Gowri gariki namaskarm,
nenu telugu lo i dhi vrayalani entho try chesanu kaani kudharledhu.. pulivesham..made my heart..very soft…
you know the therem i got from it.. you have to help some one when they need..not when you feel comfortable about it….
krish
మోహన గారూ !! నాకు పూర్తి గా ఆ పుస్తకం open కాలేదు. నేను చదివినంతమేరకు ఆయన చిన్నతిరుమలయ్య పుస్తకాన్ని వ్యాఖ్యానం చేసేరు. మంచిదే. అది అందుబాటులో ఉంటే కావాలని అనుకున్న వాళ్ళు కొనుకోగలరుకదా?? అయితే అసలు పుస్తకం చినతిరుమలయ్య గ్రంధాన్నే ముద్రించని తితిదే సాళ్వ కృష్ణ్ర్త మూర్తి గారి పుస్తకాన్ని ముద్రించగలదని అనుకోలేం !!
నేను చినతిరుమలయ్య గారి పుస్తకాన్ని చదవగలిగాను. కృష్ణమూర్తి గారి పుస్తకంలోని మిగిలిన సంగతులు సైతమ్ మీకు అన్నమయ్య సంకీర్త్నలకి ఆనాటి పెద్దలు రాసిన ముందుమాటలలో దొరికేవే !! అయితే నేను మళ్ళి మళ్ళీ అనేదేమంటే ఎందుకని చాలా డబ్బులున్న టిటిడి లాంటీ సంస్థ సైతం ఇంత పాటి చిన్న పని మీద శ్రధ్ధ పెట్టలేకపోతోంది?? ఆ సంకీర్తనాలక్షణమే చిన్న పుస్తకం కాగా అదన్నా అచ్చువేయ వచ్చును కదా?? నిన్నకాక మొన్న అచ్చు అయిన పుస్తకమె దొరకదు , ఇంక ఏ యాభైలలో పుస్తకాన్ని ఎక్కడ వెతక గలం?? అంతకన్నా ముందటి వాటిని ఎక్కడ వెతకగలం??వేంకటమఖిని చదవాలీ అంటే ఏ విష్ణు నారాయణ బత్ఖడే గారి పుస్తకాలనుంచో చదవాలి కామోసు.
” ధాతువు” ను సమృధ్ధిగా కూర్చగలిగి ‘ మాతు” రచనలో మందకోడిగా ఉండేవాడు ” మధ్యమ జాతి ” వాగ్గేయకారుడని అన్నమయ్య అన్నట్టు గా మనకి చినతిరుమలయ్య వ్యాఖ్యానమ్ వలన స్పస్టంగానే తెలుస్తోంది. అది చాలు కదా ! అంతకు మించి ఈ చర్చలొ చెప్పవలసినది ఏముందీ??
Abba entha kammaga vundo andi ee kadha… Anukokunda chadivanu ee kadhani. prasad gariki na abhinandanalu.. Nijamga mana ammala taram vallao chala mandiki email operate cheyyatam chethakadu anedi nootiki nooru pallu nijam.. daniki odaharana ma ammeee. Eppudu computer neerpudamanna vaddu kallu noppi, antha chinna letters nenu type cheyyalnu ani edo sakulu chebutundi. Ofcourse nenu rojuki 2 gantala patu matladatanu roju aavidatho adi vere sangati.. kani letter anedi matram always an evergreen thing…
Once again thank you so much for this beautiful story….
కొంపెల్ల గారూ !! మీ ప్రశ్నకి గొర్తి బ్రహ్మానందం గారు ఏమని జవాబు చెప్తారో వింటాను. అంతకు ముందు నావి కొన్ని సందేహాలూ.. సమర్ధింపులూ.. వివరణలూ.. విబేధాలూను:)
మనకున్న భక్తి సాహిత్యం చాలా గొప్పది. మీరన్నట్టూ భక్తి అంతస్సూత్రమ్ ఏ భక్తి రచనకైనా !! ఆ భావం లోని గాఢత వల్లనే దానికి ప్రాశస్త్యం వచ్చేది. దానికి ప్రత్యేకతా తెలిసేదీ. బాలమురళీ గారి అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నది. త్యాగ రాజు కీర్తనల లోని సాహిత్యం గురించి బాల మురళీనే కాదు అలా అభిప్రాయ పడిన వారు ఎందరో ఉన్నారు. మనం భక్తి రసాన్నీ సాహిత్య బలాన్నీ కట్టకలిపి ఆలోచించకూడదు కదా?? భక్తి భావం వేరు, వ్యక్తీకరణలో ఆయన ఎన్నుకున్న సాహిత్య విధానం వేరు. సాహిత్యం అన్నాకా దాన్ని తప్పని సరిగా సాహిత్యానికి సంబంధించిన అంచనాల తొనే మనం బేరీజు వేయాలి. ఇది అనివార్యం.
