రెండు చిన్న నెరసులు:
“రామారావు గారుదహరించిన కె. వి. రమణారెడ్డిగారి ‘బాధాగాధము’ అన్న ఈ కింది వచన పద్యంలో…”
ఉదాహృత పద్యం తిలక్‌ది.
నిచుల శాఖాగ్రం (గన్నేరు కొమ్మ కొస) నీచుల శాఖాగ్రంగా అచ్చు పడింది.
గమనించగలరు
డియర్ సార్
ఈ మాట.కామ్ చూశాను. చాలా బాగుంది. మీ ప్రయత్నం అభినందనీయం. మేము ఆంధ్ర నుఉండి గ్రామపంచాయతీ అనే మాసపత్రికను 2002 నుంచి తెలుగులో తెస్తున్నాం. ఈ పత్రికను పి.డి.యఫ్ అనుసంధానం చేసే వీలు ఉందా తెలపండి. our magazine is A.P first private rural development magazine in Telugu language. We r publishing rural information, aware the people about govt. schemes and other activities.
త్యాగరాజు కృతులు గాని శ్యామశాస్త్రి కృతులు గాని మొదట్లొ తమిళ,కన్నడ విద్వాంసులెవరు పాడినా సాహిత్యం తెలుసుకోడానికి చాలా కష్టపడినా గానీ బోధ పడేది కాదు. తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి కొఱకరాని కొయ్య గా ఉంటుంది. కాని బాలమురళి పాడినది విన్నపుడు ఈ సమస్య ఎదురయ్యేది కాదు. దీని వల్ల ఆయా కీర్తనలూ, కృతులూ వినాలనే అభిలాష కూడా పెరిగి అందులొ అభిరుచి పెరుగుతుదని నీను నా స్వానుభవంతొ చెప్పగలుగుతున్నాను. నాకు కించిత్తు స్వరజ్ఞానం లేదు గాని త్యాగరాజు పంచరత్న కీర్తనల్ని ఇంచుమించు బాలమురళి పాడినట్లుగానే పాడేస్తున్నాని నా మిత్రబ్రుందం అని మెచ్చుకోగా విని ఆనందపడిపొతూ ఉంటూ ఉంటాను. పరోక్షంగా నే బాలమురళి గారి “వీరాభిమానిని” ఐపోయాను కూడా.
నారాయణంబాబు వేదుల జంషెడపూరు.
కథ చాల బాగుంది. నేను అమలాపురంలో నే పెరగడం వల్ల నేమో ఆ పరిసరాలు మనుషులూ కళ్ళకి కట్టినట్టుగా అనిపించింది. కథ లో చెప్పిన ‘వామనుడి’ ని పోలిన పెద్దమనుషులు కోనసీమ లో చాల మందే ఉన్నారు.
Mahesh గారు.. నేను డబ్బులో ఏమీ పుట్టి పెరగలేదండి! చాలా మామూలు మధ్యతరగతి, ఇక్కడ చాలా మంది లాగానే..
నేను వెలిబుచ్చిన అభిప్రాయము కష్టాల గురించి కాదు.. కేవలం ‘నేను’ అనే ఈ పాత్ర hypocracy గురించి.
బ్రహ్మానందం గారూ,
నిజంగా బ్రహ్మానందం కలిగింది మీ వ్యాసం చదివి (ఇంకా పూర్తిగా చదవాలి) . మనకి (తెలుగు వారికి) మనకున్న అపార స్వర సంపదని సాహిత్య సంపదని గౌరవించడం తెలియదేమో అనిపిస్తుంది.
మీరు చేసిన కృషి అమోఘం అనడం చాలా చిన్న పదం.
నాకు త్యాగయ్య కీర్తన విన్నపుడల్లా మనసు పులకిస్తుంది ఎవరు పాడినా సరే. అసల తంజావూరుని ఆంధ్ర ప్రదేశ్ లో కలుపు కుని ఉండాల్సింది అనిపించేది ఇదివరలో (అమెరికా అలాస్కా ని కలుపుకున్నట్టు). కానీ అలా అనుకోవడం ఏంటో తప్పో అనిపిస్తోంది ఇప్పుడు. తనికెళ్ళ గారన్నట్టు సంగేతాన్ని గౌరవించే గుణం ఆ జాతిలో (తమిళ) ఉంది, మనలో లుప్తమైపోతోంది.
