పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/26/2015 11:25 pm

    “ప్రస్తుతం గ్రంథాలయోద్యమం స్పూర్తి సన్నగిల్లి, మంచి సాహిత్యం, నవలలు వెలువడక, టీవీ ప్రభావం వల్లా తెలుగు ప్రచురణ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ నేటి పాఠకులు అవసరాల మేరకు కాల్పనికేతర సాహిత్యం ప్రచురిస్తున్న సంస్థల పరిస్థితి మాత్రం చాలా బాగుంది.”
    ~ నవోదయ రామమోహనరావు, నవభారత్ ప్రకాశరావు.
    http://pustakam.net/?p=2808

    తెనాలి,విజయవాడ,మచిలీపట్నం,ఏలూరు,కర్నూలు,మద్రాసులలోని పుస్తక ప్రచురణ ప్రెస్సులూ, హైద్రాబాదులోని అత్యాధునిక సౌకర్యాలు కల కళాజ్యొతి ప్రెస్సు,చరితా ప్రెస్సు, చిత్తూరు పలమనేరు లోని నాయని కృష్ణమూర్తి గారి ప్రెస్సులలో గల సౌకర్యాల గురించి కూడా యీ సందర్భంలో ముచ్చడించవచ్చు.

  2. తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/26/2015 12:15 pm

    తెలుగు పుస్తక ప్రచురణల ద్వారా సమాజానికి వెలకట్టలేని సేవలందించిన ఎమెస్కో, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయా, పర్స్ పెక్టివ్స్, హైద్రాబాదు బుక్ ట్రస్ట్ వంటి పుస్తక ప్రచురణ సంస్థలు – పర్స్ పెక్టివ్స్ RK, కధ వాసిరెడ్ది నవీన్, పాపినేని శివశంకర్, ‘మనసు’ మన్నం రాయుడు, వాసిరెడ్డి వేణుగోపాల్, పాలపిట్ట గుడిపాటి, నండూరి పార్థసారథి ప్రభృతులను యీ సందర్భంలో అభినందించాలి.

    ఇంటింటా గ్రంధాలయం, పిల్లలలో పుస్తక పఠనానుసక్తిని ప్రోత్సహించటము పట్ల తల్లిదండ్రుల్లో అవగాహన పెంచాలి.

    “రష్యన్ పుస్తకాలు చాలా అద్భుతమైన బైండింగ్ లో చక్కటి పేపరు మీద చూడ ముచ్చటి బొమ్మలతో 1970లలో ప్రచురణ జరిగింది. ఆ ప్రచురణా స్టాండర్డ్స్ కాపీ కొట్టినా చాలు, మన తెలుగు పుస్తక ప్రచురణ నాణ్యం పెరుగుతుందని నా అభిప్రాయం “ అన్న కప్పగంతుల శివరామప్రసాదు గారి మాటల్లో ఎంతో నిజం ఉంది.

    పత్రిక, టీవీ, సినిమా, వ్యాపార రంగంలోని ప్రముఖుల సాయం పొందటం ద్వారా కూడా తెలుగు ప్రచురణని మరో మెట్టుకి పెంచవచ్చు అనుకుంటా.

    Indian publishing is a Rs 10,000 crore business ( with school book market Rs. 3,500 Crore, higher education book Rs. 2,500 Crore, trade book market worth Rs. 4,000 Crore, of which the English language segment may be worth about Rs. 2,400 Crore).

    The per capita number of book titles published in India is around 8 per 100,000 population. This number is much lower in comparison to those of the countries like the UK, US, France and Germany. In terms of languages, the per capita number of titles published per 100,000 persons is English (23), Tamil (11), Malayalam (8.7), Marathi (6.9), Bengali (6.3) and Gujarati (6.2) are all higher than Hindi at 5. Kannada (4.8) is higher than Telugu (4.2) and Urdu (3.9). In the US, the growth in per capita book title output increased from 7.6 per 100,000 people in 1950 to 43.2 per 100,000 in 2000.

  3. టూఎయిటీన్ డీ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/26/2015 11:06 am

    పర్స్పెక్టివ్స్, హైద్రాబాదు వారు ప్రచురించిన ‘త్రిపుర కధలు’ మూడో ముద్రణ లోని ‘హోటల్లో’ అనే కధ అది. కినిగే సంస్థ వారి క్రింద ఇచ్చిన లింకు ద్వారా ప్రింటు కాపీ కాని, e-పుస్తకం కాని చెప్పించుకునే సౌకర్యం కలదు.
    http://kinige.com/book/tripura+kathalu+print+book.

    ప్రతిభావంతురాలైన కవయిత్రి, రచయిత్రి, త్రిపుర గారి వీరాభిమాని అయిన స్వాతికుమారి గారు కధా విషయం, విషయ పరిధి మీద ఇంకొంచం శ్రద్ద పెట్టలేదేమో అనే దుగ్ధతో; త్రిపుర గారి ‘హోటల్లో’ కధలోని అంతర్వాహిని లాంటి మానవత్వపు తడిచెమ్మ ( ‘గుడిసెలోని తన కొడుకు సివంచెలంకి మందెవరు తెస్తారు’ అని ఖాళీ కళ్లతో చూస్తున్న రాములు గురించిన సృహ; ‘వెధవ కమ్యూనిస్టులతో చేరి జండాలు అవీ పట్టుకు తిరుగుతూ అల్లరి పెడుతున్నాడు ధర్డ్ ఫెలో’ ఆకాలమే వేరు అంటున్న తండ్రి గురించిన సృహ ) యీ కధలో కనబడక కసితో అలా అవాకులూ చవాకులూ రాసాను. రచయిత్రి మన్నింపు దృష్ఠితో మిన్నకున్నారు. యీ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

