ఎవరికి వారే సినిమా పాటల మీద వారి అభిప్రాయాలని ఈ వ్యాసపు పరిధి లోంచే ఎంచుకుంటూ పోతే.. అప్పుడది ప్రామాణికమైన విశ్లేషణ లేదా పరిశీలనా.. ఎలా అవుతుందో ? దానికేమీ ఒక కొలా నిలా ఏమీ ఉండవు కాబోలు. ఇంకపోతే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఆస్వాదించడం చేసిన వాళ్ళంతా 50 దశకపు తరాలు అన్న ఒక యాధాలాప మాటకీ లేదా విభజన కి ఏమన్నా రుజువు ఉందా?? ఇందాకా నేను ఒక కచేరీకి వెళ్ళి వస్తున్నాను. అక్కడ అంతా కుర్ర వాళ్ళే. వాళ్లు పాడినవీ ..ఎంపిక చేసుకున్నవీ ..నేను నా ఇదివరకటి అభిప్రాయాలలో ప్రస్తావించిన కవులనే మరి .ఇవాళ్టి చాలామంది కుర్రకారు నేను ప్రస్తావించిన కవులని వింటున్న వాళ్ళు సైతం ఉన్నారు. ఏ సులోచనాలతో మనం కొలిస్తే అది దానికి అనుగుణంగా కన్పిస్తుంది అంతే!! చిన్న చిన్న పిల్లలు స్వరం తప్పకుండా రావు బాల సరస్వతినీ ..పాలువాయి భానుమతినీ ఎంచుకుని అవలీలగా పాడేస్తూంటే వారిని నేను ఏ దశకం కింద జమ కట్టాలబ్బా??
కథ గురించి చాలా కాలం క్రితం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చదవడం ఎలా అని ఒక వ్యాసం రాశారు. కొంతకాలం క్రితం ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డిగారు కూడా చదవడం గురించి ఒక వ్యాసం రాశారు. కానీ ఇంత వరకూ ఎవరూ కథ గురించి కథ రాసినట్టు లేదు. ఇందులో కథ గురించిన కథనం కొత్తగా వుంది. కథ స్వయంగా తనగురించి ఒక కథ రాయడం అనే ఆలోచనే చాలా బాగుంది. అయితే ఇటువంటి కథ రాయడానికి కేవలం కథా కథన శిల్పాలతో బాటుగా చాలా అధ్యయనం కూడా అవసరమౌతుంది. ఆ విషయంలో కొంత అసంతృప్తి కలిగినప్పటికీ, కథగా చాలా బాగుంది.
ఇంతవరకూ పాఠకులు కథలు చదవడమేగానీ ఒక కథే స్వయంగా పాఠకుల్ని చదవడం అనే ఆలోచన రావడమే అపూర్వం. దాన్ని అందమైన కథగా మలచడంలో రచయిత విజయం సాధించారు.
దీన్ని కథ గురించి రాసిన కథ కాని కథగా సాహిత్యంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.
రచయిత చంద్ర కన్నెగంటి గారికి అభినందనలు.
పదేళ్ల క్రితం మేం చేసిన ఓ చిన్న సరదా ప్రయోగం గురించి ఇప్పుడు కొంత చర్చ జరుగుతోందని ఒకరు చెప్తే, “హౌరా, వెబ్ మహత్యం!” అని ఆశ్చర్యం వేసింది.
ఈ అభిప్రాయాల్ని చూశాక మరో సారి వ్యాసాన్ని చదివాను, వివరించవలసినవి గాని సవరించవలసినవి గాని ఏమైనా ఉన్నాయా అని. సవరణల అవసరం కనిపించలేదు గాని ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఒకటి రెండు విషయాలు వివరించటం వల్ల ఉపయోగం ఉండవచ్చును అనిపిస్తోంది.
ఈ వ్యాసంలో తెలుగు సినిమా పాట సాహిత్య సంగీతాల పరిణామం గురించి, శ్రోతల గురించి కొన్ని ప్రతిపాదనలు చేశాం. వాటిలో రెండిటి గురించి కొందరు పాఠకులు సంశయాలు వెలిబుచ్చారు. వాటిని కొంచెం ప్రస్తావిస్తాను.
