పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. నాకు నచ్చిన పద్యం: పాత సంప్రదాయంలో కొత్త చూపు గురించి గిరి అభిప్రాయం:

    09/01/2017 9:09 am

    నమస్కారం కామేశ్వరరావుగారు, మొన్న సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వల్ల ఇన్నాళ్లకు మళ్లీ మీకు నచ్చిన మరియొక పద్యాన్ని చదివే అవకాశం దొరికింది. మంచి కావ్యాన్ని, పద్యాలనూ పరిచయం చేసారు, కృతజ్ఞతలు. చంపకమాలలో మొదటి పాదంలో ఒక చిన్న అచ్చుతప్పుపడింది, చూడండి.
    [అచ్చుతప్పు సవరించాము. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు — సం.]

  2. భూమి చాలని మనిషి గురించి amarendra dasari అభిప్రాయం:

    09/01/2017 7:04 am

    ఆవసరమయిన చోట ఆయా వ్యక్తులూ విషయాలకు సంబంధించిన లింక్స్ ఇచ్చి వ్యాసాన్ని సంపన్నం చేసిన సంపాదక బృందానికి ధన్యవాదాలు

  3. నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/31/2017 9:45 am

    విజయ సారధి గారు
    అదృష్టవంతులు. ముందే అన్నీ తెలుసుకుని వెళ్ళారు కనక. నేను వెళ్ళినప్పుడు స్నేహితుణ్ణి చూడ్డానికే అనుకున్నాను కానీ హాస్పేట్ దగ్గిర ఇవన్నీ ఉన్నాయని తెలియనే తెలియదు. అలా అనుకోకుండా అన్నీ చూసినందుకు నేనూ అదృవంతుణ్ణే అనుకోండి. ధన్యవాదములు
    శర్మ దంతుర్తి

  4. వలసపోతున్న మందహాసం గురించి పురాణం రామప్రసాద్ అభిప్రాయం:

    08/30/2017 10:37 pm

    కవిత చక్కగా కుదిరింది. అలల గుడ్డ బదులు, అలల వలువ బాగా కుదురుతుంది.

    ఈ రోజే కాకతాళీయంగా చదవడం జరిగింది.

    నేను ••••లో చేరాను, ఓ మోపెడు…అనలేను గాని నేనూ కవితలు రాస్తుంటాను.

    క్రమం తప్పకుండా సంపర్కంలో ఉంటాను.

    ఈ మాట నిజం.

    భవదీయుడు,
    పురాణం రామప్రసాద్
    అత్తాపూర్, హైదరాబాద్.
    హస్తభూషణం : 9505255100

  5. ఒకనాటి యువ కథ: మా నాన్న నాకేమిచ్చారు? గురించి Pullen pandari అభిప్రాయం:

    08/29/2017 9:49 pm

    యెస్… మంచితనం బోధిస్తే వినరు. ఆచరిస్తే అనుసరిస్తారు.

  6. నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం గురించి విజయ సారధి జీడిగుంట అభిప్రాయం:

    08/25/2017 11:41 am

    శర్మ దంతుర్తి గారు, ఆ ఆలయం విరూపాక్ష ఆలయమే. నేను గత వారమే హంపి శిధిలాలు దర్శించి తరించాను. విద్యారణ్య స్వామి విగ్రహం విరూపాక్ష దేవాలయం వెనకాతల ఉంటుంది. ఆ గది లాక్ చేసి ఉండటంవల్ల ఊచల మధ్యలోనుంచి చూసాం. ఈ పద్యం గురించి ముందే చదివి ఉండకపోతే బహుశా నేను చూసేవాణ్ణి కాదేమో. తెలుసుకుని మరీ వెళ్ళా.

  7. తానాలో వేటూరి సుందరరామమూర్తి ప్రసంగం కొన్ని విషయాలు గురించి నిష్టల సింహాచల శాస్త్రి అభిప్రాయం:

    08/24/2017 1:41 am

    చెత్త, మంచి అన్నది కవి చేతుల్లో వుంది. విశ్వనాథ్ లాంటి మంచి సంస్కారం గల దర్శకులు ఆయన చేత అద్భుతమైన సాహిత్యాన్ని రాయించుకోలా? అశ్లీల గేయాలు రాసినా, సినీ గీతానికి కావ్యగౌరవం తెచ్చినా అది వేటూరికే చెల్లు.

    అలాంటి ప్రతిభాశాలిని చూస్తుంటే ఏ ఆదికవి నన్నయో, అల్లసాని పెద్దనో తిరిగి జన్మించారేమో అని అన్పిస్తుంది. ఏదైనా ఆయన లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన లాంటి వ్యక్తి ఆయన సృష్టి చేసిన కవిత్వం “న భూతో న భవిష్యతి”.

  8. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి ‘తః తః అభిప్రాయం:

    08/18/2017 12:33 pm

    శేష తల్ప శాయి గారికి : మీ పేరు తప్పుగా -సాయి గా – వ్రాసినందుకు క్షమాపణలు . (With my poor imagination I failed to see which was there right under my nose ). మరొక సారి మీరు అందించిన ‘అంతర జాతీయం ‘ ప్రతికి ధన్యవాదాలతో ,నమస్కారాల తో – తః తః

  9. పత్రికారంగాన్ని సుసంపన్నం చేసిన పురాణం గురించి lyla yerneni అభిప్రాయం:

    08/16/2017 11:06 am

    “డా. లైలా యేర్నేని గారు, దయచేసి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి వైశిష్టత, తెలుగు సాహిత్యానికి వారు చేసిన యెనలేని సేవల గురించి … శ్రీరమణ గారు అందించిన యీ అద్భుతమైన వ్యాసం గురించి కూడా స్పందించరా.” – కె.కె. రామయ్య August 15, 2017 11:15 pm .

    Wow! శ్రీరమణ -పి.యస్., గురించి ఈ సంచికలో అద్భుతమైన వ్యాసం రాసినట్టు, నన్ను కూడా అభిప్రాయ ప్రకటన చెయ్యమనా మీ అభ్యర్ధన, రామయ్య గారూ?
    శ్రీఛానల్ అని ఒక తెలుగు పుస్తకం ఉంది, దాని ఆఖరి అట్ట చూడండి. దాని మీద ‘నాలుగో అట్ట మీద నాలుగు ముక్కలు’ అంటూ రాసిన ఆయన, ఆ పని – సమర్ధవంతంగా చేస్తారు. ఆ పుస్తకం అట్టమీద స్ధలం చాలనందువల్ల, ఎన్నో చెప్పాల్సినవి చెప్పకుండా ఆపివేసారట. ఈ మాటలో స్థలం కొరత లేదుగా. Ask him. If you get lucky, he may oblige.
    Happy Reading!

    లైలా.

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1 గురించి suryanarayana అభిప్రాయం:

    08/16/2017 3:59 am

    నాకు జ్యోతిష్యం లో కొద్దిగా ప్రవేశం వుంది. నా అవగాహన కి సంభందించినంత వరకు వ్యక్తులలో చక్కని అవగాహన కల్పించి ఆత్మవిశ్వాసం పెంపొందించవచ్చు. నిరాశ నిస్పృహ ల నుండి దూరం చెయ్యొచ్చు. నమ్మకం వున్నవారికి అర్ధం ఆయేట్లు చెప్తూ వ్యాపార ధోరణిలో దొపిడీకి ప్రయత్నించనంతకాలం జ్యోతిష్యం వలన నష్టం లేదు.