వేటూరిని అడిగితే తనకి చాలా తెలియదనే చెప్పి వాదననుంచి తప్పించుకునే వారు. నా మానాన నేను రాసుకుపోతా అనేవారు… అని ఆయన అన్నట్లుగా చాలా మందే ధృవీకరించారు.
వేటూరికి మాత్రా చందస్సు తెలియదు..లాంటివి అనుకోవడం మాత్రం గొప్ప సాహసం. అక్కిరాజుగారు అన్నట్లు, “వేటూరి విషయంలో పరిజ్ఞానం సమస్య లేదు. ఒక స్టేజికి వచ్చాక ఆయనలో ఓ విరక్తి, దాని తర్వాత నిర్లక్ష్యం”
తన పాటల్ని అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా వక్రీకరించిందీ ఒక ప్రసంగంలో చెపుతూ, “సినిమా పాట పాంచాలిలా పంచభర్తృక ” అన్నారు.
అందువల్ల, మనం చూసే పాట, పంచభర్తల్తో పెళ్ళయిన తర్వాత కనుపించిన మూర్తి.
అక్కి: వేటూరికి చాలా పాండిత్యం ఉంది కానీ అదంతా ఒక పద్ధతిలో నేర్చుకున్న శాస్త్ర విజ్ఞానం కాదని నా అభిప్రాయం. పండిత వంశంలో పుట్టినందుకు ఆయనకు చాలా విషయ పరిజ్ఞానం అనుశ్రుతంగా అబ్బింది — అంటే ఆయనకు చాలా విషయాలపై intuitive గాఅవగాహన ఉంది గానీ వాటిని హేతుబద్ధంగా విశ్లేషించే శాస్త్రీయ ధృక్పథం గానీ, శిక్షణ గానీ లేదు. ఆయన డబ్బింగ్ పాటలు విశ్లేషిస్తే ఆయన చేసే తప్పులలో కనిపించే ఒక క్రమాన్ని (pattern)గమనించడం ద్వారా ఆయనకు మాత్రాఛందస్సు అవగాహనలో ఉన్న లోపాల్ని మనం కనిపెట్టవచ్చని నా అభిప్రాయం.
ఉదాహరణకు, “తానా తానా తానననానా” అన్న బాణీకి ‘మామకొడుకు రాతిరికొస్తే’ (ఆ బాణీలో ‘మామా కొడుకూ రాతిరికొస్తే’ అనే పాడాల్సివస్తుంది) అని రాసిన వేటూరి, ‘తాన తాననా/తన తాన తాననా/తన నాన తన నాన తననా’ అన్న బాణీకి ‘లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరుల వెన్నెలా’ (‘లేతపాపలా చిరునవ్వుతోటకే దిగివస్తా వాసిరుల వెన్నెలా’ అనే పాడాలి ఆట్యూనుకు) అని రాసాడు. 2000లో అట్లాంటాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తను ‘రామచిలకమ్మ, ప్రేమమొలకమ్మ’ అని పాట రాస్తే, దాన్ని తెలుగు రాని ఉదిత్ నారాయణ ‘రామ్మా చిలకమ్మా, ప్రేమా మొలకమ్మా’ అని పాడాడని వాపోతే శ్రోతలంతా చప్పట్లు కొట్టారు. ఆ తరువాత నేను ప్రైవేటుగా ఆయనతో మాట్లాడుతూ “‘తానా తననానా, తానా తననానా’ అన్న 4+2+4, 4+2+4 మాత్రలకు ‘రామచిలకమ్మ, ప్రేమ మొలకమ్మ’ సరిపోదుకదండి”అని అడిగాను. దానికి బదులుగా “నిజమే కావచ్చు బాబు, వాళ్ళు ఇచ్చిన బాణీకి నాకు తోచినట్టుగా రాస్తుంటాను. నాకు ఈ మాత్రాఛందస్సులు, అవి అంతగా తెలియదు” అన్నాడు. అదీ సంగతి!
సురేశ్,
మాత్రా చందస్సులో ప్రావీణ్యం లేకుండానే “జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా. మిల మిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార” లాంటి పాట రాయగలరంటావా? ఇది ట్యూనుకు రాసిన పాట అని మర్చేపోవద్దు. ఇంత చిన్న చిన్న విరుపులతో అర్థవంతమైన పాటే రాశారు. నేను ఈ చర్చంతా చదవట్లేదు గానీ… నా అభిప్రాయంలో వేటూరి విషయంలో పరిజ్ఞానం సమస్య లేదు. ఒక స్టేజికి వచ్చాక ఆయనలో ఓ విరక్తి, దాని తర్వాత నిర్లక్ష్యం “ఏం రాస్తే ఎవడు పట్టించుకున్నాళ్ళే” అనే నిరాసక్తత వచ్చాయేమో నని నా అనుమానం.
