ఏ నిఘంటువులు ఎన్ని రూపాల్లో వివరించబోయినా చివరగా నూగుని నూగులోంచి మాత్రమే చెప్పగలిగినట్టూ, దాన్ని తిరిగి వెరే వాక్యాలలోంచి చెప్పలేకపోయినట్టూ అనిపించడమ్ లేదా:) నూగు అంటే నూగే!! అది ఎక్కడ ఏ సందర్భమ్ లో ప్రయోగించినా దాని వర్ణనా దాని వివరణా దాని భావమూ కూడా ఒకటే! నూగుని నూగు అన్న వ్యాఖ్యానమే ఎవరు తిప్పి తిప్పి ఎలా వివరించినా కూడాను.”) పాపమ్ బహుజనపల్లి సీతారామాచార్యులు గానీండి మరొ నైఘంటికా కర్త కానీండి అంతకన్నా ఏం వివరణ ఇస్తారూ?? తిరిగి దానిని తెలుగు వాక్యాలల్లో చెప్పాల్సి వస్తే దానికి సరి అయిన వాక్యమే వాళ్ళకి స్పురించలేదు. వాళ్ళని అటుంచండి “నూగు” అంటే అందరికీ తెలుసు కదా?? ఏదీ తిరిగి దానిని తెలుగు వాక్యాలలో చెప్పండి. అదేమిటో?? ఎలా ఉంటుందో??:) అంతకన్నా బాగా రాసి చెప్పగలరేమో ప్రయత్నించండీ పోనీ:)
నూగు ఏ సందర్భలో వచ్చినా అది లేత/ మొలక [మీసం..ముళ్ళు../వెంట్రుక] ఇత్యాదులని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. ఎక్కడైనా కూడా!! దానికి అంతకన్నా మించి మరో అర్ధమే సాధ్యమ్ కాదు సాధించాలని అనుకున్నా:) నూగు గుచ్చుకున్న అనుభవాన్ని… వంటికి అది గుచ్చుకుని ఆ నూగుని బయటికి తీయలేక ఇబ్బంది పడే సందర్భాన్నీ… ఎవరైనా ఊహించుకున్నా ఆయా నిఘంటుకారులు దాన్ని “ముళ్ళు” గా పేర్కొనే ప్రయత్నమ్ ఎందుకు చేసారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఆ లేత “ముళ్ళు” అది కాయల మీదా ఉంటుంది. కొమ్మల మీదా ఉంటుంది. గుచ్చుకుంటే చికాగ్గానూ ఉంటుంది మరి:)
నిఘంటు నిర్మాణం ఆసక్తి దాయకమూ…. పత్తి పనీను. ఓర్పు చాలా కావాలి దానికి. సంవత్సరాల శ్రమ తర్వాత కూడా ఏ ఒక్కరూ “సమగ్ర” నిఘంటు నిర్మాణం చెయ్యలేరు. అదువల్ల ఎప్పటికప్పుడు అకారాది క్రమంలో అప్పటి దాకా నిఘంటువులకి ఎక్కని పదాలని చేర్చుకుంటూ పోవాల్సి ఉంటుంది.
ఉదాహరణకి “నునుపారు” పదాన్నే తీసుకోండి. ఇది మీకు నిఘంటువుల్లో కనిపించదే?? కానీ పుస్తకాల్లో వ్యవహారంలో ఉంటుంది. ఇలా అనేకం. అదువల్ల పాత కవుల రచనలని ఆధారంగా తీసుకుని నిఘంటువులని తరుచూ సవరించుకుంటూ ఉంటూనే ఉండాలి. అయితే ఈ పని ఎవరు చేయాలి? ఎలా చేయాలి?? ఇంత పరిశ్రమ ఎవరు పడతారూ?? ఈ ప్రయత్నానికి ఆర్ధికమైన సర్దుబాట్లు ఎవరు చేస్తారూ?? ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలు.
సాహితీప్రియుడైన నా తమిళ స్నేహితుడు సుబ్రమణ్యంగారని ఒకాయనను ఈ విషయాన్నిగురించి అడిగాను. అతడు http://dsal.uchicago.edu/dictionaries/tamil-lex/ నుండి కావలసిన విషయము సేకరించి నాకు ఉత్తరము వ్రాసినారు. అతడు ఇచ్చిన విషయము ప్రకారము నూగారు నూంగు + కారు లేక నూఁగు + కారు లేక నూన్ + కారు అవుతుంది. కారు అంటే సామాన్యమైన అర్థము నలుపు. కాని కారు అనే పదానికి మగవారి వెండ్రుకలు, ఎలుక వెండ్రుకలు అని కూడ అర్థము ఉన్నది. కాబట్టి నూఁగారు అంటే రోమావళి అని అర్థము వస్తుంది. కాలక్రమేణ అది కొన్ని చోటులలోని రోమావళికి మాత్రమేఎ పదము అన్వయించిందేమో? నేను తొడల రోమావళిని కూడ నూగారు అని చదివియున్నాను (చీమలబారులాటి నూగారు :-).
