సురేష్ గారూ, నమస్తే.
మీరు చేస్తున్న మంచి ప్రయత్నం ఈ ‘పలుకుబడి.’
అభినందనలు.
కొన్ని పదాల పట్ల మాలాంటి వారికి కలిగే కొన్ని సందేహాలకు ఈ శీర్షికలోనే సమాధానాలు కూడా ఇస్తే బావుంటుందేమోనని అనుకుంటున్నాను.
చదవంగానే, తేలికగా అర్ధమైతే ఇంకా బావుంటుందని నా అభిప్రాయం.
శుభాకాంక్షలతో-
ఆర్.దమయంతి.
సినిమా పాట మీద వ్యాస రచయితల మాటల్లోనే ఓ పెద్ద అయోమయం పోగుపడిఉంటే దాన్ని తన మాటతో మరింత జటిలమ్ చేశారు లైలా! భక్తికీ భక్తి పేరున శృంగారానికీ ఆవిడ ఇచ్చిన చిట్టాకీ అసలు విషయానికీ ఏమీ సంబంధమ్ లేదు. అది వేరే సంగతి. ఏ రసాన్ని ఎవరైనా రాయనివ్వండి. అది కాదు విషయం. కానీ ఆ సందర్భమ్ ఏమిటీ అది సహజంగా ఉందా లేక అసహజంగా ఉందా? వాళ్ళు రాసిన దానిలోని ఆ భావం లో అక్షరమ్ స్థాయి గానీ స్వరం స్థాయి గానీ ఉదాత్తంగా ఉందా?? లేకపోతే అలా ఎందుకు లేదు? ఇవీ అసలు విషయాలు. హరికృష్ణ గారన్నట్టూ “శృంగారించుకుని రావడం అంటే అది బాగా అలంకరించుకుని వెళ్ళడం” అని. అంతే గానీ “శృంగారం” అన్న మాట ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అది ఇంగ్లీషు లో వాడే సెక్స్ కి పర్యాయం కాదు. సంభోగం అని వేరే మాట ఒకటి ఉంది దానికి. శృంగారం వేరు. సంభోగం వేరు. గనక సెక్స్ కి పర్యాయగా శృంగారం అన్నది అర్ధమ్ చేసుకోవడం అన్నిసార్లూ వల్ల కాదు.
ఇకపోతే ” శివదీక్షాపరురాలనురా!!” అన్న జావళీ వంటివి భక్తి పాటలు కావు. ఇంక త్యాగరాజ కీర్తన “నౌకాచరిత్రం” లో “శృంగారించుకుని వెడలిరి” అన్నది సెక్స్ పాటలాంటిది కాదు. అది ఒక ప్రేమ గానమే !! కృష్ణ ప్రేమ. త్యాగరాజు ప్రేమని రాయకూడదని గానీ..రాయలేడని గానీ అసలు అలాంటి సందేహాలో చర్చలో ఎందుకని తలెత్తాయో మరి? గొర్తిగారు త్యాగయ్య రాసిన నౌకా చరిత్రాన్ని శృంగార కీర్తనగా ముద్రించి లైలా గారికి ఎందుకని సూచన చెయ్యాల్సి వచ్చిందో? ఇతర త్యాగరాజ కీర్తనలకు మల్లేనే ఆయన రాసిన ఈ యక్షగానం సైతం మనోహరమైన భక్తి. గోపికా విరహ ప్రకటన భాగవతం లోని భ్రమరగీతలో ముఖ్యమైన అంశం మరి.
దీనికీ తెలుగు సినిమా పాటకీ ఏమిటీ పోలికా? నాటు సంభోగాన్ని చెత్త భావాలతో అంతకన్నా చెత్త భాషతో చెప్పేది సినిమాపాట. ఎక్కువసార్లు. ఏ సముద్రాల రాఘవాచారో ఏ మల్లాది రామకృష్ణ శాస్త్రో.. ఏ కృష్ణశాస్త్రో.. ఏ శ్రీశ్రీనో రాసినవి వేరు. “విప్రనారాయణ” లోని “చూడుమదే చెలియా” అన్నది ఇటు భక్తీ అటు కృష్ణుని లలితమైన రాసక్రీడా రెండూ మిళితమైన అలాంటి పాటలని గురించి కాదు మరి ఈ “సినిమాపాటల మతీ సుతీ” అన్న గోల. “మదన జనక నీ మగసిరి చూచీ మతైపోయారా.. ఎదురులేని నీ పదును చూచి నే చితైపోయారా.. నీ సొత్తై పోయారా” లాంటి పాటలు నాటు శృంగారం. ఇలాంటి పాటలు అనేకం ఒక హద్దు దాటిపోయి విచ్చలవిడిగా యధాశక్తి దిగజారినవి అనేకం. అలాంటివి అన్నీ సమకాలీన తరాలకి మహా ఇష్టం అని ఒక తరాన్ని మొత్తంగా ఈ రొచ్చులోకి లాగి దాన్ని సమర్ధించడానికని చేసిన ప్రయత్నం ఈ వ్యాసం. అది నిజమూ కాదు. వీటికి ఈ వ్యాసకర్తల దగ్గర ఎలాంటి రుజువులూ లేవు.ఒక రొడ్దకొట్టుడు ఆర్గ్యుమెంటు ఇది. ఏ ఆధారమూ లేని వారి వారి సొంత వ్యాఖ్యానాలు అంతే !!