-అక్కిరాజు
రచయిత వేటూరి కవితారీతిలో తాను గమనించిన దాన్ని వివరించారని నా అభిప్రాయం. రచయిత వేటూరిపై అయిష్టాన్ని ప్రదర్శించారని అనిపించలేదు.
“తరాలు మారినప్పుడు స్థాయి మారుతుందేమో” అన్నారు రోహిణీ ప్రసాద్ గారు. అనుమానమేమీ లేదు దాంట్లో. అయితే ఈ తరాలు వస్తున్న మార్పులను అంగీకరించగలవా లేదా అన్నదే ముఖ్యం. ఇక స్థాయి విషయానికొస్తే, కాళిదాసు చెప్పినట్లు పాతదంతా గొప్పదీ కాదు, కొత్తదంతా చెడ్డదీ కాదు. (పురాణమిత్యేవ న సాధు సర్వం…)
పదాలతో బొమ్మలు చెక్కడం అన్నదాన్ని వేటూరి నమ్మారు. రంగులతో అరూపభావాల్ని చిత్రకారులు ఒకవిధమైన కళారూపంలో అవిష్కరింప ప్రయత్నించినట్లే, వేటూరి ఒక ప్రక్రియను చేపట్టారు. అలాంటి పెయింటింగ్స్ ని పిచ్చిగీతలని వదిలేసి నట్టే, ఈయన కవితల్ని కూడా వదిలేసే వారుంటారు. అది కవి తప్పూ కాదు.. పాఠకుడి తప్పూ కాదు. ఇందాకా అనుకునే స్థాయీభేదమే దానికి కారణం కావచ్చు.
సినీకవి ఒక్క వర్గాన్నే దృష్టిలో పెట్టుకుని పాటలు రాయడు. వేటూరి అన్ని వర్గాలకీ రాయబోయి, చాలా మంచి పాటలు “న భూతో న భవిష్యతి” అనేలా రాసికూడా (అన్ని వర్గాలకీ) అందరి చేతా ఏదో ఒక దానికి నిరసించబడ్డాడు.
వేటూరి పాట గురించి Bhaskar అభిప్రాయం:
08/30/2011 1:17 pm
వేటూరిని అడిగితే తనకి చాలా తెలియదనే చెప్పి వాదననుంచి తప్పించుకునే వారు. నా మానాన నేను రాసుకుపోతా అనేవారు… అని ఆయన అన్నట్లుగా చాలా మందే ధృవీకరించారు.
వేటూరికి మాత్రా చందస్సు తెలియదు..లాంటివి అనుకోవడం మాత్రం గొప్ప సాహసం. అక్కిరాజుగారు అన్నట్లు, “వేటూరి విషయంలో పరిజ్ఞానం సమస్య లేదు. ఒక స్టేజికి వచ్చాక ఆయనలో ఓ విరక్తి, దాని తర్వాత నిర్లక్ష్యం”
తన పాటల్ని అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా వక్రీకరించిందీ ఒక ప్రసంగంలో చెపుతూ, “సినిమా పాట పాంచాలిలా పంచభర్తృక ” అన్నారు.
అందువల్ల, మనం చూసే పాట, పంచభర్తల్తో పెళ్ళయిన తర్వాత కనుపించిన మూర్తి.
మందులను ఎలా కనుక్కొంటారు? గురించి gopinath agnihotram అభిప్రాయం:
08/28/2011 6:22 am
VERY GOOD ARTICLE, SIMPLE AND INFORMATIVE
వేటూరి పాట గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
08/26/2011 9:14 pm
అక్కి: వేటూరికి చాలా పాండిత్యం ఉంది కానీ అదంతా ఒక పద్ధతిలో నేర్చుకున్న శాస్త్ర విజ్ఞానం కాదని నా అభిప్రాయం. పండిత వంశంలో పుట్టినందుకు ఆయనకు చాలా విషయ పరిజ్ఞానం అనుశ్రుతంగా అబ్బింది — అంటే ఆయనకు చాలా విషయాలపై intuitive గాఅవగాహన ఉంది గానీ వాటిని హేతుబద్ధంగా విశ్లేషించే శాస్త్రీయ ధృక్పథం గానీ, శిక్షణ గానీ లేదు. ఆయన డబ్బింగ్ పాటలు విశ్లేషిస్తే ఆయన చేసే తప్పులలో కనిపించే ఒక క్రమాన్ని (pattern)గమనించడం ద్వారా ఆయనకు మాత్రాఛందస్సు అవగాహనలో ఉన్న లోపాల్ని మనం కనిపెట్టవచ్చని నా అభిప్రాయం.
