పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16482

  1. పురూరవ: శ్రవ్య నాటిక గురించి Nithin అభిప్రాయం:

    04/09/2011 10:26 am

    ఈ నాటకాన్ని వినాలని ఎంతో తహతహ చెందాను. దురదృష్టం. ఆడియోలో ఏదో లోపం ఉన్నట్లు ఉంది. వినే భాగ్యం లేకపోయింది. చలం ఊహల్లో ఊర్వశి అందాన్ని తనివితీరా ఆస్వాదించాం. శారదా శ్రీనివాస్ గొంతులో ప్రాణం పోసుకున్న ఆ ఇంద్రలోకపు ఒయ్యారి మధురస్వరం ఎట్లా ఉంటుందో వినలేకపోతున్నాం. దయచేసి ఎవరి దగ్గరేనా ఈ శ్రవ్య నాటకం తాలూకా ఒరిజినల్ ఆడియో ఉంటే గనుక నా మెయిల్‌కి పంపండి. వారికి సర్వదా కృతజ్ఞుడిని. ఈ వ్యాసంలో మరో లోపం ఏమిటంటే, శారద శ్రీనివాసన్ గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన జ్ఞాపకాల లింకు ఎక్కడో ఎగిరిపోయింది. ఒకసారి సరిచూడండి. నేనింతకు ముందు శారద గారిది ఏదో నాటకం విన్నాను. సరిగా జ్ఞాపకం లేదు కానీ ఆ మధురమైన పాట మటుకు నా గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆమెను ఒకసారి కలవాలని కోరుకుంటున్నాను.

    -నితిన్.
    mail: nitin@annabattula@gmail.com

    [మేము ప్రయత్నించాం. ఆడియోలో ఏ లోపమూ లేదు. దయచేసి మీ సెట్టింగ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి లింక్ స్థానే పీ.డీ.ఎఫ్ లింక్ ఇచ్చాము.- సం.]

  2. About eemaata గురించి Murali Krishna అభిప్రాయం:

    04/09/2011 3:25 am

    నమస్కారము, మీ ఈ తెలుగు భాష బ్లాగు చాలా బాగున్నది.మీ ఈమాటకు నా హృదయపుర్వక నమస్కారములు. నాకు కూడా మీ పత్రికలో పనిచేయాలని ఉన్నది.

  3. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/08/2011 2:40 pm

    లైలా ఇది అన్యాయం సుమా! నేనా? మిమ్మల్ని కోప్పడటమా?? మీ అభిప్రాయాలకోసమే కదా అసలు నేను “ఈమాట” ని చూసేదీ! మీ అంత సూటిగా ఈమాటలో అభిప్రాయాలు రాసేవారేరీ?? నేనెంతో సరదా పడతాను మీ చతురతకి తెల్సా?

    అయితే ” శృంగారం” అంటే నాకు ఇబ్బందేమీ లేదు. నా ఇబ్బందల్లా ” తెలుగు సినిమా పాట” లోని వెకిలితనమే !! అలాంటి ముతకతనం యాక్ అంటున్నాను. సినిమా పాటల్లో చాలావరకూ సాహిత్యం ఏమంత చెప్పుకోతగ్గది కాదు అన్నది నా భావం. [ తెలుగు సినిమా లో ఒరిజనాలిటీ లేనే లేదు. అన్నీ కాపీవే. ట్యూన్స్ తో సహా!} అప్పుడప్పుడో మంచి పాట వినిపించవచ్చు గాక. అది క్వాచిత్కం అంతే !! సినిమా పాటని తెచ్చి త్యాగరాజకీర్తనతోనీ జయదేవుని అష్టపదితోనీ పోల్చడం చేయలేం కద? నా ఉద్దేశ్యం సాహిత్యమ్ విషయంలో !!
    ఇంక ” రసం” అంటారా కర్ణాటక సంగీతం లోని మేళకర్త రాగాల్లా వాటి సంఖ్యకూడా పెరిగింది కాబోలు కాలంతో 🙂 భక్తి అన్నది కూడా ఒక ఎమోషన్ కదా? శృంగారం లాగే . పాతవాళ్ళు దాన్ని ఒక రసమ్ అన్నారా లేదా అని కాదు.