చెత్త పాటలు ఇవాళ్టి తెలుగు సినిమాల్లోనే కాదు ..ఇంకా మరింత ముందుకు వెళితే నాయక రాజుల యుగంనాటి కవుల అనేక రచనల్లోనూ ఉన్నాయి. కానీ వాటికి కూడా ఇవాళ్టి తెలుగు సినిమా పాటలకున్న విలువే ఉంది. వాటిని చదివిన వారూ చర్చించిన వారూ ఎక్కడా కనిపించరు. అవికూడా మరి ఆనాటి “యువతరాలు”[ఈ వ్యాస రచయితల భాష ప్రకారం అన్నమాట] ఆనందించినవే అయ్యుంటాయి. అలా పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయాయి. ఇవాళ్టి ఈ సోకాల్డ్ సినిమా “కవుల” గతీ అంతే!! వారి పాటలగతీ అంతే!! మల్లాది వారి “గిరిజా కళ్యాణం” లాంటివి రాయగల సత్తా ఉన్న వాడొక్కడు లేడు గానీ .. అందరూ యధాశక్తి కవులే మరి. అందుకే అవన్నీ మతీ సుతీ లేనట్టే ఉన్నాయి. అవి రాసింది ఆత్రేయే కానీ సినారేనే కానీ వేటూరే కానీ ఇంక పేర్లు చెప్పనవసరమ్ లేని మరొకరెవరన్నా కానీ. డబ్బుకోసం రాసే డబ్బుకోసమ్ తీసే వ్యాపార సరుకుకి తమ వంతు తలా వొక్క రూపాయిని అక్షర రూపంలో అందించినవారే కద.
I am from Anantapur and curious to know few things.
Anantapur is wellknown education center, may I know the reason for doing studies in Kurnool(except Medicine).
Not only in OldTown(you mentioned oke postoffice patahuru ), there were 4 big post offices were there in ATP even in 1950 ( Geroge Pet, Old Town, Main PO, British Treasury i.e current JNTU).
Anyways … these are not related to story but please avoid such things.
ఉయ్యాలలూగడమనే మాటకి సామాన్యులెవరికీ తోచని భావార్ధాన్ని సూచించి చదవర్లని తత్తరబిత్తర చేశారు రచయితలు. ఉయ్యాల మాట ఇంచుమించుగా ప్రతి పాత సినిమాలోనూ ఒక్కసారైనా కనబడుతుంది, …
కానీ వ్యాసకర్తల సులోచనాల్లేకుండా నాకెన్ని సార్లు చదివినా ఏ మాత్రపు విశేషార్ధమూ తోచడం లేదు. అలాగే: “శృంగారించుకుని” అనే మాటకి sex అనే అంగ్లపదంతో తర్జుమా చేశారు లైలా_యెర్నేని గారు. (తెలుగు కీబోర్డులు అందుబాటులో వున్న కాలంలో అన్నంలో రాళ్ళలాగా ఇంగ్లీషు వాక్యాలు ఇమిడ్చి ఇబ్బంది పెట్టారు). నాకు గుర్తున్నంత మటుకు ఈమాటకి, పైసందర్భంలో అర్ధం “ముస్తాబు చేసుకోవడం” అని. శబ్దరత్నాకరంలో ఈ మాట కనపడలేదు. Online సూర్యరాయాంధ్ర నిఘంటువు ఈ పదానికి “అలంకరించుకోవడం” అని చూపించింది. మరి అలంకరించుకోవడం అంటే భాష్యం వేరేమన్నా వుంటుందేమో కవి విమర్శకులు తమ అంతర్నేత్రాల్లో అంజనం వేసి చెప్పుదురు గాక.