అన్నమయ్యకి ఇవాళ పేరు వచ్చీసింది గనక ఆయన రాసిన వాటిని భక్తిగా ఒప్పీసుకుని సరే అని అనే దశకి వచ్చేరేమో భక్తులు నాకు తెలీదు. కానీ, త్యాగయ్య రాసిన లాంటి పదాలు కావు అన్నమయ్యవి. అది మీకు అర్ధం కావాలంటే విపులంగా వారిద్దరి రచనలనీ కలిపి పరిశీలించి చూడండి.
మనకి భాష చాలా పరిమితM; అందరూ కవులే!! అలాకాక మనం ఇంకొకలా మాట్లాడడానికి భాష చోటు ఇవ్వదు. కవితా సామగ్రి అని ఒకటి ఉంటుంది. సామగ్రి అని నేను అంటున్నప్పుడు భాషా పరంగా వ్యక్తం అయ్యే స్పందనని కలుపుకునే అంటున్నాను. ఈ స్పందన కవితాలక్షణాలతో ఎక్కువ వ్యక్తమ్ అయిన పదాలు అన్నమయ్యవి కాగా ..కేవలం భక్తి భావానికి మాత్రమే పరిమితమైనవి త్యాగయ్యవీ, రామదాసువీను. అదే భక్తిని జయదేవుడూ అన్నమయ్యా ఆ సరిహద్దుని దాటించి వారి భావ ప్రకటనని విశాలం చేసుకున్నారు. త్యాగయ్యా రామదాసు చేసుకోలేదు. చేసుకోదలచలేదా? చేసుకోలేకపోయారా? అన్నది చెప్పడానికి వాళ్ళు మన మధ్య లేరు గనక వారి రచనల ఆధారంగా గనక మనం చూస్తే, వాళ్ళ మార్గం వేరని మాత్రం చెప్పగలం. సాహిత్య ప్రమాణాలన్నవి ఏ సాహిత్యానికైనా వర్తిస్తాయి. దానికి మినహాయింపులు ఉండవు. కానీ, పోనీ ఉండవు. త్యాగయ్య కీర్తనలలోని భక్తి మనసుకి హాయిని ఇస్తుంది. అందులో సందేహం లేదు. కానీ సాహిత్యం ఇచ్చే సుఖం మీకు అందులో దొరకదు. అది దొరకాలీ అంటే మీరు అష్టపదులని వినాలి. అన్నమయ్య సంకీర్తన వినాలి. మనసుని అనేకానేక భావోద్రేకాలకి గురిచేయగల లక్షణం వీరి రచనలకి ఉన్నట్టుగా త్యాగరాజు గారి సాహిత్యానికి లేదు. అవి సంగీతం కోసం రాయబడినవి. బహుశా త్యాగయ్య గారి లక్ష్యం కూడా సాహిత్యం కాకపోయి ఉండవచ్చు. ఆయన సంగీతం లోంచి రాముడిని కొలిచినవాడు. ఆయన ఈ లక్ష్యానికి అనువైన సాహిత్యాన్ని వాడుకున్నాడే గాని సాహిత్యం ఆయన ఎన్నుకున్న ముఖ్య మార్గం మాత్రం కాదని ఆయన రచనలు స్పష్టం గానే చెబుతాయి. తప్పని సరిగా సాహిత్యపు విలువలు వేరైనవి సుమా! వాటి ఆధారం గానే దీనికన్నా ఇది బాగుంది అని మనం చెప్పగలిగేది. అభిరుచి అన్నది ఒకటి ఉంటుంది కదా? పిడుక్కీ బియ్యానికీ ఒకే కొలమానాలుండవు ఆ వ్యక్తి మనకి ఎంత ఇష్టమైన వారైనా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా! సాహిత్యపు విలువ వలననే “ఏమొకొ చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను.. భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా?” అన్న పదం అంతగా కొనియాడబడింది.