ఒకటి వాడుకలో ఉన్న పదబంధాలకు కొత్త అర్థాల్ని ఆపాదించి ప్రతీకలుగా వాడటం గురించి. ఒక పాఠకుడు కొన్ని ఉదాహరణలిచ్చి ఆ సందర్భాల్లో సామాన్యార్థమే వర్తిస్తుందన్నారు. నేను కాదనను. ఎందుకంటే, మేం అన్నది అర్థం పూర్తిగా మారిపోయి కొత్త అర్థమే ప్రమాణం ఔతుందని కాదు కదా, రెండు అర్థాలూ ఉంటాయనేది. పైగా అది రాసిన వారి చమత్కారం అదే, ఒకవైపు సెన్సారు వాళ్లను డబాయించటానికి ఒక అర్థం కావాలి, మరో వైపు నిర్మాతల్నీ దర్శకుల్నీ తృప్తిపరిచే విశేషార్థమూ కావాలి.
ఇక రెండో ప్రతిపాదన, పాటల సాహిత్యానికీ శ్రోతల తరానికీ ఉన్న సంబంధం గురించి. ఈ పాఠకురాలు తనకు నచ్చిన కొందరు సినీ కవుల పేర్లు, కొన్ని పాటలు చెప్పినందువల్ల మా ప్రతిపాదనను ఆవిడకి వర్తింపజేచి, ఆవిడ పుట్టిన సంవత్సరం 1955 – 60 మధ్య అని అంచనా వెయ్యొచ్చు. తన విషయంలో మా ప్రతిపాదన వర్తిస్తుందో లేదో ఆవిడో పరీక్షించుకోవచ్చు.
మిగిలిన పాఠకులకు కూడ మా ఆహ్వానం. ఎవరికి వారే తమకు హృదయగతంగా నచ్చిన పాటలను తీసుకుని మా ఈ ప్రతిపాదన వారి విషయంలో ఎంతవరకు నిజమో చూసుకోవచ్చు.
కథ బాగుంది. కానీ బాగా విన్న, చూసిన సన్నివేశాల్లా ఉన్నాయి అన్నీ. 1980s నాటి తెలుగు సినిమా ఈరోజున చూస్తే కలిగిన అనుభూతి కలిగింది…అంటే…జరగబోయేది గ్రహించేయగలం అన్నట్లు…
అయితే…తక్కువ వ్యవధిలో ఎక్కువ కథను చకచకా నడిపించినా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా సాగింది కథనం. రచయితకు నా అభినందనలు.
మీ కవితలు భలే బాగున్నాయండి. మీ బ్లాగు పేజీలో కూడా మఱికొన్ని కవితలు చదివాను. బాగా రాస్తున్నారు! మీ చేత ఇంకా ఇంకా మదిని ఆకట్టుకునే ఆనందమైన కవితలు రాయగలిగించే సంఘటనలు మీ జీవితంలో చోటుచేసుకోవాలని ఆశిస్తూన్నాను 🙂
ఈ నాటకాన్ని వినాలని ఎంతో తహతహ చెందాను. దురదృష్టం. ఆడియోలో ఏదో లోపం ఉన్నట్లు ఉంది. వినే భాగ్యం లేకపోయింది. చలం ఊహల్లో ఊర్వశి అందాన్ని తనివితీరా ఆస్వాదించాం. శారదా శ్రీనివాస్ గొంతులో ప్రాణం పోసుకున్న ఆ ఇంద్రలోకపు ఒయ్యారి మధురస్వరం ఎట్లా ఉంటుందో వినలేకపోతున్నాం. దయచేసి ఎవరి దగ్గరేనా ఈ శ్రవ్య నాటకం తాలూకా ఒరిజినల్ ఆడియో ఉంటే గనుక నా మెయిల్‌కి పంపండి. వారికి సర్వదా కృతజ్ఞుడిని. ఈ వ్యాసంలో మరో లోపం ఏమిటంటే, శారద శ్రీనివాసన్ గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన జ్ఞాపకాల లింకు ఎక్కడో ఎగిరిపోయింది. ఒకసారి సరిచూడండి. నేనింతకు ముందు శారద గారిది ఏదో నాటకం విన్నాను. సరిగా జ్ఞాపకం లేదు కానీ ఆ మధురమైన పాట మటుకు నా గుండెల్లో మారుమ్రోగుతూనే వుంది. ఆమెను ఒకసారి కలవాలని కోరుకుంటున్నాను.
-నితిన్.
mail: nitin@annabattula@gmail.com
[మేము ప్రయత్నించాం. ఆడియోలో ఏ లోపమూ లేదు. దయచేసి మీ సెట్టింగ్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆంధ్రజ్యోతి లింక్ స్థానే పీ.డీ.ఎఫ్ లింక్ ఇచ్చాము.- సం.]
