కళ్ళు చుక్క నీరు లేకుండా అయిపోయాయి. సూటిగా స్పష్టం గా రాశారు. మీ వ్యాసం లొ వర్ణించిన సోవియట్ పరిస్థితులలో రష్యన్ గణిత శాస్త్రవేత్తలు ఎంత మహొన్నతమైన పరిశోధనలు చేశారొ చెపుతూ – Melvyn B Nathanson, Notices of American Mathematical Society, Feb 2014 లో – రాసిన ఒక ఆంగ్లవ్యాసాన్ని చదివి కదిలి పోయి ఆ వ్యాసాన్ని కొన్నాళ్ళక్రితం తెనిగించాను. తెనుగుసేత ఆంధ్ర ప్రభ ఎలక్త్రానిక్ దిన పత్రిక లో వచ్చింది. అది ఇప్పుడు వెబ్ లొ దొరకటం లేదు. ఆ వ్యాసం ‘ముందుమాట’ నుంచి కొన్ని వాక్యాలు ఈమాటకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ:
‘ఇతరశాస్త్రాల విషయం ఎట్లాఉన్నా గణిత శాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది.గణితశాస్త్ర అధ్యయనం ఒక ఊహాలొక విహరణం . ఈ కారణం గా సాధారణం గా గణిత శాస్త్రజ్ఞులు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. అలాగే బాహ్య ప్రపంచం గూడా వీళ్ళను దూరంగా ఉంచుతుంది. అంటే రాజకీయ ఒత్తిళ్ళు గణితశాస్త్ర పరిశోధనల మీద ఉండే అవకాశం చాలా తక్కువ . అయినప్పటికీ ఆనాటి సోవియట్ గణిత శాస్త్ర వేత్తల మీద కూడా రాజకీయం తన భయానక ఆధిపత్యాన్ని చెలాయించింది. వాళ్లు నియంతృత్వ పిశాచపు కోరల్లోనే తమ ఊపిరులు పీల్చుకున్నారు. ఇతర శాస్త్ర అధ్యయనాలతొ పొలిస్తే గణిత శాస్త్ర పఠన పాఠనాలు తమ జీవికకు కనీసావసరాలు కూడా సమకూర్చలేనివని అనుభవమైనా ఆ భయంకరమైన వాతావరణం లోనే కేవలం గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే అలౌకిక ఆనందం మీది ప్రీతి తొ మాత్రమే వాళ్ళు అక్షరాలా అహర్నిశలూ శ్రమించి పరమోత్కృష్ట మైన మేథో నైశిత్యంతో తమ శాస్త్రాధ్యయనాన్ని కొనసాగించారనీ, శాస్త్ర పరిథుల్ని అబ్బుర పరచే రీతి లో విస్తరింప చేశారనీ ఈ వ్యాసం చెబుతుంది. తెలుగు నాట నేటి మన వై జ్ణానికులకూ, ఉన్నత విద్యాలయాల లోని ఉపాధ్యాయులకూ ఈ విషయాన్నిఏమాత్రమైనా ఈ అనువాదం అందజేయగలిగితే అదే పదివేలు.’
“నేను ‘Werther’ అని రాస్తే – Microsoft Word, ‘Weather’ అని మార్చేసింది. నేను స్త్రీ నని నాకు చదువు రాదని పాతకాలం రచయితల రచనలు బాగా ఎక్కి పోయినట్టుంది.”
లైలా గారూ! ఈ కనపడీ కనపడని ఆకాశాలలో ఏదో జరుగుతూ ఉంటుందనుకుంటాను. మీ ఈ తా.క చదివి నవ్వుకుంటుంటే పోస్ట్మన్ SIAM News,April 2015.[సొసైటీ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ అప్లయిడ్ మాథమాటిక్స్,ఫిలడెల్ఫియా] చేతికిచ్చాడు. అందులో సత్య నాదెళ్ళతో, హార్వే మడ్ కాలెజ్ అధ్యక్షురాలూ, మైక్రోసాఫ్ట్ బోర్డ్ అఫ్ డైరక్టర్ల లో ఒకరూ అయిన మరియా క్లావె నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం లో (మైక్రోసాఫ్ట్ లో) జీతాలు పెంచమని అడిగే ఉద్యొగినుల గురించి మరియా అడిగిన ప్రశ్న, దానికి సత్య ఇచ్చిన జవాబులను ‘Maria Klawe’s Mighty Blow for Women’ అన్న శీర్షిక తో పాల్ డేవిస్ చర్చించారు.
