు వాసన గంధము రఘు నాథ (పరి)
    హరి నామ స్మరణములు విరులౌరా రఘు నాథ (పరి)
    తొలి దుష్కృత ఫలమెల్ల గుగ్గులు ధూపము రఘు నాథ (పరి)
    నీ పాద భక్తియే ప్రొద్దు దీపంబగు రఘు నాథ (పరి)
    నే జేయు సు-పూజా ఫలము భోజనమౌ రఘు నాథ (పరి)
    ఎడ-బాయని నాయెడ కల్గు సుఖము విడెమౌరా రఘు నాథ (పరి)
    నిన్ను జూచుటే ఘన దీపారాధనమౌరా రఘు నాథ (పరి)
    పూజా విధి నైజ త్యాగరాజ కృతము రఘు నాథ (పరి)

    మీరన్నట్లు, ప్రతి త్యాగరాజ కీర్తన లోనూ శబ్దాలంకారాలు కనిపిస్తాయి. అయితే, పై వాటిలో ఇవి ప్రస్ఫుటంగా అనిపించినందున నాకీ ఉత్తరం రాయాలనిపించింది.

    – ఇం.అ.ప్ర.స.మూర్తి.

  7. మేఘాంగన గురించి GSCS Siddhartha అభిప్రాయం:

    03/17/2011 9:01 am

    “ప్రాంతవనాంతరానఁ జివురాకులయాసవమూని” అన్నపాదములో “ఆసవమూని” అన్నది “ఆసవమాని” గా సరిదిద్దాలి. ఊని అంటే ధరించు, అదుము అని అర్థాలు. ఆను అంటే త్రాగు అని అర్థము (నాకు తెలినానంతవరకు). తప్పైతే క్షంతవ్యుడను.
    సాంయాత్రికోపమానం సరిగ్గా అతకలేదు. గగనంలో మేఘాలకీ అభ్దిలో సాంయాత్రికులకీ మధ్య సామ్యం బాగా కుదరలేదని నా అభిప్రాయం. ఆ పద్యనిర్మాణంలో లొసుగు కూడా అక్కడే ఉంది.
    “లేఖకాపేటి” పద స్వరూపం, దానికీ చిత్రకారుడికీ సంబంధం ఏంటో అర్థం కాలేదు.
    బ్రతిరచించు అనేది ప్రామాణిక శబ్ద ప్రయోగమేనా?

    క్రింది పద్యభావం అసమగ్రం (తరువాతి పద్యంతో అన్వయం క్లిష్టం)

    అమరగఁ గేశపాశముగ శ్యామలనీరదఖండమొండు వ
    క్త్రమువలె నొక్క శ్వేతజలదంబు రహింపఁగ గాత్రవల్లిపై
    నమరిన పీతవర్ణకలితాంచలశోభితరోహితాంశుకో
    పమమయి మిశ్రవర్ణయుతవారిద మొక్కటి తారసిల్లఁగన్.

    మరి కొన్ని సందేహలు మల్లీ వెలిబుచ్చుతాను. పెద్దలు వివరించగలరు.

  8. కథ కథ గురించి Soham అభిప్రాయం:

    03/16/2011 10:45 pm

    Very interesting, but could not go further than three paragraphs. Don’t worry, you can sustain the interest of the reader, but I am little busy ….. will be back to experience you.

  9. మూడు లాంతర్లు – 3 గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/16/2011 2:36 pm