ఊహా భాషా ఉపమా ముప్పేటలుగా కలిసి సాగే రచనకీ అది కొరవడినరచనకీ చాలా తేడా ఉంటుంది మరి. అయితే త్యాగయ్య రచనలకి ఉన్న విలువ ఏమిటన్న ప్రశ్న ఉంటుంది. అవి భక్తితో నిండినవి గనక భక్తితో పాడుకున్నప్పుడు ఉపయోగపడతాయి. సంగీతం కలిసి ఉన్నందువలన సంగీతప్రియులని అలరిస్తాయి. కానీ సాహిత్యమ్ అంటే అది వేరే ప్రమాణమే!!
ఇంక బాలమురళీ అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నదే అయినా.. అసలవి సాహిత్యమా అన్నది ముఖ్య ప్రశ్న. అవి సాహిత్యం అయితే అప్పుడు వాటి గురించి మాట్లాడవచ్చు. కానీ ఆయన రాసిన వాటిల్లో ఎక్కడా ఆ వాసనలు లేవు. ఆయన గొప్ప గాయకుడు అన్నదే నిలుస్తుంది. ఇంక ఆయన కవి కావాలని అనుకున్నాడు అని మనకి అర్ధమవుతుంది.
రమగారు, డాక్టర్ సాళ్వ కృష్ణమూర్తిగారి అనువాదమును Tunes of Divinity సంకీర్తన లక్షణము అనే పేరితో Institute of Asian Studies, Madras 1990లో ప్రచురించారు. ఇది రెండు భాగాల పుస్తకము. దీని మొదటి భాగాన్ని రెండు మారులు scan చేసారు (రెండవ మారు స్కాన్ చేసిన దానిని రెండవ భాగము అనుకొన్నారేమో). ఒకే భాగాన్ని రెండు సారులు స్కాన్ చేసిన పుస్తకాన్ని ఇక్కడ pdf రూపములో డవున్‌లోడ్ చేసికొన వచ్చును –
భక్తయినా, రక్తయినా దాని భావం వెలువడేది భాషతోనే! భక్తి రంగరించినంత మాత్రాన అది గొప్ప సాహిత్యం కాదు. పోతన భాగవతంలోనూ ఉన్నదదే! కానీ చెప్పే విధానంతో కొత్తగా అనిపిస్తాయి. భలేగా చెప్పారే? అనుకుంటాము. ఉదాహరణకి, “నీ దాసుడిగా నన్ను కనికరించు” అనడానికీ, “బంటు రీతి కొలువియ్య వయ్య రామా?” అని చెప్పడానికీ తేడా వుంది. రెండో దానిలో భావుకత ఉంది. సొగసైన భాష కనబడుతుంది. పాటగా విని ఆనందించడంలో సంగీతం వుంది. వరస బావున్నంత మాత్రాన గొప్ప పాటగా నిలిచిపోదు. దానికి సాహిత్యం తోడు కావాలి. పదే పదే ఆస్వాదించడానికి అది ఆస్కారమివ్వాలి. త్యాగరాజు భక్తి పాటలే కట్టినా, ఆయన కృతుల్లో శబ్దాలంకారాలున్నాయి. మంచి మంచి సమాసాలున్నాయి. కేవలం భక్తి మీదా, సంగీతం మీదే ఆయన శ్రద్ధ చూపలేదు. భాషని కూడా పట్టించుకున్నాడు. అది నాకు బాలమురళిగారి రచనల్లో కనిపించలేదు. అంతమాత్రాన బాలమురళీ గొప్ప విద్వాంసుడు కాదని నా వుద్దేశ్యం కాదు. సంగీతం విషయంలో ఆయన అపర త్యాగరాజే! ఎవరికీ అందులో సందేహం లేదు. రాదు కూడా!