“….రచయిత్రి మాలతీ చందూర్ ని, వంటలక్క గానూ, Alan Turing గురించిన మీరు, మీ వ్యాసం లో చూపినప్పుడు – ..”lyla yerneni
ఇది సరి కాదు. శ్రీ కొడవళ్ళ అలా చేయలేదు. సైన్టిఫిక్ కంప్యుటింగ్ లో న్యూమెరికల్ మెథడ్స్ మీద రాసిన చాలా ప్రసిద్ధమైన ఒక పుస్తకానికి, ‘Numerical Recipes’ అని రచయితలు పేరు పెట్టారు. అలా ఒక వంటకాన్ని తయారు చేయటాన్ని ఒక ‘పద్ధతి’ లొ శ్రీమతి చందూర్ చెప్పారని చెప్పటం మాత్రమే శ్రీ కొడవళ్ళ ఉద్దేశ్యం. శ్రీమతి చందూర్ ను ‘వంటలక్క’ ను చేయటం కాదు.
మహాలయం గురించి చక్రధర్ అభిప్రాయం:
04/29/2015 10:05 am
ఖచ్చితంగా ఆ డం డం లని ఎవరూ సాంతం చదవరు. అలా చూసి వదిలేస్తూ కింద కవితని చదువుతారు. 🙂
ఒక చాటు పద్యం కవికి తెచ్చిన చేటు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:
04/28/2015 1:32 am
శ్రీ వేలూరి:
కళ్ళు చుక్క నీరు లేకుండా అయిపోయాయి. సూటిగా స్పష్టం గా రాశారు. మీ వ్యాసం లొ వర్ణించిన సోవియట్ పరిస్థితులలో రష్యన్ గణిత శాస్త్రవేత్తలు ఎంత మహొన్నతమైన పరిశోధనలు చేశారొ చెపుతూ – Melvyn B Nathanson, Notices of American Mathematical Society, Feb 2014 లో – రాసిన ఒక ఆంగ్లవ్యాసాన్ని చదివి కదిలి పోయి ఆ వ్యాసాన్ని కొన్నాళ్ళక్రితం తెనిగించాను. తెనుగుసేత ఆంధ్ర ప్రభ ఎలక్త్రానిక్ దిన పత్రిక లో వచ్చింది. అది ఇప్పుడు వెబ్ లొ దొరకటం లేదు. ఆ వ్యాసం ‘ముందుమాట’ నుంచి కొన్ని వాక్యాలు ఈమాటకు అభ్యంతరం లేకపోతే ఇక్కడ:
‘ఇతరశాస్త్రాల విషయం ఎట్లాఉన్నా గణిత శాస్త్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది.గణితశాస్త్ర అధ్యయనం ఒక ఊహాలొక విహరణం . ఈ కారణం గా సాధారణం గా గణిత శాస్త్రజ్ఞులు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. అలాగే బాహ్య ప్రపంచం గూడా వీళ్ళను దూరంగా ఉంచుతుంది. అంటే రాజకీయ ఒత్తిళ్ళు గణితశాస్త్ర పరిశోధనల మీద ఉండే అవకాశం చాలా తక్కువ . అయినప్పటికీ ఆనాటి సోవియట్ గణిత శాస్త్ర వేత్తల మీద కూడా రాజకీయం తన భయానక ఆధిపత్యాన్ని చెలాయించింది. వాళ్లు నియంతృత్వ పిశాచపు కోరల్లోనే తమ ఊపిరులు పీల్చుకున్నారు. ఇతర శాస్త్ర అధ్యయనాలతొ పొలిస్తే గణిత శాస్త్ర పఠన పాఠనాలు తమ జీవికకు కనీసావసరాలు కూడా సమకూర్చలేనివని అనుభవమైనా ఆ భయంకరమైన వాతావరణం లోనే కేవలం గణిత శాస్త్రాధ్యయనం ప్రసాదించే అలౌకిక ఆనందం మీది ప్రీతి తొ మాత్రమే వాళ్ళు అక్షరాలా అహర్నిశలూ శ్రమించి పరమోత్కృష్ట మైన మేథో నైశిత్యంతో తమ శాస్త్రాధ్యయనాన్ని కొనసాగించారనీ, శాస్త్ర పరిథుల్ని అబ్బుర పరచే రీతి లో విస్తరింప చేశారనీ ఈ వ్యాసం చెబుతుంది. తెలుగు నాట నేటి మన వై జ్ణానికులకూ, ఉన్నత విద్యాలయాల లోని ఉపాధ్యాయులకూ ఈ విషయాన్నిఏమాత్రమైనా ఈ అనువాదం అందజేయగలిగితే అదే పదివేలు.’
