పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి మోహన అభిప్రాయం:

    03/14/2011 2:30 pm

    వినీల్ గారు, నాకు సంగీత జ్ఞానము లేదు కాని, నాకు తెలిసినంతవరకు తాళం గతి (నడక) పైన ఆధారపడి ఉంటుంది. గతి మాత్రలపైన (దీనినే కళలు అని కూడ అంటారు) ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పిన రూపక తాళానికి ఆధారం ఆరు మాత్రలు. అంత్య ప్రాస పదాలు కనరావా, వినలేవా లాటివి ఉంటే రూపక తాళానికి సరిపోతుంది. విధేయుడు – మోహన

  2. ఈమాట గురించి గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/14/2011 12:39 pm

    సంపాదకులకి,

    ఇది ఈమాటకి కావలసిన సంగతో.. అఖ్ఖరలేని సంగతో నాకు తెలీకపోయినా ఇక్కడ జరిగిన ఈ సంఘటన గురించి ఈమాట పాఠకుల దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నంగా దీన్ని భావించండి.

    తెలంగాణా రాజకీయనాయకుల పోరాటంలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ నాయకత్వంలోని తెరాస వారి ఆధ్వర్యంలో మార్చ్ 10 న హైదరాబాద్ లో జరిగిన “మిలియన్ మార్చ్ ” చివరలో వికటించి, టాంక్ బండ్ మీద ఉన్న తెలుగుజాతి వైతాళికుల విగ్రహాలన్నీ తలలూ మొండేలూ తెగిపడి..మెడకి ఉరితాళ్లతో బిగించి లాగినట్టుగా కిందికిలాగబడి పక్కనే ఉన్న హుస్సేన్ సాగర్ లో తోసివేయబడ్డాయి. అందులో కవిత్రయం వారూ అన్నమయ్య గురజాడ అప్పారావు కందుకూరి వీరేశలింగం, గుర్రం జాషువా వంటి కవి రచయితలూ ఇంకా మిగిలిన సంస్కర్తలూ ఉన్నారు. వీరంతా ” సీమాంధ్ర రచయితలట”. దీనిమీద నిరసన ప్రకటనలు వెలువడ్డాయి. ” తెలంగాణా కోసమ్ 600 మంది విద్యార్ధులు చనిపోతే మీరు బాధని ప్రకటించలేదుగానీ ఏవో కొన్ని విగ్రహాలు కూల్చినందుకే అంత బాధ ఎందుకు పడిపోతున్నారంటూ “..తెరాస నాయకులు ఎద్దేవా చేయడం వగైరాలన్నీ గత మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనలు. మీది సాహిత్య పత్రిక గనక… ఈ విషయమ్ మీద మీరు కూడా ఏమన్నా ప్రతిస్పందిస్తారేమోనని… మీకు ఈ సంగతిని తెలియజేస్తున్నాను.
    రమ.

  3. ఈమాట గురించి గురించి Suresh Babu Kosana అభిప్రాయం:

    03/14/2011 7:14 am

    ఈమాట సంపాదకులకు మరియు కార్యవర్గ సభ్యులకూ అభినందనలు,
    ఈ మాటల”స్రవంతి” ఎప్పటికీ ప్రవహిస్తూండాలని ఆకాంక్షిస్తున్నాను.
    కొసన సురేషు బాబు

  4. ప్రభావతీ ప్రద్యుమ్నం – 3 గురించి BEVARA GOVINDU అభిప్రాయం:

    03/14/2011 5:17 am

    కధ చాలా బాగుగా ఉన్నది.రచయిత రచనా విధానాము చాలా ఉన్నతముగా ఉన్నది.

  5. కథాశిల్పం గురించి v.Haish Kumar అభిప్రాయం:

    03/14/2011 4:47 am

    This is very good story.