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి Sowmya అభిప్రాయం:
04/13/2011 2:19 pm
మరో సవరణ:
“. ఇందులో త్యాగరాజస్వామి ఆరాధన సందర్భముగా ముచ్చటించబడిన కొన్ని సంఘటనల వివరాలు కూడ హిందూ పత్రికలో లభ్యమవుతాయి (అ, ఆ).”
ఆ రెండో ఆ లో: http://sriramv.wordpress.com/2008/03/ అని ఇచ్చారు. ఆ నెల్లో ఆయన రాసిన వాటిలో, త్యాగరాజ ఉత్సవాలకి సంబంధించి ఉన్న టపా ఒకటే – http://sriramv.wordpress.com/2008/03/10/reforming-the-tyagaraja-aradhana/
గమనించగలరు.
కుండీలో మర్రిచెట్టు గురించి vengal rao అభిప్రాయం:
04/13/2011 6:36 am
నమస్కారములు. మీ కవిత బాగుంది
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి rama bharadwaj అభిప్రాయం:
04/11/2011 2:08 pm
ఎవరికి వారే సినిమా పాటల మీద వారి అభిప్రాయాలని ఈ వ్యాసపు పరిధి లోంచే ఎంచుకుంటూ పోతే.. అప్పుడది ప్రామాణికమైన విశ్లేషణ లేదా పరిశీలనా.. ఎలా అవుతుందో ? దానికేమీ ఒక కొలా నిలా ఏమీ ఉండవు కాబోలు. ఇంకపోతే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని ఆస్వాదించడం చేసిన వాళ్ళంతా 50 దశకపు తరాలు అన్న ఒక యాధాలాప మాటకీ లేదా విభజన కి ఏమన్నా రుజువు ఉందా?? ఇందాకా నేను ఒక కచేరీకి వెళ్ళి వస్తున్నాను. అక్కడ అంతా కుర్ర వాళ్ళే. వాళ్లు పాడినవీ ..ఎంపిక చేసుకున్నవీ ..నేను నా ఇదివరకటి అభిప్రాయాలలో ప్రస్తావించిన కవులనే మరి .ఇవాళ్టి చాలామంది కుర్రకారు నేను ప్రస్తావించిన కవులని వింటున్న వాళ్ళు సైతం ఉన్నారు. ఏ సులోచనాలతో మనం కొలిస్తే అది దానికి అనుగుణంగా కన్పిస్తుంది అంతే!! చిన్న చిన్న పిల్లలు స్వరం తప్పకుండా రావు బాల సరస్వతినీ ..పాలువాయి భానుమతినీ ఎంచుకుని అవలీలగా పాడేస్తూంటే వారిని నేను ఏ దశకం కింద జమ కట్టాలబ్బా??
రమ.
కథ కథ గురించి రాణి అభిప్రాయం:
04/11/2011 8:23 am
కథ గురించి చాలా కాలం క్రితం వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు చదవడం ఎలా అని ఒక వ్యాసం రాశారు. కొంతకాలం క్రితం ఆచార్య రాచపాళెం చంద్ర శేఖర రెడ్డిగారు కూడా చదవడం గురించి ఒక వ్యాసం రాశారు. కానీ ఇంత వరకూ ఎవరూ కథ గురించి కథ రాసినట్టు లేదు. ఇందులో కథ గురించిన కథనం కొత్తగా వుంది. కథ స్వయంగా తనగురించి ఒక కథ రాయడం అనే ఆలోచనే చాలా బాగుంది. అయితే ఇటువంటి కథ రాయడానికి కేవలం కథా కథన శిల్పాలతో బాటుగా చాలా అధ్యయనం కూడా అవసరమౌతుంది. ఆ విషయంలో కొంత అసంతృప్తి కలిగినప్పటికీ, కథగా చాలా బాగుంది.
ఇంతవరకూ పాఠకులు కథలు చదవడమేగానీ ఒక కథే స్వయంగా పాఠకుల్ని చదవడం అనే ఆలోచన రావడమే అపూర్వం. దాన్ని అందమైన కథగా మలచడంలో రచయిత విజయం సాధించారు.
దీన్ని కథ గురించి రాసిన కథ కాని కథగా సాహిత్యంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది.
రచయిత చంద్ర కన్నెగంటి గారికి అభినందనలు.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
04/10/2011 6:08 pm
పదేళ్ల క్రితం మేం చేసిన ఓ చిన్న సరదా ప్రయోగం గురించి ఇప్పుడు కొంత చర్చ జరుగుతోందని ఒకరు చెప్తే, “హౌరా, వెబ్ మహత్యం!” అని ఆశ్చర్యం వేసింది.
