పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి kamal అభిప్రాయం:

    03/16/2012 3:39 am

    చాలా బాగా చెప్పారు. thank you!!!

  2. భయం గురించి Anil అభిప్రాయం:

    03/16/2012 2:44 am

    పూర్ణిమా,
    కథ చాలా బాగుంది.

  3. పిలూ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/15/2012 12:52 pm

    వ్యాసం రాసి పంపాక నేను చేర్చిన ఈ సవరణను ఇక్కడ రాస్తున్నాను. ఇది అసలైన పిలూ. “తెలుగు సినిమాపాటల్లో పిలూకు మంచి ఉదాహరణ పెండ్యాల సంగీతంలో శాంతకుమారి పాడిన ఎన్నాళ్ళని నా అనే పాట.”

  4. సీత గడియ గురించి తఃతః అభిప్రాయం:

    03/15/2012 9:07 am

    ‘సుమిత్ర కైక కూ సురటీలు వేసీ’ అని పాటలొ ఉన్నదని ఇంటర్నెట్లో ఉన్న ప్రతిలొ చూశాను. అయినా దశరథుని ముగ్గురు భార్యలూ పాటలొ ఉన్నారు. శ్రీ వెల్చేరు రాసిన వాక్యం పూర్తిగా ‘నిరర్ధకం’ కాదు అయినా వీటిని రామాయణ పాటలు అనడం సబబు కాదనే అనుకుంటాను. ఆ పాత్రలు ఉన్నంత మాత్రాన వాల్మీకానికి దూరంగా ఉన్నవాటిని అలా అనడం భావ్యం కాదనే నా అభిప్రాయం. వీటిని సీతారాముల పాటలనొ ఇతర పేర్లతోనో పిలవాలి.

    నా interpretation పాటలొ ఉన్న [ఇతర] సౌందర్యాలను పక్కకు నెట్టినట్టు కాదు.

  5. భయం గురించి Dr.G.V.Krishnaiah అభిప్రాయం:

    03/15/2012 6:21 am

    బావుంది. మతోన్మాదం తీవ్రతని అర్థవంతంగా చెప్పారు . చివరి ట్విస్ట్ అద్భుతంగా మలిచారు. గుజరాత్ మారణహోమం మరోసారి కళ్ళముందుకు వచ్చింది. అనువాదం అనిపించనంతగా కథ నడిచింది. దన్యవాదాలు. డాక్టర్ జి.వి. కృష్ణయ్య .

  6. కినిమా పత్రిక నుంచి – 2 గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    03/15/2012 5:18 am

    రోహిణీప్రసాద్ గారికి…
    నాన్న గారి చందమామ కధలు ఒక సంపుటంగా రావడానికి అడ్డువచ్చే ఆ ‘అతి’ ఏమిటో అర్ధం కాలేదు.

  7. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి srinivas dhulipala అభిప్రాయం:

    03/14/2012 11:04 pm

    కన్నబాబు అనే అచ్చ కోనసీమ పేరు విని చాలా కాలమైంది, అమలాపురం వదిలిన ఇరవై యేళ్ళ తర్వాత. ఎన్నొ మధుర జ్ఞాపకాలను ఒక్క పేరుతొ కదిలించారు, ఇహ ఈ రొజు ఆఫీసు లొ పని జరిగినట్టె :-). కధ చాలా బాగుంది.

  8. షష్ఠ్యంతములు గురించి Sanath అభిప్రాయం:

    03/14/2012 9:35 pm

    చాలా మంచి విషయం తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు. నమస్సులతో సనత్

  9. అనువాదంలో మెలకువలు గురించి తఃతః అభిప్రాయం:

    03/14/2012 3:41 pm

    ముద్దొచ్చే ముక్తసరితనంతో చాలా చక్కగా రాసారు. రుబాయీల తెనుగు సేతను మీరు వివరించిన వైనం చాలా హాయిగా ఉంది. మోహన గారి అభిప్రాయాన్ని కూడా కలిపి చదువుకున్నాక నాకు కొంత నేర్చుకున్నానన్న భావన కలిగింది (వివరణా ముక్తసరితనమూ పరస్పర శత్రువులు కారు). అయినా “అనువాదం మాతృభాషలోనే సాధ్యం” అన్నది అరుగుడు పడటం లేదు.

  10. జనరంజని: మహానటి సావిత్రి గురించి Neeraja Somarouthu అభిప్రాయం:

    03/14/2012 7:35 am

    అమేజింగ్. నా జీవితంలొ నేను సావిత్రి గారి వాయిస్ వింటానని అసలు ఊహించలేదు. ఏదొ సర్చ్ చేస్తుంటె ఈ rare ఆడియో విన్నాను. చాలా చాలా happyగా ఉంది. నా feelingsని మాటల్లొ చెప్పలేను. చాల థాంక్స్ అండి ఈ ఆడియో మాకు అందించినందుకు. పాత్ర ఏదైన దానికి జీవం పోయాలంటే సావిత్రి గారికే సాధ్యం అనడంలొ సందేహం లేదు. నేను సావిత్రి గారి సినిమాలు తక్కువే చూసాను. కాని ఆ మహానటి గురించి చాలా విన్నాను. ఆమె నటించిన మూగ మనసులు సినిమాలో పాటలా మనిషి పోతె మాత్రమేమి మనసు ఉంటది, అన్న సాహిత్యంలా ఆమె మన మధ్య లేకపొయినా ఆ మహానటి మన మనసుల్లొ ఎప్పటికి నిలిచే ఉంటారు.

    thanks a lot once again
    Neeraja Somarouthu