పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16392

  1. ఓ.పీ.నయ్యర్‌ గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    03/30/2007 12:39 pm

    చక్కటివ్యాసం.శాస్త్రీయ సంగీత జ్ఞానం లేకుండా సంగీత దర్శకత్వం చేయగలగటం అన్ని పాప్యులర్ గీతాలు అందించటం ఆశ్చర్యమే కాదు అపురూపం కూడా.

    నయ్యర్ అందమైన బాణీలు, S.H.Bihari,Sahir Ludhiyanvi,Majrooh Sultan Puri లాంటి కవుల చక్కని కవిత్వం ,అలల మీద తేలుతున్నట్లు సాగే ఆశా కంఠస్వరం, వెరసి మంచి పాటలు చాలా గుర్తు చేసారు.

    చివరి రోజుల్లో నయ్యర్ గురించి చదివాక మాత్రం విషాదంగా అన్పించింది. ఎందుకో దువ్వూరి రామిరెడ్డి గారి “అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల” గుర్తుకి వచ్చింది.

  2. రాఫెల్ గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    03/30/2007 10:20 am

    Very pleasant story with flowing and photographic narration.

  3. ఓ.పీ.నయ్యర్‌ గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/30/2007 9:53 am

    నయ్యర్ పాట లతా పాడితే ఎలా ఉంటుంది? నయాదౌర్ సినిమాలోని ఒక ట్యూన్ లతా, తదితరులు పాడిన రికార్డింగ్ ఒకటి ఉంది. అది ముఝ్సే దోస్తీ కరోగే అన్న సినిమాలోనిదట. ఇదొక అపూర్వమైన మచ్చుతునక.

    ఉడే జబ్ జబ్ జుల్ఫేఁ తేరి (mp3 552k) పాటను indianscreen.com లో మీరు వినవచ్చు.

  4. ది బీచ్ గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    03/29/2007 6:22 pm

    కథాంశం చాలా బావుంది. సముద్రం కెరటాలకు గత స్మృతుల ఆలోచనా తరంగాలకు పొంతన బాగా కుదిరింది. కథ కూడా వడి వడిగా నడవడంతో ఎక్కడా విసుగనిపించలేదు. మిగిలిన పాఠకులకుమల్లే నాకు కూడా ఆ రెండు క్షణాలలో ఆలోచనలను కొంత విశదీకరించి ఉంటే మరింత బావుండుననిపించింది. అలాగే చెప్పే తీరు గురించి ఇంకొంత శ్రధ్ధ వహిస్తే ఈ కథ ఇంకా రక్తి కట్టి ఉండేది. రచయిత్రికి అభినందనలు.

  5. చాదస్తం గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    03/28/2007 7:34 pm

    కథలో ఇంత తర్కం గూటించడం అనవసరం. పాత్రలన్నీ analysis paralysis తో బాధ పడుతునట్టనిపించింది. పాత్రలని సరిగా చిత్రించడానికి వాటితో ఇంత in-depth analysis చేయించవలసిన అవసరం లేదు. ఉదాహరణకి బొమ్మరిల్లు సినిమా గురించి అంత analysis, reasoning, logic అనవసరం. ఆ సినిమా గురించి పాత్రతో తన అభిప్రాయాన్ని సరళంగా చెప్పించి పాఠకుడికి ఆ పాత్రంటే సరైన అవగాహన కల్పించవచ్చు. కథ సజావుగా సాగిపొతే చదువుకోడానికి పాఠకుడికి సుళువుగా ఉంటుంది. దానికి విరుధ్ధంగా ఇంతింత logic గుప్పించేస్తే పాఠకుడికి ఈ తర్కం అంతా follow అవ్వాల్సిన దుస్స్థితి ఏర్పడి ఎందుకొచ్చిన తలనొప్పి అని అనిపించే అవకాశం ఉంది.

    కథ మొదలైన వైఖరిని బట్టి సమాజంలో మనకి తరచు తారసపడే మనస్తత్వాలని ఆధారం చేసుకుని అల్లిన ఒక మంచి కథ చదవబోతున్నానని అనుకున్నాను. కాని మొత్తం చదివాక చాలా disappoint అయ్యాను.

  6. ఇద్దరు దుర్మార్గులు గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    03/28/2007 1:48 pm

    కొత్తపాళీగారి సవరణ చదివి నవ్వకుండా ఉండలేకపోయాను. మంచి కథలను కాకపోయినా మంచి వ్యాఖ్యలను ఆకర్షించే కథలను వ్రాసినందుకైనా రచయతలను అభినందించాలి.

