పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/10/2012 9:28 pm

    ఇంగ్లీషులో Johnny come lately అనే ఒక expression ఉంది.

    విజయరాఘవరావుగారి గురించి బొంబాయిలో 1986 ప్రాంతాల సోమంచి యజ్ఞన్నశాస్త్రిగారు నడిపిన మహాంధ్ర పత్రికలో నేనొక పెద్ద వ్యాసం రాశాను. అప్పటికాయన పాపం బతికే ఉన్నారు. (శాస్త్రిగారి 75 ఏళ్ళకూ, ఆయన పోయిన తరవాతా కూడా వ్యాసాలు రాశాను).

    ఇలాంటివన్నీ అడుగడుగునా ‘నిరూపించుకోవడం’ చాలా అనవసరం. కొన్ని సందర్భాల్లో గౌరవంతో మౌనం వహించడం మంచిదని తెలుసుకుంటే చాలు.

  2. వేణునాదం ఆగింది! గురించి వెర్రి Rahaman అభిప్రాయం:

    01/10/2012 7:25 pm

    లైలా,

    మీరు గమనించారో లేదో ఇందులో విజయరాఘవరావు గారి నివాళి కంటే రాసిన వారి సోత్కర్షే పుష్కలంగా వుంది. కాబట్టి, ఇది నివాళి వ్యాసంగా మీరెలా అనుకున్నారో, ఈ అనవసర చర్చెందుకో అర్థం కావడం లేదు.
    ఇది చూడండి: విజయరాఘవ రావుగారెంత గొప్పవారో తెలుస్తుంది.
    అంతేకాక మేము నడుపుతున్న తెలుగు సాహిత్యసమితి సభ్యుల ఉత్సాహాన్ని గమనించిన రావుగారు కొన్నిరోజులకే 1979లో తాను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు మమ్మల్ని సంప్రదించకుండానే మాతరఫున అక్కడ ఎస్.రాజేశ్వరరావునూ, పి.సుశీలనూ ఆర్కెస్ట్రాతోసహా బొంబాయికి ఆహ్వానించారు. అదొక చరిత్రాత్మక ఘట్టమయింది. ఒకవంక మాలో ‘పెద్దలు’గా చలామణీ అవుతున్న కొందరు అలిగి, మొత్తం కార్యక్రమాన్ని చివరి నిమిషాన ముంచే ప్రయత్నం చేశారు. మాలో 35మందిమి వాలంటీర్లం మటుకు పట్టువదలక ఆ పాటల ప్రోగ్రామును అతివిజయవంతంగా నిర్వహించాము. షణ్ముఖానంద హాలులోని 3000 సీట్లూ అమ్ముడు పోవడమేకాక 5రూ. టికెట్టు ప్రేక్షకుల్లోని కొందరు ఆశాపరులకు బ్లాకులో 40రూ. పలికింది! ఇదంతా ఇన్నేళ్ళ తరవాత చెప్పుకోదగినది కాదుగాని, అప్పట్లో మా ఉత్సాహాన్నీ, అందోళననూకూడా పెంచిందనేది చెప్పడానికే.

    ఆ ప్రోగ్రాములో గాయకుడు రామకృష్ణ కోరగా నేను తెరలేచే ముందరే రిహార్సల్ లేకుండా తక్కిన ఆర్కెస్ట్రాతో బాటుగా సితార్ వాయించవలసివచ్చింది. ఆ సభకు విజయరాఘవరావుగారు ముఖ్యఅతిథిగా, నౌషాద్ విశేష అతిథిగా రావడం మాకు మరింత సంతోషాన్నిచ్చింది. మేము ఆర్గనైజర్లుగానూ, స్టేజి కళాకారులుగానూకూడా శ్రమిస్తామనే సంగతి విజయరాఘవరావుగారు కళ్ళారా చూసి, భుజం తట్టగలిగారు.

    విజయరాఘవ రావుగారికి వేణువు వాయించడమే కాదు, తోటి కళాకారుల భుజం తట్టడం కూడా వచ్చునని చక్కగా తెలుస్తోంది కదా? విజయరాఘవ రావుగారి గురించి మనలాంటి వెర్రివాళ్ళకి ఏమీ తెలియలేదంటే అది మన తప్పు. కాదంటారా?

