రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం నాకు చాలా నచ్చింది. రాగాలని గుర్తు పట్టేంత సంగీత జ్ఞానం లేక పోయినా ఏ పాటనైనా స్వల్ప ప్రయత్నంతో వాయించగల సామర్ధ్యం వున్న నాకు వారి వ్యాసం ద్వారా కొన్ని రాగాలను తెలిసికొని పలికించగలిగిన జ్ఞానం అబ్బింది. ధన్యవాదాలు. వారి నుండి సంగీతసంబంధమైన మరికొన్ని వ్యాసాలను ఆశిస్తాము.
విన్నాక మనస్సు తేలికపడింది. ప్రజలకి అందించినందుకు ధన్యవాదములు. ఇటువంటివే భవిష్యత్తు లో మరిన్ని ఈమాట వాళ్ళు అందిస్తారని ఆశిస్తున్నాను. మీలాంటి వాళ్ళు మరింత సహకరిస్తారు అని కోరుకుంటున్నాను.
ఈ మూడు భాగాల వ్యాసంలో ఒక్క జోక్ నాకు అర్థమయ్యింది. కొన్ని రచనలు రాసినప్పుడు రాసినవాడికి, దేవుడుకి అర్థమవుతాయి, కొంతకాలం పొయ్యాక అవి దేవుడికే అర్థమవుతాయి అని.
ఆ జోక్ అర్థమయ్యాక, అమ్మయ్య! నా మెదడుకి ఉన్నట్టుండి ప్రమాదం రాలేదు అనుకున్నా. ఎందుకైనా మంచిదని “sister act” సినిమా చూశా. అదీ అర్థమయింది. ఎమర్జెన్సీ రూమ్ కి బుర్ర తనిఖీకి వెళ్ళక్కర్లేదనుకున్నా.
కొన్నాళ్ళ క్రితం ఈ మేగజీన్లో ఓ సంచికలో ‘స్మైల్’ గురించి ఏమీ అర్థం పర్థం లేని వ్యాసాలొస్తే – దాని క్కారణం అవి ఆ స్మైల్ అన్న ఆయనెవరో పోయిన తరుణంలో రాశారు కదా -అలాటప్పుడు చేసే సృజనలు mushy gA, musty గా ఉంటాయి. అసలు అవి అందరు పాఠకులకు ఉద్దేశించినవి కాదు. ఏదో inner circle లో వాళ్ళు రాసుకుంటున్నారు. అలాటప్పుడు మౌనం వహించటం మర్యాద- అనుకున్నాను.
ఇప్పుడు ఈ సృజనలో ‘నామిని’ ఎవరో, ‘త్రిపుర’ ఎవరో, ‘నారాయణరావు’ ఎవరో పర్సనల్ గా తెలీక కాబోలు ఈ ముక్కల ముక్కల సంభాషణలు నాకేం అర్థం కాలేదు. ఇది కూడా ఏదో inner chambers లో సన్నిహితుల ముచ్చట్లనుకుంటా.
నిశ్శబ్దం లో నీ నవ్వులు గురించి ravi అభిప్రాయం:
05/12/2010 6:26 am
చాలా బాగున్నాయి.
కీబోర్డ్ మీద రాగాలు గురించి krishna అభిప్రాయం:
05/12/2010 4:23 am
రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం నాకు చాలా నచ్చింది. రాగాలని గుర్తు పట్టేంత సంగీత జ్ఞానం లేక పోయినా ఏ పాటనైనా స్వల్ప ప్రయత్నంతో వాయించగల సామర్ధ్యం వున్న నాకు వారి వ్యాసం ద్వారా కొన్ని రాగాలను తెలిసికొని పలికించగలిగిన జ్ఞానం అబ్బింది. ధన్యవాదాలు. వారి నుండి సంగీతసంబంధమైన మరికొన్ని వ్యాసాలను ఆశిస్తాము.
‘వికృతి’ ఉగాది గురించి ijswamy( achary ) అభిప్రాయం:
05/12/2010 2:10 am
శారదా పూర్ణ శొంఠిస
హొదరుడే వ్రాయుచున్నహార్దిక కందం
బేరీతి నడచునో యని
సహృదయుండాచార్యుడు సంశయమందెన్
మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి Gannavarapu Varaha Narasimha Murty అభిప్రాయం:
05/11/2010 10:42 pm
చంద్ర గారి కవిత బాగుంది.
మిణుగురు పురుగుల దివ్వెలఁ
ప్రణయంబులు ప్రజ్వరిల్లి పరిణతి జెందున్
తృణముల నిసుకల తిన్నెల
మణిమయ ప్రభవమ్ము లవియె మమతలు పొంగన్.
ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి Sivasankar Ayyalasomayajula అభిప్రాయం:
05/11/2010 4:12 pm
విన్నాక మనస్సు తేలికపడింది. ప్రజలకి అందించినందుకు ధన్యవాదములు. ఇటువంటివే భవిష్యత్తు లో మరిన్ని ఈమాట వాళ్ళు అందిస్తారని ఆశిస్తున్నాను. మీలాంటి వాళ్ళు మరింత సహకరిస్తారు అని కోరుకుంటున్నాను.
ఇట్లు
శివ
చాపల్యం గురించి Sreenivasulu అభిప్రాయం:
05/11/2010 12:50 pm
Wow … nice thing, just it resembles everyone. Everyone feels they are lesser than others.
సుగమం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
05/10/2010 10:55 am
బాధాతప్త కలత, కాదు కవిత చదివాక రెండు మాటలు రాయాలనిపించింది.
మలినం లేని స్నేహం దొరకనప్పుడు కాదు
తానొరులకు పంచినప్పుడే్ మహిలో
మహర్జాతకం అనిపిస్తుంది
మరణానికి ముందు కాదు తరువాతైనా
మనుషులను వదలక నడిపించే ఆత్మీయతే
మానవత్వానికి దారి సుగమంచేసే మహద్భాగ్యం అనిపిస్తుంది
===========
విధేయుడు
శ్రీనివాస్
శరణాగతి గురించి sesha kumar kv అభిప్రాయం:
05/10/2010 3:47 am
తిరుమల కృష్ణ దేశికుడు దివ్యము గానొక అంశముం గొనిన్
తరుణి తలంపు తోడ కవితామృత ధారను చిల్కరించె నీ
సరణిని వ్రాసి సత్కవులు ఛందము కందము గూర్చు చుండగా
స్థిరముగ నాంధ్ర పద్యకళ తేజము లీనదె శారదాంశమై
చక్కని భాషయు భావము
మక్కువ పెన వేసి కొనగ మకరందము గా
దక్కిన దేశికుని కవిత
నిక్కము గా తెన్గు తీపి ‘ఈమాట’ కిడెన్
శ్రీమాన్ తిరుమల కృష్ణ దేశికా చార్యుల వారికి,వారి కవితకు సాష్టాంగ ప్రణామములు
కే.వీ.శేష కుమార్
గుండుగొమ్ములనుమానం – 3 గురించి lyla yerneni అభిప్రాయం:
05/10/2010 12:26 am
ఈ మూడు భాగాల వ్యాసంలో ఒక్క జోక్ నాకు అర్థమయ్యింది. కొన్ని రచనలు రాసినప్పుడు రాసినవాడికి, దేవుడుకి అర్థమవుతాయి, కొంతకాలం పొయ్యాక అవి దేవుడికే అర్థమవుతాయి అని.
ఆ జోక్ అర్థమయ్యాక, అమ్మయ్య! నా మెదడుకి ఉన్నట్టుండి ప్రమాదం రాలేదు అనుకున్నా. ఎందుకైనా మంచిదని “sister act” సినిమా చూశా. అదీ అర్థమయింది. ఎమర్జెన్సీ రూమ్ కి బుర్ర తనిఖీకి వెళ్ళక్కర్లేదనుకున్నా.
కొన్నాళ్ళ క్రితం ఈ మేగజీన్లో ఓ సంచికలో ‘స్మైల్’ గురించి ఏమీ అర్థం పర్థం లేని వ్యాసాలొస్తే – దాని క్కారణం అవి ఆ స్మైల్ అన్న ఆయనెవరో పోయిన తరుణంలో రాశారు కదా -అలాటప్పుడు చేసే సృజనలు mushy gA, musty గా ఉంటాయి. అసలు అవి అందరు పాఠకులకు ఉద్దేశించినవి కాదు. ఏదో inner circle లో వాళ్ళు రాసుకుంటున్నారు. అలాటప్పుడు మౌనం వహించటం మర్యాద- అనుకున్నాను.
ఇప్పుడు ఈ సృజనలో ‘నామిని’ ఎవరో, ‘త్రిపుర’ ఎవరో, ‘నారాయణరావు’ ఎవరో పర్సనల్ గా తెలీక కాబోలు ఈ ముక్కల ముక్కల సంభాషణలు నాకేం అర్థం కాలేదు. ఇది కూడా ఏదో inner chambers లో సన్నిహితుల ముచ్చట్లనుకుంటా.
Sorry! for evesdropping.
లైలా
సుగమం గురించి sivasankar అభిప్రాయం:
05/09/2010 10:01 am
అస్తవ్యస్తముగా ఉన్న ప్రస్తుత మానవ సంబధాలకి ఈ కవిత ఒక నిదర్శన లా ఉంది.
బాగుంది అని చెప్పి సిగ్గుపడాలా??
యేది యేమైనా రాసిన వారికి ధన్యవాదములు.
శివ