కె. ఆశాజ్యోతి
జీవిత విశేషాలు
తెలుగుతోపాటు రష్యన్, ఆంగ్లం, సంస్కృతం, హిందీ, కన్నడభాషలమీద గట్టి పట్టున్న రచయిత్రి కె. ఆశాజ్యోతి. బెంగుళూరు విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖకు అధ్యక్షురాలిగా సేవలందించి విశ్రాంతులయారు. కన్నడంలో గీతా నాగభూషణ రచించిన ‘బదుకు’ నవల, డా. సమతా దేశమానె ఆత్మకథ ‘మాతంగి దివిటీగె’ తో సహా, అనేక నవలలను తెలుగులోకి అనువదించారు. వీరి రచనలకు అనేక అవార్డులు, సత్కారాలు అందుకున్నారు.