  3. వేణునాదం ఆగింది! గురించి జె. యు. బి. వి. ప్రసాద్‌ అభిప్రాయం:

    01/10/2012 7:08 pm

    నా ఓటు కూడా లైలా గారికీ, రమా భరద్వాజ్‌ గారికీ, ఈ విషయంలో.
    ప్రసాద్‌

  4. ఆగవే రజనీ! విభావరి! గురించి మోహన అభిప్రాయం:

    01/10/2012 3:06 pm

    మదన్మోహన్ సంగీత దర్శకత్వములో అన్‌పఢ్ చిత్రములోని ఆప్ కీ నజరోన్ నె సమ్ఝా నాకు నచ్చిన పాటలలో ఒకటి. మీరు చెప్పిన తరువాత నేను ఆ పాటను మళ్లీ వినే అవకాశం కలిగింది. ఆ పాటకు అదే మెట్టులో ఇంచుమించు అదే అర్థములో నా అనువాదాన్ని జత చేస్తున్నాను. తెలుగులో పాడుతూ ఆనందించండి-

    నీదు కన్నులు దెలిపె ప్రియ నా ప్రేమ నీ సంతసముగా
    ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

    ఔను నీ సమ్మతి యది నాకు అతి ఆనందము
    చెప్పె చూపులు నిజముగా వందనమ్ముల దెలుపుచు
    నవ్వుతూ నా జీవితములో జేరితివిగద హాయిగా
    ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

    నీకు గమ్యము నేనెగాదా నాకు గమ్యము నీవెగా
    నాకు లేదుగ భయము లేవియు నీవు పక్కన ఉండగా
    గాలివానకు తెలియజేయుడు నాకు ప్రియుడిట దొరికెగా
    ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

    పడెగదా నా యెడదపైన నీదు నీడల మాయలే
    దిక్కుదిక్కుల మ్రోగెగా వంద నాదస్వరములే
    రెండు జగముల ముదము లన్నియు నేడె నాకే దొరికెగా
    ఆగు మో హృది యొక్క క్షణ మిదె నాకు గమ్యము దొరికెగా

    విధేయుడు – మోహన

  5. వేణునాదం ఆగింది! గురించి lyla yerneni అభిప్రాయం:

    01/10/2012 3:06 pm

    Pardon me, చందమామలో నేమో చదువుకున్నా, ఎప్పుడో ఒక నీతి కథని.

    ఒక ఇంటివాళ్ళకి మామిడికాయల బుట్ట వచ్చింది. కొన్ని కుళ్ళువి. కొన్ని నవనవ లాడుతున్నయి. నాలాటి ఒక హృదయం లేని స్త్రీ, – అయ్యలూ! కుళ్ళిన పళ్ళు అవతల పారెయ్యండి, మంచివి ఇవ్వాళే తినండి అంది. వారు -ఎందుకు పారెయ్యటం వెర్రిదానా! నీకు డబ్బు విలువ బొత్తిగా తెలీదూ, నువ్వు చెప్పేదేంటి, మేము వినేదేంటి అని, కుళ్ళిన పళ్ళే తిన్నారు. మర్నాటికి మరి కొన్ని కుళ్ళాయి. మళ్ళీ అవే తిన్నారు. ఇలా బుట్టలో కాయలు ఐపోయేసరికి వారు ఒక్క నాడూ మంచి మామిడిపండు ఆనందంగా తినలేదు. మంచి రుచి తెలుసుకోలేదు. ఈ లోగా వారికి కుళ్ళు రుచి అలవాటై పోయింది. ఇప్పడు కుళ్ళు పళ్ళే కావాలని తెచ్చుకుని కళ్ళ కద్దుకుని తింటారు.

    రోహిణీ ప్రసాద్ “మరణించినప్పుడే కళాకారులను గుర్తు చేసుకోటానికి, పరిచయం చెయ్యటానికి, మీరిచ్చే కారణం?” – అని నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.

    పర్లేదు. విషాదంలో ఉన్నారు, మీరు శ్రీనివాస్, occupy శ్రద్ధాంజలి ఈ మాట ప్రాంగణం లోనే peaceful గా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్, ఎప్పుడు రాయాలో మీకే తెలుసుగా.