  6. About eemaata గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/14/2011 2:56 am

    మీ పత్రికలోని రచనా నిర్వహణలో ” పీర్ రివ్యూ” ముఖ్యమైన విధానంగా ముందునించీ మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఆ “పీర్ “లు ఎవరో… సృజనని తీర్చిదిద్దటంలో వారి వారి స్థాయి ఏమిటో మాత్రం మీరు ఎప్పుడూ స్పస్టం చేయలేదు. మీ పత్రికా నిర్వహణ గురించి మీరు ఏం చెప్పుకున్నా… ఆ పధ్ధతిలోని ప్రత్యేకత మీ పత్రికలో ప్రత్యక్షంగా కనిపించాలి. ఈసారి దమయంతి కవిత చూస్తే ఆమె రచనలో పదాల తప్పులని కూడా సవరించలేని ఆ పీర్ రివ్యూదారులెవరు? అని గానీ..లేదా మీరసలు నిజంగా మీరు చెప్పుకున్న విధానం లోనే మీ పత్రికని నిర్వహించగలుగుతున్నారా? అనిగానీ …చదువరులకి సందేహాలు తప్పక వస్తాయి. రచనలోని ప్రాధమిక దోషాలని కూడా సవరించలేనప్పుడు మీ సంపాదకమండలి.. అలాగే ఆ రచనని చదివి దాని గురించి చెప్పడానికి పూనుకున్న ఇతరులు పత్రికమీద అయితే తగిన శ్రధ్ధనైనా చూపించడం లేదని అనుకోవాలి. లేదా తప్పులని గుర్తించగలంత భాష …ఈ అందరిలోని కూడా లేదని అనుకోవాలి పాఠకులు.

    రమ.

    [ఈ సంచికలో అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు మేమూహించని విధంగా మామూలు కంటే ఎక్కువగానే ఉన్నాయి. క్షంతవ్యులం. – సం.]

  7. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి వినీల్ అభిప్రాయం:

    03/13/2011 8:30 am

    బ్రహ్మానందం గారు, వ్యాస విషయానికి అసంబంధితమైనా ఎప్పట్నుండో అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న. చాలా మట్టుకు పాటల్లో అంత్యప్రాస ఉంటే ఆది/రూపక తాళాల్లో ఉండడం, ద్వితీయ అక్షర ప్రాస ఉన్న చోట ఖండ/మిశ్ర చాపు తాళాలు వాడటం గమనించాను. ప్రాసకు తాళాలకు ఏదైనా సంబంధం ఉందా? ఈ విషయం గురించి ఎక్కడైన చర్చ ఉందా? (నేను చెప్పేది చాలా మట్టుకు రామదాసు/తూము నరసింహదాసు కీర్తనల్లో చూడగలం).

  8. సిరుల సంక్రాంతి గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/13/2011 6:32 am

    అరుణ్ చంద్ర గారూ,
    మీ వూరి జ్ఞాపకాలు బాగున్నాయి, చెబుతూంటే.
    మనమెంత దూరం వెళ్ళినా, వున్న వూరు, కన్నవారు అంతరాన వుంటూనే వుంటారు. సహజమే.
    మీకునూ నా కృతజ్ఞతలు.
    ఆర్.దమయంతి.

  9. భాషల ఋతువు గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/12/2011 12:34 am

    సరళంగా ఉంది.బావుంది కూడా.

    పలచగా కూడా ఉందేమో…

    “బలానికి పాలు/జేబులో బలపాలు”? హార్లిక్స్‌ ప్రకటన గుర్తుకువస్తున్నది.

    “ఎన్ని విస్ఫోటనాలెదురైనా సరే ఇక దీన్ని తలకెత్తుకోక తప్పదు” అన్నంత తప్పనిసరితనంలో పుట్టలేదనుకుంటా ఈ కవిత.

  10. నిరాశకై ఆశపడుతూ… గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    03/11/2011 11:19 pm

    ఒకటి సురేశ్ గారు చెప్పిందే: “తెలవారదేమో స్వామీ”). ఇంకోటి “చందమామ రావే” (“కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే/గగనపు విరితోటలోని గోగుపూలు తేవే”)

    సురేశ్‌ గారూ, చెలువ బదులు చెలిమి అంటే సరిపోతుంది. చెలువు అన్నా సరిపోతుంది.

    [తప్పులు సవరించాం. సూచనకు కృతజ్ఞతలు – సం.]