ఉదాహరణకు, “తానా తానా తానననానా” అన్న బాణీకి ‘మామకొడుకు రాతిరికొస్తే’ (ఆ బాణీలో ‘మామా కొడుకూ రాతిరికొస్తే’ అనే పాడాల్సివస్తుంది) అని రాసిన వేటూరి, ‘తాన తాననా/తన తాన తాననా/తన నాన తన నాన తననా’ అన్న బాణీకి ‘లేతపాపల చిరునవ్వుతోటకే దిగివస్తావా సిరుల వెన్నెలా’ (‘లేతపాపలా చిరునవ్వుతోటకే దిగివస్తా వాసిరుల వెన్నెలా’ అనే పాడాలి ఆట్యూనుకు) అని రాసాడు. 2000లో అట్లాంటాలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, తను ‘రామచిలకమ్మ, ప్రేమమొలకమ్మ’ అని పాట రాస్తే, దాన్ని తెలుగు రాని ఉదిత్ నారాయణ ‘రామ్మా చిలకమ్మా, ప్రేమా మొలకమ్మా’ అని పాడాడని వాపోతే శ్రోతలంతా చప్పట్లు కొట్టారు. ఆ తరువాత నేను ప్రైవేటుగా ఆయనతో మాట్లాడుతూ “‘తానా తననానా, తానా తననానా’ అన్న 4+2+4, 4+2+4 మాత్రలకు ‘రామచిలకమ్మ, ప్రేమ మొలకమ్మ’ సరిపోదుకదండి”అని అడిగాను. దానికి బదులుగా “నిజమే కావచ్చు బాబు, వాళ్ళు ఇచ్చిన బాణీకి నాకు తోచినట్టుగా రాస్తుంటాను. నాకు ఈ మాత్రాఛందస్సులు, అవి అంతగా తెలియదు” అన్నాడు. అదీ సంగతి!
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
08/26/2011 11:08 am
అవునా!థాంక్యూ!!
ఆర్.దమయంతి.
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Madhurasree అభిప్రాయం:
08/26/2011 4:07 am
ఆర్.దమయంతి గారు మీరు వ్రాసిన కథ చాలా బాగుంది
వేటూరి పాట గురించి Akkiraju అభిప్రాయం:
08/25/2011 9:03 am
సురేశ్,
మాత్రా చందస్సులో ప్రావీణ్యం లేకుండానే “జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ మైనా మైనా. మిల మిల మెరిసిన తార, మిన్నుల విడిన సితార” లాంటి పాట రాయగలరంటావా? ఇది ట్యూనుకు రాసిన పాట అని మర్చేపోవద్దు. ఇంత చిన్న చిన్న విరుపులతో అర్థవంతమైన పాటే రాశారు. నేను ఈ చర్చంతా చదవట్లేదు గానీ… నా అభిప్రాయంలో వేటూరి విషయంలో పరిజ్ఞానం సమస్య లేదు. ఒక స్టేజికి వచ్చాక ఆయనలో ఓ విరక్తి, దాని తర్వాత నిర్లక్ష్యం “ఏం రాస్తే ఎవడు పట్టించుకున్నాళ్ళే” అనే నిరాసక్తత వచ్చాయేమో నని నా అనుమానం.
-అక్కిరాజు
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
08/23/2011 9:41 pm
తులసీ మోహన్ గారూ!
మీ భావాభిప్రాయాన్ని ఒకే ఒక్క వాక్యంలో వ్యక్తీకరించడం బావుంది.అందంగా కూడా వుంది.థాంక్యూ!
శుభాకాంక్షలతో..
ఆర్.దమయంతి.
చిట్ట చివరిది గురించి Tulasimohan అభిప్రాయం:
08/23/2011 2:00 pm
బాగుంది.. చదువుతుంటే హాయిగా!
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి Tulasimohan అభిప్రాయం:
08/23/2011 1:51 pm
వర్షంలో నిలువెల్లా తడిసినట్టు వుంది!
వేటూరి పాట గురించి Bhaskar Kompella అభిప్రాయం:
08/22/2011 8:08 pm
పాఠకులు కొందరు, రచయితకి వేటూరి నచ్చరు అన్న అభిప్రాయానికి వచ్చినట్టు కనబడుతోంది. ఒకరు, “నాకూ నచ్చరు” అన్నారు..