    లైలా

  6. వేణునాదం ఆగింది! గురించి rama bharadwaj అభిప్రాయం:

    01/10/2012 2:55 pm

    విజయరాఘవ రావు ఏల్చూరి మంచి సంగీత విద్వాంసుడు. రోహిణీ ప్రసాద్ అన్నట్టుగా ఆయన తెలుగు నేలకి దూరంగా ఉండటమ్ హిందుస్తానీ సంగీతానికి దగ్గర వారు కావటం వంటి వాటి వలన తెలుగు వారికి అంతగా తెలిసే వీలు కలగలేదు. అది తెలుగు వారి దురదృష్టమ్ కూడా! ఆయనకి నివాళి చెప్పడంలో తప్పేంలేదు.

    అయితే లైలా గారి అభిప్రాయంలో అందరూ ఆలోచించవలసిన ముఖ్యమైన అంశాలున్నాయి. ఆవిడ గొంతులో ధ్వనించే అసహనంలో/ ప్రశ్నలో నిజం లేకపోలేదు. ఒక వ్యక్తి తాలూకు గొప్పదనాన్ని గుర్తించడమో/ వారి గురించి మాట్లాడటమో జరగడానికివాళ్ళు వయసు మళ్ళి పోవాల్సి రావడమో ..లేక జీవితంనించి కూడా మళ్ళిపోవాల్సి రావడమో జరిగితే గానీ ఒక మంచి జ్నాపకమ్ బయటికి రాదన్నమాట! ఈ మాటలేవో ఆయన జీవితకాలంలోనే ఒక వ్యాసంగా వచ్చి ఉంటే తెలుగు వాళ్ళు ఆయన మీద ఒక గొప్ప భావనని కలిగి ఉన్నారని ఆయనకి తెలిసేది కదా? రోహిణీప్రసాద్ ఈ వ్యాసాన్ని విజయరాఘవ రావుగారు ఉన్నప్పుడే రాసి ఉండవలసింది కాదా? అప్పుడు ఆ కళాకారుడికీ ఈ కళాకారుడికీ ఒక తృప్తి మిగిలేది కదా?? ఎక్కవలసిన రైలు ఒక జీవితకాలం లేటు అన్నాడు ఆరుద్ర. కానీ రావల్సిన వ్యాసాలు సైతం ఒక జీవితకాలమ్ ఆలశ్యం కావడమ్ అసలు సిసలైన ” తెలుగుతనం”.

    లైలాగారి వ్యాఖ్యలు… చనిపోయిన వారి జ్నాపకాలతో పత్రికని నింపడం మీద. అది చాలాసార్లు చేస్తూంటే ఎవరికైనా ఈ సంప్రదాయం మీద విసుగుపుట్టడంలో ఆశ్చర్యమ్ లేదు. ఒక రంగంలో వ్యక్తులు చేసిన ఏ రకమైన సేవలకైనా ఆ వ్యక్తుల జీవితకాలంలో గుర్తింపురావడం నాగరికత. ఆ నాగరికతనే నిజాయితీగా పెంపొందించుకోవడం గురించి ఆలోచించుకోవాలి తెలుగువాళ్ళు. లేకపోతే ఎంత గాఢమైన భావనలున్నా అవన్నీ చివరికి ఇలా చనిపోయిన సందర్భంలో రాసే సంతాపంగానే మిగిలిపోతాయి. ఇవీ రాయొచ్చు తప్పులేదు. ఇంతకన్నా మెరుగైన సందర్భలో రాయడమ్ మరింత ఆహ్లాదమ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ పోయిన వారి ఆత్మీయులకి ఎవరికైనా !!

    లైలాగారూ మీ మాటల “చురుకు” ఈమాటకి ఉన్న అతికొద్ది ఆకర్షణల్లో ఒకటి.

    రమ.

  7. వేణునాదం ఆగింది! గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    01/10/2012 1:28 pm

