పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:41 am

    ధన్యవాదాలు సరళా మోహన్ గారూ

  2. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:40 am

    ధన్యవాదాలు దాశరథి గారూ

  3. నిశ్శబ్ద సమూహం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/31/2016 6:39 am

    ధన్యవాదాలు సుపర్ణ మీ అభిమానానికి.

  4. ఆశనిరాశలు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    05/28/2016 12:07 am

    శ్యామల రావు గారూ, ఇలాంటివి చెప్తే తెలుసుకోవడం నా కర్తవ్యము. దయచేసి మీకు వీలున్నప్పుడు తప్పకుండా చెప్పడానికి ఏ మాత్రమూ సంకోచించవలదని విన్నపం.
    ఆశానిరాశలు గా సరిదిద్దవలసినదని సంపాదక వర్గాన్ని కోరుతున్నాను.
    గూగుల్ సెర్చ్ లో సరైన పదం దొరకదండి. ఎక్కువభాగం ‘తేలిక తెలుగు’ నేర్పే గురువుల శిష్యులే ఉన్నామేమో.

  5. తేలిక తెలుగు గురించి ముల్లా జలాలుద్దీన్‌ అభిప్రాయం:

    05/27/2016 5:54 pm

    ఎడిటర్‌జీ:

    సలామ్‌ ఆలేకుం.

    ఎందరో పాఠకులు ఎన్నెన్నో విషయాలు ముచ్చటించిన తరువాత ఈ రెండు మాటలూ చెబుదామనిపించింది.

    “నాకు తెలుగుమాట్లాడటం వచ్చు. నాకు తెలుగులో రాయటం, చదవటం కూడా వచ్చు.అప్పుడప్పుడు, ఏమీ తోచనప్పుడు, పిల్లి దొరకనప్పుడూ, కథలు, కాకరకాయలూ కూడా రాసేశా.”

    అందుచేత,తెలుగురానివాడికి, తెలుగువాడు కానివాడికీ,తెలుగు రెండవభాషగా పాఠంచెప్పటం వచ్చనుకోవటం, ఆయనెవరో, మున్‌షీజీ అన్నట్టు, ‘దేశభక్తికన్నా హీనమైన పాపం.’

    ఖుదా హఫీజ్

    ముల్లా జలాలుద్దీన్‌

  6. నువ్వు నాకొద్దు గురించి A K Rao అభిప్రాయం:

    05/27/2016 8:20 am

    I think the doctors are trained to be clinical in their approach to the patients. This story clearly demonstrates the need for a social approach towards the patients. No doubt, the writer is a master story teller.

  7. ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం గురించి జి.ఎల్.విజయ్ అభిప్రాయం:

    05/27/2016 6:41 am

    ఘంటసాల వారి గళం నభూతోనభవిష్యతి బాలు గారి పాటలు చాల మంది మిమిక్రీ చేసి పాడగలుగుతున్నారు కానీ ఘంటసాల వారి గళాన్ని ఎవరూ అనుకరించలేకపోయారు అయన స్వరం అనుపమానం అయన ప్రాతస్మారణీయుడు. వ్యక్తిగాగానీ సంగీత దర్శకుడిగా గాని ఆయనకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు.

  8. ఆశనిరాశలు గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    05/27/2016 1:37 am

    మాధవ రావు గారు, శ్యామల రావు గారు, ధన్యవాదాలు.

    ఫోన్ రింగ్ టోన్ అది. అది వినపడగానే ఫోన్ తీస్తారు. అతకలేదంటారా , ఇకమీదట ఇలాంటివి వ్రాసేటపుడు జాగ్రత్త పడతాను. సూచించినందుకు సంతోషమండి.

  9. ఆశనిరాశలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    05/25/2016 1:47 am

    ఒక విషయం ప్రస్తావించటం మరచిపోయాను. శీర్షికను ‘ఆశనిరాశలు’ అని ఉంచారు. ఈ పదబంధం అంత సరైనదిగా అనిపించటం లేదు నాకు. ‘ఆశానిరాశలు’ అనటం సరిగా ఉంటుందనుకుంటాను. ఈమాట సంపాదకవర్గమూ, పరిశీలనాప్రవీణుల వడపోతలూ ఇలాంటి విషయాలపైన దృష్టిపెట్టవేమో తెలియదు. లేదా భాషాసంబంధమైన తప్పొప్పులపట్ల ఉదారవైఖరి అవలంబిస్తూ ఉండవచ్చును. ఇంగ్లీషులో ఎవరికైనా మెయిల్ పంపే ముందు అతిజాగ్రత్తగా వ్యాకరణదోషాలూ, అక్షరదోషాలూ సరిచేస్తాం. అది అవసరం కూడా. ఐతే, తెలుగులో మాత్రం ‘ఎలా వ్రాసినా చెల్లుతుంది’ అన్న వైఖరి ఈ మధ్య కాలంలో సర్వేసర్వత్రా కనిపిస్తోంది. సరదాగా గూగుల్ చేసి చూస్తే ‘ఆశనిరాశలు’ అన్న పదం 822 చోట్లా, ‘ఆశానిరాశలు’ అన్నది కేవలం 107 చోట్లా కనిపించింది. నాదే పొరపాటేమో!

  10. ఆశనిరాశలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    05/24/2016 7:37 am

    కథ బాగుంది.

    రెండు మూడు సార్లు అంతరంగ మృదంగనాద… అంటూ వస్తుంది. కాని అంతబాగా అది అతకలేదు కథనంలో.