@కామేశ్వరరావు గారు: పాణిని గారు సరిగ్గా ఇదే విషయాన్ని సూచిస్తూ నాకు మెయిల్ పంపారు. అయితే, కిరణాలు పైనుండి కిందకు ప్రసరిస్తాయి, తీగలే కిందినుండి పైకి పాకుతాయి (ప్రాకుతాయి) కాబట్టి “పయిఁ బ్రాకుమరీచుల” అంటే మిరియపు తీగలే కావచ్చు అని నేనంటే పాణిని గారు “నాకొక్కటే సందేహం. మరీచములను మరీచులు అని నేనూ, మీరూ అనవచ్చునేమో గానీ, తిక్కన అంటాడా అని!” ఇప్పుడు మీ వివరణ కూడా చదివాక కిరణాలే ఒప్పని అనిపిస్తోంది.
పాణిని గారే ఇంకో ప్రశ్న లేవనెత్తారు: అది ‘మరీచుల నూఁగు నూఁగు లేఁగొమ్మలా’? లేక ‘మరీచులన్ ఊగు నూఁగు లేఁగొమ్మలా’? అని. ఊగులో అరసున్న లేదు కాబట్టి నూఁగునూఁగే సరైనదని నేను సవరించి చెప్పాను.
నూగుకి సన్నని అనే అర్థం తీసుకున్నా నూగు+ఆరు అన్న విరుపుకి అభ్యంతరమేమీ లేదు.
నూఁగారుకు నూన్+గు+ఆరు = నూగు+ఆరు అన్న విరుపుకు నాకేం అభ్యంతరం లేదు. మీరు చెప్పినట్లు “ఆరు” అన్న పదానికి వెంట్రుకలన్న అర్థం ఎలా వచ్చిందన్నది పరిశీలించవలసిన అంశం.
“తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది” అని అన్నది చిన్నయసూరి, చెళ్ళపిళ్ళ కాదు. ఇకపోతే నేను “నునుపారు” లోని ఆరు కి అర్ధం చెప్పలేదు. నునుపు+ ఆరు అని విరిచినట్టుగానే నూగు+ఆరు ని విరవమని సూచన చేసాను. కామేశ్వర రావుగారి వివరణ మరీచులు అన్నది ఒప్పు. మనం నిఘంటువులని అర్ధ వివరణ కోసం మాత్రమే చూస్తున్నాం తప్ప వాటిని సవరించుకోవడమ్ దిశగా గాని, పదాల సంఖ్యని పెంచుకోవాలని గానీ ప్రయత్నమ్ పెద్దగా చెయ్యలేదు. అదునా ఆధునిక కాలంలో ఆసక్తీ అర్హతా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వేరే వృత్తులకి బతుకుతెరువుకి వెళ్లడమూ. ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ పనులకి సరిపడా శ్రధ్ధా సామర్ధ్యాలను చూపకపోవడమూ కారణంగా ఉన్న నిఘంటువులతో కుస్తీలు పట్టుకోవలసి వస్తోంది.
పాత తెలుగుతో పనిచేసే క్రమంలో నిఘంటువులతో పనిచేసే వారికి అందరికీ కొలిచాల లాగే ఈ విషయాలు అనుభవంలోకి వస్తాయి. కవిత్వం విషయంలో మనం కవి హృదయాన్ని అనుసరించాలి తప్ప ముక్కస్యముక్కహ అన్న రీతిలో అర్ధాలని చూడకూడదు కూడాను. అక్కడ ఒప్పైన అర్ధాన్ని మనం తీసుకోవాలి. నూగారు లోని ఆరు సంఖ్యా పదం లోని ఆరు ఒకటి కావు గనక ఇది వేరే విషయం. నూగు అన్నదానికి నేను నూగు+ఆరు గానే విభజించుకుంటాను. మనకి ఇవాళ అరసున్నలూ.. ఖండబిందు పూర్ణబిందులూ.. మామూలు ర బండి ర లూ చాలా తికమకతొ కలిసిపోయి ఉన్నాయి. అందులో సరైనవి ఏవో కానివి ఏవో నిఘంటువులూ ఇవ్వడం లేదు. ఎవరి తోవని అనుసరించి దేన్ని సాధించాలో స్పస్టమైన రీతి ఒకటి ఉన్నట్టు కనబడని సందర్భాలు చాలా ఎదురౌతాయి. చూద్దాం ఇతరులు ఇంకేమంటారో??