    గొప్ప నివాళి! 1982-83 ప్రాంతాల్లో ఆయన విజయవాడ వస్తే రేడియో కేంద్రం వాళ్ళు ఆయన చేత ఒక పాటను (తిరునాళ్ళకు తరలొచ్చే కన్నెపిల్లలా …) చేయించుకున్నారు. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి రచనకు విజయరాఘవరావుగారు బాణీ కడితే, శ్రీరంగం గోపాలరత్నం గొప్పగా పాడారు. విజయవాడ రేడియో స్టేషన్‌ శ్రోతలందరికీ అప్పటికీ, ఇప్పటికీ గుర్తుండి పోయిన పాటల్లో ఇదొకటి. ఈ పాటొకెత్తయితే, రామం గారు (S.B శ్రీరామమూర్తి) ఆ పాట పుట్టుక మీద చేసిన డాక్యుమెంటరీ: “ఒక పాట పుట్టింది” మరొకెత్తు. అది కూడా అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రెండు కార్యక్రమాలతోనే విజయరాఘవరావుగారితో (సంగీతం) నాకు పరిచయం. ఆ తరువాతే ఆయన మృణాల్ సేన్‌ సినిమాలకి, తెలుగులో ఒక ఊరి కథ సినిమాకి చేసిన సంగీతం తెలిసొచ్చాయి. తరువాత్తరువాత ఆయన వేణువాదన L.Pలు, CD లు చాలా విన్నాను. ఒక పదేళ్ళ క్రితం (కర్నాటక) సంగీతం గురించి బాగా తెలిసిన వారొకరు ఆయనతో సంగీతపరమైన అంశాలపై వ్యక్తిగగతంగా జరిపిన సంభాషణ టేపొకటి వినే అదృష్టం కలిగిది. అప్పటినుడీ ఆయనంటె గౌరవం మరింత పెరిగింది. ఉత్తర-, దక్షిణ భారతీయ సంగీత పద్ధతులగురించి, రేడియోలో వాద్యబృందాల గురించిన వివరాలే కాకుండా ఆయన సంగీతాన్ని విశ్లేషించిన పద్ధతి నన్ను బాగా ఆకట్టుకొంది.

    తెలుగులో కూడా బహుళంగా రచనలు చేసిన విషయం చాలామందికి తెలియదు. గత కొద్ది సంవత్సరాలలో “కౌముది”(వెబ్‌) పత్రికలో ఆయన తెలుగు రచనలు వచ్చాయి.

    తెలుగు పత్రికల్లో, ఆ మాటకొస్తే భారతీయ పత్రికల్లో యెక్కడా ఆయన కాలం చేసినట్లు వార్త వచ్చినట్లు లేదు. చివరకు “నరసరావుపేట” అన్న బ్లాగు (అది ఆయన స్వస్థలం) నడిపేవారికి కూడా ఈ వార్త తెలిసినట్లు లేదు. గత రెండు నెలలుగా నిరంతరం ప్రయాణాల్లో వుండి RMIC చర్చావేదిక కూడా చూడకపోవడంతో రెండు రోజుల క్రితం రోహిణీప్రసాద్ గారు చెప్పేవరకు ఈ వార్త తెలిసి రాలేదు. ఆయనలానే నేను కూడా దిగ్భ్రాంతికీ, కలవరపాటుకూ గురి అయాను. మొన్న డిసెంబరు చివరిలో మిత్రుడు మాధవ్ ఇంట్లో విజయరాఘవరావుగారి సిడి ఒకటి చూసి ఆయనతో interview ఒకటి ఈమాటకి పంపుతానని చెప్పాను. ఇప్పుడైనా AIR, Films Division సంస్థలు ఆయన చేసిన గొప్ప సంగీతాన్ని మరింత వెలుగులోకి తెస్తాయని ఆశిద్దాం.

    రోహిణీప్రసాద్ గారికి మంచి వ్యాసం అందించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఒక గొప్ప సంగీతజ్ఞుణ్ణి, నిరాడంబరమైన మనిషిని స్మరించుకుంటూ …

    మరొక వెర్రివాడు,
    — శ్రీనివాస్

  8. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    01/10/2012 1:08 pm

    రాజు గారు,

    మీ ఆసక్తికి కృతజ్ఞతలు. బ్రౌణ్యం చాలా పాతది. బ్రౌణ్యంలో తండ్రి, తల్లికి “త” (తెచ్చు , to bring) అన్న అర్థం ఎలా పొసగుతుందో నాకు తెలియదు. బ్రౌన్ కు తమిళంలో తంగై, ఎంగై, తంబి, ఎంబి అన్న పదాల వివరాలు తెలియక పోవచ్చు. ఎమెనో గారు 20వ శతాబ్దంలో చేసిన పరిశోధనలు భాషావేత్తలందరూ ఒప్పుకున్నవి. మీకు వీలైతే ఈ కింది పేపరు చదవండి:

    Dravidian Kinship Terms, M. B. Emeneau, Language, Vol. 29, No. 3 (Jul. – Sep., 1953), pp. 339-353 (Published by: Linguistic Society of America)

