కొడుకుల శివరాం
జీవిత విశేషాలు
కొడుకుల శివరాం కర్ణాటక, హిందూస్తానీ సంప్రదాయ సంగీతాల్లో విశేషమైన ప్రతిభ కలవారు. సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తిగారి వద్దా, ఇంకెందరో ప్రసిద్ధుల వద్దా చాలా కాలం శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. తన ఎనిమిదేళ్ళ వయసునుంచే ఎన్నో సంప్రదాయ సంగీత కచేరీలు చేశారు. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కచేరీలే కాకుండా గజల్స్, లలిత సంగీతాల్లో కూడా కచేరీలు చేస్తున్నారు.