    కరటకశాస్త్రి శిష్యుని భాషలో చెప్పాలంటే, “వీని శిగ్గోసిరి..ఎంతబాగా అన్నాడండి ఈ huge harry గాడు. వీని తస్సాగొయ్యా ఆ అలంకారికులంతా పనీపాటాలేకుండా ఒక వెయ్యేళ్లపాటు అదేంటో ఒకటే తెగ హైరానా పడిపోయి ధ్వన్యాలోకాలన్నీ రాసేసి మా గురువుగారి లాంటి వాళ్లచేత నా నెత్తిన రుద్దేస్తున్నారే!! హారిదేవుడో!! ఈ హారీ గాడెవడో ఒక కంప్యూటర్ తెచ్చి నాకిచ్చినట్టాయనా.. ఆ వెంకటేశం గాడి పనిపట్టనూ? వాడిదగ్గరే కంప్యూటర్ ఉందని ఏం గర్రాగా ఉన్నాడూ?? మా ఈ గురువుల సృజనంతా కలుషితం అయిపోయింది.” వాడెవడూ? ఆ కాళిదాసు కావ్యాలన్నీ ఆ కల్పనలన్నీ వట్టిబూజు! ఒక్క కంప్యూటర్ మాత్రమే “స్వచ్చమైన” సృజనని కల్పిస్తుంది. అంతేకదా మరి ..దానికదే విడిగా డబ్బు సంపాదించనఖ్ఖరలేదు. పేరు సంపాదించనఖ్ఖరలేదు. శృంగారపు జంఝాటం దానికి అసలేలేదు. నాకు కూడా ఒక కంప్యూటర్ గురువైతే ఎంత బాగుండూ?!! కనీశం నేను వచ్చేజనమలో అయినా ఇలా ఈ సుబ్బిలాంటి వేషం కట్టి గురువుగారి కూతుర్ని పెళ్ళాడకుండా నాకు నచ్చిన కంప్యూటర్ ని ఎన్నుకుందును కదా?? సృజన అంటే మధురవాణిలా ఉంటుందని అనుకున్నానే ఇన్నాళ్ళూ నేను. చీచీ !! మధురవాణి ఏం బాగుండదన్నమాట. అది కల్తీ సాని!! ఈ కంప్యూటర్ ఉందే!! ఇదొక్కటే మా నికార్సైన “స్వచ్చమైన “సాని!!

    ఇట్లు శ్రీ వేంకటేశం స్నేహితుడుకాని “సుబ్బి”వ్రాలు

    రమ.

    పి.యస్ . అదేంటోగానీ నాకు అన్నిటికీ డు లు పెట్టి పాఠకుడు..విమర్శకుడు అంటూ “డు” “డూ” అని చదూతుంటే కూడా ఒహటే గుద్దుకుంటున్నట్టూందేంటీ?? ఏంటో? “అహం” వల్ల కాబోలు! మరి నేను ఇంతే ఎప్పటికీ కంప్యూటర్ ని కాలేను కాదు. చస్తే కాను కూడాను. నాకు కల్తీ కల్పనే బాగుంటుంది. కల్తీలేని యంత్రమ్ కల్పించే కల్పన కాదు. అలాంటి కల్పన గిరీశాలకి బాగుంటుంది కాబోలు.!!

  10. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/16/2011 1:56 pm

    ” కర్ణపేయము”..” శ్రుతపేయము” అన్నమాటలు వాడుకలో ఉన్నమాటలు.

    శ్రుతమ్ అంటే వినికి. శ్రుతి అన్నా అదే అర్ధమ్ “వినికి “అనే !! పేయం అంటే పాలు అమృతము వంటి బాగున్న ద్రవపదార్ధాలు.పానానికి అనువైనవి.ఇక్కడ చెవి నిజంగా ఆ ద్రవాలని పానం చేస్తుందని కాదుకదా! అలా చెప్పడమ్ ఒక మెచ్చుకోలు తరహా అంతే !వినడానికి సుఖంగా ఉందని అనడంలాంటిది అంటే ఆస్వాదయోగ్యంగా ఉందని అనడం.

    భాషకి ప్రమాణం మొదటగా వాడుక మాత్రమే. వాడుకని అనుసరించి నిఘంటువులు అర్ధవివరణ చేస్తాయి. చెవికి ఇంపుగా ఉంది అన్న అర్ధంలో.. కాసింత విశేషణమ్ వేసిచెప్పడం. చెవి ఆ సంగీతాన్ని సంతోషంగా ఆస్వాదిస్తోంది అనిచెప్పడానికి …చెవి ఆ ధ్వనిని లేదా.. ఆ గానాన్ని స్వీకరిస్తోంది ..పానంచేస్తోంది.. తాగుతోంది అన్న విశేషణాలుగా మార్చిచెప్పడం.” ఆహా !! అమృతోపమానంగా ఉంది “..అని అనడం లాంటిదే ఇదికూడా!! వినడానికి బాగుందని మెచ్చుకోవడానికిగానూ చెవి ఆ గానాన్ని పానంచేస్తోంది అన్నట్టుగా అనడమ్. అందుకని “పేయమన్న” శబ్దం అక్కడ అవసరమయ్యింది. విడి విడిగా ఈ రెండుపదాలు చూస్తే అందులో అతుకు ఏదీలేదు. కానీ వాడుక వాటికి ఆ బలాన్ని ఇస్తుందన్నమాట..” కర్ణపేయంగా”.

    రమ.