స్థూలంగా గణాంక సమాహరణానికొస్తే (statistical sampling), గణాంకాలని ఎలా సేకరించామో చెప్పకపోతే, తదుపరి చెప్పే సిద్ధాంతం కూడా తదీయ విషయ సేకరణ పరిమితుల్లోనే భ్రమిస్తుంది. “అబద్ధాలకోర్లు, పచ్చి అబద్ధాలకోర్లు, వీళ్ళని మించిన వాళ్ళు గణాంకవేత్తలు, …” అని ఓ ఇంగ్లీషు దొర గారి సెలవు.
మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. ఈ వ్యాసంలోని ఆరో వాక్యంలోనే “పదాల వ్యుత్పత్తి తెలిపే నిరుక్తాన్ని ఆరు వేదాంగాలలో ఒకటిగా పేర్కొన్నారు” అని చెప్పాను. విడమరచి చెప్పాలంటే “పదాల వ్యుత్పత్తిని తెలిపే శాస్త్రాన్ని నిరుక్తం అని మన ప్రాచీనులు పిలుచుకున్నారు. దీన్ని ఆరు వేదాంగాలలో ఒకటిగా పేర్కొన్నారు.”
వ్యాసాల పఠనీయత (readability) పెంచడానికి, ఇకపై మరింత వివరంగా రాయడానికి ప్రయత్నిస్తాను.
మీరు చెప్పింది నిజమే. “ఆర్యులు” అని లూజ్ గా అనువాదం చెయ్యకుండా ఉండాల్సింది. “స్వభాషానురూపాన్ — తమ సొంత భాషలో (అంటే సంస్కృతంలో)” అన్న పదబంధం చదివినప్పుడు తెలియకుండానే ఆర్యులు అని మనసులో అనుకొన్నానేమో, అందుకే అనువాదంలో ఆర్యులు అని వచ్చి పడింది.
తాత్పర్యం: ద్రావిడ భాషలో హలంత పదాలకు అచ్చుతో అంతమయ్యే విభక్తి ప్రత్యయాలను, స్త్రీ ప్రత్యయాలను కల్పించి, తమ సొంత భాషలో అర్థాలను ప్రతిపాందించే వారు కనబడతారు.
కుమారిల భట్ట రాసిన పై వాక్యం ప్రసిద్ధి పొందడానికి ఇంకో కారణం కూడ ఉంది. శిథిలమైన తాళపత్రాలను తప్పుగా చదవడంతో, 19వ శతాబ్ధపు భాషావేత్తలు ఈ వాక్యాన్ని “తదాంధ్ర ద్రావిడభాషాయం …” అని చదివి “ఆంధ్ర, ద్రావిడ భాష(ల)లో …” అన్న అర్థాన్ని చెప్పుకున్నారు. “A comparative grammar of the Dravidian or South-Indian family of languages” లో Robert Caldwell ఈ వాక్యం ఆధారంగా ఆంధ్ర శబ్దం గురించి రాస్తూ ఇలా అన్నారు:
“Telugu is called Andhra by Sanskrit writers. […]. It occupies the first place — not kalinga or Trilinga — in the compound term Andhra Dravida bhasha by Kumaila Bhatta […], designated what he appears to have supposed to be one language spoken by the Dravidians.”
అంతకు ముందు Dr. Burnell కుమారిల భట్ట వాక్యాన్ని ఉటంకిస్తూ ఒక వ్యాసంలో ఇలా అన్నారు: “The vauge term by which the Tamil language is mentioned (by KumArila), Andhra-Dravida-bhasha, is remarkable, as it indicates that a systematic study of the Dravidian languages can hardly have begun in the eighth century”
పలుకుబడి: ముందుమాట గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
04/07/2011 7:03 am
సురేష్ గారూ, నమస్తే.
మీరు చేస్తున్న మంచి ప్రయత్నం ఈ ‘పలుకుబడి.’
అభినందనలు.
కొన్ని పదాల పట్ల మాలాంటి వారికి కలిగే కొన్ని సందేహాలకు ఈ శీర్షికలోనే సమాధానాలు కూడా ఇస్తే బావుంటుందేమోనని అనుకుంటున్నాను.
చదవంగానే, తేలికగా అర్ధమైతే ఇంకా బావుంటుందని నా అభిప్రాయం.
శుభాకాంక్షలతో-
ఆర్.దమయంతి.