    హరికృష్ణ గారు ఎందుకన్నా గానీ , మీరు మీ శైలి లోనే మరో కన్యాశుల్కాన్ని పోలిన నాటకాన్ని రాయకూడదూ?? పోస్టల్ స్టాంపు ఏం ఖర్మ.. మీ పటం కట్టి మరీ పూజించుకోమా?? అసలే మీకు హాస్యమ్ అంటే ఇస్టం పైగా బాగా రాస్తారు కూడానూ. గురజాడతోనే పోటీపడితే అది ఇంకా మజాగా ఉండదూ? ఏమంటారూ?
    రమ.

  4. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి lyla yerneni అభిప్రాయం:

    04/07/2011 3:21 pm

    “భక్తికీ భక్తి పేరున శృంగారానికీ ఆవిడ ఇచ్చిన చిట్టాకీ అసలు విషయానికీ ఏమీ సంబంధమ్ లేదు. అది వేరే సంగతి. ఏ రసాన్ని ఎవరైనా రాయనివ్వండి…” -రమ.

    నేనేం చేశాను రమా! ఎప్పుడూ నన్ను కోప్పడుతారు 🙂 ‘శృంగారించుకొని’ అన్న మాటని నేనెక్కడ ఇంగ్లీష్లోనికి అనువాదం చేశాను? ఉత్తుత్తి అభియోగం తాడేపల్లి హరికృష్ణ నా మీద బనాయిస్తున్నారు. మీరు దానికి మద్దతు ఇవ్వటం న్యాయమా?

    ఇంగ్లీషు, తెలుగు కలిపి రాసింది నిజమే. అలా రాస్తే గురజాడనైతే మెచ్చుకుని, ఆయన బొమ్మ స్టాంపుల మీద ఆంధ్రులు ముద్రించుకున్నారు. ఆయన్ను నవయుగ వైతాళికుడన్నారు. మరి నేను కాసిని కలగలుపు మాటలు రాస్తే కటువుగా ఉన్నాయంటున్నారు?

    అసలు నవరసాల్లో ‘భక్తి రసం’ లేనే లేదు. మరి రసాల సంఖ్య ఒకవేళ మారిందో, so called ‘భక్తి రసం’ పదో రసమో, ఇంకెన్నో రసమో -అది వ్యాస రచయితలు చెప్పాలి. ‘భక్తిరసం’ అనేదే లేకపోతే – ‘భక్తి’ అను పదార్థము తెలుగు సాహిత్య ప్రవేశం ఎప్పుడు చేసిందో, తెలుగు సాహిత్య చరిత్రకారులు చెప్పాలి. చెపితే వింటాను.

    నేనేమన్నాను. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ‘శృంగార రసం’ మస్తుగా ఉంది అన్నాను. లేదా? ‘ఈ మాట’ లోనే ఇచ్చినట్టి – త్యాగరాజవిరచిత కృష్ణ గీతం సెక్సీగా ఉందన్నాను. లేదా? అది కర్ణాటక శాస్త్రీయ సంగీతమే కదా అని, కృష్ణుడి మీద ఆ రచన, పోతన భాగవతము – దశమ స్కంధము కొన్ని ఘట్టముల లోని శృంగార స్థాయిలో ఉంది గదా అని, ముచ్చట పడి ఉదహరించాను. తప్పా?:-) కృష్ణుని మించిన sexy hero సినిమా పాటల్లోనే ఏమిటి, ప్రపంచ సాహిత్యం లోనే లేడు. Krishna is top notch. His position can not be toppled.

    లైలా

  5. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి SReeram అభిప్రాయం:

    04/07/2011 8:03 am

    సూర్యనారాయణా, వేదపారాయణా పూర్తి పాట పంపగలరా?

