కథ సామాన్య పాఠకులని ఉద్దేశించే రాస్తాము. కాని సామాన్యుడికి శిల్పం అవగతం కాదు. కథ బాగుంటే ఎందుకు బావున్నది సామాన్యుడికి తెలియదు. కథ ఎందుకు బాగులేనిది అలాగ్గానే తెలియదు. సాహిత్యంలో నిష్ణాతులైన విమర్శకులు ఏ అభిప్రాయాన్ని ఇస్తారో ఆ అభిప్రాయమే సరియైనది అవుతుంది.
చాగంటి సోమయాజులు
జీవిత విశేషాలు
చాగంటి సోమయాజులు (1915 – 1994) ప్రముఖ తెలుగు రచయిత. చాసోగా సుపరిచితులు. మానవతావాదిగా ప్రారంభమై, మార్క్సిస్టుగా మారి, కథల్లో ప్రగతిశీల విలువలు, పీడిత ప్రజల బాధలు, సమస్యలు గురించి విస్తృతంగా రచించారు. వీరి మొట్టమొదటి రచన చిన్నాజీ 1942లో భారతిలో ప్రచురితమైంది. వీరి కథలు అనేకం హిందీ, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళం, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. 1968లో చాసో కథలుగా పుస్తక రూపంలో చాసో కథా సంకలనం వెలువడింది. ఆయన 70వ జన్మదిన సందర్భంగా కొద్ది మంది ముఖ్యమైన రచయతల కథలు సంకలనం చేశాడు. శ్రీ శ్రీ, శ్రీరంగం నారాయణ బాబు, రోణంకి అప్పలస్వామి వంటి వారిపై వీరి ప్రభావం ఉంది.