పులి వేషగాడు గురించి krish అభిప్రాయం:
11/11/2011 9:54 am
Gowri gariki namaskarm,
nenu telugu lo i dhi vrayalani entho try chesanu kaani kudharledhu.. pulivesham..made my heart..very soft…
you know the therem i got from it.. you have to help some one when they need..not when you feel comfortable about it….
krish
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:
11/11/2011 3:42 am
మోహన గారూ !! నాకు పూర్తి గా ఆ పుస్తకం open కాలేదు. నేను చదివినంతమేరకు ఆయన చిన్నతిరుమలయ్య పుస్తకాన్ని వ్యాఖ్యానం చేసేరు. మంచిదే. అది అందుబాటులో ఉంటే కావాలని అనుకున్న వాళ్ళు కొనుకోగలరుకదా?? అయితే అసలు పుస్తకం చినతిరుమలయ్య గ్రంధాన్నే ముద్రించని తితిదే సాళ్వ కృష్ణ్ర్త మూర్తి గారి పుస్తకాన్ని ముద్రించగలదని అనుకోలేం !!
నేను చినతిరుమలయ్య గారి పుస్తకాన్ని చదవగలిగాను. కృష్ణమూర్తి గారి పుస్తకంలోని మిగిలిన సంగతులు సైతమ్ మీకు అన్నమయ్య సంకీర్త్నలకి ఆనాటి పెద్దలు రాసిన ముందుమాటలలో దొరికేవే !! అయితే నేను మళ్ళి మళ్ళీ అనేదేమంటే ఎందుకని చాలా డబ్బులున్న టిటిడి లాంటీ సంస్థ సైతం ఇంత పాటి చిన్న పని మీద శ్రధ్ధ పెట్టలేకపోతోంది?? ఆ సంకీర్తనాలక్షణమే చిన్న పుస్తకం కాగా అదన్నా అచ్చువేయ వచ్చును కదా?? నిన్నకాక మొన్న అచ్చు అయిన పుస్తకమె దొరకదు , ఇంక ఏ యాభైలలో పుస్తకాన్ని ఎక్కడ వెతక గలం?? అంతకన్నా ముందటి వాటిని ఎక్కడ వెతకగలం??వేంకటమఖిని చదవాలీ అంటే ఏ విష్ణు నారాయణ బత్ఖడే గారి పుస్తకాలనుంచో చదవాలి కామోసు.
” ధాతువు” ను సమృధ్ధిగా కూర్చగలిగి ‘ మాతు” రచనలో మందకోడిగా ఉండేవాడు ” మధ్యమ జాతి ” వాగ్గేయకారుడని అన్నమయ్య అన్నట్టు గా మనకి చినతిరుమలయ్య వ్యాఖ్యానమ్ వలన స్పస్టంగానే తెలుస్తోంది. అది చాలు కదా ! అంతకు మించి ఈ చర్చలొ చెప్పవలసినది ఏముందీ??
రమ.
న త్వం శోచితుమర్హసి గురించి Rajesh Devabhaktuni అభిప్రాయం:
11/11/2011 2:54 am
ఒక్క ముక్కలోనే చెప్తాను.
అద్భతం. ఈ మధ్య కాలంలో నేను చదివిన కధల్లో నాకు బాగా నచ్చింది. కడప జిల్లా మాండలికంలో ఎంతో చక్కగా వర్ణన బాగుంది.
అమ్మ ఉత్తరం గురించి Ramili అభిప్రాయం:
11/10/2011 3:44 pm
Abba entha kammaga vundo andi ee kadha… Anukokunda chadivanu ee kadhani. prasad gariki na abhinandanalu.. Nijamga mana ammala taram vallao chala mandiki email operate cheyyatam chethakadu anedi nootiki nooru pallu nijam.. daniki odaharana ma ammeee. Eppudu computer neerpudamanna vaddu kallu noppi, antha chinna letters nenu type cheyyalnu ani edo sakulu chebutundi. Ofcourse nenu rojuki 2 gantala patu matladatanu roju aavidatho adi vere sangati.. kani letter anedi matram always an evergreen thing…
Once again thank you so much for this beautiful story….
రచయితలకు సూచనలు గురించి lakshmi అభిప్రాయం:
11/10/2011 3:16 pm
Dear sir,
emaaTa patrika chaalaa baagundi. manchi patrikanu andistunna meeku naa abhinandanalu. mee patrikaku nenu kadha pampaalante gmail loe telugulo type cheasi attachment file gaa pampavachchaa. dayacheasi telupagalaru..
lakshmi madhav
mysore
[Yes. You can send a Telugu file as an attachment in gmail – Eds.]