  6. పలుకుబడి: ముందుమాట గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    04/07/2011 7:03 am

    సురేష్ గారూ, నమస్తే.
    మీరు చేస్తున్న మంచి ప్రయత్నం ఈ ‘పలుకుబడి.’
    అభినందనలు.
    కొన్ని పదాల పట్ల మాలాంటి వారికి కలిగే కొన్ని సందేహాలకు ఈ శీర్షికలోనే సమాధానాలు కూడా ఇస్తే బావుంటుందేమోనని అనుకుంటున్నాను.
    చదవంగానే, తేలికగా అర్ధమైతే ఇంకా బావుంటుందని నా అభిప్రాయం.
    శుభాకాంక్షలతో-
    ఆర్.దమయంతి.

  7. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి kameshwari అభిప్రాయం:

    04/05/2011 9:41 am

    మీరు చక్కగా రాసారు కానీ చిన్న పిల్లల ఆటల్లొ గుజ్జనగూళ్ళు వగైరా గురించి కూడా రాస్తే బాగా ఉండేది.

  8. ప్రేమ పెళ్ళి గురించి swetha అభిప్రాయం:

    04/05/2011 7:38 am

    just kill her. ilanti vala valla india ku bad name.

  9. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి rama bharadwaj అభిప్రాయం:

    04/04/2011 2:36 pm

    సినిమా పాట మీద వ్యాస రచయితల మాటల్లోనే ఓ పెద్ద అయోమయం పోగుపడిఉంటే దాన్ని తన మాటతో మరింత జటిలమ్ చేశారు లైలా! భక్తికీ భక్తి పేరున శృంగారానికీ ఆవిడ ఇచ్చిన చిట్టాకీ అసలు విషయానికీ ఏమీ సంబంధమ్ లేదు. అది వేరే సంగతి. ఏ రసాన్ని ఎవరైనా రాయనివ్వండి. అది కాదు విషయం. కానీ ఆ సందర్భమ్ ఏమిటీ అది సహజంగా ఉందా లేక అసహజంగా ఉందా? వాళ్ళు రాసిన దానిలోని ఆ భావం లో అక్షరమ్ స్థాయి గానీ స్వరం స్థాయి గానీ ఉదాత్తంగా ఉందా?? లేకపోతే అలా ఎందుకు లేదు? ఇవీ అసలు విషయాలు. హరికృష్ణ గారన్నట్టూ “శృంగారించుకుని రావడం అంటే అది బాగా అలంకరించుకుని వెళ్ళడం” అని. అంతే గానీ “శృంగారం” అన్న మాట ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అది ఇంగ్లీషు లో వాడే సెక్స్ కి పర్యాయం కాదు. సంభోగం అని వేరే మాట ఒకటి ఉంది దానికి. శృంగారం వేరు. సంభోగం వేరు. గనక సెక్స్ కి పర్యాయగా శృంగారం అన్నది అర్ధమ్ చేసుకోవడం అన్నిసార్లూ వల్ల కాదు.

    ఇకపోతే ” శివదీక్షాపరురాలనురా!!” అన్న జావళీ వంటివి భక్తి పాటలు కావు. ఇంక త్యాగరాజ కీర్తన “నౌకాచరిత్రం” లో “శృంగారించుకుని వెడలిరి” అన్నది సెక్స్ పాటలాంటిది కాదు. అది ఒక ప్రేమ గానమే !! కృష్ణ ప్రేమ. త్యాగరాజు ప్రేమని రాయకూడదని గానీ..రాయలేడని గానీ అసలు అలాంటి సందేహాలో చర్చలో ఎందుకని తలెత్తాయో మరి? గొర్తిగారు త్యాగయ్య రాసిన నౌకా చరిత్రాన్ని శృంగార కీర్తనగా ముద్రించి లైలా గారికి ఎందుకని సూచన చెయ్యాల్సి వచ్చిందో? ఇతర త్యాగరాజ కీర్తనలకు మల్లేనే ఆయన రాసిన ఈ యక్షగానం సైతం మనోహరమైన భక్తి. గోపికా విరహ ప్రకటన భాగవతం లోని భ్రమరగీతలో ముఖ్యమైన అంశం మరి.