  4. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    09/25/2015 9:14 am

    హృదిమై బమ్మెర పోతనార్యు గవితారీతిం బ్రపంచించు న
    స్మదపక్వార్థఫలమ్ము నర్చయిడఁగా స్వాదుత్వ మింపారు స్వాం
    తదయావ్యక్తినిఁ బ్రీతిదాయ మిడు చింతా రామకృష్ణార్య! శా
    రద మీ రూపముగా గ్రహించితి నఖర్వాశీర్హరిద్రాక్షతల్!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  5. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి G B Sastry అభిప్రాయం:

    09/25/2015 12:59 am

    రామాయణముగూర్చి రచన చాలా బాగుంది సామాన్యులకు తెలియని అనేక సాంఘిక, రాజకీయ,సాహిత్య కోణాల గూర్చి తెలుసుకునె అవకాశం కలిగించారు

    నాకు ఉన్న మరొక్క సందేహం తీర్చగలరు: శ్రీరాముని ఏకపత్నీవ్రతునిగా చూపించడానికి సాధికారమైన రుజువులున్నాయా ఉంటె రామాయణకాలం నాటి ఏ సాంఘిక పరిస్థితులు ఏకపత్నీవ్రతమన్నది ఒక వాంఛ నీయ ప్రవర్తనగా చూడబడింది తెలియచేయగలరు.

    రామునికాక రామాయణకాలములోను తదనంతర కాలములలోను ఏకపత్నీవ్రతాన్ని పెద్దగా పాటించిన వివరాలు కానరాలేదు తిరిగి పాశ్చ్చాత్య విలువలు ఆపాదించుకున్నంతవరకు ఏకపత్నీవ్రతమన్నది తెరమీదకు రాలెదు.

    కొందరనేది వాల్మీకి కూడా ఎక్కడా రాముని ఏకపత్నీవ్రతాన్ని ఉటంకించలేదు అంటారు. అది నిజమేనా?

    తెలియ చేయగలరు

  6. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి చింతా రామ కృష్ణా రావు అభిప్రాయం:

    09/25/2015 12:30 am

    మొరలాలింపుమ! శారదాంబ! సుగుణోత్పూజ్యాఢ్యు లేల్చూరి స
    న్మురళీధారుల సంస్తుతుల్, నతులు, నే మ్రోయంగఁ జాలన్. భవత్
    కరుణన్ నన్ గనఁ జేసి తీవె కొనుమా! కారుణ్య వారాశి! నీ
    సరియెవ్వారలు మమ్ము నిల్ప! కవితా సౌదామినీ! వాగ్ఘృణీ!

  7. వెడలెను కోదండపాణి గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:

    09/24/2015 2:38 am

    చక్కని ఊహకు రెక్కలనిచ్చి రచనను అద్భుతంగా నిర్వహించారు. శర్మ గార్కి అభినందనలు. భారతం లో శకునికి కూడా ఇప్పుడు మంధరకిచ్చినట్లే benefit of doubt ఇచ్చి తెలుగు సినిమా పండితులు తమ ప్రయోగ శీలతను చాటుకున్నారు. ఇదొక అందమైన అవాల్మీకం!

  8. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి చింతా రామ కృష్ణా రావు అభిప్రాయం:

    09/23/2015 1:59 am

    మహనీయ పోతనామాత్యుని కల్పనా – నల్పశిల్పంబు ననల్పరీతి
    ‘సారంబు’లోగల సారంబు వివరించి,- రహిని రుయ్యక, జయరథులఁ జూపి,
    రవిబింబముపమింప దివియప్సరాంగనా -‘కిం ఛత్ర’ శ్లోకంబు కేలఁ జూపి,
    సహజ పాండిత్యుని సారస్వతాభిజ్ఞ,- సద్గ్రంథ గణన సాక్ష్యముగ తెల్పి,
    మీదు సద్గ్రంథ సురభిని మిన్నఁ జేయు
    వ్యాసమును వ్రాసి, ‘జాల’ సద్భాస రవిగ
    కీర్తినందితిరేల్చూరి! స్ఫూర్తి మీరు.
    పండితులు మిమ్ము మెచ్చిరి నిండు మదిని.

  9. వెడలెను కోదండపాణి గురించి Chudamani అభిప్రాయం:

    09/22/2015 2:11 am

    శర్మగారు, కధ చాలా బాగుందండి. రామాయణం కూలంకషంగా చదవని నాలాంటి పామరులకు ఇది చాలా బాగుంటుంది. నిజంగా మంధర, కైక లను పూర్తిగా కొత్త మనుషులుగా చూపించారు. ఇలాంటివి సాధారణంగా స్వర్గీయ అన్నగారు పరిశోధించి తన సినిమాలలో చూపించేవారు. ఇన్ని రామయణ సినిమాలలో ఇంతమంది దర్సకులు (బాపుగారుతో సహా) ఎవరూ చూపలేదేమి?
    ఎమైనా ఈ కధ బాగుంది.
    చూడామణి.

  10. టూఎయిటీన్ డీ గురించి Chudamani అభిప్రాయం:

    09/22/2015 1:35 am

    ఏమిటి ఈ కధ?