  7. అంతరం గురించి rajasankar kasinadhuni అభిప్రాయం:

    03/28/2007 1:29 pm

    ఎదో అక్కడక్కడ కాస్త హాస్యం ఉండటం వలన తోసుకుపోయింది కాని అసలు విషయం సున్న. అసలు సమస్య గురించి ఎక్కువ చర్చ లేకపోవటం ఈ కథలో చాలా పెద్ద వెలితి. పాఠకుడికి వింధ్య కష్టం ఏవిటో తెలియచెప్పి వెంటనే కథను ముగించడంతో అర్ధాంతరంగా కథను ఆపివేసినట్లనిపించింది. మొత్తం మీద below average అని చెప్పాలి.

  8. ఇద్దరు దుర్మార్గులు గురించి కొత్తపాళీ అభిప్రాయం:

    03/28/2007 12:43 pm

    నచకీ గారి సామ్యానికి సవరింపు:
    అప్పటికే బావిలో పడి ఉండి ఆ బావిలో ఉన్న మురుగు నీళ్ళని ఒకటోరకం ఫ్రెంచి మద్యంలాగా తీర్థమిస్తున్నది గోపిక.
    అది ఒకటో తరగతి ఫ్రెంచి మద్యమే అని నమ్మేసి బావిలోకి దూకి తీర్థం పుచ్చుకుంటున్నవాడు మోహన్.
    మొగుడు పుచ్చుకుంటున్న తీర్థంలో తన భాగం రావటం ఎలాగా అని బావిలోకి దిగటానికి తాడుకోసం వెతుకుతున్నది దీప.

  9. అంతరం గురించి lalitha అభిప్రాయం:

    03/28/2007 10:13 am

    కథ బాగుంది. ఒక కథగా బాగుంది.ఒక చిన్న సందేశం కూడా ఉంది.
    వ్యాఖ్యలతోనే ఒక చిక్కు. శైలు, రమెష్ పాత్రలలో ఉన్న లోపాలగురించి వ్యాఖ్యానిస్తున్నారు చదివిన వారు. శైలు భర్త పాత్ర గురించి వ్యాఖ్యానం చెయ్యరేం. అతని కున్న స్పెషాలిటీ కాక్ టెయిల్ కలపడం. రమేష్ గురించి పూర్తిగా తెలియక ముందు అతనికీ రమేష్ మీద అసూయ లాంటి భావమేదో కలిగినట్టు ఉంది కదా. తను శైలూకి ఒక్క సారి సరదాకి కూడా వండి తినిపించలేకపోయాడు, రమేష్ మాత్రం “నాజూకుగా” ఉన్న తన భార్యకు, వచ్చిన వారికీ రుచిగా రకరకాలు చేసి తినిపిస్తున్నాడు అని. అవకాశమం దొరకగానే రమేష్ మీద ఒక వ్యంగ్య బాణం విసిరాడు కదా, “కేటరింగు” చెయ్యొచ్చు కదా అని. వింధ్య భర్త గురించి తెలిసిన తర్వాత అతనికంటే అయితే తను మెరుగే కదా అని కొంచెం గర్వ పడ్డట్టు కూడా కనిపిస్తుంది. శైలు భర్త తన భార్యను తనకంటే వ్యక్తిత్వంలో తక్కువ దానిగా చూస్తున్నాడు. ఇది సబబేనా మరి?
    భార్యా భర్తలు ఇద్దరూ ఎవరికి వారు సర్వ గుణ సంపన్నులు, ఉత్తమ వ్యక్తిత్వం గల వారు కానక్కర లేదు.
    They should complement each other. Support each other in each other’s lackings and encourage each other’s merits. The moral in the story applies to both wife and husband.

    However, there could be exceptions, like in case of Ramesh. It depends on the sverity of Ramesh’s controlling nature as to how far Vimdhya should keep trying. She has a right to choose out before there are children in the picture and the problem becomes even more cmplicated.

    Just like the cahracters in the story, it is also easy for readers / observers to analyse and give “uchita salahaalu”. I’m no exception to that.

    లలిత.

  10. ఇద్దరు దుర్మార్గులు గురించి PhaNi DokkA అభిప్రాయం:

    03/28/2007 4:26 am

    నచకి గారూ,

    కథపై మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పిన సామ్యం బావుంది, కథలోని పాత్రల స్వభావాన్ని కొంతవరకు ఆవిష్కరించింది.

    ధన్యవాదాలతో,
    మీ ఫణి డొక్కా.