    దీనికీ తెలుగు సినిమా పాటకీ ఏమిటీ పోలికా? నాటు సంభోగాన్ని చెత్త భావాలతో అంతకన్నా చెత్త భాషతో చెప్పేది సినిమాపాట. ఎక్కువసార్లు. ఏ సముద్రాల రాఘవాచారో ఏ మల్లాది రామకృష్ణ శాస్త్రో.. ఏ కృష్ణశాస్త్రో.. ఏ శ్రీశ్రీనో రాసినవి వేరు. “విప్రనారాయణ” లోని “చూడుమదే చెలియా” అన్నది ఇటు భక్తీ అటు కృష్ణుని లలితమైన రాసక్రీడా రెండూ మిళితమైన అలాంటి పాటలని గురించి కాదు మరి ఈ “సినిమాపాటల మతీ సుతీ” అన్న గోల. “మదన జనక నీ మగసిరి చూచీ మతైపోయారా.. ఎదురులేని నీ పదును చూచి నే చితైపోయారా.. నీ సొత్తై పోయారా” లాంటి పాటలు నాటు శృంగారం. ఇలాంటి పాటలు అనేకం ఒక హద్దు దాటిపోయి విచ్చలవిడిగా యధాశక్తి దిగజారినవి అనేకం. అలాంటివి అన్నీ సమకాలీన తరాలకి మహా ఇష్టం అని ఒక తరాన్ని మొత్తంగా ఈ రొచ్చులోకి లాగి దాన్ని సమర్ధించడానికని చేసిన ప్రయత్నం ఈ వ్యాసం. అది నిజమూ కాదు. వీటికి ఈ వ్యాసకర్తల దగ్గర ఎలాంటి రుజువులూ లేవు.ఒక రొడ్దకొట్టుడు ఆర్గ్యుమెంటు ఇది. ఏ ఆధారమూ లేని వారి వారి సొంత వ్యాఖ్యానాలు అంతే !!

    చెత్త పాటలు ఇవాళ్టి తెలుగు సినిమాల్లోనే కాదు ..ఇంకా మరింత ముందుకు వెళితే నాయక రాజుల యుగంనాటి కవుల అనేక రచనల్లోనూ ఉన్నాయి. కానీ వాటికి కూడా ఇవాళ్టి తెలుగు సినిమా పాటలకున్న విలువే ఉంది. వాటిని చదివిన వారూ చర్చించిన వారూ ఎక్కడా కనిపించరు. అవికూడా మరి ఆనాటి “యువతరాలు”[ఈ వ్యాస రచయితల భాష ప్రకారం అన్నమాట] ఆనందించినవే అయ్యుంటాయి. అలా పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయాయి. ఇవాళ్టి ఈ సోకాల్డ్ సినిమా “కవుల” గతీ అంతే!! వారి పాటలగతీ అంతే!! మల్లాది వారి “గిరిజా కళ్యాణం” లాంటివి రాయగల సత్తా ఉన్న వాడొక్కడు లేడు గానీ .. అందరూ యధాశక్తి కవులే మరి. అందుకే అవన్నీ మతీ సుతీ లేనట్టే ఉన్నాయి. అవి రాసింది ఆత్రేయే కానీ సినారేనే కానీ వేటూరే కానీ ఇంక పేర్లు చెప్పనవసరమ్ లేని మరొకరెవరన్నా కానీ. డబ్బుకోసం రాసే డబ్బుకోసమ్ తీసే వ్యాపార సరుకుకి తమ వంతు తలా వొక్క రూపాయిని అక్షర రూపంలో అందించినవారే కద.

    రమ.

  10. సామాన్యుని స్వగతం: మా అమ్మ – నడిచే బడి గురించి Pathakudu అభిప్రాయం:

    04/04/2011 5:13 am

    Hello … your story is fine …

    I am from Anantapur and curious to know few things.

    Anantapur is wellknown education center, may I know the reason for doing studies in Kurnool(except Medicine).

    Not only in OldTown(you mentioned oke postoffice patahuru ), there were 4 big post offices were there in ATP even in 1950 ( Geroge Pet, Old Town, Main PO, British Treasury i.e current JNTU).

    Anyways … these are not related to story but please avoid such things.