నమస్కారాలతో –
వాసుదేవ రావు ఎరికలపూడి
శ్రీశ్రీ ఉపన్యాసం గురించి దాసరాజు రామారావు అభిప్రాయం:
04/27/2015 12:37 pm
చాలా ఆలస్యంగా, శ్రీశ్రీ ని చూసాను, విన్నాను. ధన్యవాదాలు.
ఒక చాటు పద్యం కవికి తెచ్చిన చేటు గురించి T.HariKrishna అభిప్రాయం:
04/27/2015 3:23 am
Good effort. Throwing light in dark rooms.
Thanks.
విశ్వనాథ కోవెల గురించి తఃతః అభిప్రాయం:
04/26/2015 5:27 am
నూటికి నూరుపాళ్ళూ లైలా గారితొ ఏకిభవిస్తాను. అలాగే కోవెల – కామేశ్వర రావు ల తోనూ – అందు పూర్తిగ , నిందు నిండుగ నుందు నేను.
తఃతః
వచనానికి ఒక జాబు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:
04/25/2015 9:03 am
లైలా గారూ! ఈ కనపడీ కనపడని ఆకాశాలలో ఏదో జరుగుతూ ఉంటుందనుకుంటాను. మీ ఈ తా.క చదివి నవ్వుకుంటుంటే పోస్ట్మన్ SIAM News,April 2015.[సొసైటీ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ అప్లయిడ్ మాథమాటిక్స్,ఫిలడెల్ఫియా] చేతికిచ్చాడు. అందులో సత్య నాదెళ్ళతో, హార్వే మడ్ కాలెజ్ అధ్యక్షురాలూ, మైక్రోసాఫ్ట్ బోర్డ్ అఫ్ డైరక్టర్ల లో ఒకరూ అయిన మరియా క్లావె నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం లో (మైక్రోసాఫ్ట్ లో) జీతాలు పెంచమని అడిగే ఉద్యొగినుల గురించి మరియా అడిగిన ప్రశ్న, దానికి సత్య ఇచ్చిన జవాబులను ‘Maria Klawe’s Mighty Blow for Women’ అన్న శీర్షిక తో పాల్ డేవిస్ చర్చించారు.
నమస్కారాలతో -వాసుదేవ రావు ఎరికలపూడి
థాంక్స్ గివింగ్ గురించి Rajesh అభిప్రాయం:
04/24/2015 7:02 am
Very Nice story…
నెగడు చుట్టూ నాట్యం గురించి సాంఘిక అభిప్రాయం:
04/24/2015 5:57 am
మూడు, నాలుగు పాదాలలోని భావాలు బాగున్నాయి.
Thank you
– సాంఘిక
నా గురువు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి గురించి YELCHALA NARSIMLU అభిప్రాయం:
04/24/2015 2:23 am
ఈ మాటలోని భాషాసాహిత్యానికి సంబంధించిన విషయాలు చాలా బాగున్నాయి.
కృతజ్ఞతలు.
– యెల్చాల నర్సింలు
వచనానికి ఒక జాబు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:
04/23/2015 2:48 pm
ఇది సరి కాదు. శ్రీ కొడవళ్ళ అలా చేయలేదు. సైన్టిఫిక్ కంప్యుటింగ్ లో న్యూమెరికల్ మెథడ్స్ మీద రాసిన చాలా ప్రసిద్ధమైన ఒక పుస్తకానికి, ‘Numerical Recipes’ అని రచయితలు పేరు పెట్టారు. అలా ఒక వంటకాన్ని తయారు చేయటాన్ని ఒక ‘పద్ధతి’ లొ శ్రీమతి చందూర్ చెప్పారని చెప్పటం మాత్రమే శ్రీ కొడవళ్ళ ఉద్దేశ్యం. శ్రీమతి చందూర్ ను ‘వంటలక్క’ ను చేయటం కాదు.
వాసుదేవరావు ఎరికలపూడి