మూడు వందల రామాయణాలు గురించి sanjay అభిప్రాయం:
11/10/2011 10:39 am
సురేశ్ కొలిచాల గారు,
ఏమీ అనుకోనంటే వ్యాసం కన్నా మీ కామెంటు (సౌమ్య గారికి రిప్లై) అద్భుతం!
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి rama bharadwaj అభిప్రాయం:
11/10/2011 3:21 am
కొంపెల్ల గారూ !! మీ ప్రశ్నకి గొర్తి బ్రహ్మానందం గారు ఏమని జవాబు చెప్తారో వింటాను. అంతకు ముందు నావి కొన్ని సందేహాలూ.. సమర్ధింపులూ.. వివరణలూ.. విబేధాలూను:)
మనకున్న భక్తి సాహిత్యం చాలా గొప్పది. మీరన్నట్టూ భక్తి అంతస్సూత్రమ్ ఏ భక్తి రచనకైనా !! ఆ భావం లోని గాఢత వల్లనే దానికి ప్రాశస్త్యం వచ్చేది. దానికి ప్రత్యేకతా తెలిసేదీ. బాలమురళీ గారి అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నది. త్యాగ రాజు కీర్తనల లోని సాహిత్యం గురించి బాల మురళీనే కాదు అలా అభిప్రాయ పడిన వారు ఎందరో ఉన్నారు. మనం భక్తి రసాన్నీ సాహిత్య బలాన్నీ కట్టకలిపి ఆలోచించకూడదు కదా?? భక్తి భావం వేరు, వ్యక్తీకరణలో ఆయన ఎన్నుకున్న సాహిత్య విధానం వేరు. సాహిత్యం అన్నాకా దాన్ని తప్పని సరిగా సాహిత్యానికి సంబంధించిన అంచనాల తొనే మనం బేరీజు వేయాలి. ఇది అనివార్యం.
అన్నమయ్యకి ఇవాళ పేరు వచ్చీసింది గనక ఆయన రాసిన వాటిని భక్తిగా ఒప్పీసుకుని సరే అని అనే దశకి వచ్చేరేమో భక్తులు నాకు తెలీదు. కానీ, త్యాగయ్య రాసిన లాంటి పదాలు కావు అన్నమయ్యవి. అది మీకు అర్ధం కావాలంటే విపులంగా వారిద్దరి రచనలనీ కలిపి పరిశీలించి చూడండి.
మనకి భాష చాలా పరిమితM; అందరూ కవులే!! అలాకాక మనం ఇంకొకలా మాట్లాడడానికి భాష చోటు ఇవ్వదు. కవితా సామగ్రి అని ఒకటి ఉంటుంది. సామగ్రి అని నేను అంటున్నప్పుడు భాషా పరంగా వ్యక్తం అయ్యే స్పందనని కలుపుకునే అంటున్నాను. ఈ స్పందన కవితాలక్షణాలతో ఎక్కువ వ్యక్తమ్ అయిన పదాలు అన్నమయ్యవి కాగా ..కేవలం భక్తి భావానికి మాత్రమే పరిమితమైనవి త్యాగయ్యవీ, రామదాసువీను. అదే భక్తిని జయదేవుడూ అన్నమయ్యా ఆ సరిహద్దుని దాటించి వారి భావ ప్రకటనని విశాలం చేసుకున్నారు. త్యాగయ్యా రామదాసు చేసుకోలేదు. చేసుకోదలచలేదా? చేసుకోలేకపోయారా? అన్నది చెప్పడానికి వాళ్ళు మన మధ్య లేరు గనక వారి రచనల ఆధారంగా గనక మనం చూస్తే, వాళ్ళ మార్గం వేరని మాత్రం చెప్పగలం. సాహిత్య ప్రమాణాలన్నవి ఏ సాహిత్యానికైనా వర్తిస్తాయి. దానికి మినహాయింపులు ఉండవు. కానీ, పోనీ ఉండవు. త్యాగయ్య కీర్తనలలోని భక్తి మనసుకి హాయిని ఇస్తుంది. అందులో సందేహం లేదు. కానీ సాహిత్యం ఇచ్చే సుఖం మీకు అందులో దొరకదు. అది దొరకాలీ అంటే మీరు అష్టపదులని వినాలి. అన్నమయ్య సంకీర్తన వినాలి. మనసుని అనేకానేక భావోద్రేకాలకి గురిచేయగల లక్షణం వీరి రచనలకి ఉన్నట్టుగా త్యాగరాజు గారి సాహిత్యానికి