ఈ అభిప్రాయాల్ని చూశాక మరో సారి వ్యాసాన్ని చదివాను, వివరించవలసినవి గాని సవరించవలసినవి గాని ఏమైనా ఉన్నాయా అని. సవరణల అవసరం కనిపించలేదు గాని ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఒకటి రెండు విషయాలు వివరించటం వల్ల ఉపయోగం ఉండవచ్చును అనిపిస్తోంది.
ఈ వ్యాసంలో తెలుగు సినిమా పాట సాహిత్య సంగీతాల పరిణామం గురించి, శ్రోతల గురించి కొన్ని ప్రతిపాదనలు చేశాం. వాటిలో రెండిటి గురించి కొందరు పాఠకులు సంశయాలు వెలిబుచ్చారు. వాటిని కొంచెం ప్రస్తావిస్తాను.
ఒకటి వాడుకలో ఉన్న పదబంధాలకు కొత్త అర్థాల్ని ఆపాదించి ప్రతీకలుగా వాడటం గురించి. ఒక పాఠకుడు కొన్ని ఉదాహరణలిచ్చి ఆ సందర్భాల్లో సామాన్యార్థమే వర్తిస్తుందన్నారు. నేను కాదనను. ఎందుకంటే, మేం అన్నది అర్థం పూర్తిగా మారిపోయి కొత్త అర్థమే ప్రమాణం ఔతుందని కాదు కదా, రెండు అర్థాలూ ఉంటాయనేది. పైగా అది రాసిన వారి చమత్కారం అదే, ఒకవైపు సెన్సారు వాళ్లను డబాయించటానికి ఒక అర్థం కావాలి, మరో వైపు నిర్మాతల్నీ దర్శకుల్నీ తృప్తిపరిచే విశేషార్థమూ కావాలి.
ఇక రెండో ప్రతిపాదన, పాటల సాహిత్యానికీ శ్రోతల తరానికీ ఉన్న సంబంధం గురించి. ఈ పాఠకురాలు తనకు నచ్చిన కొందరు సినీ కవుల పేర్లు, కొన్ని పాటలు చెప్పినందువల్ల మా ప్రతిపాదనను ఆవిడకి వర్తింపజేచి, ఆవిడ పుట్టిన సంవత్సరం 1955 – 60 మధ్య అని అంచనా వెయ్యొచ్చు. తన విషయంలో మా ప్రతిపాదన వర్తిస్తుందో లేదో ఆవిడో పరీక్షించుకోవచ్చు.
మిగిలిన పాఠకులకు కూడ మా ఆహ్వానం. ఎవరికి వారే తమకు హృదయగతంగా నచ్చిన పాటలను తీసుకుని మా ఈ ప్రతిపాదన వారి విషయంలో ఎంతవరకు నిజమో చూసుకోవచ్చు.
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి అనుపమ గుళ్ళపల్లి అభిప్రాయం:
04/10/2011 3:30 pm
కథ బాగుంది. కానీ బాగా విన్న, చూసిన సన్నివేశాల్లా ఉన్నాయి అన్నీ. 1980s నాటి తెలుగు సినిమా ఈరోజున చూస్తే కలిగిన అనుభూతి కలిగింది…అంటే…జరగబోయేది గ్రహించేయగలం అన్నట్లు…
అయితే…తక్కువ వ్యవధిలో ఎక్కువ కథను చకచకా నడిపించినా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా సాగింది కథనం. రచయితకు నా అభినందనలు.
కథ కథ గురించి అనుపమ గుళ్ళపల్లి అభిప్రాయం:
04/10/2011 3:25 pm
కొత్తగా ఉంది…చక్కగా ఉంది…ఇక మాటల్లేవు.
రెండు కవితలు గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:
04/10/2011 6:36 am
మీ కవితలు భలే బాగున్నాయండి. మీ బ్లాగు పేజీలో కూడా మఱికొన్ని కవితలు చదివాను. బాగా రాస్తున్నారు! మీ చేత ఇంకా ఇంకా మదిని ఆకట్టుకునే ఆనందమైన కవితలు రాయగలిగించే సంఘటనలు మీ జీవితంలో చోటుచేసుకోవాలని ఆశిస్తూన్నాను 🙂
-ఆవినేని భాస్కర్.
కలవరపెడుతుంది మనస్సును గురించి SA Rahim అభిప్రాయం:
04/10/2011 2:26 am
Chala Bagundi mee kavita. Rao garu, women are like that andi.
పురూరవ: శ్రవ్య నాటిక గురించి Nithin అభిప్రాయం:
04/09/2011 10:26 am