ఇక్కడ మరీచులు అంటే కిరణాలు. మిరియాలు కాదు. మరీచము, మరిచము అంటే మిరియము. దానికి బహువచనం మరీచములు అవుతుంది కాని మరీచులు కాదు. పైగా ఇక్కడసలు మిరియపు తీగల, కొమ్మల ప్రసక్తి అవసరమే లేదు! మరీచి – కిరణము. మరీచులు – కిరణాలు. చకోరాలకి చంద్రకిరణాలు ఆహారమని కవిసమయం కదా. పైన ప్రాకే చంద్రకిరణాలనే లేలేత కొమ్మలని (అన్నిసార్లు లేత ఎందుకంటే వెన్నల కిరణాలు అంత సన్నగా ఉన్నాయి కాబట్టి). వాటిని పట్టుకోడానికి తమ చంచువులని కదులుస్తున్నాయి. నూగు అంటే ఆకులమీద, కాయలమీద ఏర్పడే చిన్నచిన్న ముళ్ళు అనే అర్థం దగ్గర యీ పద్యం ఎందుకిచ్చారో నాకు తెలియడం లేదు. అది పొరపాటే అయ్యుండాలి.
ఇక ఇక్కడ “నూగు” అంటే “లేత”, “నునుపు”, “సన్నని” అన్న అర్థాలేమైనా తీసుకోవచ్చు. సన్నని అన్న అర్థమే నాకు సబబుగా తోస్తోంది. నూగుకి సన్నని అనే అర్థం తీసుకున్నా నూగు+ఆరు అన్న విరుపుకి అభ్యంతరమేమీ లేదు. “ఆరు” అన్న పదానికి వెంట్రుకలన్న అర్థం ఎలా వచ్చిందన్నది పరిశీలించవలసిన అంశం.
మీలో సాహిత్య ప్రియులకు, నాదొక మనవి. నేను రాసిన కొన్ని కధలు నా blog లో పొందుపరచాను. సాహిత్యవిశ్లేషణ, మరియు ప్రత్యేకాభిరుచి (elitist) కి సంబంధించి ఉండకపోవచ్చు గాని, చరిత్రగతి, పురాణాలను కొంతవరకు మేళవించి, నేనొక Science Fiction కధను వ్రాస్తున్నాను. ఇంకా ఎన్నో కధలు నా మస్తిష్కం లో ఉన్నవి, future లో నా బ్లాగ్ లో వ్రాయడం జరుగుతుంది. నా కదావస్తువులు, శైలి నచ్చితే తప్పకుండా నా blog ని సందర్శించ ప్రార్ధన.
“తెలుగు వ్యాకరణ దీపం చిన్నది” అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు అన్న నాటికి నేటికి పెద్ద మార్పేమి రాలేదు. అట్లాగే, ‘తెలుగు నైఘంటిక దీపం’ కూడా చిన్నదనే చెప్పాలి. గత పది, పదిహేనేళ్ళుగా తెలుగు ప్రాచీన సాహిత్యం చదువుతూ, నిఘంటువులు చూస్తున్న నాకు అర్థమైన విషయం ఏమిటంటే మన ప్రాచీన సాహిత్యంలోని పదజాలాన్ని వివరించడానికి మనకు అందుబాటులో ఉన్న నిఘంటువులు పూర్తిగా చాలవని (శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు నాకెప్పుడూ అందుబాటులో లేదు). అందుకే, నిఘంటు అర్థాలను వివేచించి, ప్రశ్నించడంలో తప్పు లేదనిపిస్తుంది.
బహుజనపల్లి వారి శబ్దరత్నాకరము లో నూఁగు అన్న శబ్దానికి ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్న అర్థాన్నిచ్చి తిక్కన పద్యాన్ని ఉదాహరణగా ఇవ్వడం ఎంతవరకూ ఔచిత్యమో పరిశీలిద్దాం.
తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణంలో షష్ఠాశ్వాసం లో 51వ పద్యం ఇది:
“… ఇందు బింబం పై దృష్టి నిలిపి చకోరాలు పైకి పాకే మిరియపు తీగల ‘నూఁగు నూఁగు లేఁత కొమ్మలను’ ముక్కులతో కదల్చి , తెమల్చుచుండగా ఎగిరే పక్షి ఆకృతి పొందాయి” అని నాకు తెలిసిన అర్థం.
