ఇలపావులూరి

ఇలపావులూరి
పూర్తిపేరు
ఇలపావులూరి పాండురంగారావు
సొంత ఊరు
ఇలపావులూరు, ప్రకాశం జిల్లా

జీవిత విశేషాలు

ఇలపావులూరి పాండురంగారావు (1930 – 2011) శతాధిక గ్రంథరచయితగా, అనువాదకులుగా సుప్రసిద్ధులు. హిందీ భాషా సాహిత్యాంశాలలో డాక్టరేటు సాధించి రాజమండ్రిలో హిందీ లెక్చరరుగా, భారత భాషా పరిషత్, యు.పి.ఎస్.సి, భారతీయ జ్ఞానపీఠ్‌కు డైరెక్టరుగా పనిచేశాడు. వీరికి సంస్కృతం, తెలుగు, హిందీ, బెంగాలీ సహా అనేక భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఇతడు హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. సంస్కృతం నుండి ఈశ్, కేన, మాండూక్య, ఐతరేయ, కఠోపనిషత్తులను తెలుగులోనికి గేయాలుగా తర్జుమా చేశారు. త్యాగరాజకీర్తనలను హిందీలో గేయరూపంలో అనువదించారు. బలివాడ కాంతారావు నవల ‘ఇదే స్వర్గం, ఇదే నరకం’ రంగనాయకమ్మ నవల ‘పేకమేడలు’ మొదలైనవాటిని హిందీలోనికి అనువదించారు.

ఇలపావులూరి రచనలు