ఇంతటి వాగ్గేయకారుడి గురించి బోలెడు విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సాహం కూడా ఉంది. మీ వ్యాసం అందుకు ఖచ్చితంగా ఉపకరిస్తోంది.
ఇప్పటి వరకు తంజావూరు, త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఒక్కసారి కూడా చూసే అదృష్టం కలగలేదు. ఎప్పుడో మరి.
2. వచన పద్యం: లక్షణ నిరూపణం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
02/08/2011 1:38 pm
రెండు చిన్న నెరసులు:
“రామారావు గారుదహరించిన కె. వి. రమణారెడ్డిగారి ‘బాధాగాధము’ అన్న ఈ కింది వచన పద్యంలో…”
ఉదాహృత పద్యం తిలక్‌ది.
నిచుల శాఖాగ్రం (గన్నేరు కొమ్మ కొస) నీచుల శాఖాగ్రంగా అచ్చు పడింది.
గమనించగలరు
[ఉదాహృత పద్యమే తప్పండీ. సరిదిద్దాము. తప్పులు పట్టించినందుకు కృతజ్ఞతలు – సం.]
రచయితలకు సూచనలు గురించి B.AMARANATHAREDDY అభిప్రాయం:
02/08/2011 1:04 pm
డియర్ సార్
ఈ మాట.కామ్ చూశాను. చాలా బాగుంది. మీ ప్రయత్నం అభినందనీయం. మేము ఆంధ్ర నుఉండి గ్రామపంచాయతీ అనే మాసపత్రికను 2002 నుంచి తెలుగులో తెస్తున్నాం. ఈ పత్రికను పి.డి.యఫ్ అనుసంధానం చేసే వీలు ఉందా తెలపండి. our magazine is A.P first private rural development magazine in Telugu language. We r publishing rural information, aware the people about govt. schemes and other activities.
అమర్ నాథ్ రెడ్డి, editor,
gramapanchayathi mothly
madanapalli, chitoor dt. a.p india
+91 9885576646
amar2bv@yahoo.co.in
పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి Rao Vemuri అభిప్రాయం:
02/08/2011 11:51 am
ఇండియాలో, ఆంధ్రాలో, పుస్తక విక్రయశాలలో దొరుకుతుంది. లేదా ఎమెస్కో వారికి రాసి తెప్పించుకోవచ్చు. అమెరికాలో నా దగ్గర కొద్ది ప్రతులు ఉన్నాయి.
బాలమురళీకృష్ణ సంగీతం గురించి narayan babu vedula అభిప్రాయం:
02/08/2011 6:48 am
త్యాగరాజు కృతులు గాని శ్యామశాస్త్రి కృతులు గాని మొదట్లొ తమిళ,కన్నడ విద్వాంసులెవరు పాడినా సాహిత్యం తెలుసుకోడానికి చాలా కష్టపడినా గానీ బోధ పడేది కాదు. తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళకి కొఱకరాని కొయ్య గా ఉంటుంది. కాని బాలమురళి పాడినది విన్నపుడు ఈ సమస్య ఎదురయ్యేది కాదు. దీని వల్ల ఆయా కీర్తనలూ, కృతులూ వినాలనే అభిలాష కూడా పెరిగి అందులొ అభిరుచి పెరుగుతుదని నీను నా స్వానుభవంతొ చెప్పగలుగుతున్నాను. నాకు కించిత్తు స్వరజ్ఞానం లేదు గాని త్యాగరాజు పంచరత్న కీర్తనల్ని ఇంచుమించు బాలమురళి పాడినట్లుగానే పాడేస్తున్నాని నా మిత్రబ్రుందం అని మెచ్చుకోగా విని ఆనందపడిపొతూ ఉంటూ ఉంటాను. పరోక్షంగా నే బాలమురళి గారి “వీరాభిమానిని” ఐపోయాను కూడా.
