పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16634

  1. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:

    11/28/2023 11:55 am

    చాలా బాగుంది సురేశ్ గారూ! శ్లోకాల పరిచ్ఛేదన, టీకాలు సమకూర్చారు. మీ అనువాదము అద్భుతము. ధన్యవాదములు.

  2. నేత్రోన్మీలనం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    11/28/2023 5:34 am

    ఒక మితృని వ్యాఖ్య – ఎక్కడా దొరక్కుండా కామెంటారే – విన్నాక మరి నాలుగు మాటలు.

    *విలక్షణమైన కథ. నాకు నచ్చింది. రచయితకు అభినందనలు.
    *చర్చించుకోవలసిన కథ: ఉదాహరణకు సీత-అడవులు విషయంలో మనం వినే పేలవమైన కారణం స్థానంలో మరో బలమైన కారణం ప్రవేశపెట్టిందీ కథ.
    *ధాష్టీకాలకు గురి అయింది: ఇది అందరూ పైన ఒప్పుకున్నదే. మరో టిప్పణి అవసరం లేదు.

    **

    ఎవరో అంటున్నారు..’వాళ్లు మా ఇంటి మనుషులు. ఏమన్నా అంటే సహించం.’
    ఆ మాటకొస్తే మరి మా ఇంటి మనుషులు కూడా… అనే బాధ్యత మాకూ ఉంది.

  3. నేత్రోన్మీలనం గురించి RAGHAVENDRA అభిప్రాయం:

    11/28/2023 1:18 am

    ఒకోసారి సమీక్ష చదివి, సినిమా చూడటం ఉందికదా. కానీ ఇక్కడ చట్నీ వడ్డించి, ఇడ్లీ తీసేసినట్లు ఉంది నా స్థితి.

  4. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి కంభంపాటి సుశీల అభిప్రాయం:

    11/25/2023 8:34 pm

    ఏదేనా శంఖం లో పోస్తేగాని తీర్థమవదు. అన్ని పోస్టర్లు అనలేను కాని కొన్ని పోస్టర్లు కధ లోని ముఖ్య విషయాన్ని తెలియజేస్తూ చాలా బాగుండేవి. పది చూసేసరికి మాకు కధ తెలిసిపోయేది. నాకు వీటి గురించి అవగాహన లేదు గానీ అమెరికన్ స్నేహితుల్లో పాత యింగ్లీషు సినిమాల పోస్టర్లు వేలం పాటల్లో బోలెడు డబ్బు పెట్టి కొనడం చూశాక ఔరా అనుకున్నాను. రూడాల్ఫు వాలంటీనో నటించిన సినిమా తాలూకు కాగితం చాలా విలువైనదట. మాలపిల్ల, వరవిక్రయా లాటి పాత సినిమాల తాలూకువేమేనా దొరికితే వాటి విలువ యెలా వుంటుందో?

  5. జీవితానికి ఎన్ని రంగులో!!! గురించి Ramesh అభిప్రాయం:

    11/25/2023 8:01 pm

    చాలా అద్భుతమైన కథ. మానవ సంబంధాల గురించి చక్కటి కథనం. చదివినంతసెపు చాలా ఆనందంగా వుంది.
    I find it a bit difficult in using RTS to Telugu, otherwise a wonderful attempt , god bless the author and the publisher.

  6. నేత్రోన్మీలనం గురించి Dr.Y.Kameswari అభిప్రాయం:

    11/25/2023 3:38 pm

    ఆకుకు అందకుండా పోకకు పొందకుండా సాగుతోంది చర్చ. ఏదో ఒకలాగా బట్టకాల్చి మొహాన పడేసినట్లు, ఎలా ఎదుటివారి కాలు పట్టి లాగుదామా అన్నట్లు ఉన్నది. బతకని బిడ్డ బారెడు అన్నట్లు తీసేసిన కథపై చర్చ ఏల?

  7. మనమెరుగని మధ్య అమెరికా 2 గురించి Rmamesh అభిప్రాయం:

    11/25/2023 8:05 am

    It is very beautifully written, the style is picturesque. I wish the author good health and let him travel as far as possible, god bless him.

  8. సా విరహే తవ దీనా గురించి లలితా వర్మ అభిప్రాయం:

    11/25/2023 2:07 am

    విస్తృతమైన సమాచారాన్ని అందించారు. అనేక ధన్యవాములు🙏

  9. నేత్రోన్మీలనం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    11/24/2023 9:34 pm

    ఈ కథ పట్ల శ్రీ శ్యామల రావు గారి అభ్యంతరం “సీతారాములు భగవత్స్వరూపులని, ఈ కథలో వారిగురించి చిత్రీకరించిన ప్రవర్తన భగవత్స్వరూపులకు తగనిదని” ఇంతకుముందు అనుకున్నాను; అలా ఐతే వారి నమ్మకాన్ని ప్రశ్నించటానికి గాని, శంకించటానికి గాని ఎవరికీ అధికారం లేదు. ఐతే, వారి అభ్యంతరం అది కాదని, ఈకథ ఆలంకారికుల సూత్రాలను అనుసరించకపోవటమని వారిప్పుడు అంటున్నారు కనుక కేవలం కుతూహలంతోనే ఒక కోరిక కోరుతున్నాను – వారికి ఇష్టం లేకుంటే చెప్పనక్కర్లేదు – ఈ శతాబ్దంలో, అంటే గత ఇరవైమూడేళ్లలో ఈమాటలో వచ్చిన కథల్లో వారు చదివినవాటిలో, వారిచ్చిన సూత్రాలను అనుసరించిన 2 – 3 కథల పేర్లు చెప్తే వాటిని మళ్లీ చదవాలని వుంది. ముందుగానే వారికి కృతజ్ఞతలు.

  10. నేత్రోన్మీలనం గురించి జిలేబి అభిప్రాయం:

    11/23/2023 12:32 am

    తాడిగడపవారి విమర్శ గురించిన విశ్లేషణ అద్భుతం.