    నేను అల్లుడు, వియ్యంకుడు, మనమడు, మగడు, పెళ్ళాం మొదలైన కొన్ని పదాలు వివరించడం మరచిపోయాను. వచ్చే వ్యాసంలో వివరిస్తాను. అల్లుడు అన్న పదానికి అల్లిక-, అల్లు- (weaving the relationship) అన్న పదాలకు సంబంధంలేదు. ఎందుకంటే కన్నడ, మళయాళం ఇతర భాషలలో అల్లుడు-కు సజాతి పదం అళియ- అని మూర్ధన్య ళ కారంతో ఉంటాయి. ఇది అళు-/చళు- అన్న ధాతువుకు దగ్గరని నా అభిప్రాయం.

    వారం గురించి వివరంగా రాసినందుకు ధన్యవాదాలు. సూర్యుడు, చంద్రుడు కాక రాత్రి మనకు ఆకాశంలో కనిపించే నక్షత్రాల్లో 5 నక్షత్రాలు మాత్రమే కదులుతున్నట్టుగా కనిపిస్తాయి. కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని గ్రహాలు మనకు దగ్గరిగా ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే కదులుతున్నట్టుగా కనిపిస్తాయి. సూర్యుడు, చంద్రుడు, ఈ కదిలే అయిదు గ్రహాలు కలిపి మీరు చెప్పినట్లు సప్తగ్రహాలుగా పేరుపొంది, వాటి ఆధారంగా ఏడు రోజుల వారాలు ఏర్పడ్డాయి.

  9. ఊర్మిళాదేవి నిద్ర గురించి srilakshmi అభిప్రాయం:

    01/10/2012 1:03 pm

    చాలా బాగున్న ది. చదువుతుంటే ఆర్ద్రత నిండి కనుల నీరు నిండినది.ధన్యవాదములు.

  10. ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన గురించి HaTaHaTa అభిప్రాయం:

    01/10/2012 12:35 pm

    తహతహ గారు ఇలా అన్నారు:

    ‘వాల్మీకి మనకేమీ చెప్పలేదు’ అంటూనే వ్యాసకర్త ‘మనకు తెలుసు’ అనటం నిరాధారంగా ‘మనం’, ‘మనకు తెలుసు’ అంటే ఎంత నేరమో అంత కన్నా ఎక్కువ నేరం.

    ఇది వెల్చేరుగారు రాసిన ఈ వాక్యాల గురించి:

    “వాల్మీకి వదిలేసిన ఊర్మిళని తెలుగు ఆడవాళ్ళు దగ్గరికి తీసుకున్నారు. ఆవిడని గురించి ఒక అందమైన కథ అల్లారు. అడివికి రాముడితో పాటు సీత వెళ్ళిపోతూంటే ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది కాని లక్ష్మణుడు దానికి అంగీకరించలేదని మనకి తెలుసు.”

    తహతహ గారు: “మనం”, “మనకు తెలుసు”, “మనకేమీ చెప్పలేదు” అనడం ఒక రకమైన రచనాశైలి (writing style). కథను స్థూలంగా చెబుతూ, పాఠకుకుని ఆసక్తి తగ్గిపోకుండా ఉండడానికి “We”, “We know that”, “We will find out” అని వాడడం ఇంగ్లీషులో రాసే చాలామంది పండితులు ఉపయోగించే టెక్నిక్.

    ఇక్కడ “మనకి తెలుసు” అన్నది రాముడు, సీత, లక్ష్మణుడు మాత్రమే అడవికి వెళ్ళారని రామాయణం గురించి ఏ మాత్రం తెలిసిన పాఠకునికైనా అర్థమయ్యే విషయమని చెప్పడం. ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తాననడం వాల్మీకి రామాయణంలో లేదు. తెలుగువాళ్ళు అల్లిన కథలో “ఊర్మిళ కూడా లక్ష్మణుడితో పాటు వెళ్తానంటుంది” అని చదవగానే రామాయణం తెలిసిన పాఠకుడు “కానీ లక్ష్మణుడు ఒప్పుకోడు” అని ఊహిస్తాడు. పాఠకుడు ఊహిస్తున్న విషయాన్ని రచయిత బలపరచడం ద్వారా రచన పాఠకునికి చేరువౌతుంది. ఇది నాకర్థమైన విషయం.