నారాయణంబాబు వేదుల జంషెడపూరు.
సంగీతరస పానశాల ఘంటసాల గురించి radhakrishna అభిప్రాయం:
02/07/2011 10:10 am
నా జీవితములొ నాకున్న ఒకే ఒక దేవుడు.
అనువాదంలో మెలకువలు గురించి suhasini adurty అభిప్రాయం:
02/07/2011 6:12 am
చాలా వివరముగా బాగున్నది. విద్యార్ధులకు ఉపయోగము.
సుహాసిని ఆదుర్తి
శ్రీ ఆంజనేయ రక్షా కవచం గురించి RAM PAMMY అభిప్రాయం:
02/07/2011 5:06 am
బాగుంది కథ నడిపిన విధానం. వెరీ గుడ్. హాస్యభరితంగా రాశారు.
రామ్
కోనసీమ కథలు: వామనుడు గురించి Sridevi Rekapalli అభిప్రాయం:
02/06/2011 11:17 pm
కథ చాల బాగుంది. నేను అమలాపురంలో నే పెరగడం వల్ల నేమో ఆ పరిసరాలు మనుషులూ కళ్ళకి కట్టినట్టుగా అనిపించింది. కథ లో చెప్పిన ‘వామనుడి’ ని పోలిన పెద్దమనుషులు కోనసీమ లో చాల మందే ఉన్నారు.
చెప్పులు గురించి kavitha అభిప్రాయం:
02/06/2011 12:55 pm
Mahesh గారు.. నేను డబ్బులో ఏమీ పుట్టి పెరగలేదండి! చాలా మామూలు మధ్యతరగతి, ఇక్కడ చాలా మంది లాగానే..
నేను వెలిబుచ్చిన అభిప్రాయము కష్టాల గురించి కాదు.. కేవలం ‘నేను’ అనే ఈ పాత్ర hypocracy గురించి.
మనకు తెలియని మన త్యాగరాజు – 3 గురించి Vasu అభిప్రాయం:
02/06/2011 12:51 pm
బ్రహ్మానందం గారూ,
నిజంగా బ్రహ్మానందం కలిగింది మీ వ్యాసం చదివి (ఇంకా పూర్తిగా చదవాలి) . మనకి (తెలుగు వారికి) మనకున్న అపార స్వర సంపదని సాహిత్య సంపదని గౌరవించడం తెలియదేమో అనిపిస్తుంది.
మీరు చేసిన కృషి అమోఘం అనడం చాలా చిన్న పదం.
నాకు త్యాగయ్య కీర్తన విన్నపుడల్లా మనసు పులకిస్తుంది ఎవరు పాడినా సరే. అసల తంజావూరుని ఆంధ్ర ప్రదేశ్ లో కలుపు కుని ఉండాల్సింది అనిపించేది ఇదివరలో (అమెరికా అలాస్కా ని కలుపుకున్నట్టు). కానీ అలా అనుకోవడం ఏంటో తప్పో అనిపిస్తోంది ఇప్పుడు. తనికెళ్ళ గారన్నట్టు సంగేతాన్ని గౌరవించే గుణం ఆ జాతిలో (తమిళ) ఉంది, మనలో లుప్తమైపోతోంది.
ఇంతటి వాగ్గేయకారుడి గురించి బోలెడు విషయాలు తెలుసుకోవాలని చాలా ఉత్సాహం కూడా ఉంది. మీ వ్యాసం అందుకు ఖచ్చితంగా ఉపకరిస్తోంది.
ఇప్పటి వరకు తంజావూరు, త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఒక్కసారి కూడా చూసే అదృష్టం కలగలేదు. ఎప్పుడో మరి.
ఇది పుస్తకం కింద వచ్చి ఉంటే తప్పక తెలియజేయండి .
అభినందనలు
వాసు