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి kameshwari అభిప్రాయం:
04/05/2011 9:41 am
మీరు చక్కగా రాసారు కానీ చిన్న పిల్లల ఆటల్లొ గుజ్జనగూళ్ళు వగైరా గురించి కూడా రాస్తే బాగా ఉండేది.
ప్రేమ పెళ్ళి గురించి swetha అభిప్రాయం:
04/05/2011 7:38 am
just kill her. ilanti vala valla india ku bad name.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి rama bharadwaj అభిప్రాయం:
04/04/2011 2:36 pm
సినిమా పాట మీద వ్యాస రచయితల మాటల్లోనే ఓ పెద్ద అయోమయం పోగుపడిఉంటే దాన్ని తన మాటతో మరింత జటిలమ్ చేశారు లైలా! భక్తికీ భక్తి పేరున శృంగారానికీ ఆవిడ ఇచ్చిన చిట్టాకీ అసలు విషయానికీ ఏమీ సంబంధమ్ లేదు. అది వేరే సంగతి. ఏ రసాన్ని ఎవరైనా రాయనివ్వండి. అది కాదు విషయం. కానీ ఆ సందర్భమ్ ఏమిటీ అది సహజంగా ఉందా లేక అసహజంగా ఉందా? వాళ్ళు రాసిన దానిలోని ఆ భావం లో అక్షరమ్ స్థాయి గానీ స్వరం స్థాయి గానీ ఉదాత్తంగా ఉందా?? లేకపోతే అలా ఎందుకు లేదు? ఇవీ అసలు విషయాలు. హరికృష్ణ గారన్నట్టూ “శృంగారించుకుని రావడం అంటే అది బాగా అలంకరించుకుని వెళ్ళడం” అని. అంతే గానీ “శృంగారం” అన్న మాట ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అది ఇంగ్లీషు లో వాడే సెక్స్ కి పర్యాయం కాదు. సంభోగం అని వేరే మాట ఒకటి ఉంది దానికి. శృంగారం వేరు. సంభోగం వేరు. గనక సెక్స్ కి పర్యాయగా శృంగారం అన్నది అర్ధమ్ చేసుకోవడం అన్నిసార్లూ వల్ల కాదు.
ఇకపోతే ” శివదీక్షాపరురాలనురా!!” అన్న జావళీ వంటివి భక్తి పాటలు కావు. ఇంక త్యాగరాజ కీర్తన “నౌకాచరిత్రం” లో “శృంగారించుకుని వెడలిరి” అన్నది సెక్స్ పాటలాంటిది కాదు. అది ఒక ప్రేమ గానమే !! కృష్ణ ప్రేమ. త్యాగరాజు ప్రేమని రాయకూడదని గానీ..రాయలేడని గానీ అసలు అలాంటి సందేహాలో చర్చలో ఎందుకని తలెత్తాయో మరి? గొర్తిగారు త్యాగయ్య రాసిన నౌకా చరిత్రాన్ని శృంగార కీర్తనగా ముద్రించి లైలా గారికి ఎందుకని సూచన చెయ్యాల్సి వచ్చిందో? ఇతర త్యాగరాజ కీర్తనలకు మల్లేనే ఆయన రాసిన ఈ యక్షగానం సైతం మనోహరమైన భక్తి. గోపికా విరహ ప్రకటన భాగవతం లోని భ్రమరగీతలో ముఖ్యమైన అంశం మరి.
దీనికీ తెలుగు సినిమా పాటకీ ఏమిటీ పోలికా? నాటు సంభోగాన్ని చెత్త భావాలతో అంతకన్నా చెత్త భాషతో చెప్పేది సినిమాపాట. ఎక్కువసార్లు. ఏ సముద్రాల రాఘవాచారో ఏ మల్లాది రామకృష్ణ శాస్త్రో.. ఏ కృష్ణశాస్త్రో.. ఏ శ్రీశ్రీనో రాసినవి వేరు. “విప్రనారాయణ” లోని “చూడుమదే చెలియా” అన్నది ఇటు భక్తీ అటు కృష్ణుని లలితమైన రాసక్రీడా రెండూ మిళితమైన అలాంటి పాటలని గురించి కాదు మరి ఈ “సినిమాపాటల మతీ సుతీ” అన్న గోల. “మదన జనక నీ మగసిరి చూచీ మతైపోయారా.. ఎదురులేని నీ పదును చూచి నే చితైపోయారా.. నీ సొత్తై పోయారా” లాంటి పాటలు నాటు శృంగారం. ఇలాంటి పాటలు అనేకం ఒక హద్దు దాటిపోయి విచ్చలవిడిగా యధాశక్తి దిగజారినవి అనేకం. అలాంటివి అన్నీ సమకాలీన తరాలకి మహా ఇష్టం అని ఒక తరాన్ని మొత్తంగా ఈ రొచ్చులోకి లాగి దాన్ని సమర్ధించడానికని చేసిన ప్రయత్నం ఈ వ్యాసం. అది నిజమూ కాదు. వీటికి ఈ వ్యాసకర్తల దగ్గర ఎలాంటి రుజువులూ లేవు.ఒక రొడ్దకొట్టుడు ఆర్గ్యుమెంటు ఇది. ఏ ఆధారమూ లేని వారి వారి సొంత వ్యాఖ్యానాలు అంతే !!
చెత్త పాటలు ఇవాళ్టి తెలుగు సినిమాల్లోనే కాదు ..ఇంకా మరింత ముందుకు వెళితే నాయక రాజుల యుగంనాటి కవుల అనేక రచనల్లోనూ ఉన్నాయి. కానీ వాటికి కూడా ఇవాళ్టి తెలుగు సినిమా పాటలకున్న విలువే ఉంది. వాటిని చదివిన వారూ చర్చించిన వారూ ఎక్కడా కనిపించరు. అవికూడా మరి ఆనాటి “యువతరాలు”[ఈ వ్యాస రచయితల భాష ప్రకారం అన్నమాట] ఆనందించినవే అయ్యుంటాయి. అలా పుబ్బలో పుట్టి మఖలో మాడిపోయాయి. ఇవాళ్టి ఈ సోకాల్డ్ సినిమా “కవుల” గతీ అంతే!! వారి పాటలగతీ అంతే!! మల్లాది వారి “గిరిజా కళ్యాణం” లాంటివి రాయగల సత్తా ఉన్న వాడొక్కడు లేడు గానీ .. అందరూ యధాశక్తి కవులే మరి. అందుకే అవన్నీ మతీ సుతీ లేనట్టే ఉన్నాయి. అవి రాసింది ఆత్రేయే కానీ సినారేనే కానీ వేటూరే కానీ ఇంక పేర్లు చెప్పనవసరమ్ లేని మరొకరెవరన్నా కానీ. డబ్బుకోసం రాసే డబ్బుకోసమ్ తీసే వ్యాపార సరుకుకి తమ వంతు తలా వొక్క రూపాయిని అక్షర రూపంలో అందించినవారే కద.
రమ.
సామాన్యుని స్వగతం: మా అమ్మ – నడిచే బడి గురించి Pathakudu అభిప్రాయం:
04/04/2011 5:13 am
Hello … your story is fine …
I am from Anantapur and curious to know few things.
Anantapur is wellknown education center, may I know the reason for doing studies in Kurnool(except Medicine).
Not only in OldTown(you mentioned oke postoffice patahuru ), there were 4 big post offices were there in ATP even in 1950 ( Geroge Pet, Old Town, Main PO, British Treasury i.e current JNTU).
Anyways … these are not related to story but please avoid such things.
తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి తాడేపల్లి హరికృష్ణ అభిప్రాయం:
04/04/2011 4:29 am
ఉయ్యాలలూగడమనే మాటకి సామాన్యులెవరికీ తోచని భావార్ధాన్ని సూచించి చదవర్లని తత్తరబిత్తర చేశారు రచయితలు. ఉయ్యాల మాట ఇంచుమించుగా ప్రతి పాత సినిమాలోనూ ఒక్కసారైనా కనబడుతుంది, …
“ఉయ్యాల జంపాలలూగరావయా,…” (చక్రపాణి)
“రావి చెట్టుకింద రంగుటుయ్యాలా, ఉయాలా,…” (మల్లీశ్వరి)
“ఊయలలూగినదోయి మనసే, …” (??)
“యవ్వన మధువనిలో బంగరు తీవెల ఉయ్యాలా, …” (బంగారు పాప)
“… ఊగెనే మనసు ఉయాలగా, జంపాలా,…” (సువర్ణసుందరి)
కానీ వ్యాసకర్తల సులోచనాల్లేకుండా నాకెన్ని సార్లు చదివినా ఏ మాత్రపు విశేషార్ధమూ తోచడం లేదు. అలాగే: “శృంగారించుకుని” అనే మాటకి sex అనే అంగ్లపదంతో తర్జుమా చేశారు లైలా_యెర్నేని గారు. (తెలుగు కీబోర్డులు అందుబాటులో వున్న కాలంలో అన్నంలో రాళ్ళలాగా ఇంగ్లీషు వాక్యాలు ఇమిడ్చి ఇబ్బంది పెట్టారు). నాకు గుర్తున్నంత మటుకు ఈమాటకి, పైసందర్భంలో అర్ధం “ముస్తాబు చేసుకోవడం” అని. శబ్దరత్నాకరంలో ఈ మాట కనపడలేదు. Online సూర్యరాయాంధ్ర నిఘంటువు ఈ పదానికి “అలంకరించుకోవడం” అని చూపించింది. మరి అలంకరించుకోవడం అంటే భాష్యం వేరేమన్నా వుంటుందేమో కవి విమర్శకులు తమ అంతర్నేత్రాల్లో అంజనం వేసి చెప్పుదురు గాక.
స్థూలంగా గణాంక సమాహరణానికొస్తే (statistical sampling), గణాంకాలని ఎలా సేకరించామో చెప్పకపోతే, తదుపరి చెప్పే సిద్ధాంతం కూడా తదీయ విషయ సేకరణ పరిమితుల్లోనే భ్రమిస్తుంది. “అబద్ధాలకోర్లు, పచ్చి అబద్ధాలకోర్లు, వీళ్ళని మించిన వాళ్ళు గణాంకవేత్తలు, …” అని ఓ ఇంగ్లీషు దొర గారి సెలవు.
– తాడేపల్లి హరికృష్ణ
ఈమాట ప్రచురణలో చిన్న మార్పు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
04/03/2011 9:07 pm
శుభాకాంక్షలు
గౌరవనీయులైన సంపాదకులకు, సంపాదక వర్గానికి, ఈమాట రచయితలకు, పాఠకులకు నా ఉగాది శుభాకాంక్షలు!
శుభాభినందనలతో-
ఆర్.దమయంతి.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి sastry అభిప్రాయం:
04/01/2011 9:56 pm
చాలా బాగున్నది
పలుకుబడి: ముందుమాట గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
04/01/2011 11:29 am
బ్రహ్మానందం గారు,
మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. ఈ వ్యాసంలోని ఆరో వాక్యంలోనే “పదాల వ్యుత్పత్తి తెలిపే నిరుక్తాన్ని ఆరు వేదాంగాలలో ఒకటిగా పేర్కొన్నారు” అని చెప్పాను. విడమరచి చెప్పాలంటే “పదాల వ్యుత్పత్తిని తెలిపే శాస్త్రాన్ని నిరుక్తం అని మన ప్రాచీనులు పిలుచుకున్నారు. దీన్ని ఆరు వేదాంగాలలో ఒకటిగా పేర్కొన్నారు.”
వ్యాసాల పఠనీయత (readability) పెంచడానికి, ఇకపై మరింత వివరంగా రాయడానికి ప్రయత్నిస్తాను.
సురేశ్.
పలుకుబడి: ముందుమాట గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
04/01/2011 11:05 am
శ్రీనివాస్ గారు,
మీరు చెప్పింది నిజమే. “ఆర్యులు” అని లూజ్ గా అనువాదం చెయ్యకుండా ఉండాల్సింది. “స్వభాషానురూపాన్ — తమ సొంత భాషలో (అంటే సంస్కృతంలో)” అన్న పదబంధం చదివినప్పుడు తెలియకుండానే ఆర్యులు అని మనసులో అనుకొన్నానేమో, అందుకే అనువాదంలో ఆర్యులు అని వచ్చి పడింది.
మొదటి వాక్యానికి టీక:
తత్ = ఆ; యథా = ఏ విధంగానైతే; ద్రావిడభాషాయాం = ద్రావిడ భాషలో; ఏవ తావత్ = ఆ విధంగానే; వ్యంజనాంత = హలంతమైన (వ్యంజన=హల్లు); భాషాపదేషు = భాషాపదాలయందు; స్వరాంత = అజంత (స్వర=అచ్చు); విభక్తి స్త్రీప్రత్యయాది = విభక్తి ప్రత్యయాలను, స్త్రీ ప్రత్యయాలను; కల్పనాభిః = కల్పించి, జతచేర్చి; స్వభాషానురూపాన్ = (తమ) సొంత భాషలో; అర్థాన్ = అర్థములను; ప్రతిపాద్యమానాః = ప్రతిపాదించే వారు; దృశ్యంతే = కనబడతారు.