లేదు. అవి సంగీతం కోసం రాయబడినవి. బహుశా త్యాగయ్య గారి లక్ష్యం కూడా సాహిత్యం కాకపోయి ఉండవచ్చు. ఆయన సంగీతం లోంచి రాముడిని కొలిచినవాడు. ఆయన ఈ లక్ష్యానికి అనువైన సాహిత్యాన్ని వాడుకున్నాడే గాని సాహిత్యం ఆయన ఎన్నుకున్న ముఖ్య మార్గం మాత్రం కాదని ఆయన రచనలు స్పష్టం గానే చెబుతాయి. తప్పని సరిగా సాహిత్యపు విలువలు వేరైనవి సుమా! వాటి ఆధారం గానే దీనికన్నా ఇది బాగుంది అని మనం చెప్పగలిగేది. అభిరుచి అన్నది ఒకటి ఉంటుంది కదా? పిడుక్కీ బియ్యానికీ ఒకే కొలమానాలుండవు ఆ వ్యక్తి మనకి ఎంత ఇష్టమైన వారైనా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా! సాహిత్యపు విలువ వలననే “ఏమొకొ చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను.. భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా?” అన్న పదం అంతగా కొనియాడబడింది.
ఊహా భాషా ఉపమా ముప్పేటలుగా కలిసి సాగే రచనకీ అది కొరవడినరచనకీ చాలా తేడా ఉంటుంది మరి. అయితే త్యాగయ్య రచనలకి ఉన్న విలువ ఏమిటన్న ప్రశ్న ఉంటుంది. అవి భక్తితో నిండినవి గనక భక్తితో పాడుకున్నప్పుడు ఉపయోగపడతాయి. సంగీతం కలిసి ఉన్నందువలన సంగీతప్రియులని అలరిస్తాయి. కానీ సాహిత్యమ్ అంటే అది వేరే ప్రమాణమే!!
ఇంక బాలమురళీ అభిప్రాయం ఆయన గురించి ఆయన చెప్పుకున్నదే అయినా.. అసలవి సాహిత్యమా అన్నది ముఖ్య ప్రశ్న. అవి సాహిత్యం అయితే అప్పుడు వాటి గురించి మాట్లాడవచ్చు. కానీ ఆయన రాసిన వాటిల్లో ఎక్కడా ఆ వాసనలు లేవు. ఆయన గొప్ప గాయకుడు అన్నదే నిలుస్తుంది. ఇంక ఆయన కవి కావాలని అనుకున్నాడు అని మనకి అర్ధమవుతుంది.
రమ.
ఒక (అ)నాగరిక ఆనందం గురించి nArAyaNa అభిప్రాయం:
11/09/2011 9:49 pm
రామకృష్ణ గారు,
మీరు చెప్పినది కూడా బాగుంది.
ఐతే ఇందులో గతంలోకి పోతున్న భావనతో కాక;
భూమి మీది ప్రకృతిని ఒక అడవిలో సంచరిస్తున్న మనిషిగా
అనుభూతి పొందుతూ వ్రాయడంతో
నాగరికం అనాగరికం రెండింటి కలయికను చెప్పాలని
శీర్షికను అలా ఎంచుకున్నాను.
మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి మోహన అభిప్రాయం:
11/09/2011 9:22 pm
రమగారు, డాక్టర్ సాళ్వ కృష్ణమూర్తిగారి అనువాదమును Tunes of Divinity సంకీర్తన లక్షణము అనే పేరితో Institute of Asian Studies, Madras 1990లో ప్రచురించారు. ఇది రెండు భాగాల పుస్తకము. దీని మొదటి భాగాన్ని రెండు మారులు scan చేసారు (రెండవ మారు స్కాన్ చేసిన దానిని రెండవ భాగము అనుకొన్నారేమో). ఒకే భాగాన్ని రెండు సారులు స్కాన్ చేసిన పుస్తకాన్ని ఇక్కడ pdf రూపములో డవున్‌లోడ్ చేసికొన వచ్చును –
విధేయుడు – మోహన
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి బ్రహ్మానందం అభిప్రాయం:
11/09/2011 9:09 pm
పరంజ్యోతి గారూ,

-బ్రహ్మనందం