నార్ల వెంకటేశ్వర రావు
జీవిత విశేషాలు
నార్ల వెంకటేశ్వరరావు (1908 – 1985) తెలుగునాట ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నాడు. పత్రికా రచనలే కాక పలు నాటికలు, కవితలు, కొన్ని కథలు రాసారు. రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.