ఇక్కడ నూఁగు అన్న పదానికి ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్న అర్థం సరిపోతుందా? ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్నది నామవాచకము (విశేష్యము). ‘నూఁగు నూఁగు లేఁత కొమ్మలను’ అన్న చోట ‘నూఁగు’ విశేషణంగా వాడినట్టు స్పష్టంగానే తెలుస్తోంది. ‘నూఁగు నూఁగు’ అని రెండుసార్లు వాడడం కూడా అది విశేషణమే అన్న వాదాన్నే బలపరుస్తున్నది. అందుకే నేను శబ్దరత్నాకరము లో నూఁగు అన్న పదానికి విశేషణార్థంలో ఇచ్చిన లేఁత అన్న అర్థాన్ని తీసుకొని అది సరికాదు అని వాదించాను.
రమగారు అన్నారు:
“నూగు” ని “నూన్” లోంచి చూడబోతే కదా మీకు ఇబ్బంది? నూగు అన్న పదాన్ని భిన్నంగా నున్న లేదా నూన్ అన్నదానికన్నా మీరు చూడటమ్ కస్టం ఏమీ కాదే?? భిన్నపదాలని మీరు ఏక వ్యుత్పత్తి నించి సాధించలేరు కదా?
రమ గారు: నూఁగు అన్న పదంలో మధ్యలో అరసున్న ఉన్నది చూసారా? తెలుగులో అరసున్న ఉన్న ప్రతిపదాన్ని ఒకప్పుడు పూర్తిసున్నతో పలికేవారని మనం చెప్పుకోవచ్చు. తెలుఁగు, తోఁట వంటి పదాలకు మిగిలిన ద్రావిడ భాషలలో ఇంకా సున్నతో ఉచ్చారణ నిలిచే ఉంది (తెలుంగు, తోంట మొ॥). నూగు మొదటగా నూంగు/నూన్గు అన్న రూపంలో ఉండేది అని మీరు ఒప్పుకుంటే అది నున్న/నూన్- అన్న ధాతువు సంబంధించిందేఅని వివరించడం అంత కష్టమేమి కాదని నా అభిప్రాయం. లేకపోతే, నూన్గుకు మిగిలిన ద్రావిడ భాషలలో సజాతి పదాలు చూపలేం. ప్రతి అచ్చతెలుగు పదానికి మూలద్రావిడభాషా ధాతువు చూపించగలగాలి. లేదా, అది తెలుగు భాషలోనే కొత్తగా పుట్టిన పదమని (independent innovation) వాదించగలగాలి. అది historical linguistics లో మనము నేర్చుకొనే తొలిపాఠాల్లో ఒకటి.
వల్లభరాయని పద్యంలో నునుపారు పదానికి ఆరు అంటే వెంట్రుక(లు) అన్న అర్థం లేదండి. నూఁగారులో ఆరుకు వెంట్రుకలు అన్న అర్థం రావడానికి దాని మూలధాతువు *నాఱు అయి ఉండవచ్చునేమో ఆలోచించాలి.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:
09/15/2011 3:28 am
ఏ నిఘంటువులు ఎన్ని రూపాల్లో వివరించబోయినా చివరగా నూగుని నూగులోంచి మాత్రమే చెప్పగలిగినట్టూ, దాన్ని తిరిగి వెరే వాక్యాలలోంచి చెప్పలేకపోయినట్టూ అనిపించడమ్ లేదా:) నూగు అంటే నూగే!! అది ఎక్కడ ఏ సందర్భమ్ లో ప్రయోగించినా దాని వర్ణనా దాని వివరణా దాని భావమూ కూడా ఒకటే! నూగుని నూగు అన్న వ్యాఖ్యానమే ఎవరు తిప్పి తిప్పి ఎలా వివరించినా కూడాను.”) పాపమ్ బహుజనపల్లి సీతారామాచార్యులు గానీండి మరొ నైఘంటికా కర్త కానీండి అంతకన్నా ఏం వివరణ ఇస్తారూ?? తిరిగి దానిని తెలుగు వాక్యాలల్లో చెప్పాల్సి వస్తే దానికి సరి అయిన వాక్యమే వాళ్ళకి స్పురించలేదు. వాళ్ళని అటుంచండి “నూగు” అంటే అందరికీ తెలుసు కదా?? ఏదీ తిరిగి దానిని తెలుగు వాక్యాలలో చెప్పండి. అదేమిటో?? ఎలా ఉంటుందో??:) అంతకన్నా బాగా రాసి చెప్పగలరేమో ప్రయత్నించండీ పోనీ:)
నూగు ఏ సందర్భలో వచ్చినా అది లేత/ మొలక [మీసం..ముళ్ళు../వెంట్రుక] ఇత్యాదులని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతోంది. ఎక్కడైనా కూడా!! దానికి అంతకన్నా మించి మరో అర్ధమే సాధ్యమ్ కాదు సాధించాలని అనుకున్నా:) నూగు గుచ్చుకున్న అనుభవాన్ని… వంటికి అది గుచ్చుకుని ఆ నూగుని బయటికి తీయలేక ఇబ్బంది పడే సందర్భాన్నీ… ఎవరైనా ఊహించుకున్నా ఆయా నిఘంటుకారులు దాన్ని “ముళ్ళు” గా పేర్కొనే ప్రయత్నమ్ ఎందుకు చేసారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఆ లేత “ముళ్ళు” అది కాయల మీదా ఉంటుంది. కొమ్మల మీదా ఉంటుంది. గుచ్చుకుంటే చికాగ్గానూ ఉంటుంది మరి:)
నిఘంటు నిర్మాణం ఆసక్తి దాయకమూ…. పత్తి పనీను. ఓర్పు చాలా కావాలి దానికి. సంవత్సరాల శ్రమ తర్వాత కూడా ఏ ఒక్కరూ “సమగ్ర” నిఘంటు నిర్మాణం చెయ్యలేరు. అదువల్ల ఎప్పటికప్పుడు అకారాది క్రమంలో అప్పటి దాకా నిఘంటువులకి ఎక్కని పదాలని చేర్చుకుంటూ పోవాల్సి ఉంటుంది.
ఉదాహరణకి “నునుపారు” పదాన్నే తీసుకోండి. ఇది మీకు నిఘంటువుల్లో కనిపించదే?? కానీ పుస్తకాల్లో వ్యవహారంలో ఉంటుంది. ఇలా అనేకం. అదువల్ల పాత కవుల రచనలని ఆధారంగా తీసుకుని నిఘంటువులని తరుచూ సవరించుకుంటూ ఉంటూనే ఉండాలి. అయితే ఈ పని ఎవరు చేయాలి? ఎలా చేయాలి?? ఇంత పరిశ్రమ ఎవరు పడతారూ?? ఈ ప్రయత్నానికి ఆర్ధికమైన సర్దుబాట్లు ఎవరు చేస్తారూ?? ఇవన్నీ జవాబులు లేని ప్రశ్నలు.
రమ.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:
09/14/2011 6:52 pm
సాహితీప్రియుడైన నా తమిళ స్నేహితుడు సుబ్రమణ్యంగారని ఒకాయనను ఈ విషయాన్నిగురించి అడిగాను. అతడు http://dsal.uchicago.edu/dictionaries/tamil-lex/ నుండి కావలసిన విషయము సేకరించి నాకు ఉత్తరము వ్రాసినారు. అతడు ఇచ్చిన విషయము ప్రకారము నూగారు నూంగు + కారు లేక నూఁగు + కారు లేక నూన్ + కారు అవుతుంది. కారు అంటే సామాన్యమైన అర్థము నలుపు. కాని కారు అనే పదానికి మగవారి వెండ్రుకలు, ఎలుక వెండ్రుకలు అని కూడ అర్థము ఉన్నది. కాబట్టి నూఁగారు అంటే రోమావళి అని అర్థము వస్తుంది. కాలక్రమేణ అది కొన్ని చోటులలోని రోమావళికి మాత్రమేఎ పదము అన్వయించిందేమో? నేను తొడల రోమావళిని కూడ నూగారు అని చదివియున్నాను (చీమలబారులాటి నూగారు :-).
நூங்கு²-தல் nūṅku- v. intr. 10. Men’s hair; ஆண்மயிர். (பிங்.) 11. Rat’s hair; எலிமயிர். (பிங்.) 12. Black leprosy; கருங்குட்டம். காரக்குறைந்து (கலித். 65). 13. Darkness, gloom of night; இருள். காரடுகாலை (பரிபா. 12, 85). 14. Ignorance, illusion; அறிவு மயக்கம். களவென் னுங் காரறிவாண்மை (குறள், 287). 15. Rancour, deepseated and implacable hatred; ஆறாச் சினம். (பிங்.) 16. Freshness, greenness; பசு மை. காரார் குருந்தோடு (திணைமாலை. 112). 17. Beauty; அழகு. (பிங்.) 18. Ripeness, maturity, flowering period, as of a plant; செவ்வி. கார்க் குவளை காலுங் கனல் (பு. வெ. 12, பெண்பாற். 11).
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి SeshatalpaSayee Vadapalli అభిప్రాయం:
09/14/2011 3:12 pm
నూగు ఉన్న ఆకులని పైనుంచి తాకితే కొద్దిగా ముళ్లలాగా తగులుతాయి కానీ, నిమిరితే పట్టులాగానే మెత్తగా ఉంటాయి..
అర్థాలలో/వివరణలలో “నూగు” కోసం వెతకండి.
Down – soft feathers పక్షుల యొక్క వొంటిమీద మెత్తటి యీకెలు, సన్నబొచ్చు, నూగు వెంట్రుకలు.
అలాగే Hairiness, Languinous పదాలకు కూడ.
—
శాయి.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/14/2011 2:16 pm
@కామేశ్వరరావు గారు: పాణిని గారు సరిగ్గా ఇదే విషయాన్ని సూచిస్తూ నాకు మెయిల్ పంపారు. అయితే, కిరణాలు పైనుండి కిందకు ప్రసరిస్తాయి, తీగలే కిందినుండి పైకి పాకుతాయి (ప్రాకుతాయి) కాబట్టి “పయిఁ బ్రాకుమరీచుల” అంటే మిరియపు తీగలే కావచ్చు అని నేనంటే పాణిని గారు “నాకొక్కటే సందేహం. మరీచములను మరీచులు అని నేనూ, మీరూ అనవచ్చునేమో గానీ, తిక్కన అంటాడా అని!” ఇప్పుడు మీ వివరణ కూడా చదివాక కిరణాలే ఒప్పని అనిపిస్తోంది.
పాణిని గారే ఇంకో ప్రశ్న లేవనెత్తారు: అది ‘మరీచుల నూఁగు నూఁగు లేఁగొమ్మలా’? లేక ‘మరీచులన్ ఊగు నూఁగు లేఁగొమ్మలా’? అని. ఊగులో అరసున్న లేదు కాబట్టి నూఁగునూఁగే సరైనదని నేను సవరించి చెప్పాను.
నూఁగారుకు నూన్+గు+ఆరు = నూగు+ఆరు అన్న విరుపుకు నాకేం అభ్యంతరం లేదు. మీరు చెప్పినట్లు “ఆరు” అన్న పదానికి వెంట్రుకలన్న అర్థం ఎలా వచ్చిందన్నది పరిశీలించవలసిన అంశం.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:
09/14/2011 2:11 pm
“తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది” అని అన్నది చిన్నయసూరి, చెళ్ళపిళ్ళ కాదు. ఇకపోతే నేను “నునుపారు” లోని ఆరు కి అర్ధం చెప్పలేదు. నునుపు+ ఆరు అని విరిచినట్టుగానే నూగు+ఆరు ని విరవమని సూచన చేసాను. కామేశ్వర రావుగారి వివరణ మరీచులు అన్నది ఒప్పు. మనం నిఘంటువులని అర్ధ వివరణ కోసం మాత్రమే చూస్తున్నాం తప్ప వాటిని సవరించుకోవడమ్ దిశగా గాని, పదాల సంఖ్యని పెంచుకోవాలని గానీ ప్రయత్నమ్ పెద్దగా చెయ్యలేదు. అదునా ఆధునిక కాలంలో ఆసక్తీ అర్హతా ఉన్న వాళ్ళు ఎవరూ కూడా వేరే వృత్తులకి బతుకుతెరువుకి వెళ్లడమూ. ఆయా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఈ పనులకి సరిపడా శ్రధ్ధా సామర్ధ్యాలను చూపకపోవడమూ కారణంగా ఉన్న నిఘంటువులతో కుస్తీలు పట్టుకోవలసి వస్తోంది.
పాత తెలుగుతో పనిచేసే క్రమంలో నిఘంటువులతో పనిచేసే వారికి అందరికీ కొలిచాల లాగే ఈ విషయాలు అనుభవంలోకి వస్తాయి. కవిత్వం విషయంలో మనం కవి హృదయాన్ని అనుసరించాలి తప్ప ముక్కస్యముక్కహ అన్న రీతిలో అర్ధాలని చూడకూడదు కూడాను. అక్కడ ఒప్పైన అర్ధాన్ని మనం తీసుకోవాలి. నూగారు లోని ఆరు సంఖ్యా పదం లోని ఆరు ఒకటి కావు గనక ఇది వేరే విషయం. నూగు అన్నదానికి నేను నూగు+ఆరు గానే విభజించుకుంటాను. మనకి ఇవాళ అరసున్నలూ.. ఖండబిందు పూర్ణబిందులూ.. మామూలు ర బండి ర లూ చాలా తికమకతొ కలిసిపోయి ఉన్నాయి. అందులో సరైనవి ఏవో కానివి ఏవో నిఘంటువులూ ఇవ్వడం లేదు. ఎవరి తోవని అనుసరించి దేన్ని సాధించాలో స్పస్టమైన రీతి ఒకటి ఉన్నట్టు కనబడని సందర్భాలు చాలా ఎదురౌతాయి. చూద్దాం ఇతరులు ఇంకేమంటారో??
రమ.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
09/14/2011 1:39 pm
“పయిఁ బ్రాకుమరీచుల నూఁగు నూఁగు లేఁ
గొమ్మలు వట్ట”
ఇక్కడ మరీచులు అంటే కిరణాలు. మిరియాలు కాదు. మరీచము, మరిచము అంటే మిరియము. దానికి బహువచనం మరీచములు అవుతుంది కాని మరీచులు కాదు. పైగా ఇక్కడసలు మిరియపు తీగల, కొమ్మల ప్రసక్తి అవసరమే లేదు! మరీచి – కిరణము. మరీచులు – కిరణాలు. చకోరాలకి చంద్రకిరణాలు ఆహారమని కవిసమయం కదా. పైన ప్రాకే చంద్రకిరణాలనే లేలేత కొమ్మలని (అన్నిసార్లు లేత ఎందుకంటే వెన్నల కిరణాలు అంత సన్నగా ఉన్నాయి కాబట్టి). వాటిని పట్టుకోడానికి తమ చంచువులని కదులుస్తున్నాయి. నూగు అంటే ఆకులమీద, కాయలమీద ఏర్పడే చిన్నచిన్న ముళ్ళు అనే అర్థం దగ్గర యీ పద్యం ఎందుకిచ్చారో నాకు తెలియడం లేదు. అది పొరపాటే అయ్యుండాలి.
ఇక ఇక్కడ “నూగు” అంటే “లేత”, “నునుపు”, “సన్నని” అన్న అర్థాలేమైనా తీసుకోవచ్చు. సన్నని అన్న అర్థమే నాకు సబబుగా తోస్తోంది. నూగుకి సన్నని అనే అర్థం తీసుకున్నా నూగు+ఆరు అన్న విరుపుకి అభ్యంతరమేమీ లేదు. “ఆరు” అన్న పదానికి వెంట్రుకలన్న అర్థం ఎలా వచ్చిందన్నది పరిశీలించవలసిన అంశం.
నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి Suryaprakash Rao Mothiiki అభిప్రాయం:
09/14/2011 10:08 am
ఈ పద్యాన్ని తెలుగు సినిమా “భీష్మ” లొ ఘంటసాల పాడారు!
ఈమాట గురించి గురించి Salahuddin అభిప్రాయం:
09/14/2011 9:47 am
తెలుగు భాషాభిమానులకు నమస్కారం!
మీలో సాహిత్య ప్రియులకు, నాదొక మనవి. నేను రాసిన కొన్ని కధలు నా blog లో పొందుపరచాను. సాహిత్యవిశ్లేషణ, మరియు ప్రత్యేకాభిరుచి (elitist) కి సంబంధించి ఉండకపోవచ్చు గాని, చరిత్రగతి, పురాణాలను కొంతవరకు మేళవించి, నేనొక Science Fiction కధను వ్రాస్తున్నాను. ఇంకా ఎన్నో కధలు నా మస్తిష్కం లో ఉన్నవి, future లో నా బ్లాగ్ లో వ్రాయడం జరుగుతుంది. నా కదావస్తువులు, శైలి నచ్చితే తప్పకుండా నా blog ని సందర్శించ ప్రార్ధన.
ధన్యవాదములు.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/14/2011 9:34 am
“తెలుగు వ్యాకరణ దీపం చిన్నది” అని చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు అన్న నాటికి నేటికి పెద్ద మార్పేమి రాలేదు. అట్లాగే, ‘తెలుగు నైఘంటిక దీపం’ కూడా చిన్నదనే చెప్పాలి. గత పది, పదిహేనేళ్ళుగా తెలుగు ప్రాచీన సాహిత్యం చదువుతూ, నిఘంటువులు చూస్తున్న నాకు అర్థమైన విషయం ఏమిటంటే మన ప్రాచీన సాహిత్యంలోని పదజాలాన్ని వివరించడానికి మనకు అందుబాటులో ఉన్న నిఘంటువులు పూర్తిగా చాలవని (శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు నాకెప్పుడూ అందుబాటులో లేదు). అందుకే, నిఘంటు అర్థాలను వివేచించి, ప్రశ్నించడంలో తప్పు లేదనిపిస్తుంది.
బహుజనపల్లి వారి శబ్దరత్నాకరము లో నూఁగు అన్న శబ్దానికి ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్న అర్థాన్నిచ్చి తిక్కన పద్యాన్ని ఉదాహరణగా ఇవ్వడం ఎంతవరకూ ఔచిత్యమో పరిశీలిద్దాం.
తిక్కన రాసిన నిర్వచనోత్తర రామాయణంలో షష్ఠాశ్వాసం లో 51వ పద్యం ఇది:
సమ్మదవారి గన్గడలఁ జాలుగ మై గరుపార నిందుబిం-
బమ్మున దృష్టి నిల్పి పయిఁ బ్రాకుమరీచుల నూఁగు నూఁగు లేఁ
గొమ్మలు వట్ట చంచుపుట కోటిఁ గదల్చి తెమల్చి కొంచు సౌ-
ఖ్యమ్మ విహంగమ మ్మయిన యాకృతి నొందెఁ జకోర మొక్కెడన్ (6.51)
“… ఇందు బింబం పై దృష్టి నిలిపి చకోరాలు పైకి పాకే మిరియపు తీగల ‘నూఁగు నూఁగు లేఁత కొమ్మలను’ ముక్కులతో కదల్చి , తెమల్చుచుండగా ఎగిరే పక్షి ఆకృతి పొందాయి” అని నాకు తెలిసిన అర్థం.
ఇక్కడ నూఁగు అన్న పదానికి ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్న అర్థం సరిపోతుందా? ‘కొన్ని యాకులమీఁదను కాయలమీఁదను ఏర్పడియుండు చిన్న చిన్న ముండ్లు’ అన్నది నామవాచకము (విశేష్యము). ‘నూఁగు నూఁగు లేఁత కొమ్మలను’ అన్న చోట ‘నూఁగు’ విశేషణంగా వాడినట్టు స్పష్టంగానే తెలుస్తోంది. ‘నూఁగు నూఁగు’ అని రెండుసార్లు వాడడం కూడా అది విశేషణమే అన్న వాదాన్నే బలపరుస్తున్నది. అందుకే నేను శబ్దరత్నాకరము లో నూఁగు అన్న పదానికి విశేషణార్థంలో ఇచ్చిన లేఁత అన్న అర్థాన్ని తీసుకొని అది సరికాదు అని వాదించాను.
రమగారు అన్నారు:
రమ గారు: నూఁగు అన్న పదంలో మధ్యలో అరసున్న ఉన్నది చూసారా? తెలుగులో అరసున్న ఉన్న ప్రతిపదాన్ని ఒకప్పుడు పూర్తిసున్నతో పలికేవారని మనం చెప్పుకోవచ్చు. తెలుఁగు, తోఁట వంటి పదాలకు మిగిలిన ద్రావిడ భాషలలో ఇంకా సున్నతో ఉచ్చారణ నిలిచే ఉంది (తెలుంగు, తోంట మొ॥). నూగు మొదటగా నూంగు/నూన్గు అన్న రూపంలో ఉండేది అని మీరు ఒప్పుకుంటే అది నున్న/నూన్- అన్న ధాతువు సంబంధించిందేఅని వివరించడం అంత కష్టమేమి కాదని నా అభిప్రాయం. లేకపోతే, నూన్గుకు మిగిలిన ద్రావిడ భాషలలో సజాతి పదాలు చూపలేం. ప్రతి అచ్చతెలుగు పదానికి మూలద్రావిడభాషా ధాతువు చూపించగలగాలి. లేదా, అది తెలుగు భాషలోనే కొత్తగా పుట్టిన పదమని (independent innovation) వాదించగలగాలి. అది historical linguistics లో మనము నేర్చుకొనే తొలిపాఠాల్లో ఒకటి.
వల్లభరాయని పద్యంలో నునుపారు పదానికి ఆరు అంటే వెంట్రుక(లు) అన్న అర్థం లేదండి. నూఁగారులో ఆరుకు వెంట్రుకలు అన్న అర్థం రావడానికి దాని మూలధాతువు *నాఱు అయి ఉండవచ్చునేమో ఆలోచించాలి.
శ్రీపాదరాయలు గురించి nagamurali అభిప్రాయం:
09/14/2011 9:10 am
Lyla